రైతులు ఎంతో కష్టపడి పండించిన విత్తనాన్ని నిల్వ చేసుకోవడంలో సరైన జాగ్రత్తలను పాటించాలి. వివిధ పరిశోధనా ఫలితాల ప్రకారం నిల్వ చేసుకున్న విత్తనలలో 15 నుంచి 25 శాతం వరకు కీటకాలు మరియు బూజు తెగుళ్ళ వలన నష్టం జరుగుతుందని అంచనా. విత్తన నిల్వ సమయంలో చెడిపోవడానికి ముఖ్య కారణాలు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం భద్రపరిచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం పరిశుభ్రత పాటించకుండా నిల్వ చేయడం నిల్వ సమయంలో వివిధ రకాలైన కీటకాలు మరియు బూజు తెగుళ్ళు ఆశించడం వల్ల నాణ్యత మరియు మొలక శాతం తగ్గడం జరుగుతుంది. నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగులు వడ్ల చిలక : ఈ పురుగు వరి, గోధుమ, మొక్కజొన్న విత్తనాల్ని ఆశించే అతి ముఖ్యమైన పురుగు. ఈ పురుగు సీతాకోకచిలుక జాతికి చెందింది. రెక్కల పురుగులు, లేత గోధుమ రంగులో ఉంటాయి. ఈ పురుగు విత్తనం పైన గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్లు నుంచి వెలువడిన లార్వాలు విత్తనం లోపలికి వెళ్ళి లోపలి పదార్దం తింటూ అక్కడే కోశస్దదశకు చేరుకుంటాయి. వారం రోజులలో రెక్కల పురుగులు గుండ్రని రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. వీటి జీవిత చక్రం 30-32 రోజుల్లో పూర్తవుతుంది. ముక్కు పురుగు : ఈ పురుగు వరి, గోధుమ మరియు మొక్కజొన్న విత్తనాల్ని అధికంగా ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగు గింజల మీద చిన్న రంధ్రం చేసి దానిలో గ్రుడ్లు పెడుతుంది. గ్రుడ్లు నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోకి పోయి తింటూ అక్కడే కోశస్ధ దశకు చేరుతాయి. వారం రోజులలో తల్లి పురుగులు గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తాయి. మసి పురుగు : ఇది విత్తనాన్ని ఆశించే చిన్న పెంకు పురుగు. దీని తల క్రిందికి వంగినట్లుగా ఉంటుంది. ఈ పురుగులు గింజ మీద ఆకారం లేని పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తాయి. వీటి జీవిత చక్రం రెండు నెలల్లో పూర్తవుతుంది. పిండి పురుగు : ఈ పురుగు బియ్యం పిండి, రవ్వ, మైదా ని ఎక్కువగా అశంచి నష్టం కలిగిస్తుంది. ఇవి విసర్జించిన పదార్ధం వల్ల పిండి ముక్కిపొయిన వాసన వస్తుంది. అపరాలను ఆశించే పుచ్చు పురుగు : ఈ పురుగు గింజలపైన గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్లు నుంచి వచ్చిన లార్వా గింజలోనికి ప్రవేశించి లోపలి పదార్దాలను తింటూ కోశస్ధ దశకు చేరుతుంది. వారం రోజుల తరువాత తల్లి పురుగు గింజ పైన గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తుంది. వేరుశనగ ను ఆశించే పుచ్చు పురుగు : ఇది కాయల మీద రంధ్రం చేసి గింజలను తింటూ అపార నష్టాన్ని కలుగజేస్తుంది. శిలీంధ్రాలు విత్తనాన్ని నిల్వ సమయంలో ఆరబెట్టకపొయినా వివిధ శిలీంధ్రాలు అశిస్తాయి. మొక్కజొన్న మరియు వేరుశనగలో తేమ శాతం ఉధ్తమై అస్పర్జిల్లమ్ అను శిలీంద్రం ఆసించి గిజంలపై తెల్లటి, పచ్చని (లేదా) నల్లటి బుజుగా ఏర్పడుతాయి. దీని వలన గింజలు నాణ్యత, రంగు మరియు రుచిని కోల్పోతాయి. గింజలు అట్టలు కట్టి చెడు వాసన వస్తాయి. ఈ శిలీంద్రాలు మైకోటాక్సీన్స్ అనే విషపూరిత రాసాయనాలను గింజల్లో విడుదల చేస్తాయి. వేరుశనగ మరియు మొక్కజోన్నలో వీటిని అప్లోటాక్సిన్స్ అంటారు. ఈ విత్తనాలు / గింజలు మానవులు, కోళ్ళు మరియు పశువులకు హానికరం. నివారణ: శిలీంధ్రాలు తక్కువ తేమ ఉంటే అభివృధి చెందవు. కావున విత్తనాలను, సరిగ్గా ఆరబెట్టాలి (10-12% తేమ శాతం). కీటకాలు మరియు ఎలుకలు ఉంటే శిలీంధ్రాలు ఉధృతి ఎక్కువ, ఎందుకంటే ఇవి ఆశించడం వలన విత్తనాలు నాణ్యతను కోల్పోతాయి. ఎట్టి గింజల్లో శిలీంధ్రాలు సులభంగా ప్రవేశిస్తాయి. శిలీంద్రాలను నిల్వలో అదుపులో ఉంచడానికి ధైరామ్ (లేదా) కాప్టాన్ – 2.5 గ్రా/ ఒక కిలో విత్తనానికి కలుపుకోవాలి. విత్తన నిల్వ సమయంలో చేపట్టవల్సిన సస్యరక్షణ చర్యలు విత్తనాన్ని బాగా ఆరబెట్టాలి అనగా తేమ శాతం వరి, గోధుమ, జొన్న, మొక్కజోన్నలో 12 శాతం మరియు అపరాలలో 9 శాతంకి మించరాదు. విత్తన నిల్వ ఉండే గదుల్లో పగుళ్ళు, కన్నాలు పూడ్చి సున్నం వేస్తె దాగి ఉన్న పురుగులు నశిస్తాయి. వర్షాకాలంలో విత్తనానికి తేమ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కొత్త సంచుల్లో విత్తనాన్ని నిల్వ చేయాలి, లేని పక్షంలో పాత సంచులను మలాధియాన్ మందు ద్రావణంలో ముంచి ఆరబెట్టిన తరువాత విత్తనాన్ని నింపుకోవాలి. సంచులను నేరుగా నేలపైన కాకుండా ఎత్తైన చెక్కబల్లపై నిల్వ చేయాలి. పాలిధీన్ లైనింగ్ ఉన్న సంచులను వాడితే పురుగులు తక్కువగా ఆశించడం జరుగుతుంది. విత్తనశుద్ధి నిల్వ సమయంలో ఆశించిన పురుగులు మరియు తెగుళ్ళను బట్టి సరైన సస్యరక్షణ మందులతో విత్తనశుద్ది చేసుకోవాలి.విత్తన శుద్ధి చేసిన గింజలను ఆహార పదార్ధంగా వాడరాదు. విత్తన నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగులు, తెగుళ్ళు – సస్యరక్షణ చర్యల పై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : సంచాలకులు, విత్తన పరిశోధన మరియు సాంకేతిక కేంద్రం రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040 – 24015382