మామిడి సాగుకు అనుకూలమైన నేలలు ఏవి

లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, అభివృద్ధి చెంది చాలాకాలం దిగుబడినిస్తాయి. చౌడు, ఉప్ప, సున్నం మరియు నీరు నిలువ వుండే బరువైన నల్లరేగడి నేలల్లో నాటరాదు. ఉదజని సూచిక 6-7.5 వున్న నేలలు అనుకూలం. నీరు ఉపరితలము నుండి కనీసం రెండు మీటర్లు క్రింద వుండాలి.

మామిడిలో అనువైన రకాలు ఏవి.

బంగినపల్లి మరియు తోతాపురి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పండించుటకు అనువైన వాణిజ్య రకాలు. ప్రాంతానికి అనువైన రకాలు : సువర్ణరేఖ, పెద్దరసం, చిన్నరసం, చెఱకురసం, పంచదార కలశ తెలంగాణా ప్రాంతానికి అనువైన రకాలు : సువర్ణరేఖ, దశేరి, హిమయత్, చెఱకురసం, మల్లిక, రత్న రాయలసీమ ప్రాంతానికి అనువైన రకాలు: సువర్ణరేఖ, నీలేషాన్, ఎ.యు. రుమాని.

మామిడి నాటుటకు అనువైన కాలం ఏది. ఎలా నాటాలి.

జూన్ – డిసెంబరు వరకు నాటవచ్చు. జూన్-జులై మరియు సెప్టెంబరు నెలల్లో నాటుట మంచిది. నేలను బాగా దున్ని 1X1X1 మీ. గుంతలు తవ్వి, 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు చెదలు ఆశించకుండా 100 గ్రాముల ఫాలిడాల్ 2 శాతం పొడిని త్రవ్విన పైమట్టితో కలిపి నింపి మొక్కలను 7-10 మీటర్ల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటాలి.

మామిడికి ఎరువులను ఏ మోతాదులో వాడాలి.

మొక్క వయస్సును బట్టి ఎరువులు వాడాలి. ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. ప్రతి సంవత్సరం పై మోతాదును పెంచుతూ 10 సంవత్సరములు ఆ పై వయస్సు గల చెట్లకు ఒక్కో క్రితో నత్రజని, , పొటాష్ ఎరువులను వాడాలి. నత్రజనిని 50 శాతం పశువుల ఎరువు రూపంలో ఇస్తే మంచిది. మామిడి కోత అయిన వెంటనే సిఫార్సు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగిలిన 1/3 వంతు ఎరువులను జనవరి 2 లేదా 3వ వారంలో వేయాలి. కాపుకు రాని చెట్లకు ప్రతి 2-3 నెలలకొకసారి వేయాలి.

మంచి దిగుబడి కొరకు ఏం చేయాలి

జూన్-జులై ఎండు పుల్లలను, గుబురుగా, అడ్డదిడ్డంగా ఉన్న చిన్న కొమ్మలను తీసివేసి చెట్టుకు సూర్యరశ్మి గాలి బాగా సోకునట్లు చూడాలి. కొమ్మలను కత్తిరించిన చోట బోర్లో మిశ్రమాన్ని పూయాలి. తరువాత సిఫార్సు చేసిన మేరకు ఎరువులను వేయాలి. 8-10 సం||లు దాటిన చెట్లకు గొడుగు కొమ్మ తీసివేయాలి.

ఆధారం: apagrisnet