ఏ దేశానికైనా రైతు ఎంత ముఖ్యమో ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తోంది. రైతంటే ఆహార ప్రదాత మాత్రమే కాదు.. దేశానికే వెన్నెముక, శాంతి, యుద్ధం రెండింటా దేశానికి మూలస్తంభం. దేశ రక్షణకు ఆయుధం ఒక్కటే చాలదు... నాగలి కూడా అత్యావశ్యకం, పొలంలో ధాన్యం పండించేవాడే యుద్ధంలో గెలవడానికి పునాది వేస్తాడు. కాబట్టి, సైనికులు- రైతులు ఇద్దరూ దేశ రక్షకులే. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఊతమిస్తున్నది ఈ దృక్పథమే. దేశానికి అన్నం పెట్టే రైతులే వికసిత భారత్ స్వప్న సాకారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, అందువల్ల, కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ అహర్షిశలూ కృషి చేస్తోంది. విత్తనం నుంచి విపణిదాకా రైతుకు అండగా నిలుస్తోంది. సంప్రదాయ.. ప్రకృతి వ్యవసాయంపై పెరిగిన శ్రద్ధ సంప్రదాయ వ్యవసాయాభివృద్ధి పథకం (పీకేవీవై) దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన తొలి కీలక పథకం పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) 2015-16లో ప్రారంభమైంది. 28.34 లక్షల మంది రైతులు 2025 అక్టోబరు 31 నాటికి లబ్ది పొందగా, సేంద్రియ వ్యవసాయం కోసం 16.90 లక్షల హెక్టార్ల భూమిని 58,156 సముదాయాల కింద ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. జాతీయ వెదురు కార్యక్రమం దేశంలోని 23 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (జమ్ముకశ్మీర్)లో జాతీయ వెదురు కార్యక్రమం కింద వెదురు సాగు, కోత, క్రయవిక్రయాలకు ప్రోత్సాహం, దేశవ్యాప్తంగా అత్యధిక (13.96 మిలియన్ హెక్టార్లు) విస్తీర్ణంలో వెదురు సాగవుతోంది. వెదురు వైవిధ్యంలో చైనా తర్వాత భారత్ రెండో సుసంపన్న దేశం కాగా- వెదురు, వెదురు ఉత్పత్తుల పరిశ్రమ విలువ 728,005 కోట్లుగా ఉంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2024 నవంబరు 25న ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15,000 సముదాయాలలో 7.5 లక్షల హెక్టార్ల మేర ప్రకృతి వ్యవసాయం చేపట్టడం దీని లక్ష్యం కాగా, మొత్తం కోటి మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. 14.3 లక్షల మందికి పైగా రైతులు 2025 ఆగస్టు నాటికి జాతీయ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం కింద నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 5.45 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో ప్రకృతి వ్యవసాయం సాగుతుండగా, ప్రతి రైతుకూ (ఒక్కొక్కరికి ఎకరా) రెండేళ్లపాటు ఎకరాపై ఏటా ₹4,000 వంతున ప్రోత్సాహకం లభిస్తుంది.. ఈశాన్య ప్రాంతం కోసం 'మిషన్ ఆర్గానిక్ వాల్యూ చెయిన్ డెవలప్మెంట్' ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పాదక క్లస్టర్ల ఏర్పాటు లక్ష్యంగా 2015-16లో ఈ పథకం ప్రారంభమైంది. దీనికింద రైతులకు మూడేళ్లపాటు) హెక్టారుకు 46,500 వంతున ప్రోత్సాహకం లభిస్తుండగా, 2024-25లో 2.69 లక్షల మంది లబ్ధి పొందారు. పంటల రక్షణతో సౌభాగ్యానికి బాట ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్బివై) ఈ పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా వన్యప్రాణుల వల్ల, పొలాల్లో వరదనీరు నిలిచిపోవడం కారణంగా వాటిల్లే నష్టంపైనా పరిహారం చెల్లించేలా నిబంధనలను సవరించింది. ఇది 2026 ఖరీఫ్ సీజన్ నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుంది. 92.92 కోట్ల మందికి పైగా రైతులు 55.48 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో 2026 జనవరి నాటికి పంటల బీమా రక్షణ పొందారు. వీరిలో 50 శాతానికి పైగా ఓజీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే. ₹1,91,620 కోట్ల మేర రైతులకు పరిహారం పంపిణీ కాగా, పంటల బీమా రుసుము కింద రైతులు చెల్లించింది ₹39,448 కోట్లు మాత్రమే. ఎరువులు నేడు 45 కిలోల యూరియా బస్తా అసలు ధర 1,633 కాగ ఆ భారం రైతులపై పడకుండా ప్రభుత్వం రాయితీ ధర ₹266 అందిస్తోంది. అలాగే ₹3,100 ధరగల 50 కిలోల 'డీఏపీ' బస్తాను రాయితీతో ₹1,350కే సరఫరా చేస్తోంది.దాదాపు 525 లక్షల టన్నుల మేర 2025లో యూరియాను ఉత్పత్తి చేశారు. భూసారం భూసారం-మట్టి సామర్థ్య నిర్వహణ పథకం ద్వారా ప్రభుత్వం ఎరువుల సముచిత వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కమతానికీ కనీసం మూడేళ్లకు ఒకసారి భూసార కార్డు జారీ చేస్తోంది. 25.61 కోట్ల భూసార కార్డులను 2014-15 నుంచి 2025 డిసెంబరు 9 వరకూ పంపిణీ చేశారు. అలాగే ఇప్పటిదాకా 40 ఆకాంక్షిత జిల్లాల్లో 290 లక్షల హెక్టార్ల భూమిపై మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం అధిక నీటి వినియోగంగల వరి వంటి పంటల సాగు నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజలు, ముతక ధాన్యాల వంటి ప్రత్యామ్నాయాల సాగు వైపు మళ్లీ విధంగా రైతును ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. విభిన్న వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు, వేల రకాలు, సాగు పద్ధతుల రీత్యా భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు 25 పంటల సంబందిత 184 కొత్త వంగడాలను రూపొందించారు. వీటిద్వారా పంటల వైవిధ్యీకరణ వేగం పుంజుకుంటుంది. పొలం చేరిన సాగు నీరు... రైతు భారం తగ్గిన తీరు పీఎం కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్వై) ప్రధానమంత్రి సాగునీటి పథకం (సీఎంకేఎస్వై) లో భాగమైన 'ప్రతి బొట్టు బలానికి అధిక ఫలం' (పర్ డ్రాప్ మోర్ కాప్) కార్యక్రమం 2015-16 నుంచి అమలవుతోంది. దీనికింద దేశవ్యాప్తంగా 96.97 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమికి సాగునీరందింది. ఇందు పిచికారీ (స్ప్రింక్లర్) సేద్యం వంటి సూక్ష్మసాగు పద్ధతుల ద్వారా పొలాల్లో జల వినియోగ సామర్థ్యం పెంపు దీని లక్ష్యం. ఈ పథకం కింద 63 ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడటంతో 2 కోట్ల నుందికి పైగా రైతులకు సాగునీటి పొరుదల సదుపాయం మెరుగుపడింది. 'పీఎంకేఎస్వై' కింద 2025-2026కు గాను ఉప పథకంగా 'ఆయకట్టు ప్రాంత అభివృద్ధి- జల నిర్వహణ ఆధునికీకరణ'కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనం వ్యవసాయ రంగం పరంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలతో రైతుకు ప్రయోజనం కల్పించే మార్పులు వచ్చాయి. గ్రామీణ సంక్షేమం, సుస్థిరతలో ఈ సంస్కరణలు ఒక మలుపు. దీనివల్ల రైతులకు సాగు వ్యయం తగ్గటమేగాక సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారు సంస్థలు కూడా అబ్ది పొందుతాయి. దేశంలో 1800 సీసీ కన్నా తక్కువ సామర్థ్యంగల ట్రాక్టర్లపై 12 నుంచి 5 శాతానికి, విడిభాగాలపై 18 నుంచి 5 శాతానికి 'జీఎస్టీ'ని తగ్గించారు. వాణిజ్య రవాణా వాహనాలపై పన్ను 28 నుంచి 18 శాతానికి తగ్గింది. శుద్ధి-నిల్వ చేసిన కూరగాయలు, పండ్లు, గింజలపై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించడంతో ఎగుమతులు పెరిగి, ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల కూడలిగా భారత్ స్థానం బలపడుతోంది. ఎరువుల తయారీకి వాడే అమ్మెనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ వంటి ముడి పదార్థాలపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల ఉత్పాదక వ్యయం తగ్గి, ఎరువులు సరసమైన ధరకు లభిస్తాయి. పశుసంవర్ధక మత్స ఉద్యాన రంగాలకు ప్రభుత్వ చేయూత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈ పథకాన్ని 2020 సెప్టెంబరు 10న ప్రభుత్వం ప్రారంభించింది. దీనివల్ల ఉత్పత్తిలో కొత్త రికార్డులు నమోదు కాగా, ఎగుమతులు పెరగడంతోపాటు సమ్మిళిత - సుస్థిర అభివృద్ధి ద్వారా మత్స్యకారులకు సాధికారత లభించింది. భారత్ నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఎదిగింది. 58 లక్షల మందికి ఈ పథకం ద్వారా జీవనోపాధి లభించగా. వీరిలో 99,018 మంది మహిళలున్నారు. గడచిన 11 ఏళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపును మించి పెరిగింది గోకుల్ మిషన్ ప్రపంచంలోని ఆవులలో 14 శాతం, గేదెలలో 57 శాతం వంతున పశుపంపడలో భారత్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. దేశీయ పశుజాతుల అభివృద్ధి, సంరక్షణ, పాల దిగుబడి - ఉత్పాదకత పెంపు లక్ష్యంగా 2014 డిసెంబరు 16న జాతీయ గోకుల్ మిషన్ ప్రారంభమైంది. లింగ నిర్దిష్ట వీర్య విభజన కేంద్రాల ద్వారా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో 128 కోట్ల డోసులు వీర్యకణోత్పత్తి చేయడంతో ప్రతి డోసు ధర ₹800 నుంచి ₹250కి తగ్గింది. 14.56 కోట్ల పశువులకు కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియ కింద వీర్యనిక్షేపం చేశారు. ఈ పథకం కింద 9.36 కోట్ల పశువులు నమోదు కాగా, 5.62 కోట్ల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరింది. వ్యవసాయ వనాల పెంపకం జాతీయ సుస్థిర వ్యవసాయ కార్యక్రమం కింద పంటలు-పంట విధానాలతోపాటు పొలాల్లో వ్యవసాయ వనాల పెంపకాన్ని పోత్సహించేందుకు ఉప-కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 3.93 కోట్ల హెక్టార్ల భూమి దేశవ్యాప్తంగా వ్యవసాయ ననాల పెంపకం కిందకు వచ్చింది. భారత్, ఇండోనేషియా దేశాల సంయుక్త వ్యవసాయ వన విస్తీర్ణం ఆసియా దేశాలన్నిటిలోని దాదాపు 100 శాతం విస్తీర్ణంతో సమానం కాగా, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 70 శాతంగా ఉంది. జాతీయ తేనెటీగల పెంపకం తేనె కార్యక్రమం స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమంలో భాగంగా మధుర విప్లవం' (స్వీట్ రివల్యూషన్) లక్ష్యం దిశగా జాతీయ తేనెటీగల పెంపకం తేనె కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తేనె ఎగుమతిలో 2020 నాటికి భారత్ 9వ స్థానంలో ఉండగా, 2025 జూలై నాటికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఆవిర్భవించింది. 1.07 లక్షల టన్నుల మేర 2023-24లో సహజ తేనెను భారత్ ఉత్పత్తి చేసింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో రైతులు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ వ్యవసాయ మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. ఇందులో అగ్రిస్టాక్, వ్యవసాయ నిర్ణయ సహాయ వ్యవస్థలు, సమగ్ర భూసార, వివరాల నమోదు వ్యవస్థ, ఐటీ కార్యక్రమాలు ప్రధానమైనవి. 15,000 డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలుపగా, వీటిలో ఇప్పటికే 1,094 పంపిణీ చేయడంతోపాటు 'డ్రోన్ దీదీ'లకు సమగ్ర శిక్షణ కూడా పూర్తిచేశారు. 7.68 కోట్లమంది రైతులకు 14 రాష్ట్రాల్లో 2025 డిసెంబరు 4 నాటికి గుర్తింపు లభించింది. సీఎం కిసాన్ యోజన కింద రాష్ట్రాల పరిధిలో రైతులకు గుర్తింపు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2,096 వ్యవసాయ అంకుర సంస్థలకు జాతీయ వ్యవసాయ అభివృద్ధి పవరం. ໐໖ 2010-2020 2025-26 మధ్య సాంకేతిక-ఆర్థిక సహాయం అందుతోంది. తద్వారా వ్యవసాయ పారిశ్రామికవేత్తలతోపాటు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అభిస్తుంది. దేశంలోని 182 లక్షల గ్రామాలలో 2.76 కోట్ల స్వామిత్వ పథకం కార్డులు జారీ చేయగా, 3.28 లక్షల గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తయింది. ఈ నేపథ్యంలో 2020 మార్చి నాటికి 3,44 లక్షల గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యనిర్దేశం చేశారు. 75% రాయితీతో గ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారు సంస్థలకు చేయూతనిస్తోంది. రైతులకు అద్దె ప్రాతిపదికన డ్రోన్లను సమకూర్చే సహకార సంఘాలు, ఎప్పీఓలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు వాటిని కొనుగోలు చేయడం కోసం ధరలో 40 శాతం దాకా రాయితీతో, గరిష్టంగా 14 లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది.. వ్యవసాయ యంత్రీకరణ: దేశంలో వివిధ పంటలు - వాటి సాగు కార్యకలాపాలలో వ్యవసాయ యంత్రీకరణ సగటు స్థాయి మారుతూంటుంది. వాడు మడులు సిద్ధం చేయడంలో యంత్రీకరణ స్థాయి. 70 శాతం కాగా- విత్తడం- నాట్లలో 40 శాతం, కలుపు తీతలో 33 శాతం, కోత- నూర్పిడిలో 34 శాతంగా ఉంది. ఈ ప్రక్రియలన్నిటా మొత్తం మీద సగటు యంత్రీకరణ స్థాయి 45 శాతంగా ఉంది. వంట నూనెలు పప్పుధాన్యాలలో స్వావలంబన దిశగా చర్యలు జాతీయ వంట నూనెల మిషన్ పామాయిల్ మిషన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2021లో ₹11,040 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించింది. 6.5 లక్షల హెక్టార్ల భూమిని 2025-26 కల్లా పామాయిల్ సాగు కిందకు తేవాలన్నది దీని లక్ష్యం. అలాగే, 2029-30 నాటికి ముడి పామాయిల్ ఉత్పత్తిని 28 లక్షల టన్నులకు పెంచాలని ప్రభుత్వం. సంకల్పించింది. 1.89 లక్షల హెక్టార్ల మేర భూమిని 2025 మార్చి వాటికి ఈ మిషన్ పరిధిలోకి తెచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తీర్ణం 5.56 లక్షల హెక్టార్లకు చేరింది. గత దశాబ్దంలో ముడి పామాయిల్ ఉత్పత్తి రెట్టింపు అయింది జాతీయ వంటనూనెల మిషన్- నూనెగింజలు వంట నూనెల ఉత్పత్తిలో స్వావలంబన దిశగా జాతీయ వంట నూనెల మిషన్- నూనెగింజలకు 2024లో ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దేశంలో వీటి సాగు విస్తీర్ణాన్ని (2022-23నాటి) 29 మిలియన్ హెక్టార్ల స్థాయి నుంచి 2030-31 కల్లా 33 మిలియన్ హెక్టార్లకు పెంచాలన్నది ఈ మిషన్ లక్ష్యం. అలాగే 2030-31 నాటికి 25.45 మిలియన్ టన్నుల వంట నూనెల ఉత్పత్తి సాధనకు లక్ష్య నిర్దేశం చేసుకోగా, దీని ద్వారా దేశీయ అంచనా అవసరాల్లో దాదాపు 72 శాతం తీరుతుంది. పప్పధాన్యాల స్వావలంబన మిషన్ ప్రధానమంత్రి 2025 అక్టోబరు 11న ₹11,440 కోట్ల బడ్జెట్తో (2025-26 నుంచి 2030-31 వరకు) పప్పుదాన్యాల స్వావలంబన మిషన్ను ప్రారంభించారు. దీనికింద మొత్తం 88 లక్షల ఉచిత విత్తన కిట్లు, 126 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాల పంపిణీ ద్వారా దాదాపు 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుంది. దేశీయంగా 2030-31 నాటికి పప్పుధాన్యాల ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో నాలుగేళ్లపాటు కనీస మద్దతు ధరతో కంది, మినుము, ఎర్ర కంది 100 శాతం కొనుగోలుకు ఈ పథకం హామీ ఇస్తోంది. ఆధారం: న్యూ ఇండియా సమాచార్