రాష్ట్ర రైతాంగం వ్యవసాయంతో నాణ్యత గల అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన సాగు యాజమాన్య పద్దతులను సకాలంలో మేలైన సాగు యాజమాన్య పద్తులను సకాలంలో ఆచరించాలి. ఈ మధ్య కాలంలో పట్టణాలలో అధికమొతున్న పారిశ్రామీకరణ వలన రైతు కూలీల సమస్య జఠిలమై సాగు పనులు సకాలంలో చేపట్టకపోవడంతో దిగుబడులు తగ్గి ఖర్చులు పెరగడంలో చేపట్టకపోవడంతో దిగుబడులు తగ్గి ఖర్చులు పెరగడంతో పాటు వికర ఆదాయం తగ్గుతున్నది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే సాగులో ఆధునిక యాంత్రీకరణ పరిజ్ఞానాన్ని అవలంభించడం ఆవశ్యకం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వివిధ పంటల సాగులో పలు రకాల పనిముట్లు, యాంత్రాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ప్రైవేటు రంగ నిపుణులు రూపొందించి రైతు లోకానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. గత కాలంలో రైతులు ఎక్కువగా నేల తయారీ మరియు విత్తే పరికాలను వినియోగించేవారు. ఈ మధ్య కాలంలో ఎరువులను సమర్థవంతంగా వాడటానికి ఎరువులు వేయు పరికరాలు, కలుపు యాజమాన్యానికి తుంపర్ల, బిందు సేద్య పరికరాలు, సకాలంలో కోత, నూర్పిడి చేపట్టడానికి రూపర్లు, కంహైన్డ్ మరియు పలు రకాల కోత యంత్రాలు వినియోగం బాగా వృద్ది చెందింది. పంట దిగుబడులతో పాటు ఉత్పత్తుల నాణ్యత మరియు విలువ జోడింపుల ఆవశ్యకత దృష్ట్యా మార్కెట్లో లభించే అరబెట్టు, గ్రేడింగ్, పంట ఉత్పత్తులను మెరుగు పెట్టు, శుద్ది, విలువ జోడింపు యంత్రాలను కూడా విరివిగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. సేద్యంలో వస్తున్న నూతన పోకడల నేపధ్యంలో భారీ స్థాయిలో సాగును చేసే కార్పోరేట్ సంస్థలు, పెద్ద రైతులు, భూమిలో లవణ, తేమ శాతాన్ని నిర్ధారించు సెన్సర్లు, పంట ఆరోగ్య నిర్దారణ మరియు యాజమాన్యానికి డ్రోనులు లాంటి ఆధునాతన పరికరాలను వినియోగిస్తూ వ్సవసాయ యాంత్రీకరణలో విప్లవాన్ని సృష్టిస్తున్నారు. రైతులను వ్యవసాయ యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించాలన్న వృధ సంకల్పంతో గత దశాబ్ద కాలంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి రైతాంగానికి కావలసిన వివిధ వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను సరఫరా చేస్తున్నారు. అలాగే గ్రామ స్థాయిలో ప్రతి పంటకు సంబంధించిన పనిముట్లు మరియు యంత్రాలను అన్నదాతలకు సకాలంలో అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఎంపిక చేయబడిన రైతులకు మరియు బృందాలకు సుమారు 4 నుండి 20 లక్షల రూపాయల వరకు రాయితీ కల్పిస్తూ కస్టమ్ హైరింగ్ సెంటర్లను నెలకొల్పుతున్నారు. మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన ట్రాక్టరుతో నడువబడే రోటావేటర్, పలు రకాల విత్తనములను విత్తు గొర్రు, పంటలను నూర్పిడి చేయు మరియు పసుపు దుంపలను త్రవ్వు యంత్రం, స్వయంచోదక శక్తి గల వరి నాటు, కలుపు తీయు యంత్రం, మెట్ట భూమిలో కలుపు తీయు యంత్రములు తెలంగాణ రాష్ట్రంలో బహు ప్రాచుర్యం పొందినవి. వ్యవసాయ యాంత్రీకరణకు ఉపయోగించు యంత్రాలను ముఖ్యంగా ఆరు భాగాలుగా విభజించవచ్చు. ప్రాధమికంగా మరియు ద్వితీయంగా దుక్కిచేయుటకు ఉపయోగించు యంత్రాలు ఇందులో భాగంగా రెక్కల నాగలి మరియు దంతి నాగలిని ప్రాధమికంగా దుక్క చేయుటకు, లేజర్ గైడెడ్ లెవరర్ ను ఎత్తు పల్లములు లేకుండా పొలమును చదును చేయుటకు ఉపయోగించవచ్చును. ప్రాధమికంగా దుక్కి చేసినప్పుడు వెలువడిన మట్టి పెల్లాలను విత్తనాలు విత్తడానికి మెత్తగా మరియు పొడిగా చేయుటకు రోటావేటర్ ను, డిస్క్ హారోను ఉపయోగించవచ్చు. విత్తనాలను విత్తుటకు లేదా మొక్కలను నాటు యంత్రాలు విత్తనాలను విత్తడానికి గొర్రులు, నారును వాడటానికి ట్రాన్స్ ప్లాంటర్స్ ను ఉపయోగించవచ్చు. గొర్రులతో వివిధ రకముల విత్తనాలను మరియు ఎరువులకు కూడా ఒకేసారి వేయవచ్చును. వరిని మాటుటకు 4, 6, 8 వరుసల నాటు యంత్రాలను ఉపయోగించవచ్చును. అంతరకృఫికి ఉపయోగించు యంత్రాలు కలుపు తీయుటకు కల్టివేటర్, మనిషితో నడుపబడే వీడర్లు, ట్రాక్టరుతో నడుపబడే కలుపు తీయు యంత్రములను ఉపయోగించవచ్చును. ఈ కలుపు తీయు యంత్రములను ఉపయోగించవచ్చును. ఈ కులుపు తీయు యంత్రాలు తడి పొలంలో మరియు మెట్ట పొలంలో ఉపయోగించుట వేరువేరిగా రూపొందింపబడ్డాయి.పంటల సస్యరక్షణకు ఉపయోగించు యెంత్రాలు పంటల సస్యరక్షణకు ఉపయోగించు యెంత్రాలు సస్యరక్షణ మందులను పిచికారి చేయుటకు మనిషితో పనిచేయగల నాప్ స్నాక్ స్ప్రేయర్లు, పవర్ తో నడుపబడే స్ప్రేయర్లు, ట్రాక్టరులో నడుపబడే స్ప్రేయర్లను ఉపయోగించవచ్చు. కోత కోయడానికి ఉపయోగించు యంత్రాలు భూమి లోపల పండు పంటల దుంపలను త్రవ్వు యంత్రాలను, భూమిపైన వరిని మరియు ఇతర పంటలను కోత కోయుటకు రీఫర్ లు, రీఫర్ కంబైన్డెర్లు, కంబైన్డె హార్వెస్టర్లు మొదలగునవి వాడవచ్చును. కోత కోసిన తరువాత గింజలను వేరుచేయు యంత్రాలు పంటలను కోత కోసిన తరువాత గిందలను వేరు చేయుటకు వివిధ రకాల పంట నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చును. ఆధునిక వ్యవసాయ పరికరాలను వాడటం వలన ఖర్చు తగ్గడమే కాక సమయం వృధాకాదు. దీని వలన అనుకున్న సమయంలో అనగా భూమిలో తేమ ఆవిరి కాక ముందే విత్తనం గానీ, సరైన సమయంలో కలుపు తీయడం, చీడపీడల నివారణకు సరైన సమయంలో మందులను పిచికారి చేయడం, కోత కోయడం మరియు విత్తనాలను వేరు చేయవచ్చును. పంట ధాన్యాన్ని లేదా పంటను గడ్డిగులలో నిల్వ ఉంచుకోవచ్చును. తద్వారా వాటి జీవితకాలంను పెంచవచ్చును. దీని వలన శ్రమ తక్కువగా ఉండి, లాభం పెరుగుతుంది. ఉత్పత్తి కూడా ఎక్కువ చేయవచ్చును. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం మన ఉత్పత్తికి విదేశాల్లో గిట్టుబాటు ధర లభించాలంటే ఉత్పత్తుల నాణ్యత పెంచి, ఖర్చు తగ్గించాలి. ఆధునిక వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాల వాడకం దీనికి దోహదం చేస్తుంది. వివిధ పంటలలో యాంత్రీకరణ వరి వరి పంటను సాగు చేయుటకు ప్రాథమికంగా రెక్కల నాగలి లేదా దంతి నాగలి ద్వారా పొలాన్ని దుక్కి చేసుకోవచ్చును. తదుపరి లేజర్ గైడెడ్ లెవలర్ ను చదును చేయుటకు ఉపయోగించవచ్చును, దీని వలన పొలము ఎత్తు పల్లములుగా లేకుండా వరి సాగు చేయుటకు చదునుగా ఉండును. ద్వితీయంగా రోటావేటరుతో దుక్కి చేయుదురు, దీని వలన ప్రాథమికంగా దుక్కి చేసుకోవచ్చును. ఉన్న మట్టి గడ్డలు విడిపోయి నేల పొడిగా మరియు చదునుగా తయారవుతుంది. తదుపరి ఈ పొలంలో 5 నుండి 10 సెం.మీ. వరకు నీరు నిల్వ ఉంచి రోటావేటరుతో లేదా దుమ్ము చక్రాలతో దమ్ము చేయుదురు. దీని వలన నీరు భూమిలోనికి ఎక్కువగా ఇంకిపోకుండా నిలువ ఉండును. దమ్ము చేసిన పొలాన్ని రెండు రోడుల తరువాత వరి నాటుటకు ఉపయోగించుకోవచ్చును. వరిని యాంత్రీకరణ పద్దతి ద్వారా సాగు చేయుటకు నారును ట్రేలలో గాని లేదా పాలిధీన్ కవరుపైగానీ పెంచాలి. దీని కోసం 2-3 మి.మీ పరిమాణం గల మట్టిని ఎంచుకోవాలి. ముఖ్యంగా రాళ్ళ వంటి పెద్ద పరిమాణం గల వస్తువులు లేకుండా మట్టిని జల్లెజతో వేరు చేయాలి. ఇలా తయారు చేసుకున్న మట్టికి మెత్తటి నునువైన ఎరువు లేదా కొబ్బరి పీచు పొడి లేదా వానపాముల ఎరువును కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్రేలలో నింపేందుకు వరి విత్తనాలను వెదజల్లే యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చును. ఇందులో మొదటగా ట్రోలలో మట్టి నింపి హాపర్ తరువాత నీటిని మట్టిపై చల్లే భాగం తరువాత విత్తనాలను చల్లే హాపర్ మరియు చివరగా విత్తనం చల్లిన ఉపరితలంపై తప్పడానికి మట్టిని, చల్లే భాగాలుంటాయి. ఈ యంత్రం ద్వారా మట్టిని విత్తనాలను సునాయసంగా నింపవచ్చు. పాలిధీన్ కవరుపై నారును పెంచుటకు మట్టి మిశ్రమంను చెక్కలతో చేసిన ట్రేలలో వేసి దానిపై విత్తనాలను వెదజల్లుకోవచ్చు. నర్సరీ బెడ్ యొక్క మందం 2 సెం.మీ.ల కంటే ఎక్కువ మించకుండా చూసుకోవాలి. 15 నుండి 18 రోజుల వయస్సు గల నాటును వరినాటు యంత్రాల ద్వారా నాటుటకు ఉపయోగించుకోవచ్చు. ఈ వరినాటు యంత్రాలు 4, 6 మరియు 8 వరుసలలో ఒకేసారి నాటుటకు వంటివి మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. మొక్క వరుసల మధ్య దూరం 30 సెం.మీ. మరియు 23.8 సెం.మీ. ఉండేలా నాటు యంత్రాలు లభ్యం అవుతున్నాయి. మొక్కకి మొక్కకి మధ్య దూరంను కూడ 12 సెం.మీ. నుండి 28 సెం.మీ. వరకు అమర్చుకోవచ్చు. రబీలో నీరు తక్కువగా ఉన్నప్పుడు యాంత్రీకరణ పద్దతి ద్వారా వరిని సాగు చేయుటకు డ్రమ్ సీడర్ ను ఉపయోగించవచ్చును. దీని వలన నర్సరీని పెంచడం లేకుండా మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలంలో నేరుగా వేయవచ్చును. ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించునప్పుడు జమ్ము చేసిన పొలంలో నూరు లేకుండా జాగ్రత్త పడాలి. ఒక వారం రోజుల లోపు గడ్డిమందును పిచికారి చేసినచో కలుపును తగ్గించవచ్చును. వరి పొలం చుట్టూ ఉన్న గట్టుపై గడ్డిని తొలిగించుటకు బ్రష్ కట్టర్ ను ఉపయోగించవచ్చు. నారు చేసిన 15, 30, 45 రోజుల తరువాత కలుపును నివారణ చేయుటకు కలుపు తీయు యంత్రాలను ఉపయోగించవచ్చును. మనిషితో నడుపబడే కోనోవీడర్ మరియు పవర్ వీడర్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. చీడపీడలను నివారించడానికి యాంత్రీకరణ పద్దతి ద్వారా పవర్ స్ప్రేయర్ తో మందును పిచికారి చేయవచ్చును. పలురకాల పవర్ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. యాంత్రీకరణ ద్వారా వరిని కోతకోయుటకు రీపర్, రీపర్ కంబైనర్డ్ మరియు కంబైన్డ్ హార్వెస్టర్లు లభ్యం అవుతున్నాయి. రీపర్ ద్వారా వరిని కోత కోయవచ్చును. కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా వరిని కోతకోసి కట్టలు కట్టవచ్చును. కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా వరిని కోతకోసి నూర్పిడి కూడ చేయవచ్చును. కోత కోసిన వరి పంటను నూర్పిడి మరియు శుభ్రపరుచుటకు పలురకాల నూర్పిడి యంత్రాలు మరియు శుభ్రపరుచు యంత్రాలు సౌలభ్యంలో ఉన్నాయి. మొక్కజొన్న మొక్కజొన్నను సాగు చేయుటకు ప్రాధమికంగా రెక్కల నాగలి లేదా దంతి నాగలి ద్వారా పొలాన్ని దుక్కి చేసుకోవచ్చును. ద్వితీయంగా రోటావేటరుతో దుక్కి చేయడం వలన ప్రాధమికంగా దుక్కి చేసినప్పుడు ఉన్న మట్టి గడ్డలు విడిపోయి నేల పొడిగా మొలకెత్తడానికి అనుకూలంగా తయారవుతుంది. మొక్కజొన్న విత్తనాలను యాంత్రీకరణ పద్దతి ద్వారా విత్తడానికి విత్తనాలను మరియు ఎరువును ఒకేసారి వేయు గొర్రును ఉపయోగించవచ్చును. ఈ గొర్రు వలన సాలుకు మధ్య దూరం కొనసాన్తూ మరియు విత్తనాలు విత్తడం, ఎరువును వేయడం ఒకేసారి జరిగి కూలీలను తగ్గించడమే కాకుండా సకాలంలో తేమ ఆవిరి కాక ముందే విత్తుకోవచ్చును. వరి పంటను కోత కోసిన తరువాత సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ యంత్రాన్ని రెండవ పంటగా మొక్కజొన్నను విత్తడానికి ఉపయోగించడం వలన వరి కోత కోసిన తరువాత మిగిలిన తడి శాతం వలన మొలకలు మెలకెత్తుతాయి. దీని వలన ప్రత్యేకంగా దుక్కి దున్నడాన్ని తొలగించవచ్చు. యాంత్రీకరణ పద్దతి ద్వారా మొక్కజొన్నలో కలుపును నివారించుటకు కలుపు తీయు యంత్రాలను ఉపయోగించవచ్చును. మనిఫితో నడుపబడే స్టార్ వీడర్, వీల్ హూ మరియు పలు రకాల పవర్ వీడర్లు మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. చీడపీడలను నివారించడానికి పలు రకముల స్ప్రేయర్లతో మందును పిచికారి చేయవచ్చును. యాంత్రీకరణ ద్వారా మొక్కజొన్నను కోత కోయుటకు కంబైన్డ్ హార్వెస్టర్ ను ఉపయోగించవచ్చును. కంకి నుండి గింజలను వేరు చేయుటకు పలు రకములు మొక్కజొన్న నూర్పిడి యంత్రాలు సౌలభ్యంలో ఉన్నాయి. మనిషి చేత్తో తిప్పబడే మొక్కజొన్న నూర్పిడి యంత్రాలు, మొక్కజొన్న పొట్టుతో సహ గింజలను వేరు చేయు పవరుతో లేదా ట్రాక్టరులో నడుపబడే యంత్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిరుధాన్యాలు చిరుధాన్యాలను సాగుచేయటానికి ప్రాధమికంగా మరియు ద్వితీయంగా రెక్కల నాగలి లేదా దంతి నాగలి మరియు రోటావేటర్‌ను పయోగించి భూమిని దుక్కి చేసుకోవాలి. చిరుధాన్యాలను అనగా సజ్జ, రాగి, కొర్ర మొదలగునవి విత్తడానికి విత్తనాలతో సహా ఇసుకను కలిపి గొర్రు ద్వారా వేరుచేయవచ్చును. యాంత్రీకరణ పద్దతి ద్వారా చిరుధాన్యాలు సాగులో కలుపును తీయుటకు కల్టివేటరు, మనిషితో నడుపబడే స్టార్ వీడర్, వీల్ హూ మరియు పలు రకముల పవర్ వీడర్లను ఉపయోగించవచ్చును. చీడపీడలను నివారించడానికి పలు రకముల స్ప్రేయర్లతో మందును పిచికారి చేయవచ్చును. మనిషితో పనిచేయగల స్ప్రేయర్లు, పవర్ తో నడుపబడే స్ప్రేయర్లు మరియు ట్రాక్టరుతో నడుపబడే స్ప్రేయర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పప్పుధాన్యాలు పప్పుధాన్యాలను పండించుటకు ప్రాధమికంగా మరియు ద్వితీయంగా రెక్కల నాగలి లేదా దంతి నాగలి మరియు రోటావేటరు లేదా పల్లెపు దంతిని ఉపయోగించి భూమిని దుక్కి చేసుకోవాలి. కంది, పెసర, మినుము, శనగ, సోయా చిక్కుడు, అలసందలు మొదలగునవి విత్తడానికి, విత్తనం మరియు ఎరువు ఒకేసారి వేయు యంత్ర పరికరాన్ని ఉపయోగించవచ్చును. విత్తనం యొక్క పరిమాణాన్ని బట్టి గొర్రులో విత్తనం వేయు చక్రంను ఎంచుకోవాలి. పప్పుధాన్యాల పంటలలో కలుపు తీయుటకు యాంత్రీకరణ పద్ధతి ద్వారా కల్టివేటరు, మనిషితో నడుపబడే స్టార్ వీడరు, వీల్ హెూ మరియు వివిధ రకముల పవర్‌తో నడుపబడే కలుపు తీయు యంత్రములను ఉపయోగించవచ్చును. చీడపీడలను నివారించడానికి పలు రకముల స్పేయర్లతో మందును పిచికారి చేయవచ్చును. మనిషితో నడుపబడే స్పేయర్లు, పవర్‌తో నడుపబడే స్పేయర్లు మరియు ట్రాక్టర్‌తో నడుపబడే స్పేయర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పంటను మనిషితో లేదా కంబైన్స్ హార్వెస్టర్ తో కోత కోసి నూర్పిడి చేసుకోవచ్చు. ఆల్ క్రాప్ బ్రెషర్ను ఉపయోగించి పప్పధాన్యాలను నూర్పిడి చేయవచ్చును. నూనెగింజలు వేరుశనగ, ఆముదం, మరియు ప్రాదుతిరుగుడు మొదలగునవి పండించడానికి రెక్కల నాగలి లేదా దంతి నాగలిని ఉపయోగించి ప్రాధమికం గానూ, రోటావేటరు లేదా పల్లెపు దంతిని ఉపయోగించి ద్వితీయంగానూ భూవిని చదును చేయవచ్చును. పరిమాణంలో పెద్ద విత్తనాలు అనగా వేరుశనగ మరియు ఆముదంను విత్తడానికి, విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేయు గొర్రును (న్యూమాటిక్ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్) ఉపయోగించవచ్చును. చిన్న వరిమాణం ఉన్నటువంటి విత్తనాలను విత్తడానికి వాయువ ఆధీనంలో పనిచేసే విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేయు గొర్రును ఉపయోగించవచ్చును. యాంత్రీకరణ పద్ధతి ద్వారా నూనెగింజల సాగులో కలుపు తీయుటకు పలు రకముల మనిషితో నడుపబడే, పవర్‌తో నడుపబడే మరియు ట్రాక్టరుతో నడువబడే కలువు తీయు యంత్రములను ఉపయోగించెదురు. చీడపీడల నివారణకు పలు రకముల (స్పేయర్ తో మందును పిచికారి చేయవచ్చును. ఇవి మనిషితో, పవర్‌తో మరియు ట్రాక్టరుతో నడుపబడేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. వేరుశనగ పంటను త్రవ్వడానికి వేరుశనగ త్రవ్వ యంత్రం ఉన్నది. వేరుశనగ మొక్క నుండి కాయలను వేరు చేయుటకు ఫ్రిప్పర్ ఉపయోగించుకోవచ్చును. నూనె గింజలను వివిధ రకముల నూర్పిడి యంత్రాల ద్వారా నూర్పిడి చేసుకోవచ్చును. ఆముదమును నూర్పిడి చేయుటకు ఆముదం నూర్పిడి యంత్రం మరియు ධීරාජණකාර నూర్పిడి చేయుటకు వేరుశనగ పచ్చి మరియు ఎండు పంట నూర్పిడి యంత్రం అలాగే వివిధ పంటలను ఆల్క్రాప్ నూర్పిడి యంత్రం ద్వారా నూర్పిడి చేయవచ్చును. ప్రత్తి ప్రత్తి పంటను సాగు చేయడానికి ప్రాథమికంగా మరియు ద్వితీయంగా రెక్కల నాగలి లేదా దంతి నాగలి మరియు రోటావేటరును ఉపయోగించి భూమిని దుక్కి చేయవచ్చును. ప్రత్తి విత్తనాలను విత్తడానికి వాయువు ఆధీనంలో పనిచేసే విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేయు గొర్రును (న్యూమాటిక్ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్) ఉపయోగించవచ్చును. యాంత్రీకరణ పద్ధతి ద్వారా ప్రత్తిలో కలుపు తీయుటకు పలు రకముల పవర్‌తో నడుపబడే కలుపు తీయు యంత్రములు మరియు ట్రాక్టర్‌తో నడుపబడే కలుపు తీయు యంత్రములను ఉపయోగించవచ్చును. చీడపీడల నివారణకు పలురకముల స్పేయర్లతో మందును పిచికారి చేయవచ్చును. ప్రత్తి పంటను కోయడానికి మనిషితో లేదా బ్యాటరీతో నడుపబడే యంత్రాలను ఉపయోగించవచ్చును. వివిధ వ్యవసాయ పరికరాల, యంత్రాల వివరాలు పేరు శక్తి ఖరీదు ఉపయోగము సామర్థ్యము భూమిని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేయు పరికరములు రెక్కల నాగలి (యం.బి.ప్లవ్) (2వరుసలు) 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 29,000/- దుక్కి దున్నుట 1.0 - 1.5 హె/రోజుకి రెక్కల నాగలి (యం.బి.ప్లవ్) (3వరుసలు) 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 33,000/- దుక్కి దున్నుట 1.6 - 2.5 హె/రోజుకి వెనుకకు తిరుగు రెక్క నాగలి 45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 59,000/- (550 కిలోలు) రూ. 45,000/- (420 కిలోలు) దుక్కి దున్నుట 1.0 - 1.5 హె/రోజుకి దంతి నాగలి (2 వరుసలు) 35 - 45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 39,000/- (219 కిలోలు) రూ. 37,000/- (925 కిలోలు) దుక్కి దున్నుట 1.5 - 2.5 హె/రోజుకి రోటవేటర్ (36–42 బైడ్స్) 45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 80,000/- నుండి 1,25,000/- దుక్కి మరియు దుమ్ము చేయుట 0.52 హె/రోజుకి రిజిడ్ టైన్ కల్టివేటర్ (9-11 టైన్) 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 25,000/- నుండి 26 ,000/- దుక్కి దున్నుట 2.5 - 3.5 హె/రోజుకి ప్ర్పింగ్ టైన్ కల్టివేటర్ (9 టైన్) 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 20,000/- నుండి 25,000/- దుక్కి దున్నుట 2.5 - 3.5 హె/రోజుకి లేజర్ గైడెడ్ చదును చేయు యంత్రం 45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 3,40,000/- భూమిని చదును చేయుట 0.266 హె/ గంటకి ఆఫ్ సెట్ పల్లెపు దంతి 35 - 45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 38,000/- దుక్కి దున్నుట 2.5 - 3 హె/రోజుకి గుంటలు త్రవ్వు యంత్రం 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 90,000/- నుండి 1,30,000/- గుంతలు త్రవ్వుట 20-25 గుంతలు / గంటకి పవర్ టిల్లర్ 10–12 అశ్వశక్తి ట్రాక్టర్ డిజిల్ ఇంజన్ రూ. 1,30,000/- నుండి 1,60,000/- దుక్కి, దుమ్ము మరియు చదను చేయుట 1.5 హె/రోజుకి మినీ ట్రాక్టర్ రోటవేటర్ (చక్రముల వాహనం) 18.5 అశ్వశక్తి రూ. 2,20,000/- దుక్కి మరియు దుమ్ము చేయుట 2.5 - 3.0 హె/రోజుకి విత్తుట, అంతర సేద్యం మరియు పంట పరిరక్షణకు ఉపయోగించు యంత్ర పరికరములు రిజిడ్ టైన్ విత్తనం మరియు ఎరువులను వేయు యంత్రం (5 నుండి 11 టైన్) 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 39,000/- నుండి 50,000/- విత్తనము మరియు ఎరువు ఒకేసారి వేయుట 2..5 – 4.0 హె/రోజుకి స్ప్రింగ్ టైన్ విత్తనం మరియు ఎరువులను వేయు యంత్రం (6 నుండి 11 టైన్) 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 42,000/- నుండి 57,000/- విత్తనము మరియు ఎరువు ఒకేసారి వేయుట 2.5 - 3.5 హె/రోజుకి వరినాటు యంత్రము (8 వరుసలు) స్వీయ చోదక శక్తి రూ. 2,20,000/- వరినాటు వేయడం 0.13 - 0.20 హె/గంటకి వరినాటు యంత్రము (6 వరుసలు) స్వీయ చోదక శక్తి రూ. 11,00,000/- వరినాటు వేయడం 2.5 - 3.5 హె/రోజుకి వరినాటు యంత్రము (4 వరుసలు) స్వీయ చోదక శక్తి రూ. 2,50,000/- వరినాటు వేయడం 1.6 హె/రోజుకి వరి డ్రమ్ సీడర్ మాన్యువల్‌గా నడుపు రూ. 4,400/- మొలకెత్తిన విత్తనములువేయుట 12-15 కిలోలు/ ఎకరాకి 0.8 హె/రోజుకి దుక్కి లేకుండా విత్తనము మరియు ఎరువు వేయు సాధనము (9 టైన్) 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 55,000/- వరికోత తరువాత మొక్కజొన్న విత్తుట 3.5 - 4,5 హె/రోజుకి నాప్ స్నాక్ పిచికారి యంత్రం 1.4 అశ్వశక్తి పెట్రోల్ ఇంజన్ రూ. 6,000/- నుండి 15,000/- పురుగుల మందు పిచికారి చేయడానికి 0.06-0.08 హె/రోజుకి కాలితో తొక్కబడి పిచికారి చేయు యంత్రం మాన్యువల్‌గా నడుపు రూ. 4,000/- నుండి 5,000/- పరుగుల మందు మరియు ఎరువులు పిచికారి చేయడానికి 0.14-0.2 హె/రోజుకి ట్రాక్టరుతో నడుపబడే పిచికారి యంత్రం 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 26,000/- నుండి 1,80,000/- పురుగుల మందు పిచికారి చేయడానికి 2 -3.5 హె/గంటకి పవర్‌తో నడుపబడి కలుపు తీయు యంత్రం (వరిలో) స్వీయ చోదక శక్తి రూ. 45,000/- కలుపు తీయుట 0.15 పెూ/గంటకి పవర్‌తో నడుపబడి కలుపు తీయు యంత్రం (మెట్ట పొలంలో) స్వీయ చోదక శక్తి రూ. 50,000/- నుండి 80,000/- కలుపు తీయుట 0.25 పెూ/గంటకి పవర్‌తో నడుపబడి కలుపు తీయు యంత్రం మెట్ట పొలంలో) స్వీయ చోదక శక్తి రూ. 28,000/- కలుపు తీయుట 0.15 పెూ/గంటకి మనిషితో నడుపబడి కలుపు తీయు యంత్రం (మెట్ట పొలంలో) (స్టార్ వీడర్) మాన్యువల్‌గా నడుపు రూ. 1,400/- కలుపు తీయుట 0.15 హె/రోజుకి మనిషితో నడుపబడి కలుపు తీయు యంత్రం (వరిసాగులో) లేదా కోనో వీడర్ (వెట్ ల్యాండ్) మాన్యువల్‌గా నడుపు రూ. 1,400/- కలుపు తీయుట 0.15 హె/రోజుకి కోత కోయడం మరియు నూర్పిడి యంత్ర పరికరములు కంబైన్స్ హార్వెస్టర్ (వరి) 55,60 మరియు 80 అశ్వశక్తి (స్వీయ చోదక శక్తి) రూ. 18,00,000/- నుండి 24,00,000/- వరి కోత మరయు నూర్పుట 1 హె/గంటకి మొక్కజొన్న కోత కోసి నూర్పిడి చేయు యంత్రం 55,60 మరియు 80 అశ్వశక్తి (స్వీయ చోదక శక్తి) రూ. 18,00,000/- నుండి 24,00,000/- మొక్కజొన్న కోత మరయు నూర్పుట 1 హె/గంటకి వరి కోత యంత్రం స్వీయ చోదక శక్తి రూ.1,20,000/- నుండి 1,60,000/- వరి కోయడానికి 0.25 హె/గంటకి వరికోత కోసి కట్టలు కట్టు యంత్రం స్వీయ చోదక శక్తి రూ. 3,60,000/- కోత మరియు కట్టలు కటడానికి 0.4 హె/గంటకి గడ్డి కోత కోయు యంత్రం స్వీయ చోదక శక్తి రూ. 70,000/- పశుగ్రాసం 0.4 హె/గంటకి కోయడానికి వేరుశనగ పంటను త్రవ్వ యంత్రం 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 1,70,000/- వేరుశనగ తీయడానికి 0.27 హె/గంటకి పసుపు త్రవ్వ యంత్రం 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 30,000/- పసుపు తీయడానికి 0.4 హె/గంటకి ధాన్యాలను నూర్పిడి చేయు యంత్రం 45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 2,00,000/- నుండి 4,00,000/- అన్ని రకాల పంటల నూర్పిడి యంత్రము 3 - 4 క్వి/గంటకి వరి నూర్పిడి యంత్రం 35-45 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 1,20,000/- నుండి 1,60,000/- వరి నూర్పుటకు 4 - 5 క్వి/గంటకి మొక్కజొన్న పొట్టును వేరు చేయు మరియు నూర్పిడి యంత్రం 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 1,20,000/- నుండి 1,65,000/- మొక్కజొన్న ఒలుచుటకు మరియు శుద్ధి చేయుట 35 - 40 క్వి/గంటకి మొక్కజొన్న నూర్పిడి యంత్రం 35 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 50,000/- నుండి 70,000/- మొక్కజొన్న ఒలుచుటకు మరియు శుద్ధి చేయుట 20 - 25 క్వి/గంటకి ఆముదము నూర్పిడి యంత్రం 5 అశ్వశక్తి ట్రాక్టర్ రూ. 1,20,000/- ఆముదము ఒలుచుటకు మరియు శుద్ధి చేయుట 2 - 2.5క్వి/గంటకి పొలంలో పడిన గడిని కటలు కట్టు యంత్రం స్వీయ చోదక శక్తి రూ. 3,60,000/- నుండి 9,30,000/- గడ్డి కట్టడానికి కనీసం 15-20 కట్టలు చెఱకు పంట కోత కోయు యంత్రం 75 అశ్వశక్తి, ఆపైన రూ. 75,00,000/- నుండి 1,50,000/- చెఱకు కోత కోయుటకు గంటకు/ఎకరం ఆధారం: వ్యవసాయ పంచాంగం