ఫాస్ఫరస్ కరిగించే జీవ ఎరువు ఉపయోగాలు వ్యవసాయంలో వంటల పెరుగుదలకు అవసరమైన ప్రధాన పోషకాల్లో ఫాస్ఫరస్ అత్యంత కీలకమైనది. వేర్ల అభివృద్ధి, పుష్పించడం, గింజల ఏర్పాటుకు, మొక్కల ప్రారంభ ఎదుగుదలకు ఇది. ఎంతో అవసరం. అయితే రైతులు నేలలో డి.ఏ.పీ., సూపర్ ఫాస్ఫేట్ వంటి ఎరువులను అధికంగా ఉపయోగిస్తున్నప్పటికీ, వాటిలోని ఫాస్ఫరస్లో ఎక్కువ భాగం నేలలోని కాల్షియం, ఇనుము, అల్యూమినియం వంటి మూలకాలతో కలిసి మొక్కలకు అందని రూపంలో స్థిరపడిపోతుంది. ఫలితంగా మొక్కలు ఫాస్ఫరస్‌ను పూర్తిగా వినియోగించుకోలేకపోతాయి.ఈ నమన్యకు నమర్థవంతమైన, పర్యావరణహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం ఫాస్ఫరస్ కరిగించే జీవ ఎరువు. పి.ఎస్.బి. అంటే ఏమిటి? పి.ఎస్.బి. అనేది నేలలో మొక్కలకు అందని రూపంలో ఉన్న ఫాస్ఫరస్ ను కరిగించి, మొక్కలు సులభంగా గ్రహించగల రూపంలోకి మార్చే ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సమూహం. వీటిని జీవ ఎరువుల రూపంలో రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. పి.ఎస్.బి. వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు నేలలో స్థిరపడిన ఫాస్ఫరసు మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కల ఎదుగుదల వేగంగా జరుగుతుంది. డి.ఏ.పీ. వంటి ఫాస్ఫరస్ ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రసాయన ఎరువుల అవసరాన్ని కొంత మేర తగ్గిస్తుంది. దిగుబడి, పంట నాణ్యత మెరుగుపడుతుంది. పర్యావరణానికి హాని కలిగించకుండా సుస్థిర వ్యవసాయానికి తోడ్పడుతుంది. పి.ఎస్.బి. ఎలా ఉపయోగించాలి ? విత్తన శుద్ధి ఒక ఎకరానికి సుమారు 200 గ్రాముల పి.ఎస్.బి. ఎరువు సరిపోతుంది. 10 శాతం బెల్లం లేదా చక్కెర ద్రావణంతో కలిపి విత్తనాలకు బాగా పట్టించాలి. నీడలో 30 నిమిషాలు ఆరబెట్టి వెంటనే విత్తాలి. నేలలో వినియోగం పశువుల ఎరువు లేదా కంపోస్టుతో కలిపి నేలలో వేయవచ్చు. నేలలో తగిన తేమ ఉన్నప్పుడు వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు గడువు ముగియని పి.ఎస్.బి. ప్యాకెట్లను మాత్రమే ఉపయోగించాలి. రసాయన పురుగుమందులు లేదా ఫంగిసైడ్లతో నేరుగా కలపకూడదు. చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. విత్తన శుద్ధి చేసిన వెంటనే విత్తడం మంచిది. వ్యవసాయ వ్యయాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫాస్ఫరస్ కరిగించే జీవ ఎరువు (పి.ఎన్.బి.) వినియోగం రైతులకు ఎంతో లాభదాయకం. ఇది నేలలో ఇప్పటికే ఉన్న ఫాస్ఫరసన్ను సమర్థవంతంగా వినియోగించేలా చేసి, రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గిస్తుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల ప్రతి రైతు తన పంటల్లో పి.ఎస్.బి. జీవ ఎరువును వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం.