వ్యవసాయం చేయాలంటే సారవంతమైన నేలకావాలి అందులో పోషకాలున్న మట్టి కావాలి ఇదంతా పాతకాలం పద్ధతి. ఇప్పుడు మట్టి లేకుండా వ్యవసాయం చేయవచ్చు నారుమల్లు దుక్కి దున్చడానికి కాలం చెల్లింది అంటున్నారు శాస్త్రవేత్తలు. మట్టి లేకుండా వ్యవసాయం ఏమిటి అనుకుంటున్నారా? అది భవిష్యత్ వ్యవసాయానికి కొత్త రూపం. మటి లేకుండా కేవలం నీళ్లలో మొక్కల్ని పెంచడాన్ని “హైడ్రోపోనిక్స్” అంటారు. ఒకప్పుడు కొన్ని రకాల పండ్లను కూరగాయలను పొలాల్లో సాగు చేసే వాళ్ళు సాంకేతిక పురోగతి కారణంగా అధిక ఆదాయం ఇచ్చే పండ్లను, కూరగాయలను, పూలను పాలిహౌస్‌ల్లో సాగు చేసేవారు. అయితే ఇప్పుడు పాలిహౌస్ కంటే అధునాతన పద్ధతులతో కొన్ని రకాల కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను సాగు చేస్తున్నారు. ఆ అధునికపద్ధతుల్లో ప్రముఖమైనది హైడోపోనిక్స్ సాగు. గ్రికు భాషలో హైడ్రో అంటే నీరు, పోనిక్ అంటే పనిచేయడం లేదా సాగు చేయడం అని అర్థం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మట్టిలేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి మొక్కలను పెంచడం. భూమి లేకుండా సాగు ఎలా చేస్తారు? మొక్కకు పట్టు ఎక్కడినుంచి వస్తుంది? పోషకాలను ఎలా అందిస్తారు? అనే అనుమానాలు అందరికీ వస్తాయి. నేల అందుబాటులో లేనిచోట హై(డోపోనిక్స్ ఎలా పని చేస్తుంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటకు అవసరమైన ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం ఏమిటి? వాయు ప్రసరణ ఏవిధంగా ఉ౦టుంది? ఇవే ప్రశ్నలు సర్వత వినిపిస్తాయి. సాధారణ వ్యవసాయంలో నేలలో పెరిగే మొక్కలు మట్టిలో నుంచి వాటికి కావలసిన పోషకాలను పీల్చుకుంటాయి. కానీ హైడ్రోఫోనిక్స్ విధానంలో మట్టికి బదులు మొక్కకు కావలసిన పోషకాలను సరాసరి (directly) పోషక ద్రావణం ద్వార మొక్కలకు అందిస్తారు. హైడ్రోపోనిక్సును ఆహారోత్పత్తికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా భావించవచ్చు. హైడ్రోపోనిక్ వ్యవసాయం వలన రెండు ప్రధాన ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటి అధిక దిగుబడి కాగా, రెండవది సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట కూడా ఈ విధానం అనుసరించి పంటను పొందడం. ఇందులో మొక్క వేర్ల విస్తరణకు అడ్డు లేకపోడం, మొక్కకు కావలసిన పోషకాలు సమృద్ధిగా లభించడం, మొక్కకు కావలసిన కాంతిని కృత్రిమంగా లైట్ల ద్వార అనువైన మోతాదులో అందించడం వల్ల మొక్క వేగంగా పెరిగి తక్కువ వ్యవధిలోనే పంట చేతికందుతుంది. ఈ విధానంద్వారా నీటి పొదుపు కూడా జరుగుతుంది. సాధారణ పొలంలో సాగుకయ్యే నీటిలో 20 వంతు నీటితోనే సాగు చేసుకుని నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ విధానంలో పోషక ద్రావణాన్ని పునర్వినియోగించుకోవడం పల్ల సాగువ్యయాన్ని తగ్గించుకొని కలుపు సమస్యలు కూడా అరికట్టవచ్చు. సాగు కోసం ఎంచుకున్న పంటను బట్టి ఉష్ణోగ్రత కాంతి తీప్రతతో పాటు ఇతర పాదార్థిక సంఘటనలను మార్చుకోగలదు. తద్వారా మంచి దిగుబడిని అనుకున్న సమయానికి పొందవచ్చు. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టి లేకుండా సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తుల కొరత తీరడమే కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఈ విధానంలో మొక్కలు 20 నుంచి 50 శాతం వేగంగా పెరుగుతాయి. హైడ్రోపోనిక్స్ వ్యవసాయం మన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి సీజన్, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా వివిధ రకాల పంటలు పండించుకోవచ్చు. నేడు వ్యవసాయం చేయడం భారంగా మారడంవల్ల అందరూ ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారు. భవిష్యత్తులో సాగుభూమి తగ్గిపోయి ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుచేతనే శాస్త్రవేత్తలు హైడ్రోపోనిక్స్ వ్యవసాయంపై అనేక ప్రయోగాలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో వ్యవసాయం ప్రాంతాలలో కూడా చేసుకోవచ్చు. హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం ఆలోచన శాస్త్రవేత్తల మదిలో 16వ శతాబ్దంలోనే మొదలైంది. కానీ అవి ప్రయోగశాలల వరకే పరిమితమైంది. ఇటీవల కాలంలో మాత్రమే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో కూరగాయలు, ఆకుకూరల సాగుకు హైడ్రోపోనిక్స్ వ్యవసాయం మొదలుపెట్టారు. అమెరికాలోని లాన్వెగానస్ లో మొట్టమొదటి సారిగా హైడోఫోనిక్స్ సేద్యం ప్రారంభించారు. విప్లవాత్మక మార్చులతో హైడోపోనిక్స్ సాగు అమెరికాలో ప్రస్తుతం పది లక్షల కుటుంబాలు సాగుచేస్తున్నాయి. దుబాయిలో ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోఫోనిక్ ఫార్మ్ నిర్మాణం జరిగింది. ఆ స్ఫూర్తితోనే మన దేశంలోనూ పలువురు జాత్సాహిక రైతులు హైడ్రోపోనిక్స్ వ్యవసాయం పట్ల ఆసక్తి చూపుతున్నారు. హైడోఫోనిక్స్ విధానం ద్వారా మానవుని భవిష్యత్తు అవసరాలు తీర్చవచ్చు. 2025 నాటికి ప్రపంచ వ్యవసాయ మార్కెట్లో హైడోఫోనిక్స్ పంటలు ఎక్కువ శాతం లభ్యమవుతాయని శాస్త్రవేత్తల అంచనా. 2050 నాటికి పట్టణ ప్రాంతాలలోనే 60 శాతం హైడ్రోఫోనిక్స్ ద్వారా కూరగాయలను పండించుకుంటారని ఒక అంచనా. హైడ్రోపోనిక్స్ వ్యవసాయం ఆరు రకాల పద్ధతులలో చేస్తారు. అందులో ఎక్కువగా NFT పద్ధతిలో సాగుచేస్తారు. NFT అంటే న్యూటియన్స్ విలింలేయర్ టెక్నిక్స్. ఇందులో దీర్ధచతుర ప్రాకారంలో ఓ తడితొట్టెలో కావలసిన మొక్కలను పెల్టేసి మొక్క పడిపోకుండా జడపదార్థంగా బంకమన్ను ఉండల మధ్య పెడతారు. ఈ ఉండలు గుండ్రంగా తేలికగా ఉండటం వలన మొక్క వేర్తకు కావలసిన స్థిరత్వాన్ని ఆక్సిజన్ ను అందిస్తాయి. 20, 25 రోజులలో వెంక్క శెరుగుతుంది. విచితమేమిటంటే వేరు ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాండం ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వొుక్కకు కృత్రివుంగా నీటిని, ఖనిజ లవణాలను, ఆక్సిజన్‌ను, కార్బన్ డయాక్సైడ్ను, కాంతిని అందించడం వలన ఎటువంటి ఆటంకం లేకుండా మొక్క పెరుగుతుంది. ఇందులో ఉండే మరొక ఉపయోగం నీరు ఎట్టి పరిస్థితుల్లో వృథా కాదు. నేలలో నీటిని పోసినప్పుడు కొంత నీరు ఆవిరవుతుంది, కొంత నీరు నేలలోకి ఇంకి వృథా అవుతుంది. కానీ ఈ పద్ధతిలో ఛానల్ ద్వారా నీరు ప్రవహిస్తూ మొక్కకు ఎంత అవసరమో అంతే నీరు అందిస్తూ మిగిలిన నీరు తిరిగి రిజర్వాయర్‌లోకి చేరుతుంది. హైడ్రోపోనిక్స్ యొక్క మరొక ఉపయోగం మొక్కలకు తెగుళ్ళు రాకపోవడం. ఇన్ని ఉపయోగాలు ఉన్న హైడోపోనిక్స్ సాగు గురించి జెత్సాహిక రైతులకు ప్రోత్సాహకాలు అవసరం. ప్రభుత్వాలు కుడా పాలిహౌస్ ఫార్మింగ్‌కు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తున్నట్లుగా హైడోపోనిక్స్ సాగుకు కూడా సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధారం : Vigyan Prasar