రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్న తరువాత సజ్జ ప్రధానమైన ఆహార పంట. సజ్జ పంట ఇతర పంటలకు భిన్నంగా ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్ట పరిస్ధితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. సజ్జలో ఇనుము మరియు జింకు అధికంగా ఉంటాయి. సజ్జ పంటను మెట్ట ప్రాంతాల్లో తక్కువ సారవంతమైన వేలల్లో సాగు చేయటం వలన తక్కువ దిగుబడులు వస్తున్నాయి. సజ్జ ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచుటకు రకాలను ఎంపిక చేసుకోవటం, మేలైన యాజమాన్య పద్దతులను పాటించటం ఎంతో అవసరం. సజ్జ సాగుకి సుమారుగా 400-450 మి.మీ. వర్షపాతం అవసరం. వేసవిలో సజ్జను జనవరి మాసంలో విత్తుకోవచ్చును. తేలికపాటి ఎర్ర నెలలు బాగా అనుకూలం, నీరు నిలువని నల్లరేగడి నెలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. కానీ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు విలువ ఉంటే మొక్కలు సరిగా ఎదగవు. రకాల ఎంపిక పి.హెచ్.బి.-3 (హైబ్రిడ్) ఖరీఫ్ మరియు వేసవి కాలానికి అనుకూలం. 85-90 రోజులలో పంటకాలం పూర్తవుతుంది. ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వెర్రి కంకి తెగులును మరియు బెట్టాను తట్టకుంటుంది. హెచ్. హెచ్.బి- 67 (హైబ్రిడ్) ఖరీఫ్ మరియు వేశావు కాలానికి అనుకూలం. అతి తక్కువ కాలంలో (65-70 రోజులు) కోతకు వచ్చే ఈ హైబ్రిడ్ వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఐ.సి.యమ్.హెచ్.-356 ఖరీఫ్ మరియు వేసవి కాలానికి అనుకూలం. 80-85 రోజులలో పంట కాలం పూర్తవుతుంది. గింజలు మధ్యస్ధ లావుగా ఉండి ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.టి.పి.-8203 ఖరీఫ్, వేసవి కాలాలకు అనుకూలం. 80-85 రోజులలో పంట కాలం పూర్తవుతుంది. గింజలు లావుగా ఉంటాయి. ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. విత్తన మేతదు, విత్తు విధానం ఎకరానికి 1.5-2.0 కిలోల విత్తనం సైరిపోతుంది. విత్తే ముందు విత్తనాలను 2% ఉప్పు ద్రావణంలో (20 గ్రా. లీటరు నీటికి) 10 నిముషాలు ఉంచటం ద్వారా ఎర్గట్ శిలింద్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చును. ఆరిన తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున ధైర్యమ్ ను కలిపి విత్తనశుద్ధి చేయాలి. నేరుగా విత్తనాన్ని సాళ్ళ మధ్య 45 సెం.మీ. ఎడంగాను మరియు సాళ్లలో మొక్కల మధ్య 10 నుండి 15 సెం.మీ. దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కి చేసేటప్పుడు 3-4 టన్నుల పశువుల ఎరువును ఎకరా పొలంలో వేసి కలియదున్నాలి. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నీటి పారుదల పంటకు ఎకరానికి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్యరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజనిని విత్తేటప్పుడు సగం, మిగతా భాగం 30 రోజుల దశలో వేయాలి. కలుపు నివారణ విత్తిన 21 రోజుల లోపు మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తూ ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తిన 15 రోజులకు దంతులు నడిపి ఎడసేద్యం చేయాలి. విత్తిన 48 గంటలలోగా అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి తడి వేల పై పిచికారీ చేయాలి. సజ్జలో అంతర పంటగా కందిని 4:1 లేదా 6:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. నీటి యాజమాన్యం వేసవిలో సాగు చేసేటప్పుడు పూత దశ, గింజ పాలు పోసుకొనే దశ మరియు గింజ గట్టిపేదే దశల్లో నీటి హ్యాదులు ఇవ్వాలి. సస్యరక్షణ పచ్చకంకి / వెర్రి కంకి తెగులు వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు లేత మొక్కల ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుదల కనిపించి తెగులు తీవ్రత ఎక్కువై మొక్కలు గిడసబారి చనిపోతాయి. కంకి పూర్తిగా ఆకుపచ్చిని ఆకులుగా మారి గింజ ఏర్పడదు. దీని నివారణకు కిలో విత్తనానికి 6.0 గ్రా. మెతలాక్సిల్ తో విత్తనశుద్ధి చేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించి ఉన్నట్లయితే మెతలాక్సిల్ 35 డబ్ల్యు.ఎస్ 1.0 గ్రా. లేదా మెతలాక్సిల్ 8% + మ్యంకోజెబ్ 64% డబ్ల్యు.పి. 3.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తేనెబంక తెగులు మొక్కలు పుష్బించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం మరియు వర్షపు తుంపరలు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. దీని నివారణకు పైరు పూత దశలో మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. త్రుప్పు మరియు అగ్గి తెగులు ఈ తెగుళ్ళ ఆశించిన మొక్కల ఆకుల పై మచ్చలు ఏర్పడును. ఈ తెగుళ్ళ ఎక్కువగా ఆశించినప్పుడు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బండజిమ్ చొప్పున కలిపి పైరు పై పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు / కాండం తొలుచు పురుగు ఈ పురుగు ఆశించినట్లయితే నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటకోత మరియు మార్పిడి సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి కనీసం 2 దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతికట్టాలి. కంకులను బాగా ఆరబెట్టి తర్వాత నూర్పిడి చేసుకోవచ్చను. ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం