ధన్యాలు , పప్పులు - శక్తి, ప్రోటీన్ లకు నిలయాలు

వ్యవసాయ మరియు ఉద్యాన పంటలు మనిషి జీవనానికి ఆహార భద్రతను మాత్రమే కాకుండా, సమగ్ర పోషకాహారాన్ని అందించే అమూల్యమైన వనరులు. మనం రోజూ తీసుకునే ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనె గింజలు మరియు పాలు వంటి అన్ని ఆహార పదార్థాల మూలం వ్యవసాయమే. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే అందుతాయి.వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ధాన్య పంటలు శరీరానికి శక్తిని అందించే ప్రధాన ఆహార వనరులు. కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుధాన్యాలు అధిక ప్రోటీన్లను అందించి కండరాల నిర్మాణం, శరీర వృద్ధికి దోహదపడతాయి. కూరగాయలు, పండ్లు విటమిన్ A, B, C, E లతో పాటు కాల్షియం, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజ పంటలు శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. పండ్లలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు అధిక పోషక విలువలతో పాటు మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడుతున్నాయి.ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు కేవలం ఆకలి తీర్చేవి మాత్రమే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది వంటివి. “పోషకాహారానికి పునాది వ్యవసాయం” అనే భావన నేటి కాలంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.నేడు విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. వినియోగదారులు మరింత పోషకమైన ఆహారం అందుకోవచ్చు.

ధాన్యపు పంటలు, వాటి పోషక విలువలు

ధాన్యపు పంటలు మన ప్రధాన ఆహారంలో ముఖ్యమైన భాగం. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు వివిధ పోషక పదార్థాలు కలిగి ఉంటాయి.

వరి : దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆహారం. 100 గ్రా.ల వండిన వరి అన్నంలో కార్బోహైడ్రేట్లు సుమారు 28 గ్రా., ప్రోటీన్ 2.7 గ్రా. ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, B విటమిన్లు, మెగ్నీషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి.

విలువ ఆధారిత ఉత్పత్తులు: రైస్ ఫ్లేక్స్ (అటుకులు), రైస్ పఫ్స్, రైస్ బ్రాన్ ఆయిల్, రైస్ ఫ్లోర్ బిస్కట్లు, రైస్ పోరిడ్జ్ (గంజి) ఇవన్నీ పోషకవంతమైన విలువ ఆధారిత ఉత్పత్తులు.

గోధుమ : గోధుమలో ప్రోటీన్లు (10-13%), కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్-B సమూహం, ఇనుము, జింక్ ఉంటాయి. వీటి నుండి తయారైన ఆటా, సూజి, మైదా వంటి ఉత్పత్తులు విస్తృతంగా వినియోగిస్తారు.

మొక్కజొన్న : మొక్కజొన్నలలో విటమిన్-A (బీటా కెరోటిన్), విటమిన్-C, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కార్న్ స్టార్చ్, పాప్‌కార్న్, కార్న్ ఫ్లేక్స్ వంటి విలువ వర్ధక ఉత్పత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి.

ధాన్యపు పంటల పోషక పోలిక (100g)

పంట

కార్బో హైడ్రేట్స్ (గ్రా)

ప్రోటీన్ ((గ్రా))

ఫైబర్ ((గ్రా))

ఇనుము (mg)

విటమిన్లు

వరి (100g)

28.2

2.7

0.4

0.2

B1, B3

గోధుమ (100g)

72.6

12.6

10.7

3.9

B1,B2,B6

మొక్కజొన్న (100g)

74.3

9.4

7.3

2.7

A,C,B9

జొన్న (100g)

72.1

8.5

6.7

4.4

B1,B3

సజ్జలు (100g)

67.5

11.6

8.5

8.0

B3,E,K

పప్పు ధన్యాల పోషక పోలిక (100g)

పప్పు ధాన్యం

ప్రోటీన్ (g)

ఇనుము (mg)

కాల్షియం (mg)

ఫోలేట్ (g)

కంది పప్పు

22.3

5.23

73

456

శనగలు

19.3

6.53

105

557

మినుములు

24.0

7.00

138

625

పెసలు

23.9

6.74

124

625

సోయాబీన్

36.5

15.7

277

375

పప్పుధాన్యాలు ప్రోటీన్ల గని

పప్పుధాన్యాలు శాకాహారులకుప్రోటీన్ ముఖ్య వనరులు. ఇవి అమినోయాసిడ్లు, ఫైబర్, ఇనుము, కాల్షియంB విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి.

కంది : కంది పప్పులో ప్రోటీన్ 22%, ఫైబర్ 15%,ఇనుము 5.23 mg/100g ఉంటాయి. ఫోలేట్ అధికంగాఉన్నందున గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది. విలువ ఆధారితఉత్పత్తులుగా రెడీ టు కుక్ కంది పప్పు, కంది వడ మిక్స్, కందిపాప్డ్ స్నాక్స్.

శనగలు : శనగలలో ప్రోటీన్ 19 గ్రాములు, ఫైబర్ 17గ్రాములు ఉంటాయి (100g కి). అవి రక్తంలో చక్కెర స్థాయినినియంత్రించడంలో సహాయపడతాయి. బేసన్ (శనగ పిండి),రోస్టెడ్ చిక్‌పీస్. ప్రాచుర్యమైన విలువ ఆధారిత ఉత్పత్తులు.

సోయాబీన్ : సోయాబీన్‌లో ప్రోటీన్ 36%, కాల్షియం,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. సోయా మిల్క్,సోయా చంక్స్ వంటి ఉత్పత్తులు విస్తృతంగా వినియోగిస్తారు.

భారత ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధికిఅనేక పథకాలు అమలు చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ పథకంద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నారు.వినియోగదారులు ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారానికిఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సేంద్రియ విలువ ఆధారితఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈఅవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక సాంకేతికపరిజ్ఞానంతో సేంద్రియ సాగు చేపట్టి, ఉత్పత్తులను స్వయంగామార్కెటింగ్ చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ