పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు సమర్థవంతమైన యాజమాన్య పద్ధతులు తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందిన పత్తి పంట రాష్ట్రంలో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంటలలో ఒకటి. ప్రస్తుతం పత్తి పైరు 30-60 రోజుల దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పచ్చదోమ, పేనుబంక, తామరపురుగులు, తెల్లదోమ, పిండి నల్లి తదితర రసం పీల్చే పురుగులు పత్తిని ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ పురుగులు మొక్కల నుంచి రసం పీల్చడం ద్వారా మొక్కలను బలహీనపరుస్తాయి. అందువల్ల రైతులు పంటను నిరంతరం పరిశీలిస్తూ రసం పీల్చే పురుగుల ఉదృతిని గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. పత్తి పంట మొదటి 30-45 రోజులలో కాండానికి మందు పూత పూసే పద్ధతిలో ఫ్లోనికామిడ్ లేదా ఇమిడాక్లోప్రిడ్స్ను 1:20 నిష్పత్తిలో ఉపయోగించవచ్చు. అనంతరం పంటను క్రమం తప్పకుండా పరిశీలించి, పురుగుల ఉదృతి అధికంగా ఉన్నప్పుడు సిఫారను చేసిన పురుగుమందులను సరైన మోతాదులో పిచికారీ చేయాలి. పచ్చదోమ పచ్చదోమలు ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీలుస్తాయి. దీనివల్ల ఆకులు మొదట లేత ఆకుపచ్చ రంగు కోల్పోయి, తరువాత పసుపు రంగులోకి మారి చివరికి ఎండిపోతాయి. ఈ పురుగు ఎక్కువగా ఆశించినప్పుడు ఆకుల అంచులు కిందికి ముడుచుకుంటాయి. మొక్కల పెరుగుదల మందగించి, పంట బలహీనపడుతుంది. తీవ్ర ఉదృతి ఉన్నప్పుడు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆకుకు 2 పచ్చదోమ నింఫ్ ు కనిపించినప్పుడు ఆర్థిక నష్టస్థాయికి చేరినట్లు పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. పేనుబంక పేనుబంక పురుగులు సాధారణంగా మొక్కల పైభాగంలోని కోమల చిగుర్లపై గుంపులుగా చేరి రసం పీలుస్తాయి. ఇవి అధికంగా ఆశించినప్పుడు ఆకులు ముడుచుకొని పెరుగుదల ఆగిపోతుంది. ఈ. పురుగులు తేనెరసం వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దానిపై నల్లటి బూజు ఏర్పడుతుంది. దీని కారణంగా ఆకులలో కిరణజన్య సంయోగక్రియ తగ్గి పంట ఎదుగుదల దెబ్బతింటుంది. 10 శాతం మొక్కలను పేనుబంక ఆశించినప్పుడు ఆర్థిక నష్టస్థాయికి చేరినట్లు పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలి తామర పురుగు తామర పురుగులు సాధారణంగా పుష్పాలు, మొగ్గలు, గులాబీ రంగు కోమల భాగాలపై ఆశిస్తాయి. వీటి వల్ల పూలు రాలిపోవడం, ఆకులు వెండి వర్ణంలోకి మారడం, మొక్క ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పుష్పదశలో ఉధృతి ఎక్కువైతే కాయల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఆకుకు 10 తామర పురుగులు ఉన్నప్పుడు ఆర్థిక నష్టస్థాయికి చేరినట్లు పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలి తెల్లదోమ తెల్లదోమలు ఆకుల అడుగు భాగంలో నివసిస్తూ రసం పీలుస్తాయి. ఇవి కూడా తేనెరసం విసర్జించడం వల్ల నల్లటి బూజు ఏర్పడుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. తెల్లదోమలు అనేక వైరస్ వ్యాధులను వ్యాప్తి చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రారంభదశలోనే వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ఆకుకు 6 పెద్ద తెల్లదోమలు ఉన్నప్పుడు ఆర్థిక నష్టస్థాయికి చేరినట్లు పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. పిండి నల్లి పిండి నల్లి పురుగులు తెల్లని మైనపు పొరతో కప్పబడి కనిపిస్తాయి. ఇవి ఆకులు, కొమ్మలు, కాయలపై ఆశించి రసం పీలుస్తాయి. ఫలితంగా మొక్కల పెరుగుదల తగ్గి, కొమ్మలు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం జరుగుతుంది. తీవ్ర ఉధృతి ఉన్నప్పుడు మొత్తం మొక్క తెల్లటి పిండి పూసినట్లు కనిపిస్తుంది. ఈ పురుగు విస్తరణను తగ్గించడానికి ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. 5 శాతం మొక్కలను పిండి నల్లి ఆశించినప్పుడు ఆర్థిక నష్టస్థాయికి చేరినట్లు పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల సమగ్ర యాజమాన్యం రసం పీల్చే పురుగులను తట్టుకునే పత్తి రకాలను సాగు చేయాలి. ప్రారంభ దశలో తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు వేపనూనెను 5 మి.లీ/లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్ 200 ఎస్.ఎల్. నీరు = 1:20 నిష్పత్తిలో కాండానికి బ్రష్‌తో పూయాలి. పురుగు ఉధృతి ఆధారంగా ఈ చర్య చేపట్టాలి. ఈ విధానం వల్ల పురుగుమందుల ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. తెల్లదోమ, పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 8 పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. పసుపు రంగుకు ఆకర్షితమయ్యే తెల్లదోమలు, పేనుబంక పురుగులు ఈ జిగురు అట్టలకు అతుక్కుపోవడం ద్వారా వాటి ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే, తామర పురుగుల పర్యవేక్షణ, నియంత్రణ కోసం నీలం రంగు స్టిక్కీ ట్రాప్లను ఏర్పాటు చేయాలి. పొలంలో తెల్లదోమల ఉనికి గుర్తించినప్పుడు పైరిత్రాయిడ్ వర్గానికి చెందిన పురుగు మందులను అనవసరంగా ఉపయోగించకుండా ఉండాలి, ఎందుకంటే వాటి అధిక లేదా పునరావృత వినియోగం వల్ల తెల్లదోమల్లో మందు నిరోధకత పెరగడంతో పాటు వాటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. పురుగు ఉధృతి, ఆర్థిక నష్టం స్థాయి ఆధారంగా అవసరమైతే మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ కోసం లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్.ఎల్. – 0.4 మి.లీ. లేదా అసిటామిప్రిడ్ 20 ఎస్.పి. - 0.2 గ్రాములు లేదా థయోమెథోక్సామ్ 25 డబ్ల్యూ.జి - 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 5 2.0 మి.లీ. లేదా ఫ్లోనికామిడ్ 50 ఎస్.సి. -డబ్ల్యూ.జి. ໖. - 0.3 గ్రాములు మందులలో ఏదో ఒకదానిని సిఫార్సు చేసిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసే సమయంలో మందు ద్రావణం ఆకుల కింది భాగం పూర్తిగా తడిచేలా సమర్థవంతంగా పిచికారీ చేయాలి. ఒకే రకమైన పురుగుమందును పదే పదే వాడకుండా, వేర్వేరు చర్య విధానం కలిగిన పురుగుమందులను మార్చి మార్చి వాడాలి. ఆధారం: పాడిపంటలు , డా.కిషోర్, డా. దినేష్, వ్యవసాయ పరిశోధన స్థానం, ముధోల్