నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి గనుల మంత్రిత్వ శాఖ స్టేక్‌హోల్డర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. భారతదేశంలో నిర్మాణాత్మక, పారదర్శక, స్థిరమైన రీసైక్లింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యం. నేపథ్యం జాతీయ నాన్ ఫెర్రస్ లోహాల స్క్రాప్ పునర్వినియోగ మార్గదర్శకాల్లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్ ను ముఖ్యమైన భాగస్వాములను ఒకేచోటకు తెచ్చేందుకు, డేటా పారదర్శకతను మెరుగుపరచేందుకు, అల్యూమినియం, రాగి, సీసం, జింక్ తదితర కీలక మూలకాల పునర్వినియోగంలో ఆధారాలతో కూడిన విధానాలు రూపొందించేందుకు మద్దతుగా రూపొందించారు. పోర్టల్ యొక్క ముఖ్య లక్షణాలు ఈ వెబ్సైట్ పునర్వినియోగదారులు, తొలగించేవారు, సేకరణదారులు, పారిశ్రామిక సంఘాలు, పరిశోధనా సంస్థలతో సమాచారం పంపిణీ, అవగాహన పెంపు, భాగస్వామ్యాన్ని కల్పించే జాతీయ వేదికగా పని చేస్తుంది. ఇది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రదర్శించడమే కాకుండా, స్టేక్హోల్డర్ల సమావేశాలు, విధాన పరిణామాలపై నవీకరణలను అందిస్తుంది. అలాగే జాతీయ గణాంకాలు, ప్రమాణాలు మౌలిక సదుపాయాల సంబంధిత విజయాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ సమగ్ర పోర్టల్ ద్వారా పరిశ్రమల భాగస్వాముల నమోదుతో పాటు, మౌలిక పదార్థాల వినియోగం, పునర్వినియోగ సామర్థ్యం, సాంకేతిక వినియోగం, కార్మికుల ధోరణులపై కీలక డేటా సేకరణ కూడా సాధ్యమవుతుంది. ఇవి పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి వంటి భవిష్యత్ చర్యలకు మద్దతు ఇస్తాయి. ప్రధానాంశాలు విడగొట్టే కేంద్రాలు, పునర్వినియోగదారులు, వ్యాపారులు, సేకరణ కేంద్రాల కోసం జాతీయ రిజిస్ట్రీ మౌలిక పదార్థాల సరఫరా, ఉత్పత్తి రకాలూ, సాంకేతిక స్వీకరణ,కార్మిక సంబంధిత డేటాను ట్రాక్ చేయడానికి సాధనాలు పనితీరు పరంగా సరిపోల్చే (బెంచ్‌మార్కింగ్) యంత్రాంగాలు ప్రాంతీయ, రంగాలవారీగా మౌలిక సదుపాయాలు, నైపుణ్య అంతరాల గుర్తింపు ప్రమాణాలు, ధ్రువీకరణ వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాల అభివృద్ధికి మద్దతు ఈ పోర్టల్‌ను https://nfmrecycling.jnarddc.gov.in/ వద్ద యాక్సెస్ చేయవచ్చు.