పొదుగు వాపు వ్యాధి కావాల్సిన పదార్ధములు: (ఏ) కలబంద-250గ్రా, (బి) పసుపు-50గ్రా, (సి) సున్నం-15గ్రా, (డి) నిమ్మకాయలు-2 ,(ఇ) బెల్లం-100గ్రా. తయారుచేయు విధానము: ఈ పదార్ధములను (ఏ-సి మాత్రం) వేసి, కలిపి, ఎర్రటి పాకం / పేస్టు తయారు చేసుకోవాలి రెండు నిమ్మకాయలను బద్దలుగా కోసి ఉంచాలి. వాడు విధానం: చేతినిండుగా పేస్టు తీసుకొని దానికి 150-200 మీ.లీ. నీరు కలపాలి. పరిశుభ్రమైన నీటితో పొదుగును బాగా రుద్ది కడగాలి. ఈ మిశ్రమాన్ని పొదుగంతా పూర్తిగా రాయాలి. ఇలా రోజుకి 10 సార్లు చొప్పున 5 రోజులు రాయాలి. రెండు నిమ్మకాయలను బద్దలుగా కోసి నోటి దవడలో ఉంచాలి. ఈ విధంగా రోజుకి రెండు సార్లు చొప్పున మూడు రోజులు పెట్టాలి. గమనిక: పాలలో రక్తం కనపడినప్పుడు కరివేపాకు, బెల్లం నూరి పేస్టుగా చేయాలి. ఈ పేస్టు ని రోజుకు రెండు సార్లు తినిపించాలి. చన్నురంధ్రం లో అవరోధం కావాల్సిన పదార్ధములు: అప్పుడే తుంచిన, శుభ్రం చేసిన వేప ఆకు ఈనె, పసుపు వన్నె లేదా నెయ్యి. తయారుచేయు విధానము : చన్ను పొడుగును బట్టి ఈనె పొడుగును కత్తిరించుకోవాలి వెన్న పసుపు కలిపినా మిశ్రమాన్ని వేప ఆకు ఈనె కు బాగా పాటించాలో. వాడు విధానం: వెన్న పసుపు కలిపినా మిశ్రమాన్ని వేప ఆకు ఈనె కు బాగా పటించాలి. వేపాకు ఈనెను మూసుకుపోయిన చన్ను రంధ్రం లోనికి మెల్లగా దుర్చాలి. పాలు పితికిన ప్రతిసారి తాజా ఈనెను చన్ను రంధ్రం లోనికి ప్రవేశపెట్టాలి. పొదుగుకు నీరు దిగుట కావాల్సిన పదార్ధములు: నువ్వులనూనె, పసుపు చేతినిండా, వెల్లుల్లి 2 రెబ్బలు. తయారుచేయు విధానము: నూనెను వేడిచేసి దానిలో పసుపు మరియు తురిమిన వెల్లుల్లిని కలపాలి. బాగా కలుపుతూ వేడి చేయాలి. మరగపెట్ట కూడదు. తర్వాత చల్లారనివ్వాలి. వాడు విధానం: నీరు దిగి వాపు కనబడిన ప్రాంతం మీద మొత్తం పొదుగు మీద బలంగా ఈ మిశ్రమాన్ని వలయాకారంలో రాయాలి. రోజుకి 4 సార్లు చొప్పున 3 రోజులు రాయాలి. గమనిక: ఈ మందు రాసెముందు అది పొదుగు వాపు కాదని నిర్ధారించుకోవాలి. మాయ పడకుండా ఉండుట. కావాల్సిన పదార్ధములు: తెల్ల ముల్లంగి -1 , బెండ కాయ 1 .5 కిలోలు., బెల్లం ఉప్పు. తయారుచేయు విధానము: బెండ కాయని రెండు ముక్కలుగా చేయవలెను. వాడు విధానం : ఈనిన తరువాత 2 గంటల లోపల ఒక ముల్లంగి దుంపను తినిపించాలి. ఈనిన 8 గంటల తర్వాత కూడా మాయ పడకుండా అలానే వుంటే 1.5 కిలోల బెండకాయల్ని , బెల్లం మరియు ఉప్పు తో కలిపి తినిపించాలి. ఈనిన 12 గంటల తర్వాత కూడా మాయ పడకుండా అలానే వుంటే వేలాడే మయమొదలు వద్ద దారంతో కట్టి ఒక ముడి వేసి దానికి 2 ఆంగుళాల దూరంగా కత్తిరించవలెను. కట్టులోపలికి వెళ్ళావిధంగా జాగ్రత్త వహించాలి. అంటిపెట్టుకుని మాయను చేతితో తీసివేయడానికి ప్రయత్నించవద్దు. నాలుగు వరాల పట్టు వారానికి ఒక సరి ఒక పెద్ద ముల్లంగి దుంపను తినిపించాలి. తిరగ పోరుట్ల వాడు విధానం: ఎదుకు వచ్చిన మొదటి లేదా రొండోవ రోజు చికిత్సను ప్రారంభించాలి. అయు పదార్థములను తాజాగా రోజుకి ఒక్కసారి ఈ కింద సూచించిన క్రమంలో బెల్లము, ఉపుతో కలిపి నోటి ధవరా పట్టాలి. తెలు ముల్లంగి రోజుకు ఒక్కటి చప్పున 5 రోజులు. రోజుకు ఒక కలబంద ఆకూ చప్పున 4 రోజలు. రోజుకి 4 గుపిళ్ల చప్పున మునగ ఆకూ 4 రోజలు. రోజుకి 4 గుపిళ్ల చప్పున నలేరు 4 రోజలు. రోజుకి 4 గుపిళ్ల చప్పున కరివేపాకు +పసుపు విశమం 4 రోజలు. మెయ్య కు చికిత్స కావలిసిన పదార్దములు: కలబందగుజ్జు -1 ఆకు చొప్పున, పసుపు -1 ఒక స్పూన్, అత్తిపత్తి ఆకూ -2 చారెళ్ళు. తయారుచేయు విధానము: కలబంద మట్టను చీల్చి గుజ్జును సేకరించాలి. నాలుగైదు సార్లు బాగా కడగాలి. వేరే గిన్నెలో వేసి, 1 లీటర్ నీళ్లు కలిపి, మిక్సీలో వేసి ఆడించాలి. తరవాత 1 స్పూన్ పసుపు కలిపి వేడి చెయాలి. అర లీటరు అయ్యేవరకు మరిగించాలి. అత్తిపత్తి ఆకు పేస్టులా చేసుకోవాలి. వాడు విధానం: మెయ్యను శుభ్ర పరచవలెను. ఆ మిశ్రమాన్ని వడపోసి మెయ్య వచినప్పుడు దాని మీద పిచికారి చెయ్యాలి రాసిన కలబంద మిశ్రమం పిరితిగా ఆరిపోయిన తరవాతనే అతిపతి ఆకూ పేస్ట్ ను రాయాలి. ఈ పక్రియను పరిస్థితి మార్గుయన వరకు కొనిసాగాంచాలి. గాలికంటు వ్యాధి/నోటి పుండ్ల చికిత్స కావలిసిన పదార్దములు: జిలకర-10 గ్రా, వెంతలు - 10 గ్రా, పసుపు -10 గ్రా, వేలులి-4 , కొబారి కాయ-1 , బెల్లం - 120 గ్రా. తయారుచేయు విధానము: జెలికార, వెంతలు, మీరాయలు గింజలను నీటిలో 20 - 30 నిముషాలు. ననుబటాలి. అనేంటిని నూరి పస్తేగా తయారు చెయ్యాలి. ఈ పేస్ట్ కి కోబరి తారమని కలపాలి. ప్రతిసారి ఈ విశమని తాజాగా తయారు చేసుకోవాలి. వాడు విదానం: ఈ పస్తేనే నీటిలోనే, నాలిక మీద ఆంగెటీలను బాగా రాయాలి రోజుకు మూడు సార్లు చొప్పున 3 - 5 రోజలు ఈ పత్ మందిని వాడాలి. గాలికుంటూ వ్యాధి/ కాలి పుండ్లకు చికిత్స కావాల్సిన పదార్ధములు: మూర్కొడం ఆకులు - చారెడు, వెల్లుల్లి -10 రెబ్బలు, వేప ఆకులు - చారెడు, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె -200 మీ.లీ, పసుపు 20 గ్రా, రిటాకుచారెడు, తులసి ఆకులు - చారెడు. తయారుచేయు విధానము: దినుసులు అన్నిటిని బాగా రుబ్బాలి. ఈ మిశ్రమానికి 250 మీ.లీ, ల కొబారి లేదా నువ్వులనూనె కలిపి మరిగించి చల్లార్చాలి. వాడు విధానం : పుండ్లను శుభ్రాంగా కడగాలి. పుండ్లపై మందును రాయాలి. శుభ్రమైన గాజుగుడ్డతో కట్టు కట వచ్చు. ఒక వేళ పుండ్లలో పురుగులు వుంటే మొదటిరోజు కొబారినూనెలో కర్పూరం కలిపి రాస్తే లేదా సీతాఫలం గుజ్జును రాస్తే పురుగులు పోతాయి. తరువాత పై మిశ్రమాన్ని యధావిధిగా ఫుడ్ల పై రాయాలి. జ్వరము కావలిసిన పదార్థములు: వెల్లుల్లి :2 రెబ్బలు , ధనియాలు -10 గ్రా ,జీలకర్ర -10 గ్రా ,తులసి ఒక గుప్పెడు , బిర్యానీ ఆకులు 10గ్రా , మిరియాలు 10గ్రా,తమలపాకులు 5,ఉల్లి 2 ,పసుపు 10గ్రా ,నెలవేము ఆకుల పొడి 20 గ్రా ,సబ్జా ఆకులు చారెడు , వేప ఆకులు చారెడు , బెల్లం 100 గ్రా . తయారుచేయు విధానం: జీలకర్ర , మిరియాలు ,ధనియాలను 15 నిముషాలు నీటిలో నానబెట్టాలి. అన్ని పదార్థాలను మిక్సీలో వేసి ఆడించాలి. ఆ మిశ్ర మాం పేస్టుగా తరవుతుంది. వాడు విధానం: చిన్న మోతాదు లో ప్రొద్దున్న సాయంత్రం తినిపించాలి. పారుడు వ్యాధి : కావలిసిన పదార్థములు: మెంతులు 10 గ్రా ,ఉల్లి-1 ,వెల్లుల్లి -1 రెబ్బ, జీలకర్ర -10 గ్రా ,పసుపు -10 గ్రా ,కరివేపాకు -చారెడు , గసగసాలు -5 గ్రా ,మిరియాలు 10 గ్రా, బెల్లం 100 గ్రా ,ఇంగువ -5 గ్రా. తయారుచేయు విధానం: జిలికార , మెంతులు , గసగసాలు,ఇంగువ , మిరియాలు , పసుపును ముందుగా తీసుకొని వేయించాలి. తరువాత వాటిని నూరాలి. ఆ పేస్టును ఉల్లి, వెల్లుల్లి ,కరివేపాకు , బెల్లంను కలిపి మరల మెత్తగా నూరాలి. వాడు విధానం: ఆ పేస్టును ఉండలుగా చేయాలి . ఈ మిశ్రమాన్ని పశువు దవాడలో ఉంచాలి. ఈ మందును రోజుకి ఒకసారి చొప్పున 1 -3 రోజులు పెట్టాలి . కడుపు ఉబ్బరం అజీర్ణం కావలిసిన పదార్థములు: ఉల్లి 100 గ్రా ,వెల్లుల్లి 10 గ్రా,ఎండు మిరపకాయలు 2 ,జీలకర్ర 10 గ్రా, పసుపు 10 గ్రా ,బెల్లము 100 గ్రా ,మిరియాలు 10 గ్రా,తమలపాకులు 10 గ్రా, అల్లం 100 గ్రా. తయారుచేయు విధము: ముందుగా నల్ల మిరియాలు, జీలకర్రను ఒక గంట సేపు నీటిలో నానబెట్టాలి మిరియాలు, జీలకర్ర , పసుపు మిరపకాయలను మిక్సీలో వేసి ఆడించాలి. తరువాత మిగిలిన పదార్థాలను కలిపి మిక్సీలో ఆడించి పాకం తాయారు చేసుకోవాలి . ఆ పేస్టును 100 గ్రా బెల్లం కలిపి ఉండలుగా చేయాలి. వాడు విధానం: ఆ ఉండాలి మీద ఉప్పును అద్ది, పశువు నాలుక మీద రాయాలి . రోజుకి ఒక పర్యాయం చొప్పున 3 రోజులు వాడాలి. నట్టల నివారణ కావలిసిన పదార్థములు: ఉల్లి 1 , వెల్లుల్లి 5 రెబ్బలు, ఆవాలు 10 గ్రా , వేప ఆకులు - చారెడు, జీలకర్ర 10 గ్రా ,కాకరకాయ -50 గ్రా , పసుపు 5 గ్రా, మిరియాలు 5 గ్రా, అరటి దవ్వ 100 గ్రా , తమ్మి ఆకులు 1 గుప్పెడు , బెల్లము 100 గ్రా. తయారుచేయు విధానము: 30 నిమిషాల పాటు మిరియాలు, జిలికార, ఆవాలు నీటిలో నాన పెట్టవలెను. మిగిలిన పదార్థాలలో కలిపి దీనిని ఒక మిశ్రమం వాలే తాయారు చేయవలెను. వాడు విధానం: ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయవలెను. ఈ పదార్థాన్ని ఉప్పుతో కలిపి రోజుకి ఒకసారి చొప్పున 3 రోజుల పాటు తినిపించ వలెను. జోరీగలు బాహ్య పరాన్నజీవులు కావలిసిన పదార్థములు : వెల్లుల్లి 10 రెబ్బలు ,వేప ఆకు -చారెడు ,వేప పండ్లు -చారెడు, వస/వాడజ 10 గ్రా , పసుపు 20 గ్రా ,పులికంప ఆకులు -చారెడు. తయారుచేయు విధానం : అన్నిన్నిటిని మిక్సీలో వేసి ఆడించాలి. ఒక లీటరు పరిశుభ్రమైన నీటిని కలపాలి. పరిశుభ్రమైన గుడ్డతో గాని ఫిల్టర్ తో గాని వడపోయాలి. స్ప్రే యర్లతో ఆనిసంధానించబడిన సీసాలో ఈ మిశ్రమాన్ని నింపాలి. వాడు విధానం : పశువు శరీరమంతా ఈ మందు పీచికారీ చెయ్యాలి. పశువుల శాలలో,పగుళ్లలోనూ, మూలలలోను కూడా పీచికారీ చేయాలి. ఈ ద్రావకంలో ముంచిన గుడ్డతో కూడా పశువు శరీరం పై రాయవచును . బాహ్య వారన్నా జీవులు నశించు వరకు వారానికి ఒకసారి ఈ మందును పీచికారీ చేయాలి. రోజులో ఎండా కాసే సమయంలో మాత్రమే ఈ విధానాన్ని పాటించవలెను. అమ్మవారి పొక్కులు పురిపిడి కాయలు పగుళ్ళు కావలిసిన పదార్థములు : వెల్లుల్లి -5 రెబ్బలు ,పసుపు 10 గ్రా , జీలకర్ర 15 గ్రా , సబ్జా ఆకులు-చారెడు ,వేప ఆకులు -చారెడు , వెన్న -50 గ్రా. తయారుచేయు విధానము : జీలకర్ర గింజలను 15 నిమిషములు నీటిలో నానబెట్టాలి. పదార్థాలనంటింటిని కలిపి పాకం /పేస్టు చేయాలి. దానికి వెన్నను చేర్చి బాగా కలపాలి. వాడు విధానం : సంబంధిత భాగం పై వీలైనన్ని పర్యాయములు తగ్గే వరకు రాయాలి. చర్మపు ఉపరితలాన్ని పొగిడా చేసి మాత్రమే మందును రాయాలి.