ఇ వాలెట్ అంటే ఏమిటి ప్రీపెయిడ్ చెల్లింపు పద్ధతి- మీ మొబైల్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసినపుడు వినియోగించవచ్చు . ఇ వాలెట్ లోకి నగదును బదలీ చేయటానికి వ్యక్తిగత బ్యాంకు ఖాతాను ఇ వాలెట్ కు అనుసంధానించాలి ఇంచు మించు అన్ని బ్యాంకులు కొన్ని ప్రయివేటు కంపెనీలు ఇ వాలెట్ సౌకర్యాన్ని అందచేస్తున్నాయి ఇ వాలెట్‌తో ప్రయోజనాలు డిజిటల్ వాలెట్ సహాయంతో ఆన్లైన్ కొనుగోళ్లకే కాకుండా బయట దుకాణాల్లోనూ చెల్లింపులు చేయొచ్చు. పలు వాలెట్ల నుంచి బ్యాంకు ఖాతాలకూ నగదు బదిలీ చేయొచ్చు. డబ్బే కాదు.. డెబిట్, క్రెడిట్ కార్డులూ వెంట తీసుకెళ్లే అవసరం ఉండదు. ఇందులో కార్డు వివరాలను నిక్షిప్తం చేసుకుని అవసరమైన చోట వాటిని వినియోగించే వీలుంది. కార్డులను నేరుగా స్వైప్ చేసేటప్పుడు వాటి సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అదే వాలెట్లో కార్డులను ఉపయోగిస్తే ఆ ప్రమాదం ఉండదు. చెల్లింపులకు పట్టే సమయం కూడా చాలా తక్కువ. చిన్నమొత్తాల చెల్లింపులకు ఇవి అనుకూలం. ఇ వాలెట్ ఉపయోగించటములోసాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఫిర్యాదుల్లో అధిక శాతం నగదు బదిలీకి సంబంధిం చినవే ఉంటున్నాయి. అవ్యాలెట్ల మధ్య నగదు బదిలీ చేసే క్రమంలో ఒక్కోసారి లావాదేవీ విఫలమవుతుంటుంది. అప్పుడు ఆ మొత్తం పంపినవారి ఖాతాలోకే మళ్లీ పడుతుంది. ఇందులో ఆలస్యం ఏర్పడే సందర్భాలు అత్యంత అరుదు. వ్యాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించిన ప్పుడు లావాదేవీ విఫలమైనా పంపినవారి వ్యాలెట్ ఖాతాలోకే తిరిగి చేరాలి. కానీ.. ఒక్కోసారి అలా చేరడంలో ఆలస్యమవుతుంది. సంబంధిత బ్యాంకు, భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్ పీసీఐ) సర్వర్లు సక్రమంగా పనిచేయనప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి అవి పునరుద్ధరణయిన తరు వాత డబ్బు వెనక్కు వస్తుంది. విఫల లావాదేవీలను వ్యాలెట్ సంస్థలు సాధారణంగా 24 గంటల్లోనే ధ్రువీకరిస్తాయి. కానీ. కొన్ని బ్యాంకులు గరిష్టంగా 8 రోజుల సమయం కూడా తీసుకుంటాయి. చాలా మంది వినియోగదారులు ఒక వాలెట్ లో చాలా ఖాతాలు అనుసంధానిస్తారు. వక వ్యాలెట్‌లో బహుళ ఖాతాలు నిర్వహించే విని యోగదారులు ఒక్కోసారి పొరపాటు పడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. విఫల లావాదేవీకి సంబంధించి డబ్బు తిరిగి జమ కావాల్చిన ఖాతా కాకుండా వేరే ఖాతాను పరిశీలించి ఆందోళన చెందుతుంటారు పై సమస్యలకు ఏమి చెయాలి బ్యాంకులకు అనుసంధానంగా ఉండే వ్యాలెట్లకు సంబందంచి ఆ యా బ్యాంకుల పరిష్కార వేదికలనే ఆశ్రయించాలి.. సమస్య ఏర్పడినప్పుడు వెంటనే సహాయత ఖాతాదారుల సేవా విభాగాలను. అవసరమైతే బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ను కూడా సంప్రదించొచ్చు. స్వతంత్ర వ్యాలెట్ సంస్థలకు వచ్చేసరికి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడి సమస్యలు ఆంబుడ్స్మన్ పరిధిలోకి రావు. సహాయత ఖాతాదారుల సేవా విభాగాలనే ఆశ్రయించాలి. ఫోన్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఫిర్యాదు చేయొచ్చు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆయా సంస్థలు నిర్వహించే పేజీల్లోనూ మన సమ స్యను చెప్పుకోవచ్చు. ఆయా సంస్థల స్థాయిలో పరిష్కారమయ్యేదైతే వారే మొత్తం బాధ్యత వహిస్తారు. బ్యాంకులకు డబ్బు బదిలీ సమయంలో ఏర్పడే సమస్యలను అవసరమైతే ఆయా బ్యాంకులకు అప్పగిస్తారు. ఎవరిని సంప్రదిం చాలో మార్గదర్శనం చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ ఫిర్యాదుకు ఒక సంఖ్య కేటా యిస్తారు. ఆ సంఖ్యను ప్రస్తావిస్తూ బ్యాంకు ఫిర్యా దుల విభాగాన్ని సంప్రదించాలి. అప్పటికీ కాకుంటే మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ ఆ సంఖ్యను ప్రస్తావిస్తూ న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశముంటుంది క్రింది జాగ్రత్తలు తీసుకుంటే మేలు వ్యాలెట్ యాప్ సహాయంతో జరిపే ప్రతి లావాదేవీ స్థితిని తెలిపే ఆధారం ఉంచుకోవాలి. ఆ లావాదేవీ సఫలమైనా, విఫలమైనా, అపరిష్కృతంగా ఉన్నా దానికి సంబంధించి ఫోన్ తెరపై చూపే వివరాలను యధాతథంగా నిక్షిప్తం(స్కీన్ షాట్) చేయాలి. వ్యాలెట్ ఖాతాల స్థాయి పెంచమని(అప్‌గ్రేడ్) సంస్థను కోరాలి. అప్పుడు బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి నట్లే పాన్ కార్డు, ఆధార్ నంబర్ వంటి ధ్రువపత్రాలు అనుసంధానిస్తారు. దీనివల్ల ఖాతాకు బలమైన ఆధారా లతో పాటు అదనపు వెసులుబాట్లు కలుగుతాయి. ఆధారం: CSC