అజొల్లా, ఆకుపచ్చ ఫెర్నుజాతికి చెందిన మొక్క. ఇది నీటి మీద తేలుతూ వుంటుంది. ఎండ బెట్టిన అజొల్లా పొడిలో 25 - 35 శాతము మాంసకృత్తులు, 10 - 15 శాతము లవణాలు, 7 - 10 శాతము అమినో ఆమూలు మరియు కెరోటిన్, బి, విటమిన్లు ఎక్కువగా వున్నాయి. తక్కువగా లిగ్నైన్ ఉండటంతో పశువులు దీనిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. రోజూ 1.5 నుండి 2 కిలోల అజొల్లా పొడిని పశువులకు పెడితే పాల దిగుబడిలో 15-20 శాతము వృద్ది కనిపించింది. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. అజొల్లా వాడకం పాల నాణ్యతను పెంచుటయే గాక పశువుల ఆరోగ్యమును వృద్ధి చేయును. అజొల్లాను దాణాగా వాడుట ద్వారా దాణా ఖర్చులో 20-25 శాతం తగ్గుటే కాక పాలలో వెన్నశాతము మరియు SNF కూడా పెరుగుట వలన ప్రతి లీటరుకు 60 నుండి 150 పైసలు అధిక ఆదాయం పొందవచ్చు గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్ళ వంటి వాటికి కూడ అజొల్లా మేతగా వేసి ఆదాయం పొందవచ్చు. తాజా అజొల్లాను 1:1 నిష్పత్తిలో పశువుల దాణాలలో కలిపి వాడవచ్చును. అజొల్లాను పశువులకు నేరుగా కూడ తినపించవచ్చు. దీనితో పశుదాణా వాడకం సగానికి సగం తగ్గించుకోవచ్చు. 1 కేజి అజొల్లా ఉత్పత్తికి 38 పైసలు నుంచి 50 పైసలు వరకు ఖర్చు వుంటుంది. అజొల్లా ఉత్పత్తి రోజు 4 కిలోల అజొల్లా ఉత్పత్తి చేయుటకు 2.25 X 1.15 మీటర్ల సైజులో మూడు తొట్ల తయారుచేసుకోవాలి. ముందుగా భూమిపై కలుపును పూర్తిగా తొలగించి సమానముగా చదును చేయాలి. 10 సెం.మీ ఎత్తు వచ్చునట్లు ఇటుకలు నిలబెట్టి 2.25 మీటర్ల పొడవు 1.5 మీటర్ల వెడల్పు వుండునట్లు తొట్టిని తయారుచేసుకోవాలి. బయట నుండి వ్రేళ్ళలోనికి రాకుండా ప్లాస్టిక్ సంచులు గోతిలోపల పరచాలి. దీని మీద 150 జి.యస్.యం. మందము గల సిల్పాలిన్ షీట్ వేసి, షీట్ చివరలు ఇటుకలపై అంచుల వరకు వచ్చునట్లు చూడాలి. (250 x 1.80 మీటర్ల సైజు గల సిల్పాలిన్ షీటు), సిల్పాలిన్ షీట్ కప్పిన తొట్టి లోతు 10 సెం.మీ. ఉండాలి. తర్వాత 30 - 35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి ఆ మెత్తని మట్టిని షీటు మీద గోతిలో ఒకే విధముగా వుండేలా పరచాలి. (చదరపు మీటరుకు 10 కిలోల మట్టి ) తర్వాత 4 - 5 కిలోల పశువుల పేడను (2 - 5 రోజుల నిలువ వుంచిన) 15 - 20 లీటర్ల నీటిలో కలిపి గుజ్ఞగా తయారుచేసి దానికి 40 గ్రాముల మినరల్ మిక్బర్ను మట్టిలో కలపాలి 7 నుంచి 10 సెంuల వరకు నీరు నిల్వవుంచాలి. దీనికొరకు మరింత నీటిని కలపాలి. తరువాత బెడ్లో మట్టిని నీటిని కలియత్రిప్పాలి. నీటి లెవల్ 7 - 10 సెం.మీ వుండునట్లు చూసి 1 - 15 కిలోల తాజా మదర్ కల్చర్ అజొల్లాను ఈ బెడ్ మీద సమానముగా పడేలా చల్లాలి. అజొల్లా త్వరగా పెరిగి, గొయ్యి మొత్తాన్ని 7 నుండి 10 రోజులలో ఆక్రమిస్తుంది. (ఒక కిలో అజొల్లా నుండి వారం లోజులలో 8 - 10 కిలోలు వస్తుంది) 7వ రోజు నుండి అజొల్లాను ప్రతి రోజు సేకరించవచ్చు ఆ తరువాత 7 రోజుల కొకమారు 1కిలో పేడను 20 గ్రాముల మినరల్ మిక్చర్ 5 లీటర్ల నీటితో కలిపి గుజ్ఞగా చేసి ఆజొల్లా తొట్టిలో పోయాలి. పెంపకంలో జాగ్రత్తలు నేరుగా సూర్యకాంతి పడేచోట గాని, మరీ ఎక్కువ నీడగల ప్రదేశములో కాకుండా అజొల్లాను పెంచాలి. అజొల్లా పెంచు గుంటలు ఆకులురాలని ప్రదేశములో ఏర్పాటుచేసుకోవాలి. అట్లు లేనిచో గుంటలలో ఆకులు రాలినట్లయితే అజొల్లా కుళ్ళిపోయే ప్రమాదముంది. నీటిమట్టం కనీసం 5 సెం.మీ తక్కువ కాకుండా, గుంట యొక్క ప్రతిమూలలో సమానంగా వుండేటట్లు చూడాలి. పోషకాల లోపం లేకుండా చూడాలి. అవసరమైతే తెగుళ్ల నిరోధక చర్యలు చేపట్టాలి. 10 రోజుల కొకసారి బెడ్లో నాలుగవ వంతు నీటిని తీసి వేసి క్రొత్త నీటిని నింపాలి. 60 రోజుల కొకసారి 5 కిలోల బెడ్ మట్టిని తొలగించి తిరిగి 5 కిలోల కొత్త మట్టిని బెడ్ అంతా పరచాలి. ప్రతి 6 నెలలకొకసారి మట్టిని, నీటిని తొలగించి, క్రొత్తగా తయారుచేసిన నీటిని మట్టిని వుంచి అజొల్లాను క్రొత్తగా వేయాలి. పూర్తిగా పాడైపోయిన అజొల్లాను మరియు తెగుళ్ళ బారిన పడిన అజొల్లాను పూర్తిగా తొలగించి తాజా అజొల్లాను వేయాలి. చీడపీడలను ఆశించింన అజొల్లాకు పరుగు మందులు వాడిన యెడల అట్టి అజొల్లాను మేతగా వాడరాదు. కుళ్ళడు వ్యాధి అనేది ఫంగస్ వలన వచ్చే వ్యాధి, మనం అజొల్లా తయారుచేసే విధానం వల్ల వచ్చే ఒక ప్రధానమైన వ్యాధి, ఈ వ్యాధి సోకిన అజొల్లాను బెడ్ నుండి తీసి వేరేచోట పూడ్చివేయాలి. అజొల్లాను మేతగా మేపుట చ.సెం.మీ వెడల్పయిన రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో సేకరించిన అజొల్లాను వుంచాలి. సగం నీరు నింపిన బకెట్ మీద ట్రేసు వుంచి పై నుండి నీటిని పోసి ఆవు పేడ వాసన పోయేటట్లుగా కడగాలి. చిన్న అజుల్లా మొక్కలు రంధ్రాల ద్వారా బక్కెట్టులోనికి వెళతాయి. ఆ నీటిని మరలా బెడ్లో పోయుట ద్వారా అజొల్లాను తిరిగి పెంచవచ్చు. అజొల్లాను పశువుల దాణాతో 1:1 నిష్పత్తిలో వాడకము రైతులకు చాలా లాభదాయకము. కావున రైతు సోదరులు అజొల్లా పెంపకము చేపట్టి లబ్దిపొందవలసినదిగా విజ్ఞప్తి. ఆధారం : ఆచార్య రంగా కృషి విజ్ఞాన కేంద్రము, వనస్థలి, కరకంబాడి, రేణిగుంట మండలం, చిత్తూరు