రైతు సమగ్ర సర్వే చేపట్టి భూముల వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోవడం పూర్తయ్యింది . ఇదే క్రమంలో రైతు సమన్వయ సమితులు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకోసం ఎంపిక చేసిన అధికారులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 31 ఆగష్టు 2017న శిక్షణా కార్యక్రమం నిర్వహించంది. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు మండలాల వారీగా రైతు సమన్వయ సదస్సులు,శిక్షణా కార్యక్రమం, గ్రామ సభలు జరప నిశ్చయించారు. 15 సెప్టెంబర్ 2017 నుంచి 31 డిసెంబర్ 2017 నాటికీ రెవిన్యూ గ్రామం యూనిట్ గా భూ రికార్డుల ప్రక్షాళన చేయాలనేది రాష్ట్ర నిర్ణయం. భూయాజమాన్యం మారినప్పుడల్లా ఎటువంటి ఆటంకం లేకుండా వీలైనంత తక్కువ సమయంలో ర్వేన్యు రికార్డులను నవీకరణ (అప్ డేట్) చేసేందుకు సమాచార సాంకేతిక ఆధారిత వ్యవస్ధను అభివృద్ధి చేసి పసుబుక్కులను రైతుల ఇంటి వద్దేకే చెర్చీ విధంగా ప్రక్రియ చోదక వైఖరిని (ప్రోజేస్ డ్రివెన్ అప్రోచ్) అనుసరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం . రెవెన్యూ గ్రామంలో గ్రామ రైతు సమన్వయ సమతి సభ్యుల సంఖ్య 15 గాను, మండల రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య 24 గాను, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య 24 గాను, రాష్ట్ర రైతు సమన్వయ సమతి సభ్యులు సంఖ్య 42 గాను నిర్ణయించారు. రైతులు గ్రామంలో నివసించే వారై, వ్యవసాయం చేస్తున్న వారై, పట్టాదారులై ఉండాలి. అన్ని కులాల, మతాల వర్గాల పొందిక రైతు సమన్వయ సమితిలో ఉండేలా చూసుకోవాలి. మూడవ వంతు మంది మహిళలు అయి ఉండాలి. భూప్రక్షాళన చేపట్టక అసలు రైతులను గుర్తించాక ప్రభుత్వం అమలు చేయనున్న పధకాలు సజావుగా రైతులకు అందిచడం అసలు ఉద్దేశం. మన రాష్ట్రంలో 10,733 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయ రెవెన్యూ, సహకార, అనుబంధ రంగాల అధికారులతో కూడిన దాదాపు 1193 బృందాలు, ప్రతి బృందం 9 గ్రామాల చొప్పున ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రామాన్ని పూర్తి చేయాలి. రైతులకు ప్రభుత్వ పరమైన సహకారం, వివిధ రకాల పధకాల అమలులో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, అందులో భాగంగా వ్యవసాయశాఖ ముందుకు సాగుతోంది. ఆ క్రమంలో అటు రైతులు, ఇటు వ్యవసాయ. అనుబంధ రంగాల సిబ్బంది దూర దృష్టితో , వ్యవసాయశాఖ సిబ్బందికి బక్రీద్, బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక