తెలంగాణలో పంటల సాగు పూర్తిగా వర్షాధామైనదని అందరికి తెలిసిన సత్యం. వేసవి పూర్తికాగానే రైతులు తొలకరి వర్షం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఎన్నో నూతన ఆలోచనలతో సాగును ప్రారంభించడానికి సిద్ధమౌతుంటారు. ఇలా వారి ఆలోచనలకు అనుగుణంగా సకాలంలో వరాలు పడి చెరువులు, బావులు నిండి పంటకు సాగు నీరు అందితే ఆ ఏడాది పాటు ఊరు పచ్చగా ఉండి, రైతు సంతోషంగా ఉంటాడు. కానీ రుతుపవనాలు సరైన సమయంలో రాక సరైన వర్షపాత నమోదు లేకపోతే నీటి నిల్వ తగ్గి, సాగు, తాగు నీటికి కొరత ఏర్పడుతుంది. ఈ నీటి కొరత వలన ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి విపత్కర కరువు, సాగునీటి కొరత లాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గి, సరైన పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతోంది. ఇలా సాగునీటి కొరత ఉన్న పరిస్థితుల్లో తక్కువ నీటి లభ్యత ఉన్నాకూడా సూక్ష్మ, తుంపర సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసి ఈ నీటి ఎద్దడిని అధిగమించవచ్చు. కానీ ఈ సూక్ష్మ తుంపర సేద్యంలో వినియోగించే ఆధునిక పరికరాలు కొనుగోలుకు అయ్యే వ్యయం చాలా ఎక్కువ. మనరాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నందున ఈ వ్యయాన్ని భరించడం మారింది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2015న ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన అనే పథకాన్ని ప్రతీ చుక్కతో ఎక్కువ పంట (మోర్ క్రాప్ ఫర్ డ్రాప్) అనే గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పూర్వ నీటి పారుదల కొరకై ఉన్న ఇతర పథకాలను కలుపుకుని దేశ వ్యాప్తంగా విస్తరించింది. అంతే కాకుండా రాబోవు ఐదు సంవత్సరాలకు 50 వేల కోట్లు రూపాయలను ఈ పథకానికి ఖర్చు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర రైతులకు సూక్ష్మ తుంపర సేద్యానికి అవసరమగు పరికరాల వ్యయంపై సబ్సిడీని అందచేయస్తారు. రాష్ట్రంలో కరువు, కరువులేని మండలాలను గుర్తించి ఈ గుర్తించిన మండలాలకు వివిధ రూపాల్లో సబ్సిడీని అందచేస్తారు. ఇలా గుర్తించిన ప్రాంతాలలో తుంపర సేద్యానికి వాడే పరికరాలపై 75 శాతం సబ్సిడీ, సూక్ష్మసేద్యానికి వాడే పరికరాలపై 100 శాతం ఎస్.సి, ఎస్.టి. కులాలకు చెందిన రైతులకు, 90 శాతం బి.సి. కులాల రైతులకు, 80 శాతం ఇతరులకు సబ్సిడీగా ఇస్తారు. ఈ సూక్ష్మ తుంపర సేద్య పరికరాలకు అయ్యే ఖర్చు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి దగ్గరలోని వ్యవసాయ అధికారి లేదా ఉద్యాన అధికారిని సంప్రదించవచ్చు. అంతే కాకుండా వివిధ ప్రైవేటు కంపెనీల యాజమాన్యం నుంచి కూడా సబ్సిడీకి సంబంధించిన వివరాలను పొం తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ సేద్య పరికరాలపై ఇచ్చే సబ్సీడీలో కేంద్ర, రాష్ట్ర వినియోగదారుని వాటాల శాతం, వివరాలు సూక్ష్మ సేద్య పరికరాలపై సబ్సీడీ అందించే విధానం మండలాలు రైతు దుర్గం రిజర్వేషన్ సబ్సీడీ శాతం (100 శాతానికి) కేంద్ర ప్రభుత్వం వాటా (శాతం) రాష్ట్ర ప్రభుత్వం వాటా (శాతం) మొత్తం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం సబ్సీడీ లబ్దిదారుని వాటా మొత్తం కరువు మండలాలలో మధ్య / సన్నకారు ఎస్.సి. 36 24 60 15 75 25 100 ఎస్.టి. 36 24 60 15 75 25 100 బి.సి. 36 24 60 15 75 25 100 ఇతరులు 36 24 60 15 75 25 100 ఇతర రైతులకు ఎస్.సి. 27 18 45 30 75 25 100 ఎస్.టి. 27 18 45 30 75 25 100 బి.సి. 27 18 45 30 75 25 100 ఇతరులు 27 18 45 30 75 25 100 కరువు లేని మండలాలు మధ్య / సన్నకారు ఎస్.సి. 27 18 45 30 75 25 100 ఎస్.టి. 27 18 45 30 75 25 100 బి.సి. 27 18 45 30 75 25 100 ఇతరులు 27 18 45 30 75 25 100 ఇతర రైతులకు ఎస్.సి. 21 14 35 40 75 25 100 ఎస్.టి. 21 14 35 40 75 25 100 బి.సి. 21 14 35 40 75 25 100 ఇతరులు 21 14 35 40 75 25 100 తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ సేద్య పరికరాలపై ఇచ్చే సబ్సీడీలో కేంద్ర, రాష్ట్ర వినియోగదారుని వాటాల శాతం, వివరాలు సూక్ష్మ సేద్య పరికరాలపై సబ్సీడీ అందించే విధానం మండలాలు రైతు దుర్గం రిజర్వేషన్ సబ్సీడీ శాతం (100 శాతానికి) కేంద్ర ప్రభుత్వం వాటా (శాతం) రాష్ట్ర ప్రభుత్వం వాటా (శాతం) మొత్తం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం సబ్సీడీ లబ్దిదారుని వాటా మొత్తం కరువు మండలాలలో మధ్య / సన్నకారు ఎస్.సి. 36 24 60 40 100 0 100 ఎస్.టి. 36 24 60 40 100 0 100 బి.సి. 36 24 60 30 90 10 100 ఇతరులు 36 24 60 30 90 10 100 ఇతర రైతులకు ఎస్.సి. 27 18 45 55 100 0 100 ఎస్.టి. 27 18 45 55 100 0 100 బి.సి. 27 18 45 45 90 10 100 ఇతరులు 27 18 45 35 90 20 100 కరువు లేని మండలాలు మధ్య / సన్నకారు ఎస్.సి. 27 18 45 55 100 0 100 ఎస్.టి. 27 18 45 55 100 0 100 బి.సి. 27 18 45 45 90 10 100 ఇతరులు 27 18 45 45 90 10 100 ఇతర రైతులకు ఎస్.సి. 21 14 35 65 100 0 100 ఎస్.టి. 21 14 35 65 100 0 100 బి.సి. 21 14 35 55 90 10 100 ఇతరులు 21 14 35 45 90 10 100 ఆధారం: పాడిపంటలు మాస పత్రిక