'అవేరొహ కరంబోలా" అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క "ఆక్సాలిడేసి కుంటుంబానికి చెందినది. దీనిని స్టార్ ప్రూట్, అంబాణంకాయ లేదా కమరంగా అని కూడా అభివర్ణిస్తారు. ఇండోనేషియా దేశం ఈ మొక్క జన్మస్థలం. మొక్క చిన్నదిగా ఉండి, కొమ్మలు కిందికి వేలాడుతాయి. పండ్లు బంగారు పసుపు వర్ణంతో నక్షత్రపు ఆకారం పోలి ఆకర్షణీయంగా ఉంటాయి. కరంబోలా ఉపయోగాలు కరంబోలా కాయలల్లో అధికంగా విటమిన్ ఎ (రెటినాల్), మినరల్స్ కలిగి ఉంటుంది. ఈ కాయలను నిల్వ పచ్చళ్ళగాను, జామ్, చెట్నిలు, పానియాల తయారీలో ఎక్కువ మొత్తంలో విరివిగా ఉపయోగిస్తారు. విత్తనాల నుండి సేకరించిన పౌడర్ అస్తమావ్యాధి నివారణకు వాడుతారు. ఈ మొక్క వేర్ల నుండి తీసిన కషాయాన్ని విషపదార్ధానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. ఆకులనుండి దంచగా వచ్చిన కషాయాన్ని చికెన్‌పాక్స్ పూనిన కురుపులపై సున్నితంగా గుడ్డ ముక్కతో రాసినట్లయితే ఆ మంటల నుండి కొంత వరకు ఉపశమనం ఉంటుంది. వీటి మొక్క పండ్లు మలబద్ధకం, మూత్ర పిండాల వల్ల వచ్చే రుగ్మతల బారిన పడకుండా ఉపశమనం కలిగిస్తుంది. నేలలు దీని సాగుకు దాదాపుగా అన్ని నేలలు అనుకూలం. ఎక్కువ సారవంతమైన ఇసుక నేలలు, నీరు నిలువని బంకమన్ను నేలల్లో కూడా పండించవచ్చు. ఉదజని సూచిక 4.5-7.0 ఉన్న నేలలు అనుకూలం. ఆమ్ల మధ్యస్థ లక్షణాలున్న నేలని కూడా తట్టుకోగలదు. వాతావరణం మొక్కకు తగినంత సూర్యరశ్మి తగిలేలా ఎక్కువ వర్షం పడే పొడి వాతావరణం అనుకూలం. నేలను తయారు చేయడం నేలను రెండు లేదా మూడు సార్లు బాగా దున్ని చదును చేసి 6X6 మీటర్ల దూరంలో 0.6X0.6X0.6 మీటర్ల కొలతలు గల గుంతలు తవ్వాలి. మొక్కల్ని గుంతలో నాటడానికి ముందు 5-10 కిలోల పశువుల ఎరువును, చెదలు రాకుండా 100 గ్రా, ఫాలిడాల్ 2 శాతం పొడిని తవ్విన మట్టిలో కలిపి గుంతలను నింపాలి. మొక్కల ప్రవర్ధనం ఎంపిక కరంబోలాలో రెండు రకాలుగా ప్రవర్ధనం చేయవచ్చు. మొదటిది విత్తనాల ద్వారా అయితే నాలుగు సంవత్సరాల తర్వాత మొక్క కాపుకు వస్తుంది. అదే బడ్ గ్రాష్టింగ్ పద్ధతి ద్వారా పెరిగిన మొక్క రెండు సంవత్సరాలలోపే కాతకు వస్తుంది. అందువలన చీడ వీ డ లు ఆశించని ఆరోగ్యవంతమైన మూడు లేదా నాలుగు చిగుర్లు గల బడ్ గ్రాష్టింగ్ అంటు మొక్కలను నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసుకోవాలి. అంట్లు 5 నుండి 6 నెలల వయస్సు కలిగి ఉండాలి. మొక్కలు నాటడం మొక్కలను నాటే ముందు 0.6x0, 6x0.6 మీటర్ల కొలతలతో గుంతలను తవ్వాలి. 6x6 మీ. దూరంలో లేదా 8x8 మీ. దూరంలో గుంతలను తవ్వి 5-10 కిలోల పశువుల ఎరువును గుంతలోని మట్టితో కలిపి మొక్కను సరైన సమయంలో నాటుకోవాలి. అంటు మొక్కను మట్టిగడ్డతో సహా తీసి వేర్లు కదలకుండా గుంత మధ్యలో వాటి, మట్టితో గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా చిన్నకొమ్మపాతి కదలకుండా కట్టాలి. ఎరువుల యాజమాన్యం ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 120 నుండి 230 గ్రా. 15:15:15 నత్రజని, భాస్వరం, పొటాష్ల మిశ్రమం ప్రతి 30 నుండి 60 రోజులకొకసారి వేయాలి. తరువాత ఏటా 13:13:20 గల మిశ్రమాన్ని 450 గ్రా, చొప్పున పెంచాలి. ఐదవ సంవత్సరం ఆ తర్వాత 450 గ్రా. నుండి 2కిలోల వరకు పెంచాలి. ఆమ్లజనిత నేలలో మొక్కకు మాంగనీస్ జింక్, ఐరన్ 5 గ్రా, చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడాలి. బాగా చివికిన పశువుల ఎరువు, వేప పిండి ప్రతి చెట్టు పాదులో వేయాలి. నీటి యాజమాన్యం సూక్ష్మనీటి పారుదల పద్ధతి కొత్తగా నాటిన తోటలకు అనుకూలమైనది. ఈ పద్ధతి ద్వారా నీటి పొదుపు జరిగి, నాణ్యత గల దిగుబడి వస్తుంది. మొక్కలకు వారంలో రెండు నుండి మూడు సార్లు నీరు పెట్టాలి. రెండు సంవత్సరాలపైబడిన ఎదిగిన చెట్లకు పూత దశ నుండి కాయకోతకు వరకు నీరు పెట్టాలి. కొమ్మ కత్తిరింపులు సరైన ఆకారం కోసం మొక్కలను రెండు సంవత్సరాల వయస్సు లోపు కత్తిరించాలి. రెండు 2-4 మీటర్ల ఎత్తులో ఉండేలా చేసుకోవడం వల్ల మందులు పిచికారీ చేయటానికి సులువుగా ఉంటుంది. ఆగస్టు నెలలో కత్తిరించడం వలన అక్టోబర్ మాసంలో పండ్లను పొందవచ్చు. నవంబరు మాసంలో కొమ్మలను కత్తిరించడం ఫిబ్రవరి నెలలో పండ్లను పొందవచ్చు. అడ్డ దిద్దంగా పెరిగే కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను, చీడపీడలు ఆశించే కొమ్మలను తీసివేయడం వల్ల సూర్యరశ్మి బాగా తగిలి మంచి పూతని కాతని ఇస్తుంది. దీనికోసం ప్రతి : సంవత్సరం మొక్కని కత్తిరిసూ ఉండాలి. పంట కోత పూత తర్వాత 45-90 రోజులకు కాతకు వస్తుంది. అంటు పద్ధతి ద్వారా నాటిన మొక్క రెండు సంవత్సరాలకే కాపును ఇస్తుంది. దిగుబడి ఒక్క మొక్కకి 3 వందల కాయల వరకు మొదటి సంవత్సరం కాపుకి వస్తుంది. 9 సంవత్సరాల మొక్కకి 1200 కాయల వరకు కాతకు వస్తాయి. సమగ్ర సస్యరక్షణ పండు ఈగ : కరంబోలా పండ్లలో కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణ : రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. కార్బరిల్ 10 శాతం పొడిని 50-100 గ్రా. కలుపుట, 2 మి.లీ. మలాథియాన్ 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ళు మచ్చ తెగులు : మచ్చ తెగులు ఆశించినప్పుడు గోధుమ రంగు మచ్చలు ఆకులు - పండ్లు మీద గుట్టగా స్పష్టంగా కనిపిస్తాయి. కాపు ఉండదు. చిన్న కొమ్మలు ఎండిపోతాయి. మచ్చ తెగులు : మచ్చ తెగులు ఆశించినప్పుడు గోధుమ రంగు మచ్చలు ఆకులు - పండ్లు మీద గుట్టగా స్పష్టంగా కనిపిస్తాయి. కాపు ఉండదు. చిన్న కొమ్మలు ఎండిపోతాయి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక