పసుపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. మన దేశంలో సాగయ్యే విస్తీర్ణంలో దాదాపు 40 శాతం వరకు ఈ రెండు రాష్ట్రాల్లే సాగుచేస్తున్నాయి. ప్రస్తుతం దుంపలను తీసేదశలో రైతులున్నారు. పసుపులో దుంపకోత, తవ్వడం, ఉడకబెట్టడం, నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. తవ్వడం పసుపు తప్ప ముందు ఆకులను, కాండాలను, భూమట్టానికి కోసివేసి, కాల్చివేయాలి. నీరు పెట్టిన తర్వాత దున్ని దుంపలను భూమిలో నుంచి తీయాలి. తవ్విన 2-7 రోజుల లోపల ఉడకబెట్టాలి. ఉడకక బెట్టడం పొలం నుండి తీసిన కొమ్మలను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. తల్లి దుంపలను, పిల్ల కొమ్మలను వేర్వేరుగా ఉడకబెట్టాలి. రాగి లేదా ఒక ఇనుప కడాయిలో దుంపలు మునిగేంత వరకు నీరు పోసి 45-60 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. దుంపలను వేళ్లతో నొక్కినప్పుడు మెత్తబడినట్లయితే దుంప ఉడికినట్లు తెలుసుకోవచ్చు. ఆరబెట్టడం మంచిగా ఉడికిన పసుపు దుంపలను తీసి శుభ్రమైన నేల లేదా టార్సలిన్ పోసి ఆరబెట్టాలి. ఒక్కరోజు తర్వాత 2-3 అంగుళాలు మందం ఉండాలా నేలపై పరచాలి. సుమారు 10-15 రోజులకు పసుపు తయారవుతుంది. ఈ 10-15 రోజుల మధ్యలో అప్పుడప్పుడు పసుపును పైకి కిందికి ఎండ ఉన్నప్పుడు కలియతిప్పాలి. తేమ 8 శాతం ఉండేటట్లు ఆరబెట్టాలి. దుంపలను కృత్రిమంగా 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి గాలి పంపి కూడా ఆరబెట్టవచ్చు. ఈ కృత్రిమ పద్ధతిలో దుంపలను ముక్కలుగా కోళ్లి ఆరబెట్టి ఉపయోగించడం వలన మంచి నాణ్యత గల పసుపు లభిస్తుంది. పసుపును ఆరబెట్టేటప్పుడు వర్షంలో లేదా మంచులో గానీ తడవకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోనట్లయితే పసుపుకు బూజు తెగులు ఆశించి అప్లాటాక్సిన్ అనే విషపదార్థాలు వృద్ధి చెందుతాయి. పాలిషింగ్ ఎండిన పసుపు కొమ్మలు, పొలుసులు వేర్లను కలిగి గరుకుగా ఉంటాయి. కాబట్టి వీటిని అమ్మకానికి ముందు మెరుగుపెడితే ఆకర్షణీయంగా తయారయ్యి మార్కెట్లో అధిక ధర లభిస్తుంది. దుంపలను గోనె సంచుల్లో పోసి గట్టి నేలపై రుద్దడం ద్వారా గానీ లేదా కాళ్ళతో రాకడం ద్వారా కూడా పాలిష్ చేయవచ్చు. యంత్రాలతో లేదా ఇనుప జాలి కలిగిన డ్రమ్మల్లో పసుపు కొమ్మలను వేసి తిప్పడం వల్ల కూడా పొలుసులు వేర్లు ఊడిపోయి వీటికి పాలిష్ వస్తుంది. గ్రేడింగ్ సైజులను బట్టి దుంపలను గ్రేడింగ్ చేయాలి. పసుపు కొమ్మలను నిల్వ చేయటం ఎతైనా ప్రదేశంలో 4 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు గల ఒక గుంటను తవ్వి 2-3 ఎండనివ్వాలి. గుంట అడుగు భాగంలో పక్కలను వరి గడ్డితోగానీ ఈత చాపలతో కానీ కప్పాలి. ఈ గుంటలో శుభ్రం చేసి, ఎండిన, ఆరోగ్యంగా ఉన్న పసుపు కొమ్మలను పోయాలి. ఈ కొమ్మల పైన కూడా వరిగడ్డి పొర లేదా ఈత చాపలతో కప్పి తదుపరి మట్టిని ఎత్తుగా పోసి అలకాలి. ఈ విధంగా చేసిన మట్టి గోడ ఎండిన తరువాత 20 గ్రా. లిండేన్ పొడిని ఒక లీటరు నీటిలో కలిపి గుంట అడుగున చల్లడం వలన చెదలు పట్టకుండా ఈ పసుపు కొమ్ములను సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. విత్తనం కోసం నిల్వ మంచి విత్తనపు కొమ్మలను చెట్టు నీడలో కానీ, అరడుగు మందంతో ఇసుక పరచి, ఈ ఇసుకపై నీరును చల్లి ఈ విత్తనపు పసుపును శంకాఖారంలో కుప్పపోయాలి. ఈ కుప్పమీద వరిగడ్డి గానీ, వేపాకు గానీ చీడపీడలు సోకని మంచి పసుపు, ఆకులను కానీ కప్పాలి. ఈ కుప్పపై మట్టి, పేడ కలిపిన మిశ్రమాన్ని ఆకులపై లేదా గడ్డిపై అలికి పసుపును నిల్వ చేసుకొని వరాలు పడిన తర్వాత ఈ కొమ్మలను విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. పైన చెప్పిన విధంగా అన్ని పద్ధతులను రైతులు చేపట్టినట్లయితే పసుపులో మంచి నాణ్యత, కర్మూమిన్, అధిక దిగుబడి పొందడంతో పాటు మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక