నల్లతుమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో విస్తరించబడి ఉన్నది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. అధిక వర్ష సమయంలో కొద్ది రోజులు నీరు ఉన్న తట్టుకునే గునము కలిగి ఉంటుంది. నల్లతుమ్మ చెట్టు వివిధ రకాలుగా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా వంట చేఱకు, చారకోల్, వ్యవసాయ పనిముట్లకు, పశుగ్రాసం, వైద్యానికి, జిగురు (గమ్ము) గా బాగా ఉపయోగించబడుతుంది. బాగా ముదిరిన చెట్టు కొమ్మలు పైభాగం బాగా విస్తరించి 20-30 అడుగులు ఎత్తు 1-2 అడుగుల చుట్టూ కొలత కలిగి ఉంటుంది. చూడడానికి ఈ చెట్టు ఆకారము దూరము నుండి గుండ్రంగా కనబడుతుంది. నల్లతుమ్ము లెగ్యుమ్జాతి చెట్టు కాబట్టి లేత ఆకుల్లో, క్రూడ్ ప్రోటీన్లు 12% మరియు క్రూడ్ ఫైబర్ 21.35% ఉంటాయి. ఎటువంటి నేలలో అయిన సాగు చేయవచ్చు. ఉదజని సూచిక (పి.హెచ్) 9.0 పైగా, అధిక సోడియం మార్పు చెందు (ఈ యెస్ 60%) నల్ల క్షార భూములో కూడా బాగా పెరుగుతుంది. పొలం గట్లు చెరువు గట్ల మీద, బంజరు భూముల్లో కూడా పెరుగుతుంది. మొక్కల ఎంపిక ఆరు నుండి పన్నెండు మాసాల వయస్సు కలిగి ఒక అడుగు ఎత్తు ఉన్న మొక్కలను ఎంపిక చేయాలి. మొక్కల మధ్య దూరం 20 x 20 అడుగులు ఉండాలి. ఎకరానికి 80 మొక్కలు సరిపోతాయి. అంతర సేద్యం లేత వయస్సు ఉన్న చెట్ల మధ్య ఖాళీ స్దలములో 3-4 సంవత్సరాల వరకు, వీలును బట్టి పంటలను ఎంపిక చేసికోవచ్చు. ఒక్కో చెట్టు నుండి 20-25 ఘ.అ. దిగుబడి వస్తుంది. అదే బరువులో లెక్కలు వేస్తె 600 – 800 కిలోలు ఉంటుంది. ఎకరానికి 50-60 టన్నుల దిగుబడి ఉంటుంది. ఉపయోగాలు లేత ఆకులు, తాజాగా కోసిన కాయలు, మేకలకు, గొర్రెలకు పశుగాస్రంగా ఇవ్వవచ్చు. బాగా ముదిరిన కలప గట్టిగా మరియు బరువుగా ఉంటుంది. ఇంటి దూలాలకు, స్ధంభాలకు, వ్యవసాయ పనిముట్లకు, పడవల తయారికి ఉపయోగిస్తారు. వంట చేఱకుగా బాగా ఉపయోగించవచ్చు. కాలినప్పుడు పొగ తక్కువగా వస్తుంది. చార్కోల్ గా మంచి ఇంధనముగా వాడవచ్చు. చెట్ల నుండి వచ్చే జిగురు బాగా నాణ్యముగా ఉంటుంది. చెట్ల బెరడు, ఆకులు, డయోరియా, జలుబు, విరేచనాలు తగ్గడానికి మరియు గాయాలను నయము చేయడానికి ఉపయోగించవచ్చు. చెట్ల బెరడులో ఫిసాల్స్, ట్యాంనిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వీటిని పరిశ్రమలో, తోళ్లను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. ఆధారం : వ్యవసాయ పంచాంగం