ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 2.2 లక్షల ఎకరాలలో నువ్వులు సాగుచేయబడుతూ, 30 వేల టన్నుల దిగుబడి సాధిస్తున్నాము. నువ్వుల పంట విస్తీర్ణము, ఉత్పత్తులలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. నువ్వు గింజల్లో నూనె శాతం 45-50, ప్రోటీను 25 శాతం ఉండటమే కాకుండా, అమైనో ఆమ్లాలు, పాలీఅన్సాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు మరియు విటమిన్లు కూడా సమృద్దిగా ఉంటాయి. ఖరీఫ్ పంటలో ఆలస్యంగా వేసిన పరిస్థితులలో రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో నీటి వనరుల క్రింద విత్తుకొని తక్కువ వనరులతో అధిక లాభాన్ని పొందడానికి నువ్వులపంట సహాయపడుతుంది. రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చును. నువ్వుల నూనెను పరిశ్రమలలో మందుల తయారి మరియు పచ్చళ్ళ తయారీలో అధికంగా వాడుచున్నారు. యాజమాన్య పద్ధతులు నేలలు : మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు సాగుకు అనుకూలమైనవి. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కల నేలలు పనికిరావు. నేలతయారి : నేలను 2-4 సార్లు మెత్తగా దున్న్ని రెండుసార్లు గుంటక తోలి, చదును చేయాలి. విత్తన మోతాదు : ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి వరుసలలో విత్తుకోవాలి. విత్తనశుద్ధి : కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాఫ్టన్ లేదా మాంకోజెబ్ తో లేదా 5 గ్రాముల (టైకోడెర్మావిరిడితోవిత్తనశుద్ధి చేయాలి. ఇలా చేయడం వలన విత్తనం నుంచి సంక్రమించు రోగాలను అరికట్టవచ్చు. ఎక్కడైతే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశిస్తుందో అక్కడ విత్తానాన్ని అగ్రిమైసిన్ -100 (0.025%) (ద్రావణంలో నాటుకునే ముందు 30 నిముషాలు నానబెట్టి విత్తుకోవాలి. విత్తే దూరం : వరుసల మద్య 30 సెం.మీ మరియు మొక్కల మధ్య 10-15 సెం.మీ ఉండే విధంగా 2.5 సెం.మీ లోతులో విత్తనాన్ని విత్తుకుంటే మొలకశాతం ఎక్కువగా వచ్చి అధిక దిగుబడులు పొందవచ్చును. విత్తే సమయం ఖరీఫ్ లేట్ ఖరీఫ్ రబి/వేసవి గోదావరి జిల్లాలు మే 15-31 - డిసెంబర్ 15 నుంచి జనవరి 15 రాయలసీమ మే-జూన్ - జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం ఉత్తర తెలంగాణ జూలై ఆగస్ట్ మొదటి పక్షం జనవరి రెండవ పక్షం దక్షిణ తెలంగాణ జూన్-జూలై ఆగస్ట్ రెండవ పక్షం జనవరి రెండవ పక్షం అనువైన రకాలు : ఎలమంచిలి -11, ఎలమంచిలి -17, ఎలమంచిలి-66 (శారద) ఆంధ్రప్రదేశ్ రైతులకు, చందన, రాజేశ్వరి, శ్వేతాతిల్ మరియు హిమ తెలంగాణ రైతులకు సిఫారసు చేయబడినవి. అంతరపంటలు : ఒకే పంటను సాగుచేయడానికి బదులు రెండు పంటలు వేయడం వలన తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు కనీసం ఒక పంట నష్టపోయిన, ఇంకొకపంటనుంచి ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. నాలుగు చాళ్ళ నువ్వు పంట తరువాత రెండు చాళ్ళ కంది పంట లేదా మూడు చాళ్ళ నువ్వుల పంట తరువాత ఒక వరుస క్రత్తి వేసుకున్నచో రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఎరువులు : పశువుల ఎరువును 2-8 టన్నులు ఎకరాకు వేయుట మంచిది. మట్టి పరిక్షల ఆధారంగా రసాయన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులైతే ఆంధ్రప్రదేశ్ రైతులు ఎకరాకు 35 కిలోల యూరియా, 100 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, 18 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ ఎరువులు వేసుకోవాలి. తెలంగాణ రైతులైతే ఎకరాకు 25 కిలోల యూరియా, 75కిలొల సింగల్ సూపర్ ఫాస్పేట్, 18 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ ఎరువులు వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం మరియు పోటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం ఎరువును విత్తిన 30రోజులకు కలుపు తీసేటప్పుడు వేయాలి. నీటి యాజమాన్యం : రబీ మరియు వేసవిలో విత్తినప్పుడు పొడిదుక్కిలో విత్తినవెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశలలో తడులు ఇవ్వాలి. విత్తిన 35-40 రోజులనుంచి 65-75 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణ మరియు అంతర కృషి : నువ్వుల్లో గడ్డిజాతి మొక్కల పెరుగుదల ఉంటుంది. నువ్వుల పంటను ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన 15 రోజుల లోపు కుదురుకి ఒక మొక్క ఉండేవిధంగా పలుచన చేసుకోవాలి. అదేవిధంగా తప్పనిసరిగా మొదటి కలుపు విత్తిన 15 రోజులలోపల, రెండవ కలుపు 30 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేసి కలుపు నివారించుకోవచ్చును. కూలీల కొరత ఉన్న దగ్గర కలుపు నివారణ మందులైన ప్లూక్లోరాలిన్ 45 శాతంవిత్తే ముందు ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి కలియ దున్నాలి, లేదా అల్లాకోర్ 50 శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే కాని మరుసటి రోజు కాని పిచికారి చేయాలి. సస్య రక్షణ ఆకుముడుత మరియు కాయ తొలుచు పురుగు: తొలి దశలో చిన్న గొంగళి పురుగులు మూడు, నాలుగు (లేత అకులను కలిపి గూడుగా కట్టి లోపలినుంచి ఆకులలోని పచ్చని పదార్థాన్ని గోకి తినుటవలన ఆకులు వాడి ఎండిపోతాయి. గొంగళి పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకుని ఆకులను తినేస్తాయి. పూత దశలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న లార్వాలు పువ్వులోపల ఉండి తినుకుంటూ,కాయ ఏర్పడే దశలో కాయలోపలికి చొచ్చుకొనిపోయి అభివృద్ధి, చెందుతున్న గింజలను తింటూ పంటకు నష్టం క చెకూరుస్తాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలని, పూతను, కాయలలోని లేత గింజలని తింటూ పంటకి నష్టం చేకూరుస్తాయి. నివారణ : పురుగులు ఆశించిన ఆకులను పురుగులతోసహా ఏరి నాశనం చేయాలి. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్న యెడల ప్రొఫినోఫాస్ 50 ఇసి. 2 మి.లీ లేదా స్పైనోసాడ్ 45 ఎస్.సి. 0.2 మి.లీ లేదా 76 ఇసి లేదా క్వినాల్ ఫాస్ 2 మి.లీ లేదా క్లోరోఫైరిఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కోడు ఈగ చిన్న పురుగులు లేత మొగ్గ మరియు పూత తినివేయడం వలన మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక, గింజకట్టక బుడిపెలుగా ఏర్పడతాయి. మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది. నివారణ: పురుగులు ఆశించిన మొగ్గలను, మరియు కాయలను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి. మొగ్గదశలో డైమిథోయేట్ £2 మి.లీ లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 17.8 ఎస్. ఎల్ 0.8 మి.లీ ౩0 ఇ.సి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బీహారి గొంగళి పురుగు తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి విస్తరిస్తూ ఆకును తినేస్తాయి. నివారణ : గ్రుడ్లు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతోసహా తీసివేసి నాశనం చేయాలి. నివారణకు క్లోరో ఫైరిఫాస్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 (గ్రా లేదా ఇండాక్సోకార్బ్ 0.5మి.లీ/ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దోమ: తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి ఆకులనుంచి రసాన్ని పీల్చివేస్తాయి. ఈ దోమ కాటుతో వెర్రి తెగులు వ్యాప్తి చెందుతుంది. నివారణ : ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్లూ. ఎస్ ను 7.5 గ్రాములు లేదా థయోమితాక్సిమ్ 25 డబ్లూ.జి. ను 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసినచో 25-80 రోజుల వరకు రసం పిల్చే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చును. డైమిథోయేట్ 2మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0. ౩ (గ్రా/ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెగుళ్ళ నివారణ కాండం, వేరుకుళ్ళు తెగులు : ఈ తెగులు కాండం మరియు వేర్ల మీద కనిపిస్తుంది. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు వర్షానికి మారి వ్రేలాడుతుంటాయి. తరువాత అకుల అంచులు లోనికి ముడుచుకుని రాలిపోతాయి.కాండం మీద నల్లటి చారలు ఏర్పడతాయి. వేళ్ళను చీల్చి గమనిస్తే గోధుమరంగు చారలు కనిపిస్తాయి. వేళ్ళు పాక్షికంగా కుళ్ళిపోతాయి తెగులు సోకిన కాయలమీద, కాండంమీద గులాబి రంగు, శిలీంద్ర బీజాలు కనిపిస్తాయి. నివారణ : పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3/గ్రాముల థైరం లేదా కాష్టన్ లేదా కార్చండిజం కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులు అధికంగా ఉన్నప్పుడు రిడోమిల్ ఎం. జడ్ లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు/ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తెగులు అరికట్టవచ్చును. ఆకుమచ్చ తెగులు మొక్క ఎదుగు దశలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు రోగం అధికంగా వ్యాపిస్తుంది. ఆకులు, కాండంమీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. నివారణ : తెగులు ఆశించిన పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనాలకు 2 గ్రా కార్బండజిమ్ కలిపి విత్తనశుద్ది చేయాలి. పంట దశలో కార్బండజిమ్ 1 గ్రా లేక మాంకోజెబ్ 5 గ్రా లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2-8 సార్లు పిచికారి చేయాలి. బూడిద తెగులు తొలి దశలో లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి. వ్యాధి ఎక్కువగా ఉన్న ఆకులు రాలిపోతాయి, మొక్క పైన ఉన్న కాయలు పక్వానికి రావడానికి ముందే ఆకులు రాలిపోతాయి. నివారణ : పది రోజుల వ్యవధిలో రెండు సార్లు నీటిలో కరిగే గంధకపు పొడి 8 గ్రా/లీటరు లేదా ప్రోవికోనాజోల్ 1 మి.లీ./లీటరు లేదా కేరాథేన్ 1 మి.లీ./లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. వెర్రి తెగులు ఈ తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కలలోని అకులు చిన్చవై పుష్పాల్లోని భాగాలన్నీ ఆకులమాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో పుష్పాలన్ని చిన్నచిన్న ఆకులుగా మారి గుబురుగాఉండి వెర్రితల మాదిరిగా కనిపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ : రాజేశ్వరి, హిమ, చందన, రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకుంటాయి. ఈ తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. దోమ కాటును పైన పేర్కొన్న మందులతో అరికట్టవలెను. పంటకోత : ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమైనప్పుడు, కాయలు లేత 'సుపు వర్షానికి వచ్చినప్పుడు 'పైరుకోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి ఎండబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తరువాత కట్టెలతో కొట్టినూర్చిడి చేయాలి. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి గోనె సంచులలో నిలువచేసి ధర పలికినప్పుడు అమ్మి లాభాలు పొందవచ్చు. దిగుబడి : వర్షాధారం కింద 2-4 క్వింటాళ్ళు, నీటి వసతి కింద 4-6 క్వింటాళ్ళు/ఎకరాకు పొందవచ్చు అధిక దిగుబడులు సాదించడానికి ముఖ్య సూచనలు సిఫారసు చేయబడిన రకాల నాణ్యమైన విత్తనాలను వాడండి విత్తుకునే ముందు విత్తనాలను విత్తనశుద్ధి చేసుకుని వేసుకోవాలి మొక్కల సాంద్రతను బట్టి కచ్చితంగా 15-20 రోజులపుడు పలుచన చేసుకోవాలి పైరు తొలి దశలో 20-80 రోజులవరకు కలుపు లేకుండా చూసుకోవాలి మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులను సరియైన మోతాదులో వేసుకోలి పంటపుత, మొగ్గ, కాయ దశలో ఉన్నపుడు కచ్చితంగా నీటి తడులు ఇవ్వాలి తేమ శాతం 8-9 వచ్చేంతవరకు ఎండలో ఆరబెట్టి విత్తనాలను నిల్వచేసుకోవచ్చు ఆధారం : KRISHI ICAR