ఆంధ్రప్రదేశ్ లో జొన్న పంట ఖరీఫ్ లో 3.0 లక్షల ఎకరాల్లోను, రబీలో 4.25 లక్షల ఎకరాల్లోను సాగుచేయబడుతున్నది. ఎకరా సరాసరి దిగుబడి ఖరీఫ్‌లో 638 కిలోలు, రబీలో 610 కిలోలు. జొన్న పండించే ప్రాంతాలు ఖరీఫ్ లో తక్కువ వర్షపాతం ఉండి, ఎర్ర చెల్కా నేలలు గల మహబూబ్‌నగర్ మరియు కర్నూలు జిల్లాలు. ఖరీఫ్ లో అధిక వర్షపాతం గల - ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు. మాఘీ ప్రాంతం – ఖమ్మం, వరంగల్, నల్గొండ మరియు నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాలు. సాధారణ రబీ ప్రాంతం - ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలు : ప్రకాశం జిల్లా విత్తే సమయం ఖరీఫ్ మాఘీ రబీ లేట్ రబీ వేసవి జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ జనవరి నేలలు నల్లరేగడి మరియు తేలికైన ఎర్రనేలలు రకాలు హైబ్రిడ్/రకం ఋతువు పంటకాలం (రోజుల్లో) దిగుబడి (క్వి/ఎ) గుణగణాలు హైబ్రిడ్లు సి.ఎస్.హెచ్ -13/ సి.ఎస్.హెచ్. -13 ఆర్ ఖరీఫ్, రబీ 110-115 12-14 బెట్టను, నల్ల కాండం కుళ్ళు తెగులును, కుంకువు తెగులును, పేను బంకను తటుకుంటుంది. ఎతుగా పెరుగుతుంది. చొప్ప ఎక్కువగా ఇస్తుంది. సి.ఎస్.హెచ్. 16 ఖరీఫ్, మాఘీ 105-110 15-17 బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను మాఫీు తట్టుకుంటుంది. సి.ఎస్.హెచ్. 14 ఖరీఫ్ 95-100 12-13 బూజు మరియు ఆకువుచ్చ తెగుళ్లని తట్టుకుంటుంది. తక్కువ వర్షపాత ప్రాంతాలకు అనుకూలం. సి.ఎస్.హెచ్. 18 ఖరీఫ్ 110-115 16-17 గింజ పై వచ్చే బూజు తెగులును తట్టుకుంటుంది. పి.ఎస్.వి-1 ఖరీఫ్, రబీ 105-110 10-12 గింజ తెలుపు, చొప్ప పశువులు తినుటకు అనుకూలంగా వుంటుంది పి.ఎస్.వి-15 ఖరీఫ్ 110 10-12 అన్ని లక్షణాలు షుమారు పి.ఎస్.వి. -1 మాదిరిగానే ఉంటాయి నంద్యాల తెల్లజొన్న-1 (ఎన్.టి.జె. -1) రబీ, మాఘీ 105-110 10-12 బెట్టకు తట్టుకొంటుంది. గింజ రాలుటలో ఇబ్బంది లేక బాగా రాలుతుంది. నంద్యాల తెల్లజొన్న-2 (ఎన్.టి.జె. -1) రబీ, మాఘీ 95-100 12-14 పంట త్వరగా కోతకు వస్తుంది. గింజలు లావుగా, తెల్లగా మెరుసూ వుంటాయి. గింజలు సులభంగా రాలుతాయి. నంద్యాల తెల్లజొన్న-2 (ఎన్.టి.జె. -2) రబీ, మాఘీ 100-105 12-14 చొప్ప ఎక్కువగా ఇస్తుంది. బెట్టకు, ఆకుమచ్చ తెగుళ్ళకు తట్టుకొంటుంది. యన్-13 (పచ్చజొన్న) రబీ, మాఘీ 95-100 7-8 చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా వుంటుంది. జొన్న మల్లెను, బెట్టను తట్టుకొంటుంది. యన్-14 (పచ్చజొన్న) రబీ, మాఘీ 100-115 10-12 యన్-13 కంటె గింజలు మరియు ఎక్కువగా యిస్తుంది. సి.యస్.వి. 216 ఆర్ రబీ 110-115 12-14 గింజ తెలుపు, చొప్ప ఎక్కువగా వచ్చి, నాణ్యంగా ఉంటుంది. పాలెం-2 ఖరీఫ్ 105-110 11-12 గింజ తెలుపు, అధిక చొప్ప దిగుబడి నిస్తుంది. బూజు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. ఎన్.టి.జె.-4 రబీ, మాఘీ 90-98 13-15 నల్లకాండం కుళ్ళ తెగులును కొంత వరకు, మొవ్వచంపు ఈగ మరియు శనగపచ్చ పురుగును కొంతమేర తట్టుకొంటుంది. యమ్ 35-1 రబీ, మాఘీ 115-120 10-12 గింజలు, చొప్ప నాణ్యంగా వుంటాయి. సి.ఎస్.వి. 14 ఆర్ రబీ 115-120 10-12 బెట్టను, నల్లకాండం కుళ్లు తెగులును, మొవ్వు చంపు ఈగను కొంతమేర తట్టుకుంటుంది. సి.ఎస్.వి. 15 ఆర్ రబీ 110-115 13-14 మొవ్వు చంపు ఈగను, కాండం కుళ్ళను తట్టుకుంటుంది. కిన్నెర (ఎం.జె-278) రబీ, మాఘీ 110-115 12-16 బెట్టను తట్టుకుంటుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అనుకూలము. విత్తనం ఎకరాకు 3-4 కిలోలు విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్లాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తే దూరం వరుసల మధ్య 45 సెం.మీ; వరుసలో మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. ఎకరాకు 58,000 - 72,000 మొక్కలు ఉండాలి. ఎరువులు పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్మిలో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు : 32 - 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, వరాధార పంటకు : 24 - 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 క్రిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా వితేప్పడు, మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. నీటి యాజమాన్యం ఖరీఫ్ లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైతే నీరు కట్టాలి. వేసవి పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి. అంతర పంటలు ఖరీఫ్ లో జొన్న : కంది - 2:1 కలుపు నివారణ, అంతర కృషి విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందుని ఎకరాకు 800గ్రా, చొప్పన 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోపల తడి నేలపై పిచికారి చేయాలి. జొన్నమల్లె మొలకెత్తిన తర్వాత, లీటరు నీటికి 50 గ్రా, అమ్మోనియం సల్ఫేట్‌ను గాని, 200 గ్రా. యూరియానుగాని కలిపి మల్లెపై పిచికారి చేసి నివారించవచ్చు. లేదా 2,4 - డి సోడియం సాల్డ్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసికూడ మల్లెను నివారించవచ్చు. జొన్న విత్తిన 35 - 40 రోజులకు జొన్నమల్లె మొలకెత్తుతుంది. పంటకోత కంకి క్రింద వరుసలో వున్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలోనున్న పాలు ఎండిపోయి పిండిగా మారినపుడు, గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి. సస్యరక్షణ పురుగులు మొవ్వు తొలుచు ఈగ : పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వని లాగినపుడు సుళువుగా వచ్చి, కుళ్ళిపోయిన వాసనకల్లి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్ జొన్నని జూలై 15 వ తారీఖు లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేయవలసివస్తే, విత్తన మోతాదును పెంచి, మొవ్వఈగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోఫ్యురాన్ 3జి. గుళికలను మీటరు సాలుకు 2గ్రా, వంతున విత్తేటపుడు సాళ్ళలో వేయాలి లేదా ఎండోసల్బాన్ 35 ఇ.సి. 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7, 14 మరియు 21 రోజుల్లో పిచికారి చేయాలి. మొక్కకు 5 వారాల వయసు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలుచు పురుగు : ఈ పురుగు, పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసేవరకు ఆశిస్తుంది. గుండ్రని వరస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వ చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి వేస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వులో నుండి బయటకు రాదు. నివారణకు విత్తిన 35-40 రోజులలోపు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యురాన్ గుళికలను కాండపు సుడుల్లో వేయాలి. కంకినల్లి : పిల్ల, పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చటం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి క్రం క్రిలో S మంచి గింజలు వుంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగామారుతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకి నల్లిని గుర్తించి, ఎకరాకు 8 కిలోల కార్బరిల్ 5% పొడిమందును కంకుల మీద చల్లాలి. పేనుబంక : నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిధోయేట్ లేదా మలాథియన్ 5% మందుల్లో ఏదోఒకదానిని 1 లీ. నీటికి 2 మి.లీ. వంతున కలిపి పిచికారి చేయాలి. తెగుళ్ళు గింజబూజు : గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో వరాలు పడితే నష్టం అధికంగా వుంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబి లేదా నల్లని బూజు పెరుగుదల గమనించవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బ తింటాయి. దీని నివారణకు గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినపుడు కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రా. కాప్లాన్తోపాటు, 2 గ్రా.ల ఆరియోఫంగిన్ను గాని లేక లీటరు నీటికి 0.5 మి.లీ. ప్రోపికొనజోల్ గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి మరియు గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారీ చేయాలి. పంటకోత ఆలస్యం చేయకూడదు. బంకకారు తెగులు : మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై, చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారటం గమనించవచ్చు. దీని నివారణకు 3 గ్రా. కాప్లాన్ లేక ధైరమ్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2 గ్రా. లేదా బెన్లేట్ 1 గ్రా. లేదా ప్రోపికొనజోల్ 0.5 మి.లీ. కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పూతదశలో చల్లాలి. సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే ఒక ఎకరాకు 200 లీటర్లు నీటితో సిఫార్పు చేయబడిన మోతాదులో క్రిమినాశక / శిలీంధ్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయవలసివుంటుంది. జొన్న సజ్జ, రాగి, కొర్ర, వరిగ పంటల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ సైంటిస్ట్ (చిరుధాన్యాలు), వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్లపల్లె-517 502, చితూరు జిల్లా, ఫోన్ నెం.0877-2276240