తెలంగాణ రాష్ట్రంలో సీతాఫలం పంటను ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లలో చాలా విస్తృతంగా సాగుచేస్తున్నారు. తర్వత నల్గొండ, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పండించే పంట. ఈ ఫలంతో కావాల్సిన విటమిన్లు (ఎ.సి) కార్బోహైడ్రైట్స్ (చెక్కెర), మినరల్స్ (కాల్షియం, పోటాషియం, మేగ్నిషియం) పుష్కలంగా లాభిస్తాయి. వీటి గుజ్జును ఇస్క్రీం పరిశ్రమల్లో వాడుతారు. గింజల నండి తీసిన నూనెను వ్యవసాయంలో క్రిమిసంహరక మందులుగా వినియోగించవచ్చు. సీతాఫలం పంటను వర్షాలు పడని మెట్ట ప్రాంతంలో సాగుచేసి అధిక దిగుబడులు పొందవచ్చు. సీతాఫలం చెట్లు సాధారణంగా బీడు భూముల్లో, గుట్ట ప్రాంతాల్లో, పొలాల గట్లపై అడవి ప్రాంతాలలో పెరుగుతాయి. అయితే కాకుండా డ్రిప్ పద్ధతిలోను సాగుకు అనుకూలమైన పంట. ఇన్ని లాభాలు ఉండడం వలన రైతులు ఈ మధ్యకాలంలో సీతాఫలం తోటల సాగుకు సుముఖత చుపుతున్నారు. అయితే సీతాఫలం పంటను ఆశించే ముఖ్యమైన పురుగు పిండినల్లి. ఇది తెలంగాణలో సీతాఫలం సాగులో ఎదురయ్యే పెద్ద సమస్య. ఇందుకు గాను రైతులు తగిన సమయంలో గుర్తించి వీటి నివారణ తోడ్పడగలరు. పిండినల్లి గుర్తింపు తల్లి, పిల్లపురుగులు పొడవాటి అండాకారం ఆకారం కలిగి తెలుపు వర్ణపు పదార్దాలను దేహంచుట్టూ కప్పుకొని ఉంటాయి. ఇవి గుంపుల గుంపులుగా సంచరిస్తాయి. లక్షణాలు ఈ పురుగులు ఆశించిన చెట్ల ఆకులు, పుష్పాల కొమ్మలు, కాయలు ఎదుగుదల తగ్గి పోయి ఆకులు పసుపు వర్ణంలోకి మారుతాయి. ఫలాలు / కాయలు ఆకారం, సైజులలో, నాణ్యత, దిగుబడి తగ్గి మార్కెట్ తక్కువ ధర పలుకూతాయి. ఇవి ముఖ్యంగా ఫలం మధ్య పగుళ్ళలోను ఆకుల కిందిభాగంలోను, కొమ్మల పై భాగాలలో ఒక తెల్లని తేటలాగా అగుపిస్తాయి. పిండి నల్లి యాజమాన్య పద్ధతులు సాగుచేసే తోటల్లో వివిధ రకాల ఆశ్రయ మొక్కలను లేకుండా బాగా దున్నుకోవాలి. దున్నడానికి అనువైన సమయం నవంబర్ మాసం. పిండినల్లి ఆశించిన కొమ్మలు, ఆకులు, ఫలాలు / కాయలను ఏరిపారేయాలి. పిండినల్లికి నిరోధకత ఉన్న రకాలను ఎన్నుకోవాలి. నీటిని వరదగా పారించడం వలన కొంత వరకు దీని ఉధృతిని తగ్గించవచ్చు. పరాన్న భుక్కులైన క్రిప్టోలేమాస్ మంట్రోజరి బిటల్స్ లేదా స్కిమ్నాస్ కాక్సివారాను పదింటికి ఒక చెట్టు చొప్పున విడుదల చేయాలి. రసాయన మందులైన డైమిధోయేట్ / ఫాస్పామిడాన్ / డైక్లోరోవాస్ 0.05 శాతం పిచికారీ చేయడం వలన పిండి నల్లి ఉధృతిని తగ్గించవచ్చు. సితాఫలంలోని ముఖ్యమైన రుగ్మతలు – నివారణ స్టోన్ ఫ్రూట్ : సీతాఫలం తోటలలో కనిపించే ఎదురయ్యే సమస్య స్టోన్ ఫ్రూట్. ఇది వాతావరణంలో మార్పులు, పోషకాలు లోపం వల్ల ఏర్పడుతుంది. స్టోన్ ఫ్రూట్ లో కాయ పెరగాల్సిన సైజు పెరగకుండా చాలా చిన్న సైజులో ఉండి చాలా ధృడమైన / గట్టిగా ఒక రాయివలే మారుతాయి. సాధారణంగా నవంబర్ – డిసెంబర్ మాసంలో దీనిని ఎక్కువగా గుర్తించవచ్చు. ఎందుకంటే పోషకాల ఎద్దడి, కాయల మధ్య పోటి. నివారణ : ఫాస్పరస్ ఫెర్టిలైజర్స్ ను., బోన్ మీల్ సరైన మోతాదులో వాడితే దీనిని అరికట్టవచ్చు. అంతేకాకుండా సరైన సమయంలో కోత కోయడం తప్పనిసరి. ఫ్రూట్ క్రాకింగ్ / పండ్లలో చీలీకలు ఏర్పడడం : పండ్లతో చీలికలు అనేవి ముఖ్యంగా అధికంగా వర్షానికి గురైన తర్వాత కొన్ని వారాల వరకు పొడి వాతావరణానికి గురైన పండ్లలో వస్తాయి. దీనిని నివారించడానికి తోటలలో సరైన సమయంలో నిర్దారించిన మోతాదులో నిటిని పారించడం, భూమిలో తేమ ఉండేలా చేసుకోవడం వలన కొంత వరకు నివారించవచ్చు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక