ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, ప్రకాశం, కృష్ణ, పశ్చిమ గోదావరి, కర్నూలు వంటి జిల్లాల్లో మొక్కజొన్న ఖరీఫ్, రబీ కాలాల్లో విస్తారంగా సాగవుతుంది. మంచి దిగుబడి కోసం విత్తిన తర్వాత మొదటి 30-35 రోజుల్లో చేపట్టే కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం, మట్టిని ఎగదోయుట వంటి పనులు అత్యంత కీలకం. కలుపు తీత విత్తిన మొదటి 45 రోజుల్లో కలుపు మొక్కలు వేగంగా పెరిగి, నీరు, పోషకాలు, సూర్యరశ్మి కోసం పైరుతో పోటీ పడతాయి. ఈ దశలో కలుపు నివారణ చేయకపోతే దిగుబడి 30-40% వరకు తగ్గే అవకాశం ఉంది. విత్తిన 15-20 రోజుల మధ్య (వరుసల మధ్య కలుపు స్పష్టంగా కనిపించే దశ) మొదటి కలుపు తీత చేపట్టాలి. గొర్రు సహాయంతో వరుసల మధ్య మట్టిని కదిలిస్తూ కలుపు మొక్కలను తీయాలి. మొక్క వేరు వ్యవస్థకు హాని కలగకుండా జాగ్రత్త వహించాలి. చేతి కూలీలతో వరుసల్లో మొక్కకు దగ్గరగా ఉండే కలుపును చేతితో పీకేయాలి. రసాయనిక కలుపు నివారణ కావాలనుకుంటే, విత్తిన వెంటనే (ప్రీ-ఎమర్జెన్స్) అట్రాజిన్ ఆధారిత మందులు, లేదా 20-25 రోజుల దశలో పోస్ట్-ఎమర్జెన్స్ కలుపు మందులను స్థానిక వ్యవసాయ అధికారి సలహాతో వాడుకోవాలి. ఫర్టిగేషన్ బిందు సేద్యం (డ్రిప్) ఉన్న రైతులు ఎరువులను నీటితో పాటు నేరుగా అందించే పద్ధతినే ఫర్టిగేషన్ అంటారు. దీనివల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి, ఖర్చు తగ్గి, దిగుబడి మెరుగవుతుంది. ఫర్టిగేషన్ లో పాటించవలసిన జాగ్రత్తలు ఎరువులను చిన్న చిన్న మోతాదులుగా విభజించి ఇవ్వడం వల్ల నష్టం తగ్గి, మొక్క సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. డ్రిప్ లో పూర్తిగా కరిగే ఎరువులను మాత్రమే వాడాలి. నీటిలో కరగని ఎరువులు డ్రిప్పర్లను మూసుకుపోయేలా చేస్తాయి. ఫర్టిగేషన్కు ముందు, తర్వాత కొద్ది నిమిషాలు మంచినీటిని మాత్రమే డ్రిప్ ద్వారా పంపి పైప్ లైన్ శుభ్రం చేసుకోవాలి. మట్టిని ఎగదోయుట మొక్కజొన్న విత్తిన 30-35 రోజుల దశలో మొక్క వేరు దగ్గర మట్టిని ఎగదోయడం ఒక ముఖ్యమైన యాజమాన్య పని. రెండవ కలుపు తీసిన వెంటనే గోరు లేదా నగాయితో వరుసల మధ్య మట్టిని మొక్క మొదలు వైపుకు నెట్టి, వరుసల పక్కన చిన్న గట్టు (రిడ్జ్) ఏర్పరచాలి. బిందు సేద్య పద్ధతులు నీటిలో కరిగే ఎరువులను ఫర్టిగేషన్ ద్వారా మొక్క వేర్లకి సక్రమంగా అందించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని 30% వరకు పెంచుకోవచ్చు కాకపోతే ఫర్టిగేషన్ పద్ధతిలో రైతులు ముఖ్యంగా నీటిలో కరిగే ఎరువులు మాత్రమే వాడుకోవాలి. డి.ఎ.పి ని హైడ్రాట్గా వేసుకొని యూరియా పొటాష్లను డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు. మామూలుగా మొక్కజొన్నలో ప్రతి రెండు వరుసల తర్వాత అంటే 1.2 మి. ఎడంలో లేటరల్ పైపును వేసుకోవాలి అలాగే ఇమిటర్ల (Emitter) మధ్య దూరం 40 సెంటీమీటర్లు ఉంటుంది. ఇటీవల కాలంలో డ్రిప్ తో జంట సాల వద్దతిలో మొక్కజొన్నను వండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఇందులో జంటల మధ్య 90 సెం.మీ. జంటలోని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు ఎడం పెట్టుకోవచ్చు. కాబట్టి బిందు సేద్య పద్దతిలో మొక్కజొన్న సాగు చేయడం వలన నీటి ఆదా అవడంతో పాటుగా, ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో అందించడం, తక్కువ కలుపు సమస్య వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటుగా ఈ పద్ధతిలో మామూలు పద్ధతి కంటే 20 నుంచి 25% అధిక దిగుబడులు సాధించడం ద్వారా నికర ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న గారెలు మొక్కజొన్న గారెలు వర్షాకాలం, శీతాకాలంలో వీధి బండ్ల మీద, ఇళ్లలో సాయంత్రం టిఫిన్‌గా బాగా ఇష్టపడే స్నాక్. తాజా మొక్కజొన్న గింజలను శనగవప్పుతో కలిపి రుబ్బి, మసాలాలు జోడించి నూనెలో వేయించడం వల్ల బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ గారెలు అందరికీ ఇష్టమైన వంటకంగా మారింది. అవసరమైన పదార్థాలు తాజా మొక్కజొన్న గింజలు 2 కప్పులు (కొద్దిగా వేయించినవి), శనగపప్పు అర కప్పు (2 గంటలు నానబెట్టినవి), బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1 (సన్నగా తరిగినది), పచ్చి మిర్చి 3 (సన్నగా తరిగినవి), అల్లం 1 టీ స్పూన్ (తురిమినది), అల్లం వెల్లుల్లి కలిపి తురిమినది 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు (తరిగినది), 5 కరివేపాకు - 1 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్ (రుచికి సరిపడినంత) వేయించడానికి నూనె 2 కప్పులు, తయారీ విధానం మొక్కజొన్న గింజలు, శనగపప్పులను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా ముతకగా (మెత్తగా కాకుండా) రుబ్బుకోవాలి. మెత్తగా పేస్టులా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండాలి. రుబ్బిన మిశ్రమంలో బియ్యపు పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి తురిమినది, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం గారెలు వేసుకునేంత గట్టిగా ఉండాలి. నీళ్లు ఎక్కువ అయితే కొద్దిగా బియ్యపు పిండి కలపాలి. బాణలిలో నూనె వేసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. చేతిని తడి చేసుకుని, కొద్దిగా మిశ్రమం తీసుకుని గారె ఆకారంలో చదునుగా చేసి నెమ్మదిగా వేడి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి. 5. వేడి వేడి గారెలను కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో వడ్డించాలి. పోషక విలువలు మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ B కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. శనగపప్పు ప్రోటీను అందిస్తుంది, శాకాహారులకు మంచి ప్రోటీన్ మూలం. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు (లుటిన్, జియాక్సాంథిన్) ఉంటాయి, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. నూనెలో వేయించినది కాబట్టి మోతాదులో తినడం మంచిది. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా.వి.సుజాత శాస్త్రవేత్త ( సేద్య విభాగం), వ్యవసాయ పరిశోధనా స్థానం, పెద్దాపురం, కాకినాడ జిల్లా.