గ్లావ్ సరస్సు - అరుణాచల్ ప్రదేశ్‌లో మొదటి రామ్సర్ సైట్ భారతదేశంలోని రామ్సర్ సైట్ల సంఖ్య 101కి చేరింది వెట్‌ల్యాండ్ (తడి నేలలు) పరిరక్షణ, జీవవైవిధ్య రక్షణ మరియు స్థిరమైన జీవనోపాధి పట్ల భారతదేశ నిబద్ధతను నొక్కి చెబుతూ, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ చారిత్రాత్మక చేరికను ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని గ్లావ్ సరస్సును భారతదేశపు 101వ రామ్సర్ సైట్‌గా గుర్తిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకటించారు. ఇది ఆ రాష్ట్రంలో మొదటి రామ్సర్ సైట్ కావడం వల్ల ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ పరిణామం జీవవైవిధ్య పరిరక్షణ, నీరు మరియు వాతావరణ భద్రత, మరియు స్థిరమైన జీవనోపాధి దిశగా ఒక ముఖ్యమైన అడుగు. "2014లో 26 రామ్సర్ సైట్లు ఉండగా, నేడు ఆ సంఖ్య 101కి చేరుకుంది. ప్రతి కొత్త రామ్సర్ సైట్ ప్రకృతిని రక్షించడంతో పాటు, ఈ కీలక పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న సమాజాల ప్రయోజనాలను కాపాడాలనే భారతదేశ సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. "రామ్సర్ సైట్లను గుర్తించడంలో భారతదేశం తన ప్రయాణాన్ని సెంచరీ దాటి కకొనసాగిస్తోంది" (తడి నేలలు) పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో దేశం యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ మరియు వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో ఉన్న గ్లావ్ సరస్సు, తూర్పు హిమాలయాలలో ఉన్న ఒక స్వచ్ఛమైన మంచినీటి సరస్సు మరియు జీవవైవిధ్య హాట్‌స్పాట్. ఈ సరస్సుకు నిరంతరం ప్రవహించే కొండ వాగుల ద్వారా నీరు అందుతుంది. ఇదిచుట్టూ దట్టమైన వృక్షసంపదతో పచ్చగా అలరారుతూ, గొప్ప వృక్ష వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఈ వెట్‌ల్యాండ్ పరిధిలో మరియు దాని పరివాహక ప్రాంతంలో 150 కి పైగా వృక్ష జాతులు, 49 ఆర్కిడ్ జాతులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. ఇది గ్లావ్ సరస్సు మరియు దాని చుట్టుపక్కల ప్రాంతం యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆధారం: పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ