తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు గత మూడు రోజుల వాతావరణం: గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (ఈరోజు మధ్యాహ్నం 1300 గంటల ఆధారంగా): హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చును. పగటి ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న మరియు మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చును. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ మరియు బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చును. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలకు నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. వరి వరి పంట దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు పొలంలో 2 సెం.మీ. నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతని బట్టి పొలంలో 2 సెం.మీ. లేదా 5 సెం. మీ. నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువ ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకూ ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 0.6 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వారిలో ఆకునల్లి మరియు కంకినల్లి ఆశించే అవకాశం ఉన్నది. నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి (కంకివెన్ను 10 శాతం కన్న తక్కువ ఉన్నప్పుడు మందుల పిచికారి చేసుకోవాలి, కంకివెన్ను 10 శాతం కన్న ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారి చేసినచో దిగుబడి తగ్గుతుంది) వరిలో కాండం కుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు 1.0 మి.లీ ప్రోపికొనజోల్ లేదా 2.0 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుండి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు కావున రైతులు పైరుకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు (అధిక ఉష్ణోగ్రతలు మరియు భూమిలో ఎక్కువ తేమ) మొక్కజొన్నలో పాము పొడ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, తెగులు ఆశించిన క్రింది భాగంలోని (1లేదా 2) ఆకులను తీసివేయాలి 1మి.లీ. ప్రోపికనజోల్ లేదా 2మి.లీ. హెక్సాకొనజోల్ లేదా 2మి.లీ. వాలిడామైసిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పెసర మరియు మినుము పూత దశలో ఉన్న పెసర మరియు మినుము పంటలకు )35-40 రోజుల తేలికపాటి నీటి తడి ఇవ్వాలి ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర మరియు మినుము పంటలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2మి.లీ. ఫిప్రోనిల్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేరుశనగ యాసంగిలో ఆలస్యంగా సాగు చేసిన వేరుశనగ గింజ అభివృద్ధి దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మి.లీ. హేక్సాకోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. నువ్వులు 40 నుండి 50 రోజుల దశలో ఉన్న నువ్వుల పంట పూత మరియు కాయ ఏర్పడుతుంది కాబట్టి పంటను నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శాకీయ దశలో ఉన్న నువ్వుల పంటలో రసంపీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.0 గ్రా. ఎసిఫేట్ లేదా లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరప ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.5గ్రా. అసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3గ్రా. థయోమిథాక్సం లేదా 1.0గ్రా. డైఫెన్ థయోరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. మిరపలో కాయకుళ్ళు మరియు కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బెండ ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులు బెండలో తెల్ల దోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.6 మి.లీ. మొనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేనియెడల పల్లాకు తెగులు వ్యాప్తి చెందును. టమాట ప్రస్తుత పరిస్థితులలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వలన తామర పురుగుల ఉదృతి పెరిగి టమాట స్పాటేడ్ విల్ట్ వైరస్ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తామరపురుగుల నివారణకు 2మి.లీ. డైమిథోయెట్ లేదా 2మి.లీ. మిథైల్ డెమటాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో సూది పురుగు గమనించడమైనది. నివారణకు 1.5 మి.లీ. నోవాల్యూరాన్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.25 మి.లీ. ప్లూబెండమైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉల్లి ఉల్లిలో తామరపురుగులు గమనించడమైనది. నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్ + 2.5 గ్రా. మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి 8-10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తీగజాతి కూరగాయలు పెరుగుతున్న ఉష్నోగ్రతల వలన తీగజాతి కూరగాయ పంటలలో పెంకు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2మి.లీ. క్లోరిపైరిపాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన తీగజాతి కూరగాయ పంటలలో పెనుబంక ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్ లేదా మిథైల్ డేమటాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేసవిలో తీగజాతి కూరగాయ పంటలలో పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది. నివారణకు పండు ఈగ ఎరలను ఎకరానికి (క్యూలూర్) 4-8 చొప్పున అమర్చుకోవాలి. వేసవిలో తీగజాతి కూరగాయ పంటలలో రసంపీల్చే పురుగుల ఉదృతిని తగ్గించుకోవడానికి పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఎకరానికి 20-30 వరకు పెట్టాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయ పంటలలో బంక తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 2.5గ్రా. రిడోమిల్ లేదా 1మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బొప్పాయి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బొప్పాయి పంటలలో రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.5గ్రా. ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. జామ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు జామలో తెల్లసుడి దోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు, జిగురు పూసిన పసుపు రంగు అట్టలను తెల్ల దోమ ఆశించిన చెట్ల దెగ్గర ఉంచాలి. ఉదృతి తక్కువగా ఉన్న మొక్కల కొమ్మలను కత్తిరించి 5మి.లీ. వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. జామలో ఎండు తెగులు ఆశించిన మొక్కలు పైనుండి క్రిందకి ఎండిపోతాయి. నివారణకు, 2.5 గ్రా. కార్బండజిమ్ లేదా మాంకోజేబ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును పది రోజుల వ్యవధిలో మూడు సార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. చెరకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చెరకులో పీక పురుగు / కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.6మి.లీ. మొనోక్రోటోఫాస్ లేదా 2.5మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 0.75మి.లీ. క్లోరాంట్రినిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బత్తాయి మరియు నిమ్మ బత్తాయిలో మంగునల్లి గమనించడమైనది. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా 3మి.లీ. డైకోఫాల్ లేదా 1మి.లీ. ప్రాపర్ జైట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నిమ్మలో పల్లాకు తెగులు గమనించడమైనది. న్వారణకు 5గ్రా. జింక్ సల్ఫేట్ + 2గ్రా. మాంగనీస్ సల్ఫేట్ + 2గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ + 2గ్రా. ఫెర్రాస్ సల్ఫేట్ + 1గ్రా. బోరాక్స్ + 6గ్రా. క్యాల్షియం లేదా సున్నం + 10గ్రా. యూరియా మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మామిడి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో 75 శాతం పిందె కట్టిన తోటల్లో తేలికపాటి మొదటి తడి ఇవ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మామిడిలో తేనెమంచు పురుగులు మరియు తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు పూమొగ్గ దశలో 2 మి.లీ డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రా. థయోమిథక్సిన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయలు బటాని గింజ సైజులో ఉన్నప్పుడు 1.5గ్రా. ఎసిఫేట్ లేదా 2మి.లీ. డైమిథోయెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఆశించిన తేనెమంచు పురుగులు, తామర పురుగులు మరియు బూడిద తెగులుతో పాటు నీటి ఎద్దడి మామిడిలో కాయ రాలుటకు అనుకూలం. పురుగు నివారణతో పాటు తోటకు 1%యూరియా లేదా 1% నత్రజని మరియు పొటాషియం మిశ్రమ మందును (13-0-45) మామిడి కాయలు నిమ్మపండు పరిమాణంలో ఉన్నప్పుడు 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. మామిడిలో పిందె రాలుటను నివారించుటకు 2.5 మి ప్లానోఫిక్స్ మందును .లీ.10 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)& అధిపతి తెలంగాణా రాష్ట్ర జిల్లాల రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు నాగర్ కర్నూల్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు జోగులాంబ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు నల్గొండ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు మేడ్చల్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు మెదక్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమెన వ్యవసాయ సలహాలు రంగారెడ్డి జిల్లా రెైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు సంగారెడ్డి జిల్లా రెైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు సిద్దిపేట జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు సూర్యాపేట జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు వికారాబాద్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు వనపర్తి జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు వరంగల్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు యాదాద్రి - భువనగిరి జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు జన్గోయన్ జిల్లా రైతాంగానికి వాతావ్రణాధారమైన వ్యవసాయ సలహాలు