కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (Krishi-DSS) కృషి - DSS: 16 ఆగస్టు 2024న ప్రారంభించబడిన కృషి-DSS, ఉపగ్రహ, వాతావరణం, నేల, పంట సంకేతాలు (crop signatures), జలాశయం, భూగర్భ జలాలు మరియు ప్రభుత్వ పథకాల సమాచారంతో సహా జియోస్పేషియల్ (భౌగోళిక) మరియు నాన్-జియోస్పేషియల్ డేటాను ఏకీకృతం చేస్తుంది మరియు ప్రామాణీకరిస్తుంది. కృషి-DSS పంట పటాలు (crop maps), నేల పటాలు, స్వయంచాలక దిగుబడి అంచనా నమూనాలు, కరవు/వరద పర్యవేక్షణ వ్యవస్థలు మొదలైనవాటిని అందిస్తుంది. ఇవి ప్రభుత్వ సాక్ష్యం-ఆధారిత నిర్ణయాధికారానికి మద్దతు ఇస్తాయి మరియు పరిశోధనా సంస్థలు అలాగే అగ్రిటెక్ పరిశ్రమల ద్వారా వినూత్న పరిష్కారాలను సులభతరం చేస్తాయి. ఈ కృషి-DSS ప్లాట్‌ఫారమ్ ప్రభుత్వ జాతీయ జియో-స్పేషియల్ విధానంతో (National Geo-Spatial policy) అనుసంధానించబడి ఉంది. కృషి-DSSలో అందుబాటులో ఉన్న సమాచారం పంట సాగు విధానాలను మరియు పంట వైవిధ్యాన్ని గుర్తించడం కోసం పంట పటాల తయారీకి, కరవు/వరద పర్యవేక్షణకు మరియు రైతుల పంట బీమా క్లెయిమ్‌లను పరిష్కరించడం కోసం సాంకేతికత/నమూనా ఆధారిత దిగుబడి అంచనాకు మద్దతు ఇస్తుంది. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కోసం సహకార విధానంకృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (Krishi-DSS): బహుళ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల భాగస్వామ్యంతో సమగ్ర ప్రభుత్వ విధానాన్ని (whole government approach) అనుసరించే ఒక సహకార ప్లాట్‌ఫారమ్‌కు ప్రధాన ఉదాహరణ. ఇక్కడ వ్యవసాయ నిర్ణయాధికారాన్ని మెరుగుపరచడానికి బహుళ డేటా వనరులు సజావుగా మార్పిడి చేయబడతాయి. ఈ వ్యవస్థ వాతావరణ సమాచారం/అంచనాలు, నేల సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, జలాశయ మట్టాలు, భూగర్భ జలాల డేటా, క్షేత్ర సమాచారం (Field information) మొదలైన విస్తృతమైన డేటా రకాలను ఏకీకృతం చేస్తుంది. ఈ డేటాసెట్లు వివిధ సంస్థల నుండి సేకరించబడతాయి - భారత వాతావరణ శాఖ (IMD) నుండి వాతావరణ డేటా; జల వనరుల శాఖ, RD & GR పరిధిలోని నేషనల్ వాటర్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NWIC) నుండి జలాశయ మట్టాలు మరియు భూగర్భ జలాల డేటా; సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా (SLUSI) నుండి నేల డేటా; మరియు MNCFC, DA&FW మరియు రాష్ట్ర సంస్థల ద్వారా సేకరించిన క్షేత్ర సమాచారం. ఓపెన్-సోర్స్ ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో విలీనం చేయబడ్డాయి. కృషి-DSS (Krishi-DSS) ద్వారా పంట దిగుబడి నమూనాలు (Crop yield models) మరియు కరవు మాడ్యూళ్లను అమలు చేయడం కోసం అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (SAC)తో కలిసి పని చేయడం జరిగింది. K-DSSలో నేలకు సంబంధించిన మాడ్యూల్‌ను అభివృద్ధి చేయడంలో SLUSI భాగస్వామి అయింది. వాతావరణ సమాచారం కోసం IMD సహకారంతో అభివృద్ధి చేయబడుతున్న WINDS ప్లాట్‌ఫారమ్ కూడా కృషి-DSSలో అనుసంధానించబడుతుంది.కృషి DSS తన అధునాతన మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ద్వారా ఈ విభిన్న డేటా సెట్ల నిరంతర మార్పిడిని సులభతరం చేస్తుంది. ఇవి రైతులు, పరిశోధకులు మరియు విధాన నిర్ణేతల కోసం ఉపయోగపడే అంతర్దృష్టులను రూపొందించడానికి ప్రాసెస్ చేయబడతాయి మరియు విశ్లేషించబడతాయి. విభిన్న వనరుల నుండి డేటాను ఏకీకృతం చేసి, ఒకే ప్లాట్‌ఫారమ్‌గా సమన్వయం చేసే కృషి DSS యొక్క సామర్థ్యంలో దాని సహకార స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవస్థలో పంట పర్యవేక్షణ, దిగుబడి అంచనా, భీమా పరిష్కారాలు మరియు సలహా సేవల కోసం మాడ్యూల్స్ ఉన్నాయి. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (Krishi-DSS) యొక్క కార్యాచరణ విధానం: 1.డేటా ఇంటిగ్రేషన్ మరియు యాక్సెసిబిలిటీ (డేటా అనుసంధానం మరియు ప్రాప్యత): కృషి DSS కేంద్ర, రాష్ట్ర మరియు పరిశోధన/సంస్థల నుండి డేటాను అనుసంధానిస్తుంది. డేటా యొక్క సున్నితత్వం ఆధారంగా విభిన్న యాక్సెస్ స్థాయిలను అందిస్తుంది. ఇందులో మూడు యాక్సెస్ స్థాయిలు ఉన్నాయి: A1 (కేంద్ర డేటా ఉచిత యాక్సెస్), A2 (పరిమిత యాక్సెస్‌తో రాష్ట్ర-నిర్దిష్ట డేటా), మరియు A3 (నియంత్రిత యాక్సెస్‌తో కేంద్ర మరియు రాష్ట్ర డేటా). 2.వినియోగదారు సమూహాలు మరియు అధికారాలు: వివిధ వినియోగదారు సమూహాలు వేర్వేరు యాక్సెస్ స్థాయిలను కలిగి ఉంటాయి. రైతులు తమ పొలానికి సంబంధించిన నిర్దిష్ట డేటాను యాక్సెస్ చేయవచ్చు, ప్రభుత్వ అధికారులు మాత్రం సమగ్రమైన డేటాను యాక్సెస్ చేయగలరు. 3.శిక్షణ మరియు సామర్థ్య పెంపొందింపు: సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత, కృషి DSSని సమర్థవంతంగా ఉపయోగించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ఉద్యోగులు శిక్షణ పొందుతారు. ఇందులో సాఫ్ట్వేర్ యొక్క పనితీరు మరియు ప్రక్రియలపై ప్రత్యక్ష శిక్షణ (hands-on training) ఉంటుంది. 4. సహకార మరియు సురక్షితమైన ఫ్రేమ్‌వర్క్ (Collaborative and Secure Framework): ఈ ప్లాట్‌ఫారమ్ ఉమ్మడి నిర్ణయాధికారానికి అనుమతిస్తుంది. అలాగే, కఠినమైన డేటా భద్రత మరియు గోప్యతా చర్యలతో, నిరంతరాయ డేటా ప్రవాహం మరియు నిర్వహణ కోసం వివిధ డేటా వనరులతో అనుసంధానించబడుతుంది. కృషి - డిఎస్ఎస్ (Krishi - DSS) అభివృద్ధి మరియు పర్యవేక్షణ బాధ్యత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (PIC) మరియు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అధికారుల మద్దతుతో, కృషి-డిఎస్ఎస్ (Krishi-DSS) యొక్క భావన, అభివృద్ధి, నిర్వహణ మరియు పర్యవేక్షణకు MNCFC డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కృషి డిఎస్ఎస్ అభివృద్ధిని పర్యవేక్షించడానికి మరియు దాని పనితీరును గమనించడానికి MNCFC వద్ద అవసరమైన నైపుణ్యం కలిగిన వనరులతో కూడిన ఒక వ్యూహాత్మక PMU (Project Management Unit) ఏర్పాటు చేయబడుతుంది. కృషి-డిఎస్ఎస్ ప్లాట్‌ఫారమ్ యొక్క నిర్వహణ, పర్యవేక్షణ మరియు వినియోగం కోసం రాష్ట్ర స్థాయిలో PMUలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించడమైనది. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర వ్యవసాయ సంబంధిత అప్లికేషన్ల కోసం ఒక నమ్మకమైన వ్యవస్థగా పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక మద్దతు వ్యవస్థతో (decision support system) కూడిన ఒక సమగ్ర వ్యవసాయ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తోంది. కృషి-డిఎస్ఎస్లో అందుబాటులో ఉన్న ప్రామాణిక డేటాను అభివృద్ధి చేయడానికి మరియు ఉపయోగించడానికి రాష్ట్రాలు ఈ రిఫరెన్స్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని అనుసరించవచ్చు. రాష్ట్రాలకు కృషి-డిఎస్ఎస్ యాక్సెస్ ఇవ్వబడుతుంది, ఇక్కడ రాష్ట్రాలు నిబంధనలను మరియు APIలను తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు లేదా సొంతంగా నిర్మించుకోవచ్చు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం సూచించిన ముఖ్యమైన ఫీచర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. ఆధారం :ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ