పంటల నమోదును సులభతరం చేయడానికి మరియు రైతులు తమ పంటలను డిజిటల్‌గా నమోదు చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి, పర్యవేక్షించుకోవడానికి వీలు కల్పించేందుకు, ఇ-పంట యాప్‌ను ఆధునీకరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రకటించింది. ముఖ్యమైన సమాచారం: ప్రయోజనాలు: ఏ రైతు ఏ పొలంలో ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు సేకరించి డిజిటల్ గుర్తింపునిస్తుంది. దీనివల్ల దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు నేరుగా అసలు రైతులకు అందుతాయి. నమోదు ప్రక్రియ: గ్రామాల్లోని వ్యవసాయ సహాయకులు (V.A.A) లేదా రైతు భరోసా కేంద్రం (RBK) సిబ్బంది ఈ-పంట యాప్ ద్వారా మీ పంట వివరాలను, జియో-కోఆర్డినేట్లతో సహా ఆన్లైన్లో నమోదు చేస్తారు. స్టేటస్ చెక్ చేసుకోవడం: మీ పంట నమోదు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి e-Panta వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్ లేదా సర్వే నంబర్ ఉపయోగించి సులభంగా చెక్ చేసుకోవచ్చు నమోదు చేయు సంయంలో తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఆధార్ కార్డు: రైతు ఆధార్ నంబర్ తప్పనిసరి. పట్టాదారు పాస్ పుస్తకం: భూమి యాజమాన్య హక్కుల పత్రం. బ్యాంక్ ఖాతా: సబ్సిడీలు, బీమా డబ్బులు జమ కావడానికి యాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ పాస్ బుక్. ఫోన్ నంబర్: ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్. ఆధారం :ఇ-పంట యాప్ https://karshak.ap.gov.in/ecrop/farmerack