మన రాష్ట్రంలో శనగ రబీ పంటగా నల్లరేగడి భూముల్లో సాగుచేయబడుతుంది. రాష్ట్రంలో శనగ విస్తీర్ణం షుమారుగా 15.41 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 8.57 లక్షల టన్నులు. సరాసరి దిగుబడి ఎకరాకు 500 కిలోలు. విత్తేసమయం అక్టోబర్ – నవంబర్ నవంబరు తర్వాత విత్తిన ఎడల దిగుబడులు తగ్గుతాయి. నేలలు సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం. నల్లరేగడి నేలల్లో నిలవ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచుతో మొక్కలు పెరుగుతాయి. చౌడు భూములు పనికిరావు. నేల తయారి తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మొత్తగా దున్ని చదును చేయాలి. రకాలు రకం పంటకాలం దిగుబడి గుణగణాలు జె.జి 11 100-105 8-10 ఎండు తెగులును తట్టుకొంటుంది. లావుపాటి గింజలు గల దేశీయ రకము జె.ఎ.కె.ఐ 9218 95-100 8-10 ఎండుతెగులును తట్టుకొంటుంది. లావుగింజ. దేశవాళి రకము. లామ్ శనగ (యల్.బి. ఇజి-7) 90-95 8-10 లావుగింజ గల కాబూలిరకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది. కె.ఎ.కె- 2 95-100 8-10 లావు గింజ కల కాబూలి రకం. మొక్క ఎత్తుగా పెరుగుతుంది. పూలే.జి – 95311 95-100 7-8 కాబూలి రకం. గింజలు లావుగా ఉంటాయి క్రాంతి (ఐ.సి.సి.సి-37) 100-105 8-10 గుబురుగా పెరుగుతుంది. గింజలు మధ్యస్ధ లావుగా వుంటూ ఎండు తెగులును తట్టుకోగల దేశీయ రకం. శ్వేత (ఐ.సి.సి.వి-2) 80-85 6-7 త్వరగా కాపుకు వచ్చే రకం. ఎండు తెగులును తట్టుకొనే కాబూలి రకం. ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలం (నవంబర్) అన్నేగిరి 100-110 7-9 మొక్క గుబురుగా పెరిగి కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా వుంటాయి జ్యోతి 110-110 6-7 మొక్క క్రింద నుండి గుబురుగా కొమ్మలు వేస్తుంది. గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా వుంటాయి. ఐ.సి.సి.వి 100-110 8-10 మొక్క నిటారుగా పెరిగి బాగా కొమ్మలు వేస్తుంది. ఎండు తెగులును బాగా తట్టుకొంటుంది. ముందుగా (అక్టోబర్ లో) వేసుకోవడానికి అనుకూలం. విత్తనం ఎకరాకు 30-40 కిలోల విత్తనం అవసరం (గింజసైజును బట్టి). ఆలస్యంగా వేసినపుడు నవంబర్లో విత్తన మోతాదు 20% పెంచాలి. లావు కాబూలి రకాలకు 40-50 కిలోల విత్తనం అవసరముంటుంది. విత్తనశుద్ధి ఎండు తెగులున్నచోట కిలో విత్తనానికి 4 గ్రా. బ్రెకోడెర్మా విరిడిని వాడితే మంచి ఫలిత ముంటుంది. రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 20-30 శాతం అధిక దిగుబడి పొందవచ్చు. 8 కిలోల విత్తనానికి ఒక రైజోబియం పాకెట్ (200 గ్రా.) వాడాలి. విత్తటం గొర్రుతోగాని, బుర్రలతోగాని, జడ్డిగంతోగాని విత్తుకోవాలి. పదును తక్కువగా ఉన్నపుడు నాగలితో కూడా విత్తుకోవచ్చు. విత్తేదూరం 30 X 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఎరువులు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరిదుక్కిలో వేసుకోవాలి. నీటియాజమాన్యం శనగ వరాధారపు పంట. తేలికపాటి నీటి తడులు యిచ్చి అధిక దిగుబడులను పొందవచ్చు. నీటి తడులు పెట్టేటప్పుడు నీరు నిల్వకుండా చూడాలి. పూత దశకు ముందు ఒకసారి, కాయదశలో మరోసారి నీటి తడి ఇవ్వాలి. కలుపు నివారణ, అంతరకృషి విత్తేముందు ఫూక్లోరలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పన పిచికారి చేసి, భూమిలో కలియదునాలి లేక పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.0-1.5 లీటర్లు చొప్పన విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పడు గొర్రుతో అంతరకృషి చేయాలి. సస్యరక్షణ పరుగులు శనగపచ్చ పురుగు: ఇది లదై పురుగు దశలో పూతను, కాయలను తింటూ ఉంటుంది. సీతాకోక చిలక దశలో పూత పైన, కాయలపైన గ్రుడ్లను ఒక్కొక్కటిగా పెడుతుంది. గ్రుడ్ల నుండి వచ్చిన పరుగు, కాయలను తొలిచి గింజలను తింటుంది. నివారణకు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.0 మి.లీ. లేక క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.0 గ్రా, చొప్పన పూత, పిందె దశల్లో 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి రెండు, మూడు సార్లు పిచికారి చేయాలి. శనగతో అంతరపంటలుగా ఆవాలు (యల్ బి యమ్ 428, క్రాంతి, సీత), ధనియాలు (సింధు, సాధన, స్వాతి) వేసుకోవాలి. శనగపై ఆశించే కాయతొలుచుపరుగు సమగ్ర సస్యరక్షణ విధానాల గురించి పేజి 53, 54 చూడండి (2-5, 10 అంశాలు కేవలం కందికి మాత్రమే ఉద్దేశింపబడ్డాయి). రబ్బరు పురుగు పైరు తొలిదశలో రబ్బరు పురుగు(స్పోడోప్టెరా ఎక్సిగ్వా) ఆశించి పంటను నష్టపరుస్తుంది. ఈ పురుగు మొదటి రెండు ఆకుల మధ్య మొగ్గ దగ్గర వుండి పత్రహరితాన్ని గీకి తిని నష్టం కలుగజేస్తుంది. పైరు పెరిగేదశలో కూడా ఆకులను తింటుంది. నివారణకు ఎసిఫేట్ 1గ్రా/క్వినాల్ఫాస్ 2.0 మి.లీ./క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ./డైపూ బెంజురాన్ 1.0 మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2లేక 3 సార్ల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి. తెగుళ్ళ ఎండు తెగులు: ఎండు తెగులు సోకిన మొక్కలు తొలి దశలో త్వరగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి. ఈ తెగులు, నేలలో ఉన్న శిలింధ్ర బీజాలు మాక్రోక్రానీడియా, మైక్రోకొనీడియా మరియు క్లామిడోస్పోర్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. ధైరమ్/కాప్లాన్/కార్బండజిమ్ను 2.5 గ్రా/కేజి విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. ఐ.సి.సి.సి. -37, ఐ.సి.సి.వి.-2, ఐ.సి.సి.వి.-10 రకాలు ఎండు తెగులును బాగా తట్టుకొంటాయి. తెగులుకు లొంగిపోయే రకాలను వరుసగా 3–4 సం||లు ఒకే పొలంలో విత్తుకోకూడదు. పంట మార్పిడి, విత్తనశుద్ధి చేయాలి. వేరుకుళ్ళ తెగులు : ఈ తెగులు పూతదశలో నీటి ఎద్దడి మరియు 30'సి ఉష్ణోగ్రత ఉన్నపుడు ఆశిస్తుంది. స్మీరోషియా (ఆవగింజ పరిమాణంలో వుంటాయి)ద్వారా వ్యాప్తి చెందుతుంది. ధైరమ్/కాప్లాన్/ కార్బండైజిమ్ను 2.5./ కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోయి పొలమంతా అక్కడక్కడ కనబడతాయి. వేళ్ళ పెళుసుగా వుంటాయి. ఐసిసివి–10 రకం ఈ తెగులును కొంత వరకు తట్టుకొంటుంది. విత్తనశుద్ధి తప్పక చేయాలి. పంటకోత: కోతకు వచ్చిన మొక్కలను పీకి, ఆరిన తర్వాత వారం రోజుల వరకు కుప్పకట్టి ఉంచి తర్వాత నూర్చాలి.