నేలవేము సాగు వివరములు (అండ్రోగ్రాఫీస్ పానిక్యులేట) సాధారణ నామము : కాలమేఘ్ శాస్త్రీయ నామము : అండ్రోగ్రాఫీస్ పాలిక్యులేట కుటుంబము : అకాంథేసి ప్రాంతీయ నామము : నేలవేము వాణిజ్య నామము : కాలమేఘ్ ఉపయోగపడు భాగములు : పూర్తి మొక్క పరిచయము అండ్రోగ్రాఫీస్ పాలిక్యులేట అనే శాస్తీయ నామం కలిగిన ఈ మొక్క అకాంథెసీ కుటుంబానికి చెందినది. ఇదే చేదుగా ఉండే వార్షిక గుల్మం నిటారుగా 50 సెం.మీ. నుంచి 1 మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. కాండం శాఖోప శాఖలుగా ఉంటుంది. అభిముఖ పత్రాలు, చిన్న పత్ర వృంతం ఉంటుంది. ఫలాలు గెలులుగా క్యాప్సూల్ ఆకారంలో లేదా అండాకారంగా ఉంటాయి. విత్తనాలు ఒక్కొ ఫలంలో సుమారు 12 ఉంటాయి. అవి గోధుమ వర్ణంలో లేదా పసుపు రంగులో ఉంటాయి. వ్యాప్తి సహజంగా విత్తనాలు విస్తారంగా వెదజల్లబడటం ద్వారా వీటి వ్యాప్తి జరుగుతుంది. భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, థాయిలాండ్ దేశాలలో వ్యాప్తి చెంది ఉంది. భారతదేశంలో అస్సాం, బీహార్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలలో వ్యాప్తి చెంది ఉంది. నేలలు లోమ్ నేలలు, ఎర్ర నేలలు, ఇసుక కల్పిన లోమ్ నేలలు, బంజరు భూముల్లో ఒక మోస్తరు సారంగల వివిధ రకాల నేలల్లో దీన్ని విస్తారంగా సాగుచేయవచ్చును. ఉష్ణోగ్రతలు తగినంత సూర్యరశ్మితో పాటు వేడి, తేమతో కూడిన వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రతలు 10 నుంచి 40 సెంటిగ్రేడ్. పంటకాలం జూన్, జులై మాసాలలో విత్తనము విత్తుకోవచ్చు. పంటకాలం 180 రోజులు. విత్తన మోతాదు నర్సరీ బెడ్ సైజు 3X1.5X0.15 మీటర్లు ఏర్పాటు చేసుకొని 20 కలోల పశువుల ఎరువు మెత్తగా చేసుకొని బెడ్ లలో వేసుకేవాలి. 400 గ్రాముల విత్తనములును 5 సెం.మీ. అంతరములో వరుస లైన్లలో చల్లుకోవాలి. 8-10 రోజులలో విత్తనములు మొలకెత్తుతాయి. విత్తే దూరం 45 నుండి 50 రోజుల తరువాత 0.30X0.45 మీటర్ల అంతరంలో నారు మొక్కలను పొలంలొ వేసుకొనుటకైతే ఎకరానికి 800 గ్రాముల విత్తనములు అవసరమవుతాయి. ఎరువులు ఎకరానికి 3-5 టన్నుల బాగ కుల్లిన పశువుల ఎరువు అవతరమవుతుంది. అంతర కృషి మొక్క బాగా నాటుకోవాలంటే ఒకటి, రెండు దఫాలుగా కలుపు తీయడం, మట్టి త్రవ్వి పెళ్ళగించడం అవసరం. మొక్కలు నాటుకొన్నా వర్షకాలంలో బాగా పెరుగుతాయి. సస్యరక్షణ నేలవేము పంటకు ఆశించదగు తెగుళ్ళు గాని, వ్యాధులు గాని సాధారణంగా ఏమి లేవు. పంట సేకరణ పంటనాటిన 90 రోజుల నుంచి 120 రోజుల తరువాత పంట పూతకు వచ్చు దశలో భూమి నుంచి 10 నుంచి 15 సెం.మీ. ఎత్తులో మొక్కలను కత్తరించుకోవాలి. తరువాత రెండవ సారి పంటను సేకరించుకోవచ్చు. ఈ విధంగా ఒక సంవత్సరములో 2 నుంచి 3 సార్లు పంటను సేకరించవచ్చు. మొత్తం మొక్కలను సమూలంగా సేకరించుకోవాలి. వీటిని నీడన ఆరబెట్టుకొని బాగా ఆరిన తరువాత ప్యాక్ చుసుకేవాలి. దిగుబడి మొత్తం మొక్కల దిగుబడి 2-3 సార్లు సేకరించిన ఎకరానికి 1,200 కిలోల నుంచి 1,500 కిలోల ఎండబెట్టిన ఔషధం లభిస్తుంది. గమనిక నేల స్వభావం, వాసావరణ పరిస్థితులు, మార్కెట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి. ఉపయోగములు ఈ మొక్కలో ఆండ్రోగ్రాపాలాయిడ్స్ అనే చేదు రసాయనం ఉంటుంది. జ్వరం, మలేరియా జ్వరం, క్రిముల నివారణ, చర్మ వ్యాధులు, మదుమేహ వ్యాధి, గుండే జబ్బుల నివారణలోను ఉపయోగపడుతుంది. ఆధారం:తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోవ్: +21 40 66364096, 24764096 , website : ww.tsmpb.in , E-mail: tsmapb@gmail.com