శాస్త్రవేత్తలకే కాకు౦డా, పంటలలో వైవిధ్యాన్ని ఎన్నో ఏళ్ళుగా కాపాడంతూ, వంగడాల అభివృద్ధికి మూల కారణమైన రైతులకి కూడా వంగడాల రక్షణ హక్కులు వుండాలని భారత ప్రభుత్వం మొక్కల రకాల మరియు రైతు హక్కుల రక్షణ చట్టం - 2001ని రూపొందించింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో “మొక్కల రకాల రక్షణ మరియు రైతు హక్కుల ప్రాధికార సంస్థ (PPV & FRA) స్థాపించింది. ఈ సంస్థ ద్వారా రైతు/శాస్త్రవేత్త/సంస్థ/సామాజిక సంఘము కొత్త లేదా సాంప్రదాయ/రైతు రకాలని రూపొందించి యాజమాన్య మరియు లాభాలు సెంచుకొనే హక్కు పొందుటకు వీలు కల్పించబడినది. మొక్కల రకాల మరియు రైతు హక్కుల చట్టం - 2001లో రైతు హక్కులు విత్తనములు : రైతులు తమ విత్తనాలను లేదా ఫైనేట్ కంపెనీల విత్తనాలనైనా దాచుకొని తిరిగి వాడుకునే వీలు ఈ చట్టము ద్వారా కల్పించబడినది. (సంకరజాతి విత్తనాలను దాచుకొని తిరిగి వాడుకునే వీలు సాంకేతిక పరంగా లేదు). రైతులు తమ పొలములో పండించిన ఏ విత్తనాన్నైనా ఇతర రైతులతో మార్చు కోవచ్చు, పంచుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇతరరైతులకు విత్తనాలను అమ్ముకునే / పంచుకునే / మార్చుకునే సమయంలో ఇతరుల రకం పేరుగాని, బ్రాండ్ సేరు గాని, సంస్థ పేరుతో ఉన్న సంచులను గాని వాడరాదు. దేశీయ/విదేశీయ విత్తనాభివృద్ధిలో “విత్తనం మొలకెత్తే గుణాన్ని అరికట్టే జన్యువుల (టెర్మినేటర్ జీన్)” వాడకాన్ని నిషేదించారు. రక్షణ పొందిన వంగడాలు 3 సంవత్సరాల తర్వాత కూడా రైతుకి అందకపోతే, రైతు హక్కుల ప్రాధికారిక సంస్థకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ ఫిర్యాదుని నిర్దారించుకొన్న తర్వాత తప్పనిసరి అనుమతి పత్రం ద్వారా ఆ కొత్త వంగడము మీద ఉన్న గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి మరో సంస్థకు బదలాయించి సరియైన ధర మరియు సమయానికి కొత్త వంగడము రైతులకు అందజేసే వీలు ఈ చట్టము కల్పిస్తుంది. పాత / సంప్రదాయ వంగడములు రైతు సంస్థలు గాని, సామాజిక సంస్థలు గాని, ప్రభుత్వేతర సంస్థలు గాని, పాత / రైతు సాంప్రదాయ వంగడాలను “మొక్క రకాల రక్షణ మరియు రైతు హక్కుల ప్రాధికార సంస్థ” నందు నమోదు చేసుకోవచ్చు. అలా నమోదు చేసిన రకాలను తామే స్వయంగా పండించి విత్తనముగా అమ్మే హక్కు కేవలం రైతులకు మాత్రమే కల్పించబడినది. ఈ నమోదులకు సంబంధించి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరము లేదు. కొత్త వంగడములు రైతులు కూడా, శాస్త్రవేత్తల వలె కొత్త వంగడాలను రూపొందించి నమోదు చేసుకునే వీలు ఈ చట్టము కల్పించింది. దీనికి సంబందించి రైతులకు ఎటువంటి విద్యార్హతలు అవసరము లేదు. ఈ నమోదు గుర్తింపు పొందడానికి శాస్త్రవేత్తలు రూపొందించిన వంగడాలకు వర్తించే పరీక్షలు మరియు నియమ నిబంధనలే రైతులకు కూడా వర్తిస్తాయి. రాయితీలు / గుర్తింపులు రక్షణ పొందడానికి, వాటికి అవసరమైన పరిస్థితులకు, రక్షణ కాలము అయిపోతే తిరిగి పొందడానికి, లాభాలు పొందుటకు సెట్టుకునే అర్జీలు మొదలగు వాటికి సంబంధించి చెల్లించే రుసుముల నుండి రైతులను మినహాయించారు. అయినప్పటికీ, వివాదాల సమయంలో వకీలు రుసుము మరియు ఇతర ఖర్చులను రైతులే భరించవలసి ఉంటుంది. చట్టాల గురించి తెలియక రైతులు ఏమైనా పొరపాట్లు చేసినట్లైతే, వాటిని అమాయకముగా (Innocent Infringement) తెలియక చేసిన తప్పులుగా రెతు నిరూపించుకోగల్లినట్టె తే కోర్మువారు విధించే శిక్ష నుండి రైతును మినహాయించే వీలు చట్టములో పొందుపరచబడినది. పంటల వైవిధ్యతను కాపాడుతూ, సాంప్రదాయ రకాలను వృద్ధిపరుస్తూ, అధిక దిగుబడి, రోగ నిరోధకశక్తి కలిగి వున్న వంగడాలను అందించే రైతుల లేదా రైతు సమూహాలకు గుర్తింపు మరియు సత్కారము పొందే అవకాళవం ఉంది. దీని కొరకు “జాతీయ జన్యు నిధి”ని ప్రత్యేకముగా ఏర్పాటుచేశారు. లాభ పంపకము రైతు లేదా రైతు సమూహాల వంగడాలను, కొత్త రకం అభివృద్ధి చేయడానికి ఎవరైనా వాడినట్లుగా నమోదు ఆర్టీలో వ్యక్తపరిస్తే, ఈ కొత్త రకాలు అమ్మడం ద్వార వచ్చే లాభంలో వాటి పొందే హక్కు రైతులకు కల్పించబడింది. కొత్త రకాల నమోదు ఆర్టీలో మూల రకాల వివరాలు (శేరు, మూలం, తరాలు, లక్షణాలు, సేకరించిన భౌగోళిక వివరాలు) తప్పనిసరిగా పొందుపరచాలి. మొక్కల రకాల పరిరక్తణ కా బ్రతు హక్కుల ప్రా ప్రాధికార స౦స లాభంలో వాటా వంతును రైతు హక్కుల ప్రాధికార సంస్థ నిర్ధారిస్తుంది. అలా నిర్దారించిన సొమ్మును జాతీయ జన్యు నిధి సంస్థ నియమ నిబంధనలకి అనుగుణంగా పంపిణీ చేస్తుంది. నష్టపరిపోరము రైతు హక్కుల ప్రాధికార సంస్థలో నమోదు చేయబడిన వంగడాలు, నిర్ధారిత ప్రమాణాలకు అనుగుణంగా పండించినప్పటికీ, చెప్పబడిన దిగుబడి ఇవ్వనిచో, నియమ నిబంధనలకు లోబడి నష్ట పరిహారము కోరే వీలు రైతులకు ఈ చట్టం కల్పిస్తుంది. నమోదు చేసుకునేటప్పుడు ఎక్కువ దిగుబడి / లాభాలు చూసించి, తరువాత రైతులకు నష్టాలు కలుగుతున్నట్లైతే అటువంటి కంపెనీలు లాభపడటాన్ని ఈ చట్టము అరికడుతుంది. ఆధారం : KRISHI ICAR