మన రాష్ట్రంలో రబీ కాలం లో పండించే ఆపరాలలో శనగ ముఖ్యమైనది శీతా కాలంలో కేవలం మంచు తో పెరిగె శనగ పంట మన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో అధిక దిగుబడి నివ్వడం వల్ల ఈ పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ పంటను ఎక్కువగా గుంటూరు ప్రకాశం మరియు కర్నూలు జిల్లాలలో పండిస్తున్నారు .ఈ పంట నల్ల రేగడి భూముల్లో సాగుచేయబడుతుంది . రాష్ట్రంలో శనగ విస్తీర్ణం సుమారుగా 8.0 లక్షల ఎకరాలు ఉత్పత్తి 3.55 లక్షల టన్నులు .దిగుబడి ఎకరాకు 440 కిలోలు శనగ గింజల ఉత్పత్తి విలువ 643 కోట్ల రూపాయలు. నేలలు సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం.నల్లరేగడి నెలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటు సితకాలంలో మంచుతో మొక్కలు పెరుగుతాయి. నేల తయారి తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి గోర్రుతో రెండుసార్లు మొత్తగా దున్ని చదను చేయాలి . విత్తే సమయం అక్టోబర్-నవంబర్ , నవంబర్ తర్వాత విత్తిన ఎడల దిగుబడి తగ్గుతాయి . విత్తటం గొర్రుతోగాని బుర్రలతోగాని జడ్డిగంతోగాని విత్తుకోవాలి .పదను తక్కువగాఉన్నప్పుడు నాగలితో కూడా విత్తుకోవచ్చు. విత్తనశుద్ధి ఎండు తెగులున్నచోట కిలో విత్తనానికి 4గ్రా టైకోడేర్మా విరిడేను వాడితే మంచి ఫలిత ముంటుంది రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 20 - 30 శాతం అధిక దిగుబడి పొందవచ్చు .8 కిలోల విత్తినానికి ఒక రేజోబియం పాకెట్ (200 గ్రా )వాడాలి. విత్తే దూరం 30 x 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి . రకాలు క్రాంతి (ఐ.సి.సి.సి.-37) పంటకాలం 100 - 105 రోజులు .దిగుబడి ఎకరాకు 8 - 10 క్వింటళ్ళు గుబురుగా పెరుగుతుంది .గింజలు మధ్యస్ల లావుగా ఉంటూ ఎండు తెగులును తట్టుకో గల దేశీయ రకం . శ్వేతా (ఐ.సి.సి.వి.-2) పంటకాలం 80 - 85 రోజులు .దిగుబడి ఎకరాకు 6 - 7 క్వింటళ్ళు త్వరగా కాపుకు వచ్చే రకం ,ఎండు తెగులును తట్టుకొ నే కాబూలి రకం ఆలస్యంగా వేసుకోవాడానికి అనుకూలం. అన్నెగిరి పంటకాలం 100 - 110 రోజులు .దిగుబడి ఎకరాకు 7 - 9 క్వింటళ్ళు మొక్క గుబురుగా పెరిగి కొమ్మలు ఎక్కువగా వేస్తుంది .గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి. జ్యోతి పంటకాలం 100 - 110 రోజులు .దిగుబడి ఎకరాకు 6 - 7 క్వింటళ్ళు,మొక్క క్రింద నుండి గుబురుగా కొమ్మలు వేస్తుంది .గింజలు గరుకుగా మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఐ.సి.సి.వి-10 పంటకాలం 100-110 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు,మొక్క నిటారుగా పెరిగి బాగా కొమ్మలు వేస్తుంది .ఎండు తెగులును బాగా తట్టుకొంతుంది.వేరు కుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకొంతుంది. ముందుగా (అక్టోబర్ లో)వేసుకోవాడానికి అనుకూలం. కె.ఎ.కె-2 పంటకాలం 95 – 100 రోజులు .దిగుబడి ఎకరాకు 8 - 10 క్వింటళ్ళు లావు గింజ కల కాబూలీ రకం మొక్క ఎత్తుగా పెరుగుతుంది . పూలేజి -95311 పంటకాలం 95 - 100 రోజులు .దిగుబడి ఎకరాకు 7 - 8 క్వింటళ్ళు. కాబూలీ రకం .గింజలు లావుగా ఉంటాయి. జె.జి-11 పంటకాలం 100 - 110 రోజులు .దిగుబడి ఎకరాకు 8 - 10 క్వింటళ్ళు,ఎండు తెగులను తట్టుకంతుంది లావుపాటి గింజలు గల దేశీయ రకము . లామ్ శనగ పంటకాలం 90-95 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు లావు గింజ కల కాబూలీ రకం. మొక్క ఎత్తుగా పెరుగుతుంది . ఎరువులు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరిదుక్కిలో వేసుకోవాలి. సాగు నీటి యాజమాన్యం శనగ వర్షధారపు పంట తేలికపటి నీటి తడులు ఇచ్చి అదిక దిగుబడులను పొందవచ్చు .నీటి తడులు పెట్టెటతప్పుడు నీరు నిలవకుండా చూడాలి .పుట దశ ముందు ఒకసారి కాయదశలో మరోసారి నీటి తడి ఇవ్వాలి . కలుపు నివారణ, అంతర కృషి విత్తేతముందు ఫ్లూక్టోరలీన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేక పెండమిధాలీన్ 30% ఎకరాకు 1.0-1.5 లీటర్లు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి . విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రు తో అంతరకృషి చేయాలి .