ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం (పి యమ్ ఇ జి పి) ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం (పి యమ్ ఇ జి పి) భారత ప్రభుత్వం యొక్క ఋణాలకు సంబంధించిన రాయితీ పథకం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (పి యమ్ ఆర్ వై) మరియు గ్రామీణ ఉద్యోగ కల్పనా పథకం (ఆర్ ఇ జి పి) అనే రెండు పథకాలను మేళవించి ప్రవేశ పెట్టబడినది. ఈ పథకము 15 ఆగుస్ట్ , 2008 లో ప్రారంభించబడినది. లక్ష్యములు కొత్త స్వయం ఉపాధి వెంచర్లను / పథకాలను / చిన్న పరిశ్రమలను స్థాపించి, వాటి ద్వారా దేశం లోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించుట కొరకు సంప్రదాయపరమైన ఒకే రకమైన వృత్తులలో పనిచేస్తున్నా వేరు వేరు చోట్లలో విడివిడిగా దూరాల్లో నివసించుచున్న పనివారిని ఒకే చోటుకు ఒకే దగ్గరకు తీసుకురావటం / మరియు పట్టణాలలో ఉన్న నిరుద్యోగ యువతను ఒకటిగా చేర్చి వారికి స్వయం ఉపాధి అవకాశాలను వీలైనంత మేరకు వారి స్థానాలలో కల్పించుట కొరకు. సంప్రదాయబద్దమైన వృత్తులలో ఉన్న వారు - కుటుంబపరంగా ఎన్నో ఏళ్ళనుండి చేస్తున్నవారు– మరియు - క్రొత్తగా ఆ పనిని చేపట్టబోయే పనివారికి, ఈ రెండు రకాల వారికీ పెద్ద మెత్తం లో మరియు తరచుగా/నిరంతరంగా ఉపాధి కల్పించటం . దేశంలోని గ్రామీణ మరియు పట్టణాలలో ఉన్న నిరుద్యోగ యువతకు నిరంతరమైన ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణయువత పట్టణ ప్రాంతాలకి తరలిపోకుండా ఆపడానికి. సాంప్రదాయబద్దమైన వృత్తులలో ఉన్న పనివారి రోజువారి వేతనాలను సంపాదించే సామర్ధ్యాన్ని పెంచి తద్వారా గ్రామీణ మరియు పట్టణ ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు అభివృద్ధికి దోహదపడడానికి. ఆర్థిక సహాయం యొక్క స్వభావం మరియు పరిమాణం పి.యమ్.ఇ.జి.పి క్రింద మూల ధనము యొక్క స్థాయిలు ‘పి.యమ్.ఇ.జి. పి’కింద లబ్దిపొందిన వర్గములు లబ్దిపొందిన వారి సహకారం (ప్రాజెక్టు ఖర్చులో) రాయితీ రేటు ( ప్రాజెక్టు ఖర్చులో ) ప్రదేశం (సంస్థ నెలకొల్పడిన స్థలము) పట్టణ ప్రాంతం గ్రామీణప్రాంతం సాధారణ వర్గము 10 % 15% 25% ప్రత్యేకమైన వర్గము (యస్.సి./యస్.టి./ ఓ.బి.సి./మైనారిటీలు/మహిళలు/ ఎక్స్ సర్వీస్ మెన్/ వికలాంగులు/ ఈశాన్య ప్రాంతం/కొండ మరియు సరిహద్దు ప్రాంతాలు మొదలైనవారు 5% 25% 35% గమనిక: ఉత్పత్తి / తయారు చేయు విభాగాని క్రింద, పథకానికి/సంస్థకి ఇవ్వబడే అధిక పెట్టుబడి రూ. 25 లక్షలు వ్యాపార/సేవ విభాగానికింద పథకానికి/సంస్థకి ఇవ్వబడే అధిక పెట్టుబడి రూ. 10 లక్షలు మొత్తం పథకం యొక్క పెట్టుబడిలో మిగిలిన మొత్తము బ్యాంకుల తరపునుండి టర్మ్ లోన్ల కింద ఇవ్వబడును. లబ్దిపొందే వారికుండవలసిన అర్హత నియమాలు ఎవరైనా 18 సంవత్సరములు దాటి ఉండవలెను. ‘పి యమ్ ఇ జి పి’ కింద ప్రాజెక్టులను ఏర్పరచుకొనుటకు కావలసిన సహయానికి ఆదాయ పరిమితి లేదు. తయారు చేయు విభాగంలో 10 లక్షలకు మించి పెట్టాలన్నా మరియు వ్యాపార సేవా విభాగాలలో 5 లక్షలకు మించి పెట్టాలన్నా, లబ్దిపొందేవారు కనీసం 8వ తరగతి పాసైన విద్యార్హత కలిగి ఉండవలెను. ‘పి యమ్ ఇ జి పి’ కింద ప్రత్యేకముగా ఆమోదించబడిన కొత్త పథకాలకు మాత్రమే సహకారము అందజేయబడుతుంది. స్వయంసహకార సంస్థలు (ఇతర పథకాల కింద లబ్దిపొందని దారిద్ర్య రేఖకి దిగువనున్నవారి తో సహా) ‘పి యమ్ ఇ జి పి’ కింద సహాయానికి అర్హులు. సొసైటి రిజిస్ట్రేషన్ చట్టం, 1860 ప్రకారం నమోదు చేయబడ్డ సంస్థలు. ఉత్పత్తి దారుల సహకార సంస్థలు మరియు సేవా సంస్థలు అప్పటికే నెలకొల్పబడిన సంస్థలు (‘పి యమ్ ఆర్ వై’ , ‘ఆర్ ఇ జి పి’ లేక రాష్ట్ర ప్రభుత్వం లేక భారత ప్రభుత్వం తరుపున ) భారత ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల ద్వారా అప్పటికే రాయితీ పొందిన సంస్థలకి అర్హత లేదు. మరికొన్ని అర్హత నియమాలు. కులము/వర్గము ధృవీకరించు పత్రము నఖలు గాని లేక ప్రత్యేక కేటగిరీలకు చెందినచో తత్సం బంధీకులైన అధికారులచే జారీ చేయబడిన పత్రములుగాని, లబ్దిదారునకు తన మార్జిన్ మనీ (రాయితీ) క్లెయిమ్ తో పాటు సంబంధించిన బ్యాంక్ శాఖలో సమర్పించవలెను. అవసరమైనచో, ఆయా సంస్థల యొక్క బైలాస్ ధృవీకరణ పత్రము నకలును మార్జిన్ మనీ (రాయితీ) క్లెయిమ్ తో జతపరచవలయును. ప్రాజెక్టు ఖర్చులో పెట్టుబడి ఖర్చు మరియు ఒక నిర్ణీత కాలవ్యవధికి తగిన వర్కింగ్ పెట్టుబడి ఉండాలి. ఈ పథకంలో, పెట్టుబడి ఖర్చు నిర్దేశింపబడని ప్రాజెక్టులుకు రుణ సహాయమునకు అర్హత ఉండదు. వర్కింగ్ పెట్టుబడి అవసరము లేని ఐదు లక్షలకు పైగా పెట్టుబడి కావలసిన ప్రాజెక్టులకు ప్రాంతీయ కార్యాలయము నుండి గాని , ఆ బ్యాంక్ శాఖ యొక్క కంట్రోలర్ నుండి గాని అనుమతి అవసరము. అటువంటి క్లెయిమ్ లకు ప్రాంతీయ కార్యాలయము లేక కంట్రోలర్ నుండి తత్సంబంధముగా ఇవ్వబడిన అనుమతి పత్రమును సమర్పించవలెను. భూమి యొక్క ఖరీదును ప్రాజెక్టు ఖర్చు లో కలుపరాదు. నిర్మింపబడి యున్నగాని లేదా ధీర్ఘ కాలం లీజునకు గాని/అద్దెకుగాని తీసుకున్న వర్క్ షెడ్/వర్క్ షాప్ లకు 3 సంవత్సరముల వరకు అగు ఖర్చును మాత్రమే ప్రాజెక్టు కాస్టులో కలుపవచ్చును. గ్రామీణ పరిశ్రమలలోని వ్యతిరేక చిట్టాలో పేర్కొనబడిన పనులు తప్ప ‘పి యమ్ ఇ జి పి’ సాధ్యపడే అన్ని కొత్త చిన్నపరిశ్రమలకు మరియు గ్రామీణ పరిశ్రమ ప్రాజెక్టులతో సహా ‘పి యమ్ ఇ జి పి’ వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న/పాత యూనిట్లకు అర్హత లేదు.(గైడ్ లైన్స్ యొక్క 29వ పేరాని చూడండి.) గమనిక: ప్రత్యేక కేటగిరిలో సంస్థలు/సహకార ఉత్పత్తి సంఘాలు/ప్రత్యేకముగా గుర్తింపబడిన ట్రస్టులు మరియు ఎస్.సి.,ఎస్.టి.,ఓ.బి.సి.,మహిళలు,వికలాంగులు,ఎక్స్ సర్వీస్ మెన్ మరియు బైలాస్ లో పేర్కొనబడిన మైనారిటి సంస్థలు ఈ మార్జిన్ మనీ (రాయితీ) పొందుటకు అర్హులు. అయితే జనరల్ కేటగిరీలో, ప్రత్యేక కేటగరీలో రిజిష్టర్ చేయబడని సహకార ఉత్పత్తి సంఘాలు/ట్రష్టులు మార్జిన్ మనీ (రాయితీ) పొందుటకు అర్హులు. ‘పి యమ్ ఇ జి పి’ కింద ప్రాజెక్టులు ఏర్పాటుచేయుటకు ఆర్థిక సహయం పొందుటకు ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హులు. కుటుంబం అనగా సదరు వ్యక్తి లేక అతని భార్య లేక భర్త. అమలు పరిచే ఏజన్సీలు జాతీయ స్థాయిలో ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ 1956 చట్టం క్రింద ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి, ముంబాయి ) లోని ఏకైక నోడల్ సంస్థ ద్వారా ఈ పథకం అమలు పరచబడును. రాష్ట్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతములలో ఈ పథకం ‘కె వి ఐ సి’ రాష్ర్ట డైరక్టరేట్,రాష్ట్ర ఖాది గ్రామీణ పరిశ్రమల బోర్డు (కె వి బి సి) మరియు జిల్లా పారిశ్రామిక కేంద్రము(డి ఐ సి) ద్వారా అమలుపరచబడును.పట్టణ ప్రాంతములలో ఈ పథకం రాష్ట్ర జిల్లా పరిశ్రమల కేంద్రములచే (డి ఐ సి) మాత్రమే అమలు చేయబడును. ‘పి యమ్ ఇ జి వి’ క్రింద ప్రతిపాదించిన అంచనా లక్ష్యములు ‘పి యమ్ ఇ జి పి’ క్రింద ఈ 4 సంవత్సరములకు (2008-09 నుండి 2011-12 వరకు) ఈ క్రింద పేర్కొన్న అంచనా లక్ష్యములు ప్రతిపాదించబడినవి. సంవత్సరము ఉద్యోగముల సంఖ్య మార్జిన్ మనీ(రాయితీ) (కోట్ల రూపాయలలో) 2008-09 616667 740.00 2009-10 740000 888.00 2010-11 962000 1154.40 2011-12 1418833 1702.60 మొత్తం 3737500 4485.00 గమనిక 250 కోట్ల రూపాయలు అదనపు సోమ్ముని వెనకబడిన మరియు ప్రగతి సాధించిన వాటిని కలుపుటకు ఉద్దేశించబడినది. మొదటిగా, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అతిచిన్న పరిశ్రమలపైన ఎక్కువ ప్రాముఖ్యత కొరకు ‘కె వి ఐ సి’(రాష్ట్ర ‘కె వి ఐ బి’లతో పాటు) మరియు రాష్ట్ర ‘డి ఐ సి’ల మధ్య 60 : 40 నిష్పత్తి లో లక్ష్యములను ఉంచుతారు. అదే నిష్పత్తిలో మార్జిన్ మనీ రాయితీ కూడా విభజిస్తారు. తమకు కేటాయించబడిన సోమ్ములో కనీసం 50% గ్రామీణ ప్రాంతాలలో తప్పక వినియోగింప బడేటట్లు ‘డి ఐ సి’ లు చూస్తాయి. అమలుపరిచే ఏజన్సీలకు ఆ సంవత్సరముయొక్క లక్ష్యములను రాష్ట్రాలవారీగా ఇస్తారు. వ్యతిరేక చర్యల యొక్క జాబితా ‘పి యమ్ ఇ జి పి’ క్రింద చిన్న వ్యాపార సంస్థలు/ప్రాజెక్టులు/యూనిట్లను స్ధాపించుటకు ఈ క్రింద పేర్కొన బడిన చర్యలు అనుమతించబడవు. ప్రాససింగ్, కేనింగ్ చేసే (వధించిన)మాంసము, దానితో చేసిన ఆహారాన్ని అమ్మే ఏదైనా వ్యాపారం/ఉత్పత్తి చేసే పరిశ్రమ మరియు చుట్ట, బీడి, కిళ్ళీ, సిగిరెట్టు వంటి మత్తుకలిగించు వస్తువులను ఏదైనా అమ్మే వ్యాపారం/ఉత్పత్తి చేసే పరిశ్రమ మరియు మద్యం అమ్మే ఏదైనా హొటల్ లేదా డాబా, పొగాకు ముడి పదార్థాన్ని తయారు/ఉత్పత్తి చేయడం, కల్లుతీత తీసి అమ్మడం. టీ, కాఫీ, రబ్బరు వంటి వాటిని సాగు చేసే వ్యాపారం/పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకం, మొక్కల పెంపకం, పువ్వుల తోటల పెంపకం,పందుల పెంపకం, కోళ్ళు పెంపకం,పంటకోత కోసే యంత్రాలు మొదలైనవి. వాతావరణ కాలుష్యాన్ని ప్రేరేపించే 20 మైక్రానుల దలసరి కన్నా తక్కువ ఉన్న పోలిథీన్ సంచులు తయారుచేయడం, ఆహార పదార్థాలు నిల్వ ఉంచుటకు, తీసుకొని పోవుటకు, పారవేయుటకు, దాచి ఉంచుటకు రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ తో సంచులు గాని డబ్బాలు గాని తయారు చేయడం మరియు ఏదైనా అటువంటి అంశం. సర్టిఫికేషన్ రూల్స్ పరిధిలో ఉన్న ఖాది కార్యక్రమముల వంకతో, అమ్మకంలో ముదరాయింపు తీసుకోనే పష్మీనా ఉన్ని మరియు చేతితో నూలువడకడం, నేయడం అటువంటి ఇతర ఉత్పాదనలని ప్రోసెస్ చేయు పరిశ్రమలు. గ్రామీణ రవాణా ( అండమాన్ నికోబార్ దీవులలో ఆటోరిక్షా, కాశ్మీర్ లో హౌస్ బోట్, షికారా మరియు టూరిస్టు బోట్లు మరియు సైకిల్ రిక్షాలు తప్ప). పి యమ్ ఇ జి పి పథకం మీద తరచుగా అడిగే ప్రశ్నలు (ప్ర) ‘పి యమ్ ఇ జి పి’ కింద అనుమతించే గరిష్ట ప్రాజెక్టు ఖర్చుఎంత? (జ) తయారు చేయు పరిశ్రమలకి 25 లక్షల రూపాయలు మరియు సేవా సంస్థలకి 10 లక్షల రూపాయలు (ప్ర) భూమి ఖరీదు ప్రాజెక్టు ఖర్చులో ఉంటుందా? (జ) లేదు. (ప్ర) ప్రభుత్వం సబ్సిడి మార్జిన్ మనీ (ప్రభత్వ రాయితీ)ఎంత ఇవ్వవచ్చును? (జ) ‘పియమ్ ఇ జి పి’ కింద లబ్ధి పొందు కేటగిరి రాయితీ రేటు ( మార్జిన్ మనీ ) (ప్రాజెక్టు ఖర్చులో) ప్రాంతము (సంస్థ నెలకొల్పబడిన స్థలము) పట్టణం గ్రామీణ సాధారణ కేటగిరి 15% 25% ప్రత్యేకముగా ( ఎస్.సి., ఎస్.టి./ఒ.బి.సి./మైనారిటీలు/ మహిళలు,ఎక్స్ సర్వీస్ మెన్, వికాలాంగులు, ఈశాన్య ప్రాంతము వారు, కొండ మరియు సరిహద్దు ప్రాంతాల వారితో కలిపి) 25% 35% (ప్ర) ప్రాజెక్టు ఖర్చులో అంశములు ఏవి? (జ) పెట్టుబడి ఖర్చు లోన్, ఒక పర్యాయముకు సరిపడా వర్కింగ్ పెట్టుబడి మరియు సాధారణ కేటగరి విషయంలో స్వంత పెట్టుబడి ప్రాజెక్టు ఖరీదులో 10% మరియు బలహీన వర్గాల విషయంలో ప్రాజెక్టు ఖర్చులో 5% (ప్ర) లబ్ధిదారులు ఎవరు? (జ) వ్యవస్థాపకులు, సంస్థలు, సహకార సంఘాలు, స్వయం సహాయ సంస్థలు, ట్రస్ట్ లు. (ప్ర) ఆర్థిక సంస్థలు ఏవి? (జ) 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు,ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ( ఆర్ ఆర్ బి ) సహకార బ్యాంకులు మరియు రాష్ర్ట టాస్క్ ఫోర్స్ కమిటి చేత ఆమోదించిన ప్రైవేటు కమర్షియల్ బ్యాంకులు. (ప్ర) పెట్టుబడి ఖర్చు లోన్/ క్యాష్ క్రెడిట్ లిమిట్ ను ఎలా వినియోగించుకోవాలి? (జ) ఎమ్ ఎమ్ యొక్క 3 సంవత్సరములు లాకిన్ కాల పరిమితి లోపు, కనీసం ఒక్కసారైనా వర్కింగ్ కాపిటల్ 100% క్యష్ క్రెడిట్ పరిమితిని తాకవలెను మరియు ఆమోదించబడిన లిమిట్ వినియోగం సగుటున 75% క్యాష్ కన్నాతగ్గకూడదు. (ప్ర) లబ్ధిదారుడు తన దరఖాస్తు/ ప్రాజెక్టును ఎక్కడ సమర్పించ వలెను? (జ) లబ్ధిదారుడు తనకు సమీపములో నున్న ‘కె వి ఐ సి’ / ‘కె వి ఐ బి’/ ‘డి ఐ సి’ ఆఫీసులలో గాని ( 2-3 వారాల ‘ఇ డి పి’ శిక్షణ ను పూర్తి చేసి ఉంటే) బ్యాంకులలోగాని తన ధరఖాస్తు/ పాజెక్టును సమర్పించవచ్చును. ‘కె వి ఐ సి’ / ‘కె వి ఐ బి’ / ‘డి ఐ సి’ ఆఫీసుల చిరునామాల జాబితా మా వెబ్ సైట్ www.pmegp.in లో లభ్యమవును. (ప్ర) గ్రామీణ పరిశ్రమ అంటే ఏమిటి? (జ)విద్యుత్ శక్తి ఉపయోగించి లేదా ఉపయోగించకుండా వస్తువులను ఉత్పత్తి చేయుటగాని లేదా ఏ విధమైన సేవ చేయుట ద్వారాగాని సదరు పరిశ్రమలో పూర్తికాలము పనిచేయు కార్మికుడిపై కేపిటల్ పెట్టుబడి సాధారణ ప్రదేశము అయినచో లక్ష రూపాయలు, పర్వత ప్రాంతములైనచో 1½ లక్ష రూపాయలు మించని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పబడిన ఏ పరిశ్రమనైనా (వ్యతిరేక చిట్టాలో చెప్పబడినవి తప్ప) గ్రామీణ పరిశ్రమ అంటారు. (ప్ర) గ్రామీణ ప్రాంతం అంటే ఏమిటి? (జ) రాష్ట్ర రెవిన్యూ రికార్డుల ప్రకారం, గ్రామంగా పేర్కొనబడిన ఏ ప్రాంతమైనను జనాభాతో నిమిత్తం లేకుండా గ్రామీణ ప్రాంతంగా గుర్తింపబడును. టౌను ప్రాంతమైనను దాని జనభా 20,000 దాటని చో అది గ్రామముగానే పరిగణించబడును. (ప్ర) వయోపరిమితి ఏమిటి? (జ) ‘ఆర్ ఇ జి పి’ కింద 18 సంవత్సరములు వయస్సు మించిన ఏలబ్ధిదారుడైనను ఆర్థిక సహాయమునకు అర్హుడు. (ప్ర) ప్రాజెక్టుగా దేనిని పరిగణిస్తారు? (జ) అది గ్రామీణ ప్రాంతం ప్రాజెక్టు అయితే గ్రామీణ ప్రాంతం యొక్క నిబంధనకు లోబడి ఉండాలి. తలసరి పెట్టుబడి, స్వయంగా పెట్టే పెట్టుబడి , వ్యతిరేక చిట్టా, సరికొత్త పరిశ్రమ అయి ఉండాలి. (ప్ర) ‘ఇడిపి’ శిక్షణ తప్పనిసరియా? (జ) బ్యాంకు రుణములోని మొదటి వాయిదా ఇన్ స్టాల్మెంట్ విడుదల చేయుటకు ముందు లబ్ధిదారునకు 2-3 మూడు వారములు ‘ఇడిపి’ శిక్షణ తప్పనిసరి. (ప్ర) రూల్స్ ప్రకారం కొల్లేటరల్ సెక్యురిటి అవసరమా? (జ) ‘ఆర్ బి ఐ’ గైడ్ లైన్స్ ప్రకారం 5లక్షల ప్రాజెక్టుకు ‘పి యమ్ ఇ జి పి’ రుణాలలో కొల్లేటరల్ సెక్యూరిటి అవసరం లేదు. 5లక్షలు దాటి మరియు 25 లక్షలకు లోబడి ఉన్న ప్రాజెక్టుకు ‘పి యమ్ ఇ జి పి’ లో ‘సి జి టి యస్ యమ్ ఇ’ కొల్లేటరల్ గ్యారంటీ ఇచ్చును. (ప్ర) ప్రాజెక్టు కొరకు సన్నధం అవుతున్న లబ్దిదారునికి ఉన్న హెల్ప్ లైన్ ఏది? జ) లబ్దిదారులకు ముఖ్యంగా ప్రాజెక్టు రిపోర్ట్స్ తయారు చేయుటలో మార్గదర్శకంగా ‘కె వి ఐ సి’, 73 ‘ఆర్ ఐ సి యస్ సెల్స్’ ను ఏర్పాటు చేసారు. దీని చిరునామా మా వెబ్ సైట్ www.pmegp.in లో గాని లేదా www.kvic.org.inలో గాని చూడవచ్చును. ప్ర ) వ్యవస్ధాపకుడు ఒకటికి మించి ప్రాజెక్టులను సమర్పించవచ్చునా ? జ) ఎక్కువ మంది లబ్దిదారులకు సహయపడుటకు వీలుగా ‘పి యమ్ ఇ జి వి’ క్రింద ఒక కుటుంబం ఒక యూనిట్ మాత్రమే ఏర్పాటు చేయవచ్చును. ప్ర ) కుటుంబం యోక్క నిర్వచనం ఏమిటి? జ) భర్త మరియు భార్య. ప్ర ) యూనిట్ ను పట్టణ ప్రాంతాములో పెట్టవచ్చునా? జ) ‘డి ఐ సి’ ద్వారా పెట్టవచ్చును. ప్ర ) అప్పటికే ఉన్న ఒక యూనిట్ ‘పి యమ్ ఇ జి వి’ ద్వారా ఆర్థిక సహయం పోందవచ్చునా? జ) లేదు , కేవలం కొత్త యూనిట్ మాత్రమే. ప్ర ) ‘కె వి ఐ సి’లో నమూనా ప్రాజెక్టులు ఏమైనా లభిస్తాయా? జ) అవును. www.pmegp.inలో ఈ వివరాలు లభిస్తాయి. ప్ర ) ‘ఇడిపి’ తీసుకొనుటకు శిక్షణా కేంద్రాలు ఎచ్చట గలవు? జాబితా జ) శిక్షణా కేంద్రాల జాబితా, మా వెబ్ సైట్ www.pmegp.inలో దొరుకుతుంది. ప్ర ) ప్రభుత్వ రాయితీకి లాకిన్ పీరీయడ్ ఎంత? జ) 3 సంవత్సరములు ప్ర) ప్రాజెక్టు కొరకు రెండు వేర్వేరు మూలముల నుండి (బ్యాంకు/ఆర్థిక సంస్థలు) పెట్టుబడిని పొందవచ్చునా? జ) లేదు. అర్హత లేదు ప్ర ) సొంత పెట్టుబడిని ఎంత పెట్టవలెను? ‘పి యమ్ ఇ జి పి’ కింద లబ్దిదారుని కేటగిరీలు లబ్దిదారుని పెట్టుబడి (ప్రాజెక్టు ఖరీదులో ) సాధారణ వర్గము 10 % ప్రత్యేకమైన వర్గము (యస్.సి./యస్.టి./ ఓ.బి.సి./ మైనారిటీలు/ మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్/వికలాంగులు/ఈశాన్య ప్రాంతం/కొండ మరియు సరిహద్దు ప్రాంతాలు మొదలైనవారు) 5% ఖాదీ మరియు గ్రామ పరిశ్రమ కొరకు గ్రామ పరిశ్రమ క్లస్టర్ (సమూహం) గ్రామీణ పారిశ్రామిక సేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) అభివృద్ధి కార్యక్రమము లక్ష్యాలు క్లస్టర్ లోని ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కార్యక్రమాల పురోగమన, తిరోగమన అనుసంధానాన్ని అందించుట. ముడిసరుకుమద్దతును , నైపుణ్యాల పెంపు, శిక్షణ, నాణ్యతా నియంత్రణ, పరీక్షించే సౌకర్యాలు, వాణిజ్య పెంపుదల, నమూనా రూపకల్పన మరియు ఉత్పత్తి అభివృద్ధి వంటి సేవలను అందిస్తూ గ్రామీణ క్లస్టర్లను బలోపేతం చేయడం. పథకం గ్రామీణ పారిశ్రామిక సేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) అనేది ఉమ్మడి సౌలభ్య విభాగం. మౌలిక సదుపాయాలకు మద్దతుతోబాటు గ్రామీణ పరిశ్రమల ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచడం, నైపుణ్యాలను అభివృద్ధి పరచడం, వర్తకాన్ని పెంచడం వంటి స్థానిక విభాగాలకు అవసరమైన సేవలను అందించడం అనేది దీని ఉద్దేశం. ఈ క్రింది సేవలను తప్పని సరిగా గ్రామీణ పారిశ్రావిుక సేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) చేయాలి. అవి ఏమిటంటేః తయారైన ఉత్పత్తులను పరీక్షించి నాణ్యమైన ఉత్పత్తులను పొందడానికి ప్రయోగశాలను ఏర్పరచడం. ఉమ్మడి వినియోగ సౌకర్యాలతో యంత్రాలను/పరికరాలను మెరుగు పరచి దగ్గరలో ఉన్న విభాగాలు/ వృత్తి నిపుణత గల వారితో ఉత్పాదక సామర్ధ్యాన్ని లేదా అదనపు విలువ గల ఉత్పత్తిని పొందడం. ఆకర్షణీయమైన, తగినవిధమైన ప్యాకజి సౌకర్యాలతోను, స్థానిక విభాగాల/వృత్తి నిపుణత గల వారితో ఉత్పత్తులకు మెరుగైన వర్తకాన్ని అందించడం. పైన తెల్పిన సౌకర్యాలతో బాటు గ్రామీణ పారిశ్రామిక సేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) క్రింది సేవలను కూడ అందిస్తుంది. అవిః చేతి వృత్తి పనివారి సంపాదనను ఎక్కువ చేసుకోవడానికి, వారి నైపుణ్యాన్నిపెంచడం కోసం శిక్షణా సౌకర్యాన్ని అందించడం. నిపుణుల సలహా మేరకు/సంస్థల ద్వారా గ్రామీణ తయారీ విభాగాల అదనపు విలువల కొరకు కొత్త నమూనా రూపకల్పనలేదా కొత్త ఉత్పత్తి, వైవిధ్యమైన ఉత్పత్తిని అందించడం. తగిన కాలంలో కొనుగోలు చేసిన వాటిపై ప్రధానంగా ఆధారపడి ముడి సరుకునకు సహకారం అందించడం. ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేయడం. అమలు చేసే సంస్థలు ఖాదీ గ్రామీణ పరిశ్రమ కేంద్రం (కెవిఐసి), రాష్ట్ర స్థాయి ఖాదీ గ్రామీణ పరిశ్రమ బ్లాకులు (కెవిఐబిసి) జాతీయ స్థాయి/రాష్ట్ర స్థాయి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కూటమి ఖాదీ గ్రామీణ పరిశ్రమ కేంద్రం(కెవిఐసి), రాష్ట్ర స్థాయి ఖాదీ గ్రామీణ పరిశ్రమ బ్లాకుల(కెవిఐబిసి) నుండి ఆమోదింపబడిన ఖాదీమరియు గ్రామీణపరిశ్రమ సంస్థలు వ్యతిరేక జాబితా నుండి వేరుపరచబడిన కెవిఐసి కి కనీసంమూడు పథకాలకు రాష్ట్ర మంత్రిత్వ శాఖ/కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్ధికతోడ్పాటు. గ్రామీణ వృత్తి నిపుణులు చేసే కార్యకలాపాల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలు, సి.ఎ.పి.ఆర్.టి, ఎన్.ఎ.బి.ఎ.ఆర్ డి (నాబార్డ్), యు. ఎన్ సంస్థలు అమలుచేస్తున్నవి. ఆర్ ఐ ఎస్ సి - (గ్రామీణ పరిశ్రమల సేవా కేంద్రం) క్రింద పనిచేస్తున్న పరిశ్రమలు ఖాదీ మరియు (బహుళ) వస్త్రాల తదుపరి నేతకు అదనపు విలువతోగల సౌకర్యాలు మూలికా ఉత్పత్తులుః సౌందర్య సాధానాలు,ఔషధాలు వంట నూనెలు, డిటర్జెంట్లు,సబ్బులు తేనె చేతి తయారీ కాగితం వంట ప్రక్రియలు జీవ సంబంధిత ఎరువులు/జీవ సంబంధిత తెగుళ్ళ మందులు/జీవసంబంధిత సేంద్రియ ఎరువులు కుమ్మరిపని తోలుపరిశ్రమ కట్టెపని | వడ్రంగి పని వ్యతిరేకజాబితాలోఉన్నవి తప్ప ఇతర గ్రామీణ పరిశ్రమలన్నియును ఆర్ధిక విధానం 1. రూ||లు 25.00 లక్షల వరకు చేయ గల్గే కార్యక్రమాలు ఈశాన్య (ఎన్ఇ) రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు అ. కె.వి.ఐ.సి (ఖాదీ గ్రామీణపరిశ్రమల కేంద్రం) భాగస్వామ్యం 80 శాతం 75 శాతం ఆ. స్వయం సహాయం 20 శాతం 25 శాతం 2. రూ||లు 5.00 లక్షల వరకు చేయగల్గు కార్యక్రమాలు ఆర్దిక విధానం ఈశాన్య (ఎన్ఇ) రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు అ. కెవిఐసి (ఖాదీ గ్రామీణ పరిశ్రమల కేంద్రం) భాగ స్వామ్యం 90 శాతం 75 శాతం ఆ. స్వయం సహాయం/బ్యాంకు నుండి ఋణం/ఆర్ధిక సంస్థలు 10 శాతం 25 శాతం ఈశాన్య రాష్ట్రాలలోఖాదీ- గ్రామ పరిశ్రమ క్లస్టర్ పథకమునకు ఖర్చులో 90 శాతాన్ని , గరిష్టంగా రూ||లు 5.00లక్షల మేరకు అందజేస్తుంది. ఆర్ధిక తోడ్పాటుకు నిబంధనలు రూ||లు 25.00 లక్షల వరకు గల కార్యక్రమాలు 1 నైపుణ్యాల పెంపు, శిక్షణ మరియు /లేదా ఉత్పత్తి జాబితా(శిక్షణా నైపుణ్యముల పెంపుదల మొదలగు వాటిని ముందుగానే అందించడం) ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 5 శాతం 2 పూర్వ నిర్వహణ, ఏర్పాటైన తర్వాత ఖర్చులు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 5 శాతం 3 భవనానికి/మౌలిక సదుపాయాలకు(ఈ కార్యక్రమాలను అమలుపరచే సంస్థకు స్వంత భూమి ఉండాలి. ఒకవేళ అమలుచేసే సంస్థకు స్వంతభవనం సిద్ధంగా ఉంటేగనుక ప్రోజెక్ట్ వ్యయంలో15 శాతం మేరకు పరిమితమౌతుంది) సముచితమైన అధికారికంగా ఉన్న అంశానికి విలువకడ్తుంది. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 15 శాతం 4 కర్మాగారం (ప్లాంట్), యంత్ర నిర్మాణాల తయారి మరియు లేదా వాటిని పరీక్షించే సౌలభ్యాలు, ప్యాకేజి (సమాఖ్య/ కూటమి(ఫెడరేషన్)తో ఆమోదింపబడిన అమ్మకపు సంఖ్య తో తగిన విధంగా నమోదు చేసుకున్న ఒప్పందాన్ననుసరించి యంత్ర నిర్మాణానికయ్యే వ్యయమునకగు సొమ్మును నేరుగా యంత్ర తయారీదారునికి/ సరఫరాదారునికి విడుదల చేయడం. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 50 శాతం 5 ముడి సరుకు/కొత్త నమూనా రూపకల్పన, వైవిధ్యమైన ఉత్పత్తి మొదలగునవి. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 25 శాతం (భూమి ధర కూడ ప్రాజెక్ట్ వ్యయం లో ఉంది.) 2. రూ||లు 5.00 లక్షల వరకు గల కార్యక్రమాలు ఆర్ధిక తోడ్పాటు కొరకు నిబంధనలు క్రింద నివ్వబడ్డాయిః 1 భవనం/మౌలిక సదుపాయం ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్ట పరిమితి15 శాతం 2 కర్మాగారం(ప్లాంట్),యంత్ర నిర్మాణాల తయారి కొరకు మరియు వాటిని పరీక్షించడానికి ,పేకేజికి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్ట పరిమితి 50 శాతం 3 ముడి సరుకు/కొత్త నమూన, వైవిధ్యమైన ఉత్పత్తి, మొదలగున్నవి. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్ట పరిమితి 25 శాతం 4 నైపుణ్యాల పెంపు, శిక్షణ మరియు/ లేదా ఉత్పత్తి జాబితా ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్ట పరిమితి10 శాతం అయినప్పటికినీ, అవసరమగు వాటిపై ఆధారపడి అ,ఇ,ఈ ల వ్యయాన్ని తగ్గించవచ్చును. ఆర్ధిక తోడ్పాటుకి కార్య విధానం 1. రూ||లు 25లక్షల మేరకు రాష్ట్ర స్థాయి/డివిజన్ కార్యాలయాలలో చేసే కార్యక్రమాల మూల్యాంకన కమిటి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు గ్రామీణ పారిశ్రావిుక సేవా కేంద్రానికి రూ||లు 25 లక్షలవరకు సునిశిత పరిశీలన చేయడం, రాష్ట్ర / డివిజన్ స్థాయిలో ఏర్పరచబడిన కమిటి సూచనల ప్రకారం కింద సూచించబడిన సభ్యులు ఉండాలి 1) రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిసంచాలకులు(పరిశ్రమ) లేదా అదనపు సంచాలకుల హొదాకు తక్కువ గాకుండ ఉన్న ఆయన యొక్క ప్రతినిధి. సభ్యుడు 2) రాష్ట్ర ఖాది-గ్రామీణ పరిశ్రమ సంబంధిత ముఖ్య కార్యనిర్వహణాధికారి. సభ్యుడు 3) రాష్ట్ర/డివిజన్ లో ఆధిపత్యం వహించే బ్యాంకు ప్రతినిధి. సభ్యుడు 4) నాబార్డ్ (ఎన్ఎ బిఎఆర్ డి) ప్రతినిధి. సభ్యుడు 5) వార్షికాధాయం అధికంగా గల ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ కార్యదర్శి సభ్యుడు 6) ఎస్.మరియు టి(ఇంటర్ ఫేస్ )లో లేదా రాష్ట్రానికి దగ్గరైన ప్రతినిధి సభ్యడు 7) ఖాదీ గ్రామీణ పరిశ్రవుకేంద్ర రాష్ట్ర సంచాలకులు సభ్యడు నిబంధనలు-నిర్దేశితాలుః 1. సంస్థ యొక్క అమలుపరచే సమర్ధతను కమిటి మూల్యాంకనం చేయడం. 2. పథకానికి గల వ్యాపారసత్తా మరియు సాంకేతిక నైపుణ్యతను కమిటీ మదింపు చేయడం. 3. గ్రామీణ పారిశ్రామిక సేవాకేంద్రం లో గలకార్యక్రమాన్ని మూల్యాంకనంతోబాటు పర్యవేక్షణ చేయడం. సాంకేతికానుకూలత కెవిఐసి/ఇంజనీరింగ్ కళాశాల/వ్యవసాయ కళాశాల, విశ్వవిద్యాలయం/పాలిటెక్నిక్ యొక్క టెక్నికల్ ఇంటర్ఫేస్ను అధ్యయనంచేసి ప్రాజెక్ట్ కు అనుకూలతను తెలుసుకోవడం. పూర్వ నిర్వహణ ఖర్చులు లేదా నిపుణుని తో తగిన సాంకేతికమైన విశ్వసనీయనిదర్శనాలు కూడ సాంకేతికతానుకూలతకయ్యే వ్యయంలోని అధ్యయనంలో కలిసి ఉంటాయి. పై అధికారులచే ఇవ్వబడిన అనుమతి విధానం ఒకసారి పథకానికయ్యే రూ. 25.00 లక్షల వరకు సాంకేతికంగా ధరను అంచనావేసి, రాష్ట్ర స్థాయి అధికారిక ధరనిర్ణేత కమిటి యొక్క వ్యాఖ్యానాలు వ్రాస్తే, రాష్ట్ర సంచాలకులు తన వివరణలతో కూడిన నివేదికలను అదే విధంగా వ్రాసి ప్రధాన కార్యాలయంలోని సంబంధిత కార్యక్రమ సంచాలకులకు పంపిస్తారు. ఆయన అదే దానిని ఖాదీ రాష్ట్ర ఆర్ధిక కార్పొరేషన్ లేదా గ్రామీణ పరిశ్రమకు పంపిస్తారు. నిధుల విడుదల కమీషన్ మూడు సమానమైన విడతలుగా నిధులను విడుదల చేస్తుంది. ఈనిధులు వినియోగమైన తర్వాత, ప్రాజెక్ట్ అనుమతినొందిన మొత్తానికి సంస్థ తన వంతు సహాయాన్ని చేస్తుంది. 1 నైపుణ్యాల పెంపు, శిక్షణ మరియు /లేదా ఉత్పత్తి జాబితా. పథకంయొక్క సిబ్బందికి నిర్వహణ కొరకు సంస్థకు కావలసిన / స్వయంగా రూపొందించడానికి వీలుగా ఉత్పత్తి జాబితామొదలగు వాటికొరకు శిక్షణను ఇవ్వడం. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 శాతం 2 పూర్వ నిర్వహణ, ఏర్పాటైన తర్వాత ఖర్చులు ఇవ్వడం. ఆయ్యే ఖర్చులలో ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేయడం మొదలగు వాటికి చిల్లరఖర్చులకు, రాకపోకలకు, ఇతర ఖర్చులకు మొ|| వాటికి సంస్థ తాను స్వంతంగా ఖర్చు చేస్తుంది. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 5 శాతం 3 భవనానికి/మౌలిక సదుపాయాలకు (ఈ కార్యక్రమాలను అమలుపరచే సంస్థకు స్వంత భూమి ఉండాలి.ఒకవేళ అమలుచేసే సంస్థకు స్వంతభవనం సిద్ధంగా ఉంటేగనుక ప్రోజెక్ట్ వ్యయంలో15 శాతంమేరకు పరిమితమౌతుంది) సముచితమైన అధికారికంగా ఉన్న అంశానికి విలువకడ్తుంది. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 15 శాతం 4 కర్మాగారం (ప్లాంట్), యంత్ర నిర్మాణాల తయారి మరియు లేదా వాటిని పరీక్షించే సౌలభ్యాలు, ప్యాకేజి (సమాఖ్య/ కూటమి (ఫెడరేషన్) తో ఆమోదింపబడిన అమ్మకపు సంఖ్య తోతగిన విధంగా నమోదుచేసుకున్న ఒప్పందాన్ననుసరించి యంత్ర నిర్మాణానికయ్యే వ్యయమున కగు సొమ్మును నేరుగా యంత్ర తయారీదారునికి/ సరఫరాదారునికి విడుదల చేయడం. ప్రాజెక్ట్ వ్యయంలో కనిష్టంగా 50 శాతం 5 ముడి సరుకు/కొత్త నమూనా రూపకల్పన,వైవిధ్యమైన ఉత్పత్తి మొదలగునవి. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 25 శాతం సూచన రాష్ట్ర/డివిజన్ లలో అంచనా చేసేకమిటీ సలహా మేరకు అసాధారణ విషయాలలో తప్ప ప్రాజెక్ట్ వ్యయంలో ఇచ్చేశాతాలలో(1)నుండి(4)వరకు పరస్పర మార్పులకు సమ్మతిస్తుంది. క్షేత్రాధికారి తనిఖీచేసి ఎంతవరకుసాధ్యమైనదో వ్రాసిన నివేదికాధారంగా మొదటి విడత విడుదలౌతుంది.రాష్ట్ర/డివిజన్ కార్యాలయ క్షేత్రాధికారి వినియోగ ధృవీకరణ పత్రాన్ని తనిఖీ చేసి, రాష్ట్ర/డివిజినల్ సంచాలకులు సంతృప్తి చెందిన పిమ్మటనే మలి విడత నిధులు విడుదలౌతాయి. అమలు ప్రతిపాదనలు గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం(ఆర్ ఐఎస్సి)ఏర్పాటు ఉద్దేశమేమిటంటే వృత్తి నైపుణ్యత గలవారికి భద్రతను కల్పించడం/గ్రామ పరిశ్రమ విభాగాలు లబ్ధి పొందడానికి 125గురికన్నా తక్కువగాకుండా వ్యక్తిగతంగా వృత్తినిపుణులు లేదా 25అర్ఇజిపివిభాగాలు/ గ్రామీణ పరిశ్రమ సంస్థలు/ సంఘాల పథకాల కొరకు రూ. 25.00లక్షల వరకు ప్రతిపాదనలు చేయడం. గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం(ఆర్ ఐఎస్సి)ఏర్పాటు చేసే ప్రదేశం అమలు పరచే సంస్థ / వ్యవస్థకు తప్పనిసరిగా స్వంతమైనదై ఉండాలి. ఆరు నెలల కాల వ్యవధిలోనే ప్రాజెక్ట్ ను ఏర్పరచాలి. గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం(ఆర్ ఐఎస్సి) ఏర్పాటు చేసే సంస్థకు అమలు పరచడానికి సూచించే కార్యాచరణ ప్రణాళికతోబాటు పైన తెల్పిన మార్గదర్శకాలతో కూడిన సాంకేతికానుకూలతను సమర్పించిన తదుపరి ఈ నివేదికను అంగీకర యోగ్యతకై రాష్ట్రస్థాయి కమిటి ముందు పెట్టడం. నిర్ణీత కాల వ్యవధిలో జరిగే పని పురోగతి నివేదిక అందిన దానిపై ఆధారపడి, పథక కార్యక్రమాలాధారంగా నిర్దిష్ట కాలంలో రూపొందించిన ప్రణాళిక నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్ పూర్తవడం ఆధారంగా రాష్ట్ర / డివిజినల్ సంచాలకుల నుండి నిధులు విడుదలౌతాయి. రాష్ట్ర/ ఎక్కడైతే ప్రాజెక్ట్ ఏర్పాటయిందో అక్కడి రాష్ట్రానికి సంబంధించిన డివిజినల్ సంచాలకుల పర్యవేక్షణ, మూల్యాంకనం, నిర్ణీతకాలంలో ప్రాజెక్ట్ పూర్తవుతున్న విషయాన్ని గమనించాలి. ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీద్వారా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర/డివిజినల్ సంచాలకులు, కేంద్ర కార్యాలయకమీషన్ ¸యొక్క సంబంధిత పారిశ్రామిక కార్యక్రమ సంచాలకులకు తెలియజేయాలి. పర్యవేక్షణ రాష్ట్ర / డివిజినల్ కమీషన్ కార్యాలయం గ్రామీణ పరిశ్రమ సేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) ప్రతిపాదనలననుసరించి, నిర్ణీత కాలవ్యవధులలో ప్రాజెక్ట్ కార్యకలాపాలను తనిఖీ చేస్తుంది. పరిశ్రమ / సంబంధిత కార్యక్రమ సంచాలకులు ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో ఏర్పడి, ఆచరణ కొచ్చేసమయానికి తనిఖీ చేస్తారు. ప్రోజెక్ట్ ఏర్పడి కార్యక్రమాలు చేపట్టి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత గ్రామీణ పారిశ్రామిక కేంద్ర సంచాలకులు భౌతికంగాపరిశీలన చేస్తారు. 2. అధికారికంగా అనుమతి పొందిన రూ. 5.00 లక్షల వరకు చేసే కార్యక్రమాలు గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) ప్రతిపాదనలతో ఏర్పడిన ప్రాజెక్ట్ రూ. 5.00 లక్షలవరకు అంచనా వేసి అమలుచేయడంలో రాష్ట్ర/ప్రాంతీయ స్థాయిలలో కమిటీ వేసి కింది పట్టికలో ఉన్న విధంగా సభ్యులను చేరుస్తుంది. 1) రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిసంచాలకులు(పరిశ్రమ) లేదా అదనపు సంచాలకుల హొదాకు తక్కువ గాకుండా ఉండే ఆయన యొక్క ప్రతినిధి. సభ్యుడు 2) రాష్ట్ర ఖాది-గ్రామీణ పరిశ్రమ సంబంధిత ముఖ్య కార్యనిర్వహణాధికారి. సభ్యుడు 3) రాష్ట్ర/డివిజన్ లో ఆధిపత్యం వహించే బ్యాంకు ప్రతినిధి. సభ్యుడు 4) నాబార్డ్ (ఎన్ఎ బిఎఆర్ డి) ప్రతినిధి. సభ్యుడు 5) రాష్ట్రంలో గల వార్షికాదాయం అధికంగా ఉన్న ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ కార్యదర్శి సభ్యుడు 6) ఖాదీ గ్రామీణ పరిశ్రవుకేంద్ర రాష్ట్ర సంచాలకులు సభ్యడు నిబంధనలు-నిర్దేశితాలుః సంస్థ యొక్క అమలుపరచే సమర్ధతను కమిటి మూల్యాంకనం చేయడం. పథకానికి గల వ్యాపారసత్తా మరియు సాంకేతిక నైపుణ్యతను కమిటీ మదింపు చేయడం. రూ. 5.00 లక్షల మేరకు ప్రాజెక్ట్ అనుమతి పొందడం. గ్రామీణపారిశ్రామిక సేవాకేంద్రంలో గలకార్యక్రమాన్ని మూల్యాంకనంతోబాటు జరిగే పనిని పర్యవేక్షణ చేయడం. నిధుల విడుదల గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి)ఏర్పాటు ఉద్దేశమేమిటంటే చేతి వృత్తి నిపుణులు/గ్రామ పరిశ్రమ విభాగాలు 25గురి కన్నా తక్కువగాకుండా వ్యక్తిగతంగా వృత్తినిపుణులు లేదా 5 అర్ఇజిపి (గ్రామీణ ఉపాధిహామీ కార్యక్రమ )విభాగాలు/ గ్రామీణ పరిశ్రమ సంస్థలు/ సంఘాల యొక్క పథకాల కొరకు రూ. 5.00 లక్షల వరకు ప్రతిపాదనలు చేయడం. గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం(ఆర్ ఐఎస్సి)ఏర్పాటు చేసే ప్రదేశం అమలు పరచే సంస్థ / వ్యవస్థకు తప్పనిసరిగా స్వంతమైనదై ఉండాలి. ఆరు నెలల కాల వ్యవధిలోనే ప్రోజెక్ట్ను ఏర్పరచాలి. గ్రామీణ పరిశ్రమసేవా కేంద్రం (ఆర్ ఐ ఎస్ సి) ఏర్పాటు చేసే సంస్థకు అమలు పరచడానికి సూచించే కార్యాచరణ ప్రణాళిక, రాష్ట్ర/ప్రాంతీయ సంచాలకులు సాంకేతికానుకూలతపై జరిపిన పరిశీలనను సమర్పించిన తదుపరి ఈ నివేదికను అంగీకార యోగ్యతకై రాష్ట్రస్థాయి కమిటి ముందు పెట్టడం. సాంకేతికానుకూలతపై జరిపే పరిశీలననుడివిజినల్ పరిశ్రమల కేంద్రం లేదా రాష్ట్ర కార్యాలయం లేదా రాష్ట్ర బోర్డు కూడ నిర్వహించవచ్చు. నిర్ణీత కాల వ్యవధి లో జరిగే పని పురోగతి నివేదిక అందిన దానిపై ఆధారపడి, పథక కార్యక్రమాలాధారంగా నిర్దిష్ట కాలంలో రూపొందించిన ప్రణాళిక, నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్ పూర్తవడం ఆధారంగా రాష్ట్ర / ప్రాంతీయ సంచాలకుల నుండి నిధులు విడుదలౌతాయి. రాష్ట్ర/ ఎక్కడైతే ప్రాజెక్ట్ ఏర్పాటయిందో అక్కడి రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ సంచాలకుల పర్యవేక్షణ, మూల్యాంకనంతోబాటు నిర్ణీతకాలంలో ప్రోజెక్ట్ పూర్తవుతున్న విషయాన్ని గమనించాలి. ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీద్వారా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర/ప్రాంతీయ సంచాలకులు, కేంద్ర కార్యాలయ కమీషన్ ¸యొక్క సంబంధిత పారిశ్రామిక కార్యక్రమ సంచాలకులకు తెలియజేయాలి. కార్యక్రమం అమలు చేయడంలో దశలు( రూ. 5 నుండి 25 లక్షల వరకు గల కార్యక్రమాలు) క్లస్టర్ ను గుర్తించడం. క్లస్టర్ అభివృద్ధి ఏజెన్సీని ఎంపిక చేయడం. నిపుణునితోగాని నిపుణత్వంగల ఏజెన్సీతోగాని సాంకేతికానుకూలతను తెలుసుకోవడం. పథక రూపకల్పన. పథకం ఆమోదింపబడడం, నిధులు విడుదల చేయడం. పర్యవేక్షణ మరియు మూల్యాంకనం. అగ్రిక్లినిక్స్ (వ్యవసాయ ఆసుపత్రులు) మరియు అగ్రిబిజినెస్ సెంటర్ (వ్యవసాయ వాణిజ్య కేంద్రాలు) పథకం పథకం గురించి : మన దేశంలో ప్రతి ఒక్క రైతుకు మేలైన సాగు పద్ధతులు తెలియచేయటానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నాబార్డ్ మరియు మేనేజ్ సంస్ధల సహకారంతో, ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో ఉన్న వ్యవసాయ పట్టభద్రుల నిపుణతను సమర్ధవంతంగా వినియోగించుకోవటమే ఈ పథక ధ్యేయం. ఈ వ్యవసాయ పట్టభద్రులు వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి అప్పుడే ఉత్తీర్ణులైన వారు లేదా ప్రస్తుతం ఏదైనా ఉద్యోగంలో ఉన్నవారైనా, లేనివారైనా – ఎవరైనా తమ సొంత అగ్రిక్లినిక్ లేదా అగ్రిబిజినెస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకొని అసంఖ్యాకంగా ఉన్న మన రైతులకు వృత్తిపరమైన క్షేత్ర విస్తరణ సేవలు అందించవచ్చు. ఈ పథకంపట్ల నిబద్ధతతో, ప్రభుత్వం వ్యవసాయ మరియు సంబంథిత సబ్జెక్టులు అంటే ఉద్యానవన పెంపకం (హార్టికల్చర్), పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్), పశువైద్య విజ్ఞానం అటవీ శాస్త్రం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం మరియు చేపల పెంపకం తదితర అంశాలలో పట్టాపొందిన పట్టభధ్రులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వ్యవసాయ పెట్టుబడి పెట్టడానికి వీలుగా ప్రత్యేక ప్రారంభ ఋణ సదుపాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యోద్ధేశ్యం : ప్రభుత్వ క్షేత్ర విస్తరణ పనులకు తోడ్పాటు నందించుట. అవసరం ఉన్న రైతులకు సాగు సరఫరా మరియు సేవలు అందించే వారి సమాచారం అందుబాటులో ఉంచటం. వ్యవసాయ రంగంలో ఉత్పన్నమవుతున్న కొత్త అంశాలలో వ్యవసాయ పట్టభధ్రులకు లాభదాయకమైన ఉద్యోగావకాశాలను కల్పించుట. భావన (కాన్ సెప్ట్) : అగ్రిక్లినిక్స్: పంటల / పశువుల ఉత్పాదకతను పెంచడానికి, మెరుగైన సాగు పద్దతులు, సాంకేతిక బదలాయింపు, తెగులు మరియు వ్యాధుల నుండి పంటల పరిరక్షణ, మార్కెట్ ధోరణి, మార్కెట్ లో వివిధ పంటల ధరలు మరియు పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై నాణ్యమైన సేవలు మరియు సలహాలు అందించటమే లక్ష్యంగా అగ్రిక్లినిక్స్ ఏర్పాటు చేశారు. అగ్రిబిజినెస్ సెంటర్లు : రైతులకు కావలసిన సాగు సరఫరా, అద్దెకు సాగు పనిముట్లు తదితర ఇతర సేవలు అందించటానికి అగ్రి బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేయటానికి వీలుగా ఈ వ్యవసాయ పట్టభద్రులు అగ్రిక్లినిక్స్ లేదా అగ్రిబిజినెస్ సెంటర్లు నిర్వహణతో పాటు వ్యవసాయం లేదా సంబంధిత అంశాలలో పనులను చేపట్టవచ్చు. అర్హత : ఈ పథకంకు వ్యవసాయం లేదా సంబంధిత విషయాలు అంటే ఉద్యానవన పెంపకం, పట్టు పురుగుల పెంపకం, పశు నిర్వహణ, అటవీ శాస్త్రం, పాడి పశువుల పెంపకం, పశువైద్య విజ్ఞానం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, మరియు తదితర అంశాలలో పట్టా పొందిన వ్యవసాయ పట్టభద్రులు / ఇతర పట్టభద్రులు అర్హులు. పథక కార్యక్రమాలు : నేల, నీటి నాణ్యత మరియు సాగు సరఫరాల పరీక్షా ప్రయోగశాలలు (అటామిక్ అబ్జార్షన్ స్పెక్ట్రో ఫోటో మీటర్ తో సహా) తెగులు పరిశీలన, నిర్ధారణ మరియు నియంత్రణ సేవలు నిర్వహణ, మరమ్మతులు మరియు వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలు, అంటే సూక్ష్మ సాగు పద్ధతులు (స్ప్రింక్లర్ మరియు డ్రిప్) తో సహా, అవసరమైనపుడు అద్దెకు తీసుకోవటం. వ్యవసాయ సేవా కేంద్రాలు, పైన ఉదహరించిన మూడు కార్యక్రమాలతో సహా (సామూహిక కార్యక్రమం) విత్తన శుద్థి యూనిట్లు మొక్కల టిష్యూకల్చర్ ప్రయోగశాలల ద్వారా మరియు హార్డెనింగ్ యూనిట్ల ద్వారా సూక్ష్మ వ్యాప్తి వెర్మికల్చర్ (వానపాముల పెంపకం ) యూనిట్ల ఏర్పాటు, జీవ ఎరువులు, జీవ – క్రిమి సంహారకాలు, జీవ నియంత్రణ కారకాల ఉత్పత్తి. తేనెటీగల పెంపక ఏర్పాటు మరియు తేనె మరియు సంబంధిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు. విస్తరణ కార్యకలాపాలలో నిపుణుల సేవల సదుపాయం చేపల పెంపకంలో చేప గుడ్ల సంరక్షణ మరియు చేప పిల్లల ఉత్పత్తి పశువుల ఆరోగ్య సంరక్షణ, శీతలీకరించిన వీర్య (సెమెన్) బ్యాంకులు మరియు లిక్విడ్ నైట్రోజన్ సరఫరాతో కూడిన పశువైద్యశాలలు మరియు సేవల ఏర్పాటు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంబంథిత అనేక పోర్టల్స్ ద్వారా సమాచార సేకరణకు సమాచార సాంకేతిక కేంద్రాలను (కియోస్క్స్) ఏర్పాటు చేయుట పశుదాణా ప్రాసెసింగ్ మరియు పరీక్షా యూనిట్లు విలువ పెంపుదల కేంద్రాలు సాగు క్షేత్ర స్ధాయి నుండి మొదలుకొని పైవరకు సత్సంబంధాల వ్యవస్ధ (cool chain) ను ఏర్పాటు చేయుట (సామూహిక కార్యక్రమము) ప్రాసెస్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులకు చిల్లర దుకాణాలు (రిటైల్ మార్కెటింగ్) ఏర్పాటు చేయుట. పంటలకు కావలసిన సరుకుల సరఫరాకు మరియు వ్యవసాయ ఉత్పత్తులకు గ్రామీణ మార్కెటింగ్ డీలర్ షిప్ లు నెలకొల్పుట. పైన పేర్కొన్న వాటిలో రెండు లేదా అంతకు మించిన కార్యకలాపాలను వ్యవసాయ పట్టభద్రులు తమకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చే ఇతర కార్యకలాపాలతో పాటు ఎంచుకోవచ్చు. ఇటువంటి వాటిని బ్యాంకు అంగీకరిస్తుంది. పథక ఖర్చు & విస్తృతి : వ్యవసాయ పట్టభద్రులు వ్యక్తిగతంగా కాని లేదా ఇతరులతో కలిసి గాని ఈ పథకాన్ని చేపట్టవచ్చు. ఈ పధక ఖర్చు వ్యక్తులకయితే గరిష్టంగా రూ పది లక్షలు, గ్రూపుగా అయితే రూ యాభై లక్షలు, గ్రూపు అంటే సాధారణంగా ఐదుగురు, అందులో ఒకరు యాజమాన్య పట్టభద్రుడు, అంటే అర్హతతో కాని లేదా అనుభవంతో కాని, వ్యాపార అభివృద్ధికి మరియు యాజమాన్యానికి తోడ్పడేవ్యక్తి అయి ఉండాలి. మార్జిన్ మనీ (ముందస్తు చెల్లింపు) : ఆర్ బి ఐ సూచనల ప్రకారం i) రూ,, 10,000 వరకు మార్జిన్ లేదు ii)రూ,, 10,000 పైన పధక ఖర్చులో 15% నుండి 25% వడ్డీ రేట్లు : అప్పు ఇచ్చే బ్యాంకు వడ్డీ రేట్లు ఈ విధంగా ఉంటాయి. అసలు లబ్దిదారుకు వడ్డీ రేటు వ్యాపార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకులు రూ,25,000/- బ్యాంకు నిర్దేశించిన ప్రకారం బ్యాంకు యొక్క పి ఎల్ ఆర్ గరిష్టంగా బ్యాంకు నిర్దేశించిన ప్రకారంగా కనిష్టంగా 12% బ్యాంకు నిర్దేశించిన ప్రకారంగా రూ,25,000/- పైన రూ.2 లక్షల వరకు బ్యాంకు నిర్దేశించిన ప్రకారం బ్యాంకు యొక్క పి ఎల్ ఆర్ గరిష్టంగా బ్యాంకు నిర్దేశించిన ప్రకారంగా కనిష్టంగా 12% బ్యాంకు నిర్దేశించిన ప్రకారంగా రూ. 2 లక్షల పైన బ్యాంకు నిర్దేశించిన ప్రకారం బ్యాంకు నిర్దేశించిన ప్రకారంగా కనిష్టంగా 12% బ్యాంకు నిర్దేశించిన ప్రకారంగా తిరిగి చెల్లింపులు : చేపట్టిన కార్యకలాపాల ఆధారంగా అప్పు తిరిగి చెల్లించే కాలం 5 సంవత్సరాల నుండి పది సంవత్సరాల మధ్య ఉంటుంది. తిరిగి చెల్లింపు కాలం లోనే పొడిగింపుకాలం కూడా (వ్యక్తిగత స్కీము ఆధారంగా అప్పు ఇచ్చే బ్యాంకు దీన్ని నిర్ణయిస్తుంది) గరిష్ఠంగా రెండు సంవత్సరాలు ఉంటుంది. అప్పు తీసుకొనేవారి (ఋణగ్రస్థుల) ఎంపిక ఋణగ్రస్థుల ఎంపిక మరియు పధక అమలు ప్రదేశ ఎంపికలో బ్యాంకులు తమతమ పరిధిలో అవసరమైతే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు /కృషి విజ్ఞాన కేంద్రాలు / రాష్ట్ర వ్యవసాయ శాఖల సహాయంతో నిర్ణయిస్తాయి. మోడల్ పథక వివరాలు : ఈ పథకం గురించి గుర్తింపు పొందిన శిక్షణా సంస్ధల వివరాలు : రాష్ట్రాల వారీగా ఉన్న అగ్రిక్లినిక్స్ వివరాలు. ఆధారము: www.agriclinics.net ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు