ఏమి చేయాలి? ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడ పురుగులు,క్రిమి కీటకాదులు, తెగుళ్ళ బెడద,ఉప్పెన, కరువు, కీటకాలు, నీటి ముంపులు, వడ్లగండ్ల వానలు, అత్యల్ప వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నుండి రక్షణ కోసం రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మీ ప్రాంతములో వర్తింప చేయబడుతున్న పంట భీమా పధకం ద్వారా లబ్ది పొందాలి. జాతీయ పంట భీమా పధకము(ఎన్.ఏ.సి.ఐ.సి) మూడు రకాల పథకాలు 1. సవరించిన జాతీయ పంట భీమా పధకము (ఎమ్.ఎన్.ఏ.ఐ.ఎస్), 2. వాతావరణ ఆధారిత పంటల భీమా పథకము (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్) మరియు 3. కొబ్బరి మొక్కల భీమా పథకము (సి.పి.ఐ.ఎస్) అమలు చేయబడుతున్నాయు. ప్రకటించబడిన పంటలకు ఋణము తీసుకొనిన యెడల మీరు (ఎమ్ ఎన్ ఏ ఐ ఎన్ )/ (డబ్ల్యు బి సి ఐ ఎస్ ) పథకం తప్పని సరిగా వర్తిస్తుంది. ఋణాలు తీసుకోని రైతులు ఐచ్చికంగా ప్రీమియంగా చెల్లించి పంటల భీమా చేసుకోవాలి. పంటల భీమా పథకం ద్వారా లబ్ది పొందడానికి దగ్గర లోని బ్యాంక్ /ఇన్సూరెన్స్ కార్యాలయాలను సంప్రదించాలి. మీరు ఏమి పొందుతారు? క్రమ సంఖ్య పథకము సహాయము 1 సవరించబడిన జాతియ వ్యవసాయ బీమా పథకము (ఎమ్.ఎన్ ఏ.ఐఎస్ ), ప్రకటించబడిన ఆహార పంటల, నూనె గింజలు మరియు తోట /ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటల రక్షణ భీమా పథకము. ప్రకటించబడిన పంటల భీమా పథకము యొక్క వాస్తవమైన గరిష్టమైన ప్రీమియము రేటుకు లోబడి రబీ మరియు ఖరీప్ కాలములో వేయు ఆహార మరియు నూనె గింజలు పంటలకు గాను 11% మరియు 9% వరకు ఉండును. ఇదే విధముగా,వార్షిక తోట / ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటలకు 13% వరకు ఉండును. అన్ని రకాల రైతులకు ప్రీమియము పరిమితి ఆధారముగా, సబ్సీడీ 75% వరకు ఏర్పాటు చేయబడును. ఎ. 2% వరకు ఏమీ లేదు బి. 2-5% కంటే ఎక్కువ 40% ప్రీమియము నగదు కనీసము 2%నకు లోబడి సి. 5-10% కంటే ఎక్కువ 50% ప్రీమియము నగదు కనీసము 3%నకు లోబడి డి. 10-15% కంటే ఎక్కువ 60% ప్రీమియము నగదు కనీసము 5%నకు లోబడి ఇ. 15% కంటే ఎక్కువ 75% ప్రీమియము నగదు కనీసము 6%నకు లోబడి ప్రకృతి/వాతావరణ ప్రతికూల పరిస్థితుల వలన విత్తనాలు నాటలేకపోవడము జరిగినపుడు, భీమా మొత్తము పైన 25% వరకు ఈ పరిస్థితులను అధిగ మించుటకు గాను క్లేయిములు/నష్ట పరిహారములు చెల్లింపు చేయబడును. ప్రకటించ బడిన పంటలకు గాను వాస్తవముగా రావలిసిన ఆదాయము కంటే ఒకవేళ పంట పైన రాబడి లేదా ఆదాయము తక్కువగా ఉన్నచో అట్టి పంట రాబడి తరుగునకు సమానముగా నష్ట పరిహారములు చెల్లింపు చేయ బడును. ఏది ఏమైనను, కొన్ని ప్రకటించిన ప్రాంతాలలో, పంట నష్ట పరిమితి 50% ఎదుర్కొన్న సందర్బాల లోనికి తీసుకొన బడును. దీనితో పాటు, తుఫానుల వలన పంట కోతల కాలము (2వారాల వరకు) జరుగు నష్టాన్ని కూడా పరిగణన లోనికి తీసుకోన బడును. స్థానికంగా సంభవించే ప్రమాదాలు అంటే వడగళ్ల వానలు మరియు కొండ పరియలు విరిగి పడటం మొదలగు నష్టాలను, వ్యక్తి గత ఆదారంగా మధింపు చేసి మరియు భీమా పథకము క్రింద ఉన్న బాధిత రైతులకు తదను గుణముగా చెల్లింపు చేయబడును. 2 వాతావరణ ఆదారిత పంటల బీమా పథకము (డబ్ల్యు.బి.సి.ఐ.ఎస్) ప్రకటించబడిన ఆహార పంటల, నూనె గింజలు మరియు తోట /ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటల భీమా రక్షణ కలదు. ప్రకటించబడిన పంటల భీమా పథకము యొక్క వాస్తవమైన గరిష్టమైన ప్రీమియము రేటుకు లోబడి రబీ మరియు ఖరీప్ కాలములో వేయు ఆహార మరియు నూనె గింజలు పంటలకు గాను 10% మరియు 8% వరకు ఉండును. ఇదే విధముగా,వార్షిక తోట / ఉద్యానవన, వాణిజ్య మొదలగు పంటలకు 12% వరకు ఉండును. ఇది 12% వరకు ఉంచబడినది. ఎ. 2% వరకు ఏమీ లేదు బి. 2-5% కంటే ఎక్కువ 25% ప్రీమియము నగదు కనీసము 2%నకు లోబడి సి. 5-8% కంటే ఎక్కువ 40% ప్రీమియము నగదు కనీసము 3.75 %నకు లోబడి డి. 8-50% కంటే ఎక్కువ 50% ప్రీమియము నగదు కనీసము 4.8%నకు లోబడి, గరిష్టముగా నగదు ప్రీమియము పైన రైతులకు 6% చెల్లింపు చేయబడును. పంటలకు గాను నిర్ధేశించబడిన వాతావరణ సూచనలు అనగా (వర్షపాతము/ఉష్ణోగ్రత/ గాలిలో తేమ/ గాలి తీవ్రత మొదలగునవి) భేదము (తగ్గింపు / హెచ్చు) జరిగి నపుడు, ఇవ్వబడు నష్ట పరిహారము ప్రకటించ బడిన ప్రాంతాలలో ప్రకటించ బడిన పంటలకు గాను ఇట్టి తీవ్రతను బట్టి కలిగిన వ్యత్యాసము ప్రకారము చెల్లింప బడును. 3 కోకోనట్ పాల్మ్ భీమా పధకము (సిపిఐఎస్ ) కొబ్బరి పంపకము దారులు సంరక్షణకు భీమా భీమా కిస్తు రేటు రూ.9.00 (వయస్సు 4 నుండి 15 సంవత్సరములు) మరియు (16 నుండి 60 సంవత్సరములు) రూ.14.00 50 – 75 % భీమా కిస్తు పైన సబ్సిడి అన్ని రకాల రైతులకు ఇవ్వబడును. ప్రకటించబడిన ప్రాంతాలలోని రైతులకు కొబ్బరి చెట్లు ధ్వంసము జరిగినపుడు, నష్ట పరిహారము భీమా చేసిన మొత్తమునకు / జరిగిన నష్టమునకు చెల్లింపు చేయబడును. ఎవరుని సంప్రదించాలి? దగ్గరలో ఉన్న వాణిజ్య బ్యాంకులు, నమోదు చేయబడిన జనరల్ భీమా కంపెనీలు, క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటిలు మరియు జిల్లా వ్యవసాయ అధికారులు/బ్లాక్ డెవలప్ మెంట్ అధికారులను సంప్రదించండి. ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం