పత్తి- నాణ్యమైన హైబ్రిడ్‌తో నిండైన దిగుబడి

పత్తి పంటకు పుట్టుక నుండే నీరు చాలా అవసరం.అందువల్ల వర్షం వచ్చిన తర్వాతే విత్తనం వేయండి. నైరుతి రుతుపవనాల వల్ల కనీసం 80-100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత మాత్రమే పత్తి నాటుకోవాలి. అంతకు ముందు నాటుకుంటే మొక్కలు సరిగ్గా మొలకెత్తవు, మొదలు నుండే పంట దెబ్బతింటుంది.ఈ సంవత్సరం ప్రత్యేక హెచ్చరిక:వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి వర్షపు నీటి సంరక్షణ, సమర్థవంతమైన వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అత్యవసరం.

బోదెల పద్ధతి-నీటి ఆదాకు అత్యుత్తమ మార్గం

పత్తిని బోదెల పద్ధతిలో (Ridge & Furrow Method) విత్తుకుంటే వర్షపు నీరు వృధా కాకుండా నేలలో ఇంకి మొక్కకు ఎక్కువ కాలం తేమను అందిస్తుంది. ముఖ్యంగా వర్షపాతం తక్కువగా ఉండే సంవత్సరాల్లో మొక్కలను కాపాడే మంచి పద్ధతి రైతులకు చాలా ఉపయోగకరం.

విత్తే సమయం

నల్లరేగడి నేలల్లో పత్తి విత్తనాలను జులై నుండి ఆగస్టు 15 తేదీ లోపు విత్తుకోవచ్చు. ఒకవేళ ఆలస్యంగా విత్తుకునే సందర్భంలో, నేల స్వభావాన్ని బట్టి మొక్కల మధ్య దూరాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఎకరాకు మొక్కల సంఖ్య ఎక్కువవుతుంది. ఇలా చేయడం వల్ల ఆలస్యంగా నాటినా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.

సరైన హైబ్రిడ్ రకం ఎంపిక

ఒక గ్రామంలో లేదా ప్రాంతంలో రైతులందరూ కలిసి సరైన రకం ఎన్నుకోవడం చాలా ముఖ్యం. త్వరగా కాపుకు వచ్చే, రసం పీల్చే పురుగులను తట్టుకునే హైబ్రిడ్ రకాన్ని ఎంచుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు.

సీజన్ చివర్లో వచ్చే గులాబీ రంగు పురుగు (Pink Bollworm) బాధ తప్పుతుంది.

పురుగు మందుల ఖర్చు బాగా తగ్గుతుంది.

పంట త్వరగా పూర్తవడం వల్ల మంచి మార్కెట్ ధర దొరికే అవకాశం ఉంటుంది.

ఒంటరిగా కాకుండా అందరూ ఒకే రకం ఎన్నుకుంటేనే ఈ ఫలితాలు సాధ్యం.

విత్తన శుద్ధి

మార్కెట్లో కొనే పత్తి విత్తనాలు ముందే శుద్ధి చేసి ఉంటాయి. అయినా, పంట తొలి దశలో వచ్చే వివిధ తెగుళ్ల నుండి మొక్కలను రక్షించుకోవడానికి విత్తనం వేయడానికి ముందు విత్తన శుద్ధి తప్పనిసరి. విత్తనాలను మందుతో బాగా కలిపి నీడన ఆరబెట్టి విత్తుకోవాలి.

ఎరువుల యయాజమాన్యం: పత్తిలో మంచి దిగుబడికి సేంద్రియ ఎరువు, రసాయన ఎరువులు రెండూ కావాలి. నేలలో తేమ ఉన్న సమయంలో ఎరువు వేయడం ముఖ్యం లేదంటే ఎరువు నేలలో కలవకుండా వృధా అవుతుంది.

కలుపు యాజమాన్యం: పత్తి విత్తనం వేసిన 48 గంటల లోపల తప్పకుండా కలుపు మందు పిచికారీ చేయాలి. ఇది నేల... మీద ఒక రక్షణ పొరలా పని చేసి కలుపు మొలవకుండాఅడ్డుకుంటుంది. నాటిన తర్వాత మొదటి 60 రోజులు పంటలోకలుపు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ఈ దశలోకలుపు మొక్కలు పంట మొక్కలతో నీరు, ఎరువులు, వెలుతురుపోటీ పడి దిగుబడిని బాగా తగ్గిస్తాయి. కలుపు లేకుండా చేయడంవల్ల నేల తేమ కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

అంతరకృషి

కలుపు మందు పిచికారీ ఒక్కటే పూర్తిగాకలుపు నిర్మూలించదు. అందువల్ల ప్రతి 10 నుండి 15 రోజులకుఒకసారి గొర్రు లేదా గుంటక తో పంటలో నేల గుల్లబరచాలి. ఈపని 60 నుండి 70 రోజుల వరకు కొనసాగించాలి.నేలలో గాలి ప్రసరణ మెరుగవుతుంది.నేల తేమ ఎక్కువ కాలం నిలుస్తుంది.కలుపు మొక్కలు తగ్గుతాయి.పంట ఆరోగ్యంగా పెరుగుతుంది.

అంతర పంట : పత్తిని ఒక్కటే పండించకుండా కందిపంటను అంతర పంటగా వేస్తే వర్షాధారంగా కూడా మంచి నికరఆదాయం వస్తుంది. కంది మొక్కలు నత్రజనిని నేలలో స్థిరపరుస్తాయి కాబట్టి ఎరువు ఖర్చు కూడా తగ్గుతుంది.

లింగాకర్షక బుట్టలు : గులాబీ పురుగు నియంత్రణకుపత్తి నాటిన 45 రోజులకు పురుగుని పర్యవేక్షించడానికి,నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలు పెట్టాలి. ఒక ప్రాంతంలోని రైతులందరూ ఒకేసారి బుట్టలు ఏర్పాటు చేసుకుంటే ఫలితంచాలా బాగుంటుంది.

ఉద్దేశంఎకరాకు బుట్టల సంఖ్యపర్యవేక్షణ కొరకు4 బుట్టలుపురుగు నియంత్రణ కొరకు8 నుండి 10 బుట్టలు

రైతు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు

80-100 మి.మీ. వర్షం పడిన తర్వాతే నాటాలి.

విత్తనం నాటే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి.

విత్తిన 48 గంటల్లో కలుపు మందు పిచికారీ చేయాలి.

కంది అంతర పంట వేసి ఆదాయం పెంచుకోవాలి45 రోజులకు లింగాకర్షక బుట్టలు అందరూ కలిసి పెట్టుకోవాలి.

పత్తిలో విత్తన శుద్ధి ప్రధాన ప్రయోజనాలు

పత్తిలో విత్తన శుద్ధి అనేది పంటను ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి రక్షించడానికి, దిగుబడిని పెంచడానికి అత్యంత కీలకమైన మరియు చౌకైన పద్ధతి. విత్తనాన్ని నాటే ముందు రసాయన లేదా జీవ శిలీంధ్ర నాశనులతో శుద్ధి చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

మొలక దశలో రక్షణ : విత్తనం మొలకెత్తిన కొత్తలో నేలలో ఉండే శిలీంధ్రాల వల్ల కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటాయి.

రసంపీల్చు పురుగుల నివారణ : పత్తిని మొదటి 30-45 రోజుల పాటు ఆశించే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక వంటి రసం పీల్చు పురుగుల బెడదను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

వేరు వ్యవస్థ పటిష్టం : మొక్కల వేరు కుళ్ళు తెగులు విల్ట్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ పొందుతాయి.

మొక్కల ఏకరీతి పెరుగుదల : ఆరోగ్యకరమైన దృఢమైన మొక్కల ఎదుగుదలకు సహాయపడుతుంది. దీనివల్ల చేతికి వచ్చే దిగుబడి గణనీయంగా పెరుగుతుంది.

ఖర్చు అదా : పంట ప్రారంభ దశలోనే పురుగుల మందులు పిచికారీ చేసే ఖర్చు తగ్గుతుంది.

ఆధారం :  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ