సిమరుబా చెట్టు మధ్యస్తంగా ఉండి 7-15 మీ. ఎత్తు పెరుగుతుంది. సుమారు 4-6 సంవత్సరాల వయస్సులో దిగుబడి ప్రారంభమవుతుంది. డిసెంబరు నేలలో పూతకు వచ్చి ఫెబ్రవరి వరకు కొనసాగుతుంది. కాయలు ఊదారంగులో ఉండి ఏప్రిల్ – మే నేలలో కోతకు వస్తాయి. విత్తనాల్లో 50-70 శాతం నూనె కలిగి ఉండి కొవ్వు పదార్దాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. వీటి ఆకులను ఎరువుగా ఉపయోగించవచ్చును. నేలలు బంజరు భూముల్లోనుమ్, వర్షాధార భూముల్లో నటుకోవచ్చును. పంట కాలాలు మరియు అనుకూలమైన సమయం సముద్ర మట్టం నుండి 1000 అడుగుల ఎత్తు వరకు గల ఉష్ణప్రదేశాలు అనుకూలం. సగటు వర్షపాతం 500 – 1000 మి. మీ. గల ప్రాంతాలు అనువైనవి. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో సంవత్సరంలో ఎప్పుడైనా నటుకోవచ్చును. విత్తే దూరం 5 x 5 మీ. మొక్కల సాంద్రత (ఎకరాకు) 160 మొక్కలు. విత్తు పద్ధతి 45 x 45 x 45 సెం. మీ. వైశాల్యం గల గుంతలను 2కిలోల కంపోస్టు 20 గ్రా. భాస్వరం మరియు 20 గ్రా. నత్రజని ఎరువునుత్రవ్విన మట్టిలో కలిపి నింపాలి. అంతర పంటలు మొక్కలు నాటిన 3-4 సంవత్సరాల వరకు ఆయా ప్రాంతాలకు అనువైన అంతర పంటలను పండించి ఆదాయాన్ని పొందవచ్చును. ఎరువుల యాజమాన్యం మొక్కలకు ప్రతి సంవత్సరం 2 కిలోల కంపోస్టు, 20 గ్రా. భాస్వరం మరియు 20 గ్రా. నత్రజని ఎరువులను వేయాలి. కలుపు యాజమాన్యం పాదులో ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీయుట చాలా ఉపయోగకరం. నీటితడులు మొక్కలు నిలదొక్కుకొనే దశలో ఒక్కొక్క మొక్కకు వారానికి 2 నుండి 4 లీటర్ల నీరు అవసరం. దిగుబడి సంవత్సరాల వయస్సు గల చెట్ల నుండి ఒక ఎకరానికి ఈ క్రింద విధంగా దిగుబడి ఉండమచ్చును. కయలున్న చెట్ల కొమ్మలను గట్టిగా ఉపినట్లైతే కాయలు రాలి క్రింద పడతాయి. ఏరుకుని ఎండలో ఎండబెట్టి తరువాత నిలువ చేయాలి. నూనె - 400 – 800 కి. గ్రా. చెక్క - 400 – 800 కి. గ్రా. విత్తనాల గుజ్జు - 2400 – 2600 కి. గ్రా. రాలిన ఆకులు - 2400 – 2600 కి. గ్రా. పుప్పొడి దాతలు పుప్పొడి దాతలను ప్రతి 60 మీటర్లకు ఒకటి చొప్పున నటుకోవడం మంచిది. అలా చేసినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చుటకు అవకాశం ఉంది. ఆధారం: వ్యవసాయ పంచాంగం