ఉపోద్దాతం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు ఆక్వా ఉత్పత్తులు ప్రధాన పోషకాహారంగా ఉన్నాయి. ఈ ఉత్పత్తుల డిమాండు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము పెరుగుతూ వస్తోంది. ఆక్వా ఉత్పత్తులలో ప్రధానంగా రొయ్యలు సింహ భాగంగా ఉన్నాయి. కానీ గత కొంత కాలంగా రొయ్యలకు వస్తున్న వ్యాధులు వల్ల వాటి ఉత్పత్తిలో అనేక వడిదుడుకులు వస్తున్నాయి. అందువలన ప్రపంచ వ్యాప్తంగా డిమాండు ఉన్న పీతల పెంపకము వైపు ఆక్వా పరిశమ దృష్టి సారించింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న సుమారు 8000 కి.మీ. తీర ప్రాంతం పీతల పెంపకానికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వెనామీ రొయ్యలను తక్కువ సెలినిటీ ఉన్న మంచి నీటిలో పెంచడం, ఆక్కడే మంచి దిగుబడులు రావటంతో తీర ప్రాంతంలో గల అధిక సెలినిటీ ఉన్న ప్రాంతాలు ఖాలీగా ఉన్నాయి. ఈ నీటిలో ప్రత్యామ్నాయ పంటగా అధిక విలువ గల, ఎగుమతి డిమాండు ఉన్న పీతల పెంపకము చాలా లాభదాయకంగా ఉంటుందని రైతులు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ ఆసియా దేశాలైన థాయిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, వియత్నాం, చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాలలో పీతల సాగు చాలా కాలం నుండి సాగవుతోంది. అంతే కాకుండా వారు పీతలను వాటి ఉత్పత్తులను విదేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం మన దేశం నుండి రూ. 400 - 500 కోట్లు విలువగల పీతలు ఎగుమతి అవుతున్నాయి. అపార సహజ వనరులు మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నా మనము పీతల ఉత్పత్తిలో అంతగా ప్రగతి సాధించలేదు. దానికి గల ప్రధాన కారణం నాణ్యమైన పీత పిల్లల లభ్యత లేదు. నేటికి మనం పీతల పెంపకం సాంప్రదాయ పద్ధతిలోనే సాగిస్తున్నాము. మరియు సహజ వనరుల నుండి సేకరించిన పీత పిల్లలను పెంపకానికి ఉపయోగిస్తున్నాము. అంతే కాకుండా వీటి పెంపకము సాంకేతికంగా చేపట్టకపోవడం వలన బ్రతుకుదల, ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలో పీతల పెంపకము 80వ దశకంలో మొదట్లో ప్రారంభమైనది. రైతులు పీతల డిమాండును దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలోని తీర ప్రాంతంలో సుమారుగా 5500 'హెళ్టారులలో పెంచుతున్నారు. మన తీర ప్రాంతంలో మడ అడవులలో పీతల పెంపకానికి అనువుగా ఉన్న ప్రాంతాలలో రైతులు పీతల పెంపకానికి ముందుకొస్తున్నారు. కానీ, సరిపడినంతగా హేచరీ సీడు లభ్యం కాకపోవడం, సాంకేతిక పద్ధతులు అవలంబించకపోవడం వలన బ్రతుకుదల తక్కువగా ఉండటం, పీతల ఫ్యాటనింగ్, మెత్తని పీతల ఉత్పత్తి, బాక్స్‌లలో పెంపకము వంటి నూతన పద్ధతుల మీద సరియైన అవగాహన లేకపోవడం వలన మన రైతులు అధిక ఉత్పత్తులు సాధించలేకపోతున్నారు. పై సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మత్స్యశాఖ గుంటూరు జిల్లా, బాపట్ల మండలంలోని సూర్యలంక నందు హేచరీ ద్వారా పీత పిల్లలను ఉత్పత్తి చేసి వాటిని రైతులకు సరఫరా చేయడానికి సంకల్పించింది. అతి త్వరలో అన్ని అనుమతులు పొంది హేచరీ నిర్మాణం మొదలుకానుంది. పీతల బాహ్య లక్షణాలు - జీవిత చరిత్ర క్రస్టషయన్ తరగతికి చెందిన జలచరాలు అనగా పీతలు, రొయ్యలు, రాతి రొయ్యలు మొదలైన రకాలు చాలా ఆహార ప్రాముఖ్యతను కలిగియున్నవి. ఇవి మన దేశమునకు విదేశీమారక ద్రవ్యార్దనలోనూ, దేశీయ మార్కెట్లోనూ విలువైన రకాలుగా కొనసాగుతున్నవి. ఈ రొయ్యలు, పీతలు మొదలైన రకాలు వీటికి గల మంచి విదేశీ మార్కెట్టు డిమాండును బట్టి దేశము యొక్క ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్రను పొందినవి. ఇది మంచి పౌప్టికాహారంగా విలసిల్లుతూ, పెరుగుతున్నటువంటి జనాభాకు ఆహార మరియు పౌష్టికాహార భద్రతను ఇస్తున్నాయి. ముఖ్యముగా ఆహారంగా ఉపయోగపడుతున్న రకాలలో రొయ్యలు మరియు రాతి రొయ్యలు (లోబ్స్టర్స్) తరువాత పీతలు మూడవ స్థానంలో ఉన్నాయి. పెద్దగా ఉండే పీతలకు డిమాండు మరింత అధికముగా ఉన్నందున వీటి యొక్క వేట అధికముగా చేయుట మరియు సహజవనరులలో వీటి యొక్క సంరక్షణ మరియు సుస్థిరత మీద ప్రత్యేక దృష్టి సారించక పోవుట వలన సహజవనరుల నుండి వేట ద్వారా వచ్చే పీతలు తగ్గిపోతున్నాయి. పీతలలో దాదాపు 800 రకాలు ఉన్నాయి. వీటిలో వాణిజ్యపరంగా ప్రాముఖ్యతను కలిగియున్నటువంటి పీతలు “పోర్చ్యునిడే” కుటుంబానికి చెందినటువంటివి మరియు వీటియొక్క చివరి జత కాళ్ళు పలుచగా అణచబడిన లక్షణం కలిగి తెడ్డు మాదిరిగా ఉండి ఈదుటకు ఉపయోగపడతాయి. ఈ రకానికి చెందినటువంటి పీతలు ఆసియా దేశాలు మరియు ఇండియా నందు మంచి మత్స్య సంపదగా ఉన్నాయి. సముద్రాలు, ఉప్పు నీటి కాలువలు, మడ అడవులు వీటి యొక్క సహజ ఆవాసాలు. పీతలలో సవాల పీతలు, చుక్క పీతలు, శిలువ పీతలు, మండ పీతలు, పసువు లేదా పచ్చ పీతలు వంటి రకాలు కలవు. వీటిలో సవాల పీతలు, చుక్క పీతలు మరియు శిలువ పీతలు లేదా నామాల పీత రకాలు సముద్రపు పీతలు. ఇవి పెంపకానికి పనికిరావు. ఇక పెంపకానికి ఉపయోగపడే రకాలైనటువంటి మండ పీతలు,పసుపు లేదా పచ్చ పీతలు ఉప్పు నీటి కాలువలు, మడ అడవులలో మరియు సముద్ర తీరప్రాంతాలలో దొరుకుతాయి. మ్యాంగ్రూవ్ పీతలు, వ్యవహారికంగా పిలవబడే “స్పిల్లా” అనే జాతికి చెందినవి. ఇవి ఉష్ణమండల మరియు వ ౯ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఈ “సిల్లా” జాతికి చెందిన మండ పీతలు మరియు పసుపు లేదా పచ్చ పీతలు పెద్దవిగా పెరుగుతాయి మరియు వీటి యందు మాంసము అధికముగాను, రుచిగాను, బెషద గుణాలను కలిగి ఉంటాయి. కనుక ఇవి మిగిలిన జాతి పీతలకంటే ప్రథమ స్థానమును ఆక్రమించినవి. ఈ పీతలు వాటి ఆవాసమును విడిచి ఎక్కువ రోజులు జీవించి ఉంటాయి. అందువలన వీటిని బ్రతికి ఉండగానే మార్కెట్టు చేయవచ్చును. ఇవి భారతదేశములో వళశ్చిమ బెంగాల్ నందు గల సుందర్ బన్ మడ అడవుల ప్రాంతమైన హుగ్లీ మట్ల నది ముఖద్వార ప్రాంతమందు, ఒరిస్సా రాష్ట్రములో చిలకా సరస్సు మరియు మహానది ముఖద్వారమందు, తమిళనాడు రాష్టమందు పులికాట్ సరస్సు, కోవలం బ్యాక్ వాటర్స్నందు, కేరళ రాష్ట్రంలో వెంబనాడ్ ఉప్పు టేరులు నందు, కర్నాటక రాష్ట్రములో కాళి నేత్రావతి నదీ ముఖద్వార ప్రాంతములో, గోవా రాష్ట్రంలో మాండవీ నదీ ముఖద్వారనందు, గుజరాత్లో కచ్చ్ మరియు నర్మద, తపతీ నదీ ముఖద్వార ప్రాంతములలో లభ్యమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొస్తే మడ అడవులున్నటు వంటి కృష్ణ, గోదావరి నదీ పాయల ముఖద్వారాల నందు, కోరింగ మడ అడవుల యందు నాగాయలంక మడ అడవులందు ఎక్కువగా లభ్యమవుతాయి. పీతల అవాసము : మండ పీతలు ముఖ్యముగా మడ అడవులలో, ఉప్పు నీటి కయ్యలు మరియు బాకిష్ వాటర్ నందు సహజముగా ఆవాసముంటాయి. వీటి యందు రెండు రకములు కలవు. సిల్లా 'సెరైటా(పచ్చ పీతు, సిల్లా ఒలివేషియా (మండ పీతు. 2005 సం॥ వరకు వీటి యొక్క బాహ్య లక్షణాలను బట్టి నాలుగు రకములు ఉన్నట్టుగా భావించారు. సిల్లా ట్రాంక్విబారికా సిల్లా సెరైటా సిల్లా పారమెమొజైన్ సిల్లా ఒలివేషియా కానీ బాహ్యలక్షణాలు కేవలము అది ఉండేటటువంటి వాతావరణము బట్టి స్వల్చ మార్పులను పొందుతాయి. అందువలన శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానమును అనగా RFLP-PCR, RAPD వంటి పరీక్షలు ద్వారా వాటి జన్యు పదార్థమును పరీక్షించగా కేవలము రెండు రకాలు మాత్రమే ఉన్నట్టుగా నిర్ధారించినారు. అవి సిల్లా సెరైటా మరియు సిల్లా ఒలివేషియా. సిల్లాసెర్రెటా : అనగా పసుపు లేదా వచ్చ పీత రకము. ఇది ఉప్పు నీటి కయ్యలలో నదీ ముఖద్వార ప్రాంతాలలో స్వేచ్చగా తిరిగే రకము. సిల్లా ఒలివేషియా : ఇది మడ అడవులలో, బురద మట్టిలో, కాలువలు మరియు చెరువు గట్ల నందు బొరియలు వా 1 జీవిస్తాయి. ఇవి పచ్చ పీతలు కంటే చిన్నవిగా ఉంటాయి. ఆడ మగ పీతలను గుర్తించుట : పీతలలో ఉదరము పలుచగా ఉండి పీతకు అడుగు భాగములో అనగా ('క్రిండ వైపు మడత పెట్టబడి ఒక రెక్కమాదిరిగా ఉంటుంది. దీని ఆకారము బట్టి పీతలలో ఆడ మగ వాటిని గుర్తించగలము. మగ పీతలు నందు ఈ ఉదరము, త్రిభుజాకారముగా ఉంటుంది. అదే ఆడ పీతలలో వెడల్పుగా ఉండి అర్థ చంద్రాకారములో పెద్దవిగా ఉంటుంది. ఇది ఆడ పీతలలో గుడ్డను పట్టి ఉంచడానికి సహాయ పడుతుంది. పెరుగుదల : వీటి యొక్క పెరుగుదలను గమనించినట్లయితే మగ, ఆడ పీతలు వాటి యొక్క గుల్ల యొక్క వెడల్పు నెలకు 9 నుండి 10 మి.మీ. పెరుగుదల ఉంటుంది. పచ్చపీతలు సహజ వనరులలో అధికముగా 220 మిమీ గుల్ల వెడల్పు మరియు 2.4 కేజీల బరువు, అదే మండపీతలు విషయంలో 140 మిమీ గుల్ల వెడల్పు మరియు 750 గ్రా. బరువును శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ప్రయోగాత్మకంగా 'పెంపకపు చెరువులలో వీటి పెరుగుదలను పరిశీలించినప్పుడు చిరు పీత పిల్ల నందు గుల్ల పెరుగుదల నెలకు 7 నుండి 12 మిమీ, 3 నుండి 18 గ్రా॥ బరువు, పీత పిల్లలనందు 11 నుండి 12 మిమీ, 45 నుండి 97 గ్రా బరువు , ఫ్రొాడ దశలలో 8-10 మిమీ, 100 నుండి 180 గ్రాముల బరువును గమనించడం జరిగినది. ఆహారపు అలవాట్లు : ఇవి అన్ని రకాల ఆహారములను అనగా చేపలు, క్రస్టేషియన్స్, నత్తలు, రొయ్యలను మరియు కుళ్ళుతున్నటువంటి ఆహారమునూ, వృక్ష సంబంద ఆహారమును కూడా తీసుకుంటుంది. ఎక్కువగా చిరు చేపలను, నత్తలను స్వీకరిస్తుంది. ఇది వేగముగా సంచరించే వాటిని ఆహారము తీసుకొనవు. పరిపక్వత : పరిపక్వత రెండు రకాలలో వేరువేరుగా ఉంటుంది. పచ్చ లేదా పసుపు పీతలు వాటి యొక్క గుల్ల వెడల్పు 120 నుండి 180 మి.మీ. మధ్యలో ఉన్నప్పుడు అనగా అంత పెరుగుదల ఉన్నప్పుడు మొదటి సారిగా పరిపక్వతకు వస్తాయి. అదే మండపీతలు 78 నుండి 88 మిమీ గుల్ల వెడల్పు ఉన్నప్పుడు పరిపక్వతకు వస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి (ఫికండిటీ) సిల్లా సెర్రేటా (పచ్చపీతలు) మండపీతల కంటే అధికముగా గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. 1 కేజీ బరువు గల పీత దాదాపుగా 2 నుండి 5 మిలియన్ల గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అదే మండపీతలు కేవలము, 1 నుండి 8 మిలియన్ల గుద్లకు ఉత్పత్తి చేస్తాయి. [గ్రుడ్డు ఉత్పత్తి సంఖ్య ఆయా వనరుల యొక్క వాతావరణ పరిస్థితులు మరియు ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కొచ్చిన్ ప్రాంతములోని పచ్చపీతలు అధికముగా గుడ్లను ఉత్పత్తి చేయుట శాస్త్రవేత్తలు నమోదు చేయడం జరిగినది. బ్రీడింగ్ సీజన్ : వీటినందు బ్రీడింగ్ సంవత్సరం పొడుగునా జరుగుతుంది కాని శీతాకాలములో అత్యధికముగా ఉంటుంది. మరియు వివిధ ప్రాంతాలలో క్రింద తెలియచేసిన విధముగా వీటి యొక్క బ్రీడింగ్ సీజన్‌ను గమనించినారు. పళ్చిమ తీర ప్రాంతాలలో సెప్టెంబరు నుండి ఫిబ్రవరి వరకు గుజరాత్ తీరంలో సెప్టెంబరు నుండి మార్చి వరకు పులికాట్ సరస్సు మరియు ఒరిస్సా తీర ప్రాంతంలో సెప్టెంబరు నుండి ఏప్రిల్ వరకు కాకినాడ తీర ప్రాంతంలో అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు పైన తెలియచేసినట్లుగా శీతాకాలంలో అత్యధికముగా (బ్రూడర్లు వివిధ ఉప్పునీటి కాలువలు, నదీ ముఖ ద్వారాలలో లభ్యమవుతాయి. బాగా పరిపక్వత చెందిన పీతల యొక్కగుల్లను పై భాగములో పరీక్షించినప్పుడు (గ్రుడ్డు బాగా అభివృద్ధి చెందిన అండాశయాలు, నారింజ ఎరుపు వర్ణములో కనీపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి అనేది ఆయా వనరుల యొక్క వాతావరణ పరిస్థితులు మరియు ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటుంది. జీవిత చక్రము - హేచరీలలో పిల్లల ఉత్పత్తి (Life cycle of Mangroove Crab) సహజ వనరులలో మాంగ్రూవ్ పీతలు సంవత్సరం పొడవునా గ్రుడ్లు పెడతాయి. బాగా పరిణితి చెందిన ఆడ పీతలు ఉదర భాగంలో ముదురు పసుపు లేదా నారింజ (ఆరెంజ్) వర్ణంలో గల (గ్రుర్గ సముదాయం) లీజ కోశాలను కలిగి ఉంటాయి. పరిణితి చెందిన ఆడ పీతలు 2-3 వారాలలో (గ్రుడ్తను పెడతాయి. ఆడ పీతలు సహజ వాతావరణంలో సముద్రమునకు వలస వెళ్ళి అక్కడ గ్రుడ్లను విడుదల చేస్తాయి. అక్కడే గ్రుడ్లు పొదగబడి లార్వా దశలు వృద్ధి చెందుతాయి. వీటి జీవిత చక్రంలో 5 జోవియా దశలు, ఒక మెగలోపా దశ ఉంటాయి. ఈ దశలన్నీ సముద్రపు నీటిలో గడిపి తిరిగి మడ అడవులకు, తీర ప్రాంతంలోని ఉప్పునీటి కయ్యలకు చేరుకొని పిల్ల పీతలుగా అభివృద్ధి చెందుతాయి. హేచరీలలో అయితే ఎంపిక చేయబడిన పరిణితి చెందిన ఆడ పీతలను పెద్ద పెద్ద ట్యాంకులలో (అనుకూలమైన నీటి గుణాలు ఉండే విధంగా) ఉంచుతారు. బ్రీడింగు ట్యాంకు అడుగు భాగము సముద్ర ప్రాంతం నుండి సేకరించిన ఇసుకను 5-10 సెం॥మీ మందంగా పరచాలి. ప్రతి చదరపు మీటరు వైశాల్యమునకు పరిణితి చెందిన ఒక ఆడ పీతను ఉంచవచ్చు. బ్రీడింగు ట్యాంకును వడకట్టిన సముద్రపు నీటితో 80-100 సెం॥మీ లోతు ఉండే విధంగా నింపుకోవాలి. వీటికి తగినంత ప్రాణవాయువు కొరకు ఏరియేషన్ ఏర్పాటు చేయాలి. ఈ బ్రీడింగు ట్యాంకు నందు 6 అంగుళాల వ్యాసం గల పి.వి.సి పైపులను పీతలు దాక్కోవడానికి ఉంచాలి. బ్రీడింగు ట్యాంకు అడుగుభాగంను ప్రతీ 5 రోజులకు ఒకసారి శుభపరచాలి. బ్రీడింగు ట్యాంకు నీటి నాణ్యత పరిశీలించుకుంటుండాలి. బ్రీడింగు ట్యాంకు నందు ఉండవలసిన నీటి నాణ్యత ఈ క్రింది విధంగా ఉందాలి. నీటి ఉప్పదనం = 31-85 పి.పి.టి ఉష్ణోగ్రత - 80-826 ఉదజని సూచిక = 80-85 ప్రాణవాయువు -ా 4 పి.పి.యం కన్నా ఎక్కువ అమ్మోనియా ఆ ఉండరాదు పరిపక్వతకు వచ్చిన ఆడపీత శరీరమును బ్రీడింగు ట్యాంకు అడుగు భాగం నుండి పైకి ఎత్తి ఉదర భాగం నందు గల ప్లాప్‌ని క్రమంగా తెరుస్తూ గ్రుడ్గను విడుదల చేస్తుంది. సాధారణంగా ఒక ఆడపీత 1 నుండి 5 మిలియన్ల గ్రుడ్గను పెడుతుంది. ఫలదీకరణం చెందిన గ్రుడ్లు ముదురు నారింజ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఫలదీకరణం చెందిన (గ్రుడ్లలో అభివృద్ధి జరుగుతూ క్రమంగా గుడ్లు ముదురు నారింజ రంగు నుండి ముదురు బూడిద వర్ణంలోకి మారతాయి. ఉష్టోగ్రత అనుకూలంగా ఉంటే 10-14 రోజుల కాల వ్యవధిలో గ్రుడ్లు పూర్తిగా పొదగబడి మొదటి లార్వా దశ జోవియా వస్తుంది. జోవియా లార్వా దశలకు (జీవ ఆహారం) రోటీఫర్, క్లొరెల్లా, కీట్సెరాస్ వంటి వ్ల్రవకాలను ఆహారంగా ఇవ్వాలి. జోవియా లార్వా దశ 2-3 వారాలలో మోల్టింగ్లు జరుపుకొని 65 దశలను దాటి మెగలోపా లార్వాగా వృద్ధి చెందును. జోవియా లార్వా దశలలో మోల్టింగ్కు 29-80 C ఉష్ణోగ్రత బాగా అనుకూలం. జోవియా దశ 1 నుండి 3వ దశ జోవియాలు తల్లి పీత ఉదర భాగాన్ని అతుక్కొని ఉంటాయి. జోవియా 5వ దశ నుండి ఆర్జీమియాను ఆహారం తీసుకుంటాయి. మెగలోపా లార్వా దశకు డెక్కలు ఏర్పడతాయి. ఇది పీతని పోలి ఉంటుంది. ఈ దశలో ఆర్జీమియాని ఆహారంగా తీసుకొంటుంది. అంతే కాక బాగా ముద్దగా చేసిన తాజా చేప మాంసం, కృత్రిమ ఆహారాన్ని కూడా స్వీకరిస్తుంది. 6 - 7 రోజుల కాల వ్యవధిలో మెగలోపా దశ రూప విక్రియ నొంది (మెటామార్చోసిస్) 4 మీ.మీ వెడల్పు గల చిన్న పీత్ర పిల్లగా రూపాంతరం చెందును. మెగలోపా లార్వా దశలను నర్సరీ ట్యాంకులలో వేసి సహజ ఆహారం (ఆర్జీిమియా) తో పాటు తాజా మాంసం ముద్దను అందించిన 80 రోజులలో 80 గ్రా పరిమాణం గల పీత పిల్లలుగా పెరుగుతాయి. ఈ పీత పిల్లలను పెంపకపు చెరువులలో వేసి మార్కెట్ సైజు వరకు పెంచవచ్చును. సహజ వనరులలో అయితే మెగలోపా దశ మోల్టింగ్ జరుపుకొనీ చిరు పిల్ల పీతగా మారి సముద్ర తీర జిల్లాల్లోకి వైవు వచ్చి సముద్రం అడుగు భాగాన ఉంటూ తిరిగి మోల్టింగ్ జరుపుకొని పిల్ల పీతగా మారి మడ అడవులలో చిత్తడి నెలలలో సంచరిస్తూ ఉంటాయి. హెచరీ నుండి సేకరించిన పీతపిల్లల వలన కలుగు ప్రయోజనాలు ఆరోగ్యవంతమైన మంచి లక్షణాలుగల పీతపిల్లలను పొందవచ్చును. పీత పిల్లలన్ని ఒకే సైజులో ఉంటాయి. సంవత్సరం పొడవునా లభ్యమౌతాయి. పెంపకానికి అనువైన ఒకే జాతికి చెందినవై ఉండటం. తగిన సమయంలో సాగుకు సరిపడా సంఖ్యలో పీత పిల్లల లభ్యత. వ్యాధి కారక జీవులు లేని పరీక్ష చేసిన పీతపిల్లలు (SPF) పొందవచ్చును. ఏక జాతి పీతల పెంపకం (Mono Sex Culture)కు అవకాశం. పెతపిల్లల లభ్యత వలన పెంపకపు విస్తీర్ణం పెంచుకోవచ్చు. పెతపిల్లల లభ్యత వలన సహజ వనరులలో వాటిని వదులుట ద్వారా సహజ సిద్ధంగా పీతలు అంతరించిపోకుండా పీతల సంఖ్యను గణనీయంగా పెంచవచ్చు. (Conservation of wild Stock) చిన్న సన్నకారు రైతులు తక్కువ వ్యవధిలో పీతపిల్లలను నర్సరీలలో పెంచి పెంపకము చెరువులకు సరఫరా చేసి లాభాలు ఆర్జించవచ్చును. అంతేకాకుండ సాగుచేయు రైతులకు పీతల బ్రతుకుదల శాతం బాగుండుటయే కాక పెంపకం సమయం తగ్గుట ఒక మంచి అనుకూలాంశము. సహజవనరుల నుండి సేకరించిన పీత పిల్లల వలన తలెత్తు సమస్యలు : సరిపడినంత సంఖ్యలో సాగుకు అనువైన సమయంలో లభించక పోవుట. సైజు వ్యత్యాసాలు ఎక్కువగా ఉండటం. పీతపిల్లలు మిశ్రమ జాతులకు చెందినవిగా ఉండటం. వ్యాధి కారక జీవులను కలిగి ఉంటాయి. నర్సరీలలో పీతల పెంపకము రొయ్యల పెంపకములో మాదిరిగా పీతల పెంపకంలో నేరుగా విత్తనమును హేచరీల నుండి తీసుకు వచ్చి చెరువులో వేసుకొని పెంపకము చేపట్టలేము. హేచరీల నుండి తీసుకువచ్చే పీత పిల్లలు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక వీటిని తప్పుని సరిగా నర్సరీలలో వ. చేపట్టాలి. పీతల పెంపకములో నర్సరీ పెంపకము మరియు యాజమాన్యము చాలా కీలకమైనది. రొయ్యలలో బ్రీడింగ్ ద్వారా 90 శాతం పోస్టులార్వా 'బ్రతుకుదల సాధించవచ్చు. కానీ, పీతపిల్ల(ఇన్స్టార్)ల 'బ్రతుకుదల కేవలం 5 శాతం వరకు మాత్రమే ఉంటుంది. అందువలన రైతులకు కావలసిన స్టాకు సైజు పీతలు సరిపడినంతగా కావాలంటే తప్పనిసరిగా రైతులు నర్సరీ యాజమాన్యములో సాంకేతిక మెళకువలు పాటించవలసి ఉంటుంది. ప్రస్తుతం పీతల రైతులు, పెంపకం కోసం 100 - 200 గ్రాముల బరువుగల పీతలను ఇతర రాష్ట్రాల నుండి కేజి ఒక్కింటికి 400 - 550 రూపాయల చొప్పున కొంటున్నారు. దీని వలన ఖర్చు అధికమవుతుంది. అందువలన సీడు ఖరీదును తగ్గించుకొని తగినంత సీడును పెంపకమునకు ఉత్పత్తి చేసుకోవాలంటే హేచరీల నుండి తీసుకున్నటువంటి చిరు పీత పిల్లలను (ఇన్స్టార్ లను) నర్సరీలలో పెంపకం చేపట్టాలి. నర్సరీల యాజమాన్యము క్రింది విధంగా చేయాలి. నర్సరీ దశలో హేచరీ నుండి విడుదల చేసిన మెగలోపా లార్వా లేదా ఇన్స్ట్రార్లకు 2.5 సెం.మీ. కేరాపేసు వెడల్పు వరకు పెంచుతారు. సహజంగా ఇన్స్టార్లు 0.8 నుండి 0.5 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. వీటిని 80 - 40 రోజుల వ్యవధిలో మంచి యాజమాన్యము ద్వారా 2.5 సెం.మీ. పరిమాణం వరకు సాధించవచ్చు. వీటిని క్రాబ్లెట్స్ అని లేదా అగ్గిపెట్టె సైజు అని అంటారు. ఇవి 10 నుండి 15 గ్రాముల వరకు బరువుంటాయి. వీటిని (ప్రత్యక్షంగా పెంపకము చెరువులలో వేసుకొని సాగు వ. లేదా వేరొక చెరువులో మరో రెండు నెలలు పెంచి 70 నుండి 100 గ్రాములు పెరిగిన తరువాత పెంపకము చెరువులోకి మార్చుకోవచ్చును. చెరువు తయారీ : రాయ్యల చెరువుల తయారీ విధానమే దీనికి కూడా అవలంబించాలి. ముందుగా చెరువులో నీటి మట్టం 1.2 మీ. (4 అడుగులు) నిలువ ఉండేలా గట్లు ఎత్తు చేసుకోవాలి. ఎటువంటి రంధ్రాలు లేకుండా గట్లు పటిష్టంగా ఉంటే పీతలు బయటకి పోకుండా ఉంటాయి. నీరు పెట్టేందుకు, బయటకు తీసేందుకు వేరు వేరు గేట్లు పెట్టుకొని, నీరు సులువుగా పోయేందుకు వీలుగా వాలు ఏర్పాటు చేసుకోవాలి. దీని వలన నీటి యాజమాన్యం, పట్టుబడి సులువుగా ఉంటుంది. పీతలు రొయ్యలా కాకుండా ఉభయచర జీవులు. నేల మీద, నీటిలో కూడా 'బ్రతుకగలవు. ఈ లక్షణం వలన చెరువులో నుండి బయటకి పోయే అవకాశం కలదు. దీని వలన ఆక్వా రైతు ఆర్థికంగా నష్టపోవు అవకాశం కలదు. అందువలన చెరువు చుట్టూ సుమారు 1 మీ. ఎత్తు గల న వలను గట్టు మీద ఏర్పాటు చేసుకోవాలి. పీతలు వల మీద నుండి సులువుగా ఎక్కగలవు. కనుక వల పై భాగంలో ఒక అడుగు వెడల్పుగల క షిల్పాలి లిన్ క్లాత్ (నునుపుగా ఉన్న గుడ్డు లోపలి తలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ వలను 45 కోణంలో చెరువు వైపు వాలి ఉండేలా ఏర్పాటు చేసుకుంటే పీతలు చెరువులోనే పడతాయి. పై విధంగా చెరువు తయారు చేసుకున్న తరువాత చెరువును బాగా ఎండబెట్టాలి. ఎండిన చెరువును దున్నితే పై పొరలో ఉన్న వ్యాధి కారక క్రిములు మరణిస్తాయి. ఎండని, నీరు ఉన్న చెరువులలోని మాంసాహార జీవులు, కలుపు చేపలు మొదలగువాటిని చంపుటకు గాను ఎకరాకు 100 కేజీలు టీసీడ్ కేక్‌ను గాని లేదా మహువా ఆయిల్ కేక్‌ను గాని లేదా 100 కేజీ ల బ్లీచింగ్ పొడి గాని వాడి, వాటిని పూర్తిగా నిర్మూలించుకోవాలి. మట్టి పరీక్షలు చేసి దానికి అనుగుణంగా సున్నం వాడుకోవాలి. పై విధంగా చెరువును శుభ్రం చేసుకున్న తరువాత నీటిని 120 మైక్రాన్స్ సైజు గల వలతో వడగట్టి చెరువును నింపాలి. దాని వలన ఇతర జీవులు చెరువులోనికి రాకుండా ఉంటాయి. నీటిని 8-4 అడుగుల లోతు వచ్చేలా పెట్టుకోవాలి. పహోపాల తయారీ మరియు అమరిక : పీత పిల్లలలో అధిక బ్రతుకుదల శాతం పొందటానికి హాపాలను వాడతారు. ఇవి నైలాన్‌తో గాని, హెచ్.డి.పి.ఇ 1.5 మి.మీ మెష్‌తో గాని తయారు చేస్తారు. సహజంగా 5 మీ * 4 మీ * 1 మీ వైశాల్యంతో హాపాలను తయారు చేసి వాటిని చెరువులో ఎకరాకు 12 - 16 హాపాలను రెండు సమాన వరుసలలో అమర్చుతారు. రెండు వరుసల మథ్యలో కేట్ వాక్‌ను చెక్కలతో గాని, వెదురు కర్రలతో గాని ఏర్పాటు చేస్తారు. ఆహారం వేయటానికి, పిల్లలను పరిశీలించుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రతి హాపాను చెరువులో నీరు పెట్టక ముందే అమర్చుకోవాలి. హాపా అడుగు భాగం చెరువు అడుగు భాగం కంటే 80 సెం.మీ. ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. హాపాను నాలుగు వైపులా కర్రల సహాయంతో త్రాళ్ళతో కట్టి, హాపా అడుగుభాగం ముడతలు పదకుండా లేదా నీటిపై తేలకుండా పి.వి.సి గొట్టాలతో మ. చట్రంను హాపా అడుగుభాగంలో ఏర్పాటు చేయాలి. ఈ చట్రాన్ని నీటితో గాని, ఇసుకతో గాని నింపుకోవాలి. హాపాపై అంచునందు అర అడుగు ఎత్తులో షిల్సాలిన్ క్లాత్ ని ఏర్పాటు చేసుకోవాలి. దీని వలన పీత పిల్లలు బయటకు వెళ్ళకుండా ఉంటాయి. పిల్ల సాంద్రత /సంఖ్య: 5 * 4 * 1 మీ.తో తయారు చేసిన హాపా విస్తీర్ణం 20 చదరపు మీటర్లు ఉంటుంది. సాంకేతికంగా ఒక చదరపు మీటరుకు 25 - 80 పిల్లలు / ఇన్స్టార్ల చొప్పున ఒక హాపాలో మొత్తము 500-600 పిల్లలను వేసి పెంచుకోవచ్చును. పీత పిల్లలు దాక్కునే సదుపాయములు : పీత పిల్ల దశలో స్వజాతి భక్షణ లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందువలన బ్రతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సహజంగా ప్రకృతిలో బ్రతుకుదల 20-80 శాతం మాత్రమే ఉంటుంది. కానీ, హాపాల ద్వారోసుమారు 60 శాతం సాధించవచ్చు. దీని కోసం హవాపాలలో పి.వి.సి గొట్టం ముక్కలు/సముద్రపు నీటి మొక్కలు/వల ముక్కలు మొదలైన వాటిని రక్షణ స్థావరాలుగా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా పిల్ల గుల్ల విడిచినపుడు ఇతర పీతల దాడులకు గురి కాకుండా ఉంటుంది. మొత్తం పీతల సంఖ్యలో 40-60 శాతం వరకు 'బ్రతుకుదల ఉంటుంది. ఆహారం మేత : పిల్ల దశలో బాగా ఎదుగుదలకు అధిక శాతం ప్రొటీన్ గల ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం ఆర్టీమియా లేదా చేప మాంసాన్ని మెత్తగా ఖైమాలా చేసి మొత్తం పిల్ల బరువులో ప్రతిరోజు 100 శాతం చొప్పున మొదటి వారం ఆహారంగా ఇవ్వాలి. నిర్ణయించిన మొత్తం మేతలో 40 శాతం భాగాన్ని ఉదయం, మిగిలిన 60 శాతం సాయంత్రం ఇవ్వాలి. తదుపరి వారాలలో 10-15 శాతం తగ్గించుకుంటూ ఇవ్వాలి. గేడింగు మరియు పట్టుబడి : పిల్ల వేసిన 15వ రోజు మరియు 20వ రోజున హాపాలోని పిల్లలను జాగ్రత్తగా దాక్కునే ప్రదేశాల నుండి సేకరించి చల్లని సమయంలో అంటే ఉదయం గానీ, సాయంకాలము గానీ గ్రేడింగు చేయాలి. అందులో బాగా చిన్నగా ఉన్న పిల్లలను వేరొక హాపాలో ఉంచాలి. 380 రోజులు పెంచిన తదుపరి సుమారుగా 2.5 సెం.మీ. కేరాపేసు (డొప్పు వెడల్పు గల పిల్లలను పట్టుబడి చేసి వాటిని పెంపకపు చెరువులలోనికి మార్చుకోవచ్చు. పీతపిల్లల ప్యాకింగ్ మరియు రవాణా : హేచరీ నుండి ఉత్పత్తి అయిన మెగలోపా లేదా ఇన్స్టార్లు చాలా చిన్నగా బటన్స్‌లాగా ఉంటాయి. వీటిని లీటరు నీటికి 50 పిల్లలు చొప్పున వేసి దానిలో 6 లీటర్లు సముద్రపు నీటిని కలిపి రెండు పొరలు గల ప్లాస్టిక్ బ్యాగులలో ప్యాకింగ్ చేస్తారు. ఈ సంచులలో రక్షణగా దాగుడు వస్తువులు వేస్తారు. ఈ సంచులను అట్ట పెట్టెలలో ధర్యోకోల్ పెట్టెలలో ప్యాకింగ్ చేస్తారు. అందువలన ఉషహ్టోగ్రత మార్పులకు గురికాకుండా సుమారు 36 గంటల వరకు రవాణా చేయవచ్చు. అదే విధంగా 2.5 సెం.మీ. సైజు గల క్రాబ్లెట్స్ (పీత పిల్లలు) ను ఎక్కువ దూరం రవాణా చేయాల్సినపుడు వెదురు బుట్టలలో గానీ, రంధ్రాలు గల ప్లాస్టిక్ బుట్టలు గాని, పళ్ళ బుట్టలు గాని ఉపయోగిస్తారు. ప్రతి బుట్టలో తడిగా నున్న గోనె సంచి ముక్కలు మరియు మడ ఆకులు, సముద్రపు నాచు, షెడ్ నెట్ ముక్కలు వాడి రవాణా చేస్తారు. ఇవి పీత పిల్లలు దాక్కునేందుకు, గుల్ల కొట్టిన పీతపిల్లల రక్షణకు ఉపయోగపడతాయి. ఈ బుట్టలను రంధ్రాలు గల పెట్టెలలో పెట్టి రవాణా చేస్తారు. చాలా తక్కువ దూరం రవాణా చేసేటపుడు పీతపిల్లలను తడి ఇసుక గల ప్లాస్టిక్ ట్రేలలో ఉంచి రవాణా చేసారు. చెరువులలో పీతల పెంపకం పీతల పెంపకంలో మరో ముఖ్యదశ పీతల పెంపక చెరువుల ఎంపిక, తయారీ వీటి మీదనే పీతల బ్రతుకుదల, ఎదుగుదల మరియు లాభాలు ఆధారపడి ఉంటాయి. రైతులు వివిధ పద్ధతులలో పీతల పెంపకం చేపడుతున్నారు. వేరు వేరు దేశాలలో అనేక నూతన పద్ధతులు అవలంబిస్తున్నారు. ప్ర పద్ధతి అవలంబీించినా దిగువ పేర్ళొన్న పద్ధతులు, విధానాలు పాటిస్తే లాభాలు పొంద వచ్చును. చెరువుల ఎంపిక : సముద్ర తీర ప్రాంతంలోని ఉప్పు నీటి చెరువులు, ఖాళీగా ఉన్న రొయ్యల చెరువులు, తరచు రొయ్యలు వ్యాధులకు గురి అయ్యి నష్టం వస్తున్న చెరువులు, ఉప్పు నీటి ప్రాంతాలు పీతల సాగుకు అనుకూలంగా ఉంటాయి. 0.5 ఎకరం నుండి 2.5 ఎకరాలు విస్తీర్ణం గలవి అనుకూలంగా ఉంటాయి. ఇసుక మరియు బంక మట్టితో కలిసి నీరు నిలువ ఉండే భూములు అయితే ఖర్చు బాగా తగ్గుతుంది. మురుగు కాలవలు, క్రీక్లకు దగ్గరగా ఉంటే నీటి మార్చిడి సులువుగా ఉంటుంది. చెరువు తయారి : రొయ్యల చెరువుల తయారీ విధానమే దీనికి కూడా అవలంబించాలి. ముందుగా చెరువులో నీటి మట్టం 1.2 మీ. (4 అడుగులు) నిలువఉండేలా గట్లు ఎత్తు చేసుకోవాలి. ఎటువంటి బెజ్జాలు లేకుండా గట్లు పటిష్టంగా ఉంటే పీతలు బయటకి పోకుండా ఉంటాయి. నీరు పెట్టేందుకు, బయటకు తీసేందుకు వేరు వేరు గేట్లు పెట్టుకొన్, నీరు సులువుగా పోయేందుకు వీలుగా వాలు ఏర్పాటు చేసుకుంటే నీటి యాజమాన్యం, పట్టుబడి సులువుగా ఉంటుంది. పీతలు ఉభయచర జీవులు. చెరువు గట్ల మీద నుండి బయటకు పోగలవు. అందువలన నర్సరీ చెరువుల మాదిరిగానే పెంపకపు చెరువులను తయారు చేసుకోవాలి. గట్ల వాలుగా ఏర్పాటు చేసుకోవాలి. నేల యాజమాన్యమును కూడా అదే విధముగా పాటించి, నీటిని వడగట్టి పెట్టుకోవాలి. ఎరువుల వాడకం : నీరు తోడిన తరువాత చెరువులో తగినంత వృక్ష్మ జంతు ప్లవకాలు (వ్లాంక్టాను) ఉందేలా యూరియా/డిఎపి మరియు సూపర్ ఫాస్ఫేటును వాడుకొని లేత ఆకు పచ్చ మరియు గోధుమ రంగు ఉండేలా చూసుకోవాలి. పీత పిల్లల ఎంపిక నర్సరీల నుండి/సహజవనరుల నుండి పీతపిల్లలను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ క్రింది అంశాలను పరిశీలించుకోవాలి. పీత పిల్లల గుల్ల మరియు కాళ్ళు పై ఏ విధమైన పాకుడు (fouling) ఉండరాదు. పీత పిల్లల రంగు కాంతివంతంగా ఉండాలి. పీత పిల్లకు గల అన్ని కాళ్ళు మరియు డెక్కలు కల వాటినే ఎంపిక చేసుకోవాలి. ఒక పరిమాణంలో గల పీత పిల్లలనే ఎంపిక చేసుకోవాలి. పీత పిల్లల పరిమాణం (Size) వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అవి వివిధ బ్యాచ్‌లకు చెందినవి అని అర్థం. పరిమాణంలో ఎక్కువ వ్యత్యాసాలున్న పీత పిల్లలను ఎంపిక చేసుకుంటే స్వీయ భక్షణ (cannibalism) కు ఎక్కువ అస్మారముంటుంది. పిల్లపీతలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద రవాణా చేయుటవలన కొద్దిగా మందకొడిగా ఉంటాయి. అందువలన వీటిని రవాణా బుట్టల నుండి తీసి చెరువు నీరు గల బేసిన్లో కొంత సేపు ఉంచి చెరువు నీటికి అలవాటు చేయవలెను. (acclimatization) పీత పిల్లలను మొదట చెరువునందు వాపా / పెన్లో 2-3 వారాలు పెంచి బాగా ఎదిగిన పీత పిల్లలను చెరువులో వదులుకోవాలి. అంతగా పెరుగుదల చూపని పీత పిల్లలను మరికొద్ది రోజులు హాపా నందు ఉంచటం వలన మంచి బ్రతుకుదల శాతం సాధించవచ్చు. చెరువులో పీతలు పెంచుతున్నప్త్పుడు ఈ క్రింది అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. నీటి నాణ్యత మేత యాజమాన్యత పీత బ్రతుకుదల పెరుగుదల పీత ఆరోగ్యస్థితి సైజు మరియు సంఖ్య: పీత పిల్లల లభ్యతను బట్టి పెంపక విధానం రెండు రకాలుగా ఉంటుంది. హేచరీ సీడు అయితే నర్సరీలలో పెంచబడిన అగ్గిపెట్టె పరిమాణం (2-2.5 సెం.మీ) కేరాపేస్ వెడల్పు గల పిల్లలను ఎకరానికి 1000-1500 చొప్పున వేసి 6-8 నెలల కాలంలో 500 గ్రా పైన గల పీతలను పట్టుబడి చేయవచ్చు. రెండవ విధానంలో 100-200 గ్రా॥లు బరువు గల లోకల్ పీతలను ఎకరానికి 500-600 చొప్పున వేసుకోవాలి. ఇవి 4 నెలల్లో మార్కెట్ సైజుకు వస్తాయి. విత్తనానికి పై భాగంలో ఎటువంటి బూజుగాని, గుల్ల గాని అంటుకొని ఉండరాదు. ఒకే సైజు విత్తనం ఎంపిక చేసుకోవాలి. కాళ్ళు, డెక్కలు విరిగిన విత్తనాన్ని ఎంపిక చేసుకోరాదు. చురుకుగా ఉన్న పిల్లల్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఆక్షిమటైజేషన్ : (చెరువు నీటికి అలవాటు చేయుట) రొయ్య పిల్లల మాదిరిగానే పీత పిల్లలను కూడా చెరువులో వదిలే ముందు చెరువు నీటి ఉష్ణోగత, సెలినిటి, ఉదజని సూచికలకు అలవాటుపడేలా చేసి అప్పుడు చెరువులో వదిలితే ఒత్తిడి తగ్గి బతుకుదల శాతం పెరుగుతుంది. నీటి గుణాలు మరియు యాజమాన్యం : పీతలు ఉభయచర జీవులు కాబట్టి వాటికి నీటి యాజమాన్యం అంతగా అవసరం లేదనుకుంటారు. కానీ, నీటి యాజమాన్యం బాగా ఉంటే పీతలలో బ్రతుకుదల, ఎదుగుదల, గుల్ల కొట్టడం వంటి వాటి వలన తొందరగా పట్టుబడికి వస్తాయి. వ్యాధులు కూడా దరిచేరవు. పీతల పెంపకానికి నీటికి క్రింది లక్షణాలు అనుకూలంగా ఉంటాయి. నీటి ఉదజని సూచిక = 75-85 నీటి ఉప్పు శాతం = 10-25 పి.పి.టి నీటి ఉష్ణోగ్రత = 25 - 35 C కరిగి ఉన్న ప్రాణవాయువు = 4 పి.పియం కంటే ఎక్కువ మొత్తం అమ్మోనియా = 1 పి.పి.యం కంటే తక్కువ వైటైటు = 0.2 పి.పి.యం కంటే తక్కువ ఆల్భలినిటీ = 80-120 పి.పి.యం. కఠినత్వం = 4000 పి.పి.యం. కంటే ఎక్కువ టర్చిడిటి / బురదతనం = 20 - 80 సెం.మీ మేత యాజమాన్యం : పీతలు సహజంగా మాంసాహార జీవులు మరియు నిశాచార జీవులు. రాత్రి వేళల్లో ఆహారం ఎక్కువగా సుకుంటాయి. రొయ్యల పెంపకంలో లాగా పీతలు పెంపకంలో కృత్రిమ మేత ఇంకా రాలేదు. అందువలన రైతులు పచ్చి, చేపల గుండ, ఎండు చేపల పై ఆధారపడి సాగు చేస్తున్నారు. అందువలన మేత యాజమాన్యంలో సరియైన మెళకువలు పాటించకపోతే నీటి నాణ్యత కోల్పోవడం, వ్యాధులు రావడం, తక్కువ అయితే పెరుగుదల లేకపోవడం, మేత కోసం ఒక దానితో మరొకటి పోటీ పడి 'బ్రతుకుదల తగ్గిపోవడం, డెక్కలు విరిగిపోయి నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. మేతలు : ఎండు చేపలు, కలుపు చేపలు, చైనా గొరకలు, నత్త మాంసం, రొయ్య తలలు మరియు ఫార్ములేటెడ్ మేతలు (కణికలు) వేయవచ్చు. అయితే నీటి నాణ్యత, వ్యాధుల దృష్ట్వా మరియు ఖరీదును దృష్టిలో ఉంచుకొని చాలా మంది రైతులు ఎండు/వచ్చి చేపలను ముక్కలుగా కోసి ఆహారంగా వేస్తుంటారు. పీతల ఎదుగుదలకు 55% ప్రొటీను, 15% కొవ్వులు కావాలి. అంతే కాకుండా పీతలు పిండి పదార్ధంను కూడా బాగా జీర్ణం చేసుకోగలవ. ప్రతి రోజు పీతలకు ఇచ్చు ఆహారం లెక్కించుకొని ఇవ్వాలి. పీతలలో ఆహారం పీత డొప్ప యొక్క (కేర పేస్) వెడల్పు ఆధారంగా లెక్కిస్తారు. పై డొప్ప వెడల్పు : 6 సెం.మీ కంటే తక్కువ ఉంటే పీతల మొత్తం బరువులో 10% ఆహారంగాను, 6-15 సెం.మీ వెడల్పు ఉంటే మొత్తం బరువులో 8% ఆహారంగాను, 15 సెం.మీ పైన ఉంటే 6% ఆహారంగాను ఇవ్వాలి. పై విధంగా లెక్కించిన ఆహారంలో 40% ఆహారం ఉదయం, 60% ఆహారం సాయంత్రం ఇవ్వాలి. ఆహారం వినియోగం చెక్ ట్రేల ద్వారా పరిశీలించుకొని అవసరమయిన మార్పులను చేసుకోవాలి. కృత్రిమ మేతలు కణికల రూపంలో ఇస్తే పోషక విలువలు క్రింది విధంగా ఉండాలి. క్రూడ్ ప్రొటీన్ - 45.03% క్రూడ్ కొవ్వులు - 11. 64% కూడ్ ఫైబరు - 5.18% పిండి పదార్ధం - 23.13% బూడిద =జా 15.02% ఐతే కణికల మేతలకు వాటిని నెమ్మదిగా అలవాటు చేయాలి. పీతలు దాక్కునే సదుపాయాలు : పీతలు స్వజాతి భక్షక జీవులు. అందువలన తన కంటే సైజు చిన్నగా ఉన్న నీరసంగా ఉన్న గుల్ల కొట్టిన పీతలను తినేస్తాయి. కనుక చెరువులలోను, నర్సరీలలోను 'బ్రతుకుదల శాతం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల వలన రైతులు ఆర్థికంగా ఎక్కువ నష్టపోతారు. ఈ సమస్యను పెంపకం చెరువులో అధిగమించి ఎక్కువ బ్రతుకుదలను పొందడానికి చెరువులో పాత బంగాళ పెంకులను, పాత పి.వి.సి గొట్టాల ముక్కలను, పాత టైరు ముక్కలను లేదా మట్టి దిబ్బలను రక్షణ న్థావరాలుగా ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా పీతలకు సరిపడా ఆహారం ఇస్తే ఆ సమస్య మరింత తగ్గుతుంది. గుల్ల విడవటం / మోల్లింగ్ పీతలలో పెరుగుదల మిగతా జంతువులలో లాగా ఒక క్రమ పద్ధతిలో నిరంతరంగా ఉండదు. కారణం పీతలకు కైటిన్తో నిర్మితమైన ధృఢమైన బాహ్య కవచం ఉంటుంది. దీనిని స్థానికంగా షెల్ లేదా గుల్ల అంటారు. పీతల ఎదుగుదల ప్రక్రియలో ఈ గుల్లని వదిలి వేస్తాయి. ఈ విధంగా పెరుగుదల జరుగుతున్నప్పుడు గుల్ల విడవడాన్ని మోట్టింగ్ లేదా గుల్ల విడవడం అంటారు. ఎంజైములు మరియు ్రావకాల వలన పాత గుల్ల క్రింద గల శరీరపు బాహ్యపొర వేరు పడుతుంది. క్రమంగా బాహ్యపార గ్రంధుల విడుదలైన స్రావకాలు మెత్తటి పేపరులా,. పలుచని బ్రౌన్ వర్ణంలో ఒక పొర పాత గుల్ల క్రింద ఏర్పడుతుంది. పీత ఎప్పుడు గుల్ల విడుస్తుందంటే దాని శరీరం పూర్తిగా మాంసంతో నిండి గుల్ల బాగా గట్టి పడినప్పుడు శరీరములో స్రవించు అంత: కారకాలు (హార్మోనులు) మరియు బాహ్యకారకాలు (ఒత్తిడి) వలన గుల్ల వదులుతుంది. పీత గుల్ల విడవడానికి ఒక రోజు ముందు బాగా నీటిని పీల్చుకుంటుంది. ఫలితంగా శరీర పరిమాణం పెరిగి పాత గుల్ల క్రమంగా శరీరం నుండి వేరుపడుతుంది. గుల్ల పై భాగం (కారపేస్) పార్వ భాగాలందు వేరుపడి ఊడిపోతుంది. క్రమంగా పీత దాని ఉపాంగాలన్నింటిని గుల్ల నుండి సంకోచ వ్యాకోచాలు జరిపి ముందుగా వెనుక కాళ్ళు బయటకు లాక్కుంటుంది. చివరగా ముందు భాగంలో గల ఉపాంగాలన్నింటిని పాత గుల్ల నుండి పూర్తిగా బయటకు లాక్కుంటుంది. అంటే పాత గుల్ల నుండి జీవి మొత్తం వేరుపడుతుందన్న మాట. ఈ గుల్ల విడవటానికి 15-40 ని; సమయం పడుతుంది. పీత గుల్ల విడిచే సమయం, పీత పరిమాణం, వయస్సు, నీటి నాణ్యత, పీత ఆరోగ్య స్థితి (చురుకుదనం) సి బట్టి 4-5 గంటల వరకూ పట్టవచ్చు. గుల్ల విడిచే ప్రక్రియలో పీత తన కాళ్ళు, కళ్ళు, యాంటినా అన్ని ముఖ భాగాలు, మొప్పలని కూడా పాత గుల్ల నుండి వేరుపరచుకుంటుంది. గుల్ల విడిచిన తరువాత పాత గుల్ల చూస్తే అచ్చం పీతలాగే అనిపిస్తుంది. గుల్ల విడిచిన పీత మరుసటి రోజు శరీరం 85% నీటితో నిండి ఉంటుంది. గుల్ల విడిచిన 3-4 రోజులు ఆహారం తీసుకోదు. ఈ సమయంలో కొత్తగా ఏర్పడిన గుల్ల గట్టిపడుతుంది. గుల్ల విడిచిన 4వ రోజు నుండి పీత చాలా చురుకుగా ఉండి విపరీతంగా ఆహారం తీసుకుంటుంది. ఈ ఆహారం నుండి మాంసకృతులను తయారు చేసుకుంటుంది. (క్రమంగా పీత శరీరంలో గల నీటి స్థానంలో కణజాలం వృద్ధి చెంది మాంసముగా ఏర్పడి పీత పరిమాణం పెరిగి గట్టి పడుతుంది. పీత మంచి బరువు తూగుతుంది. ఈ విధంగా పీత శరీరం మాంసంతో ఏర్పడటానికి 20 - 25 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో పీత శరీర బరువు 50 శాతం వరకూ పెరుగుతుంది. గుల్ల కూడా బాగా గట్టిపడుతుంది. గుల్ల ్ష గట్టిపడటానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియంలను ఆహారం నుండి గ్రహిస్తుంది. పీత గుల్ల విడిచిన తరువాత పాత గుల్లని తినివేస్తుంది. ఫలితంగా కొంత కాల్షియంను పొందుతుంది. ఒక్కొక్కసారి పీత గట్టిపడటానికి 80 రోజులు సమయం కూడా పట్టవచ్చు. పీత శరీరంలో నీటి స్థానంలో పూర్తిగా కణజాలం ఏర్పడి నీటి శాతం 50 - 62 శాతంగా ఉంటుంది. గుల్ల విడిచిన పీతలకు మంచి పోషకాహారం ఇవ్వాలి. ముఖ్యంగా తాజా చేప మాంసం, నత్త మాంసం వంటివి రోజుకు రెండు సార్షు ఇవ్వాలి. గుల్ల విడవడం వలన పీత పెరగటమే కాక అంతకు ముందు ఏవైనా పరాన్న జీవులు, వ్యాధి కారక జీవులు, పాత గుల్లపై పెరిగిన ఇతర జీవులు తొలగించబడతాయి. గుల్ల విడవడం అనునది పీత ఎదుగుదలని సూచిస్తుంది. గుల్ల విడవడం పీతకు పునర్జన్మ అని చెప్పవచ్చు. గుల్ల విడవడానికి ముందు ఏదైనా ఉపాంగము విరిగినా లేదా పూర్తిగా తొలగిపోయినా గుల్ల విడిచే సమయంలో ఆ ఉపాంగమునకు సంబంధించిన భాగం పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా ఏర్పడి పూర్తి స్థాయిలో పెరుగుతుంది. అయితే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. కొత్తగా పునరుత్పత్తి ద్వారా ఏర్పడిన ఉపాంగము/కాలు సాధారణ సైజుకు రావాలంటే కనీసం ౩ సార్లు గుల్ల విడవాలి. బాగా ఎదిగిన పెద్ద పీతలలో కాలు విరిగి పునరుత్పత్తి ద్వారా గుల్ల విడిచే సమయంలో ఏర్పడినా అది సాధారణ పరిమాణంకి పెరగదు. ఇలాంటి పీతలకు మార్కెట్ రేటు తక్కువగా ఉంటుంది. చిన్న పీతలు ఎదిగే క్రమంలో తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ సార్లు గుల్ల విడుస్తాయి. పెద్ద పీతలలో గుల్ల విడవడం తక్కువగా అంటే పరిమితంగా ఉంటుంది. అంటే గుల్ల విడిచే కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది. గుల్ల విడుచు సమయంలో పీతలు పెరుగుదల నీటి నాణ్యత, వాతావరణ పరిస్థితుల అనుకూలత పై ఆధారపడి ఉంటుంది. నీటి నాణ్యత, అనుకూల వాతావరణ పరిస్థితులలో మంచి పోషకాహార లభ్యత ఉంటే గుల్ల విడిచిన పీతలలో 100 శాతం పెరుగుదలని కూడా చూపిస్తాయి. పచ్చ పీత జువినైల్ పీతలు ప్రతి 15-25 రోజులకొకసారి గుల్ల విడుస్తాయి. గుల్ల తరచుగా విడుస్తుంటే పెరుగుదల బాగుంటుంది. గుల్ల విడవడం సాధారణంగా రాత్రి వేళలలో ఎక్కువగా జరుగుతుంది (60-70%). పగటి పూట గుల్ల విడవడం (80-40%) తక్కువగా ఉంటుంది. సాధారణంగా పీత జీవిత కాలంలో 15-20 సార్లు గుల్ల విడుస్తుంది. కానీ పచ్చపీత (సిల్లా సెర్రేటా) లలో 25 సార్లు గుల్ల విడుస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. పీతల పెంపకంలో ఎన్ని సార్లు గుల్ల విడిస్తే అంత మంచిది. సాగు చేయు రైతులకు పీతలు తరచుగా గుల్ల విడవడం మంచి దిగుబడికి సంకేతం అని చెప్పవచ్చు. పీతల సాగులో గుల్ల విడవటానికి ప్రభావితం చేయు అంశాలు : పీత వయస్సు, పరిమాణం నీటి ఉష్టోగ్రత నీటి ఉప్పదనం నీటి ఉదజని సూచిక పోషకాహార లభ్యత నీటిలో మినరల్స్ గాఢత పీత ఆరోగ్య స్థితి పీత పునరుత్పత్తి సామర్థ్యం. పీతలలో గుల్ల విడవడానికి అవసరమైన నీటి నాణ్యత ప్రమాణాలు బాహ్యా కారకాలు : నీటి ఉష్టోగ్రత - చెరువు నీరు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు త్వరగా గుల్ల విడుస్తుంది. నీటి ఉహ్టోగ్రత బాగా పెరిగితే గుల్ల గట్టిపడదు. నీటి లోతు - కనీసం 4 అడుగులుంటే అనుకూలంగా ఉంటుంది. కాంతి ప్రసరణ - చాలా తక్కువగా అంటే చెరువు అడుగు భాగం చీకటిగా ఉంటేనే గుల్ల విడవడానికి అనుకూలాంశము నీటిలో తేలియాడు పదార్ధములు (సస్పెండెడ్ సాలిద్స్) - నీటిలో పఫ్లవకాలు, ఇసుక/బురద రేణువులు అధికంగా ఉంటే పీత మొప్పలపై చేరి అవి అతుక్కోవటం వలన శ్వాసక్రియకు అవరోధం ఏర్పడి పీత బలహీనపడిపోతుంది. రసాయనిక కారకాలు : ప్రాణ వాయువు - నీటిలో ప్రాణవాయువు 4 పి.పి..యం కి తగ్గకూడదు. 7 పి.పియం ఉంటే విడిచే సమయంలో పీత చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రాణవాయువు తగినంతగా ఉంటేనే గుల్ల విడవడం సాఫీగా జరుగుతుంది. లవణాలు & మినరల్స్: నీబ్రలో కరిగియున్న లవణాలైన సోడియం క్లోరైడ్ తగిన మోతాదులో ఉండాలి. ఈ లవణం గుల్ల విడుచు సమయంలో చాలా అవసరం. సనీట్రిల్రో కాల్షియం, మెగ్నీషియం మరియు పొాటాషియంలు కూడా సమృద్ధిగా ఉండాలి. ప్రీశ్రల్రు పెరుగుచున్న నీబిలో ఎలాంటి కాలుష్య పదార్థాలు ఉండరాదు. ముఖ్యంగా అమ్మోనియా, వైటైటు వంటి వాయువులు. జీవ సంబంధ కారకాలు : సీట్రిలో బాక్టీరియా, వృక్ష ప్రవకాల సాంద్రత తగు మోతాదులో ఉండాలి. గృల్ల విడవడం ప్రక్రియ విజయవంతంగా జరగాలంటే నీటి నాణ్యతకు సంబంధించిన 6 లక్షణాలు అనుకూలంగా ఉండాలి. అవి - డి.ఓ, ఉష్టోగత, పి. హెచ్, సెలినిటీ, అమ్మోనియా, నైటైట్. ఉష్ణోగ్రత - 20-