ద్రుష్టికోణము- లక్ష్యాలు (Vision &Goals) భారత దేశపు అతి పెద్దదైన టెక్నాలజీ ఇంక్యుబేటర్- T- Hub ను ప్రారంభించిన పుడు వచ్చిన అపూర్వ స్పందనను ఆధారం చేసుకుని మేము హైదరాబాద్ ను ప్రపంచ ఇన్నొవేషన్ పటములో స్థిరముగా నెలకొల్ప తలచాము. వచ్చే 5 సంవత్సరాలలో ఒక మిలియన్ చదరపుఅడుగుల కార్యరంగ స్తలాన్ని అభివ్రుధి పరచి స్టార్త్స్-అప్ కి అంకితం చేయటము. 20 గ్లోబల్ ఏక్సిలేటర్స్/ ఇంక్యుబేటర్ లలో భాగస్వామ్యం వహించి PPP mode లో సౌకర్యాలను ఏర్పరచటము, రాష్ట్ర వివిధ ప్రాంతాలలొ వివిధ రంగాలలో Plug & play కార్య స్తలాలను ఏర్పరచటము. వచ్చే 5 సంవత్సరాలలో 900 స్టార్ట్స్ –అప్ కు నీడ నిచ్చే 3,00,000 చ- అడుగుల T- Hub Phase-II ను పూర్తి చేయటము. రాష్ట్రములోని ద్వితీయ శ్రేణి ప్రాంతాలలో రెండు ఇంక్యుబేటర్లు ఏర్పరచటము. 1000 IT సంబధిత ఉత్పాదనలు , 300 ఎ లక్ట్రానిక్స్ మరియు 400 స్వచ్చతా స్టార్ట్స్-అప్ ల తో పాటుగా మొత్తం 5000 స్టార్ట్స్ –అప్స్ అభివ్రుధికిదొహద పడటము. వివిధ రంగా లలో వివిధస్థాయిలలో ఉన్న స్టార్ట్స –అప్ కొరకు INR 2000కోట్ల రూపాయలు తరలించటము. వ్యవసాయ, ఆరోగ్య, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్ రంగాలలో ప్రభుత్వానికి ఉపయోగపడే 5 Innovative Technology పరిష్కారాలను Incubated స్టార్ట్స్ –అప్స్ నుండి తీసుకొని ప్రోత్సాహించటము (leverage) ఫ్లాగ్ షిప్ ఇన్షియేటివ్స్(Flagship Initiatives) 2 GBPS ఇంటర్నెట్ కనెక్షన్ అన్నిఇంక్యుబేషన్ సౌకర్యాలకోసము అందుబాటులోకి తేవటానికి ప్రభుత్వము అన్ని ఇంటర్నెట్ ప్లేయర్స్ తోనుకలసి పనిచేస్తుంది T Hub తో అనుసంధానమైన అన్ని స్టార్ట్స్-అప్ లకు ప్రతి సామూహిక / స్టార్త్స్ –అప్ ఈవెంట్ కి త్రోవ కల్పిస్తుంది. నామ మాత్రపు ఖర్చుతో స్టార్ట్స్ –అప్ కి cloud space అందుబాటులోకి తేవటము. "ఎంటర్‌ప్రెన్యూర్స్ – ఇన్ రెసిడెంస్" పేరిట విద్యార్ధులకు విద్యార్ధి దశ మధ్యలోనే ఎంట్రప్రెన్యూర్ గా ఎదగటానికి అవకాశము ఇవ్వటము. స్టార్త్స్-అప్ లో యువతకి ఇంటర్న్ షిప్స్ కి కానీ ఉపాధి అవకాశాలను కానీ కల్పించటానికి ఫ్రేమ్ వర్క్ తయారుచేయటము. ప్రపంచస్థాయి ఇన్నొవేషన్ ఫెస్టివల్స్ , కాన్ క్లేవ్స్, హాకథాంస్, B –plan పోటీలు నిర్వహించటము విగ్నాన వినిమయ కార్యక్రమాల కొరకై అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో Tie-ups ఎర్ప్రుచుకోవట ము. e- గవర్నెంస్ స్పేస్ లో ఉన్న స్టార్ట్స్-అప్స్ కి పైలట్స్ ని రోల్ అవుట్ చేయటం కోసం ప్రభుత్వ data అందుబాటు చేయటము. తెలం గాణాలో ఎంటర్ ప్రెన్యుర్ షిప్ ను ప్రొత్సహించటానికి "ఇన్నొవేషన్ సలహా సంఘం" ను ఏర్పరచి చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ ను నియమించటము. అంకురస్తాయి, మరియు అభివ్రుధి స్తాయి కంపెనీలకు “Fund of Funds “ మోడల్ ద్వారా ఆర్ధి క సహాయము చేయటము., అట్లాగే నత్తనడకలో ఉన్న/ నస్టాలలోఉన్న కంపెనీలకై ఒక ప్రత్యేక ఆర్ధిక నిధి ఏర్పరచటము R&D ని ఉత్పత్తి అభివ్రుధి ని పెంపొందించే “Innovation cells మరియు “Centres of Excellence” ల వంటి కేన్ద్రాల స్తాపన నిర్వాహణకై పెద్ద టెక్నాలజీ కంపనీలను ప్రోత్సహించటము గ్రామీణ మరియు సామాజిక సంస్తలకొరకు ఒక ప్రత్యేక ఇంక్యుబేటర్ స్తాపన. వరల్డ్ బాంక్, WHO,ప్రపంచ ఆ ర్ధిక ఫోరం . మొదలైన అంతర్ జాతీయ సంస్తలతో కలసి తెలం గాణా లో సామాజికాభివ్రుధి కోసము పనిచేస్తున్న వ్యవస్తలకు ఆర్ధిక సహాయము, చేయూత నిచ్చుట. కంపెనీ రెజిష్ట్ఱే షన్ , IP ప్రొటెక్షన్ , నెట్ వర్కింగ్, అనుమతులు మొదలైన అన్ని స్టార్ట్ అప్ అవసరాలకు One stop shop గా పనిచేసే ఒక స్టార్ట్ అప్ సెల్ ను ప్రారంభించటము. స్పాంసర్షిప్ ద్వారా అంతర్జాతీయ, జాతీయఈవెంట్స్ లో పాల్గొనేటట్లు స్టార్ట్స్ అప్ ను ప్రోత్సహించటము. సాంస్క్రితికకార్యక్రమములు ఇన్నొవేషన్ ఫెస్టివల్స్ వంటివి స్పాంసర్ చేసి Brand Hyderabad ను ప్రొమోట్ చేయటము దీనిలో భాగం గా అంతర్జాతీయ ఇన్నొవేషన్ ప్రముఖులను కలసి పనిచేయటానికి ఆహ్వా నించటము. ప్రోత్సాహకాలు-ముఖ్యాంశాలు(Incentives Highlights) ఇంక్యుబేటర్స్ కు ప్రోత్సాహాలు(Incentives for Incubators) చెల్లించిన స్తాంప్ డ్యూటీ మరియు రిజిష్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించుట: ఇంక్యుబేటర్స్, మరియు హోస్ట్ ఇంస్టిట్యూట్ లు మొదటి సేల్ /లీజ్ ట్రాంశాక్షన్ కు కట్టిన స్టాంప్ డ్యూటీ మరియు రిజిష్ట్రేషన్ ఫీజులకు 100% , రెండవ ట్రాంశాక్షన్ కు 50% తిరిగి తీసుకొవటానికిఅర్హులు అవుతారు . . మేచింగ్ గ్రాంట్ల రూపములో ఆర్ధిక సహాయము: ప్రభుత్వము మేచింగ్ గ్రాంట్ల రూపములో ఇంక్యుబేటర్లు భారత ప్రభుత్వము నుండి పొందిన నిధులకు 1:1 నిష్పత్తిలో నిధులు విడుదలచేస్తుంది. కార్యనిర్వాహణానైపుణ్యముతో ముడిబడ్డ సహాయత: ఒక సంవత్సరములో ప్రారంభింపబడిన స్టార్ట్స్ అప్ ల సంఖ్య ఆధారంగా గుర్తింపు బొందిన ఇంక్యుబేటర్లకు సంబంధించిన హోస్ట్ సంస్తలకు ప్రభుత్వ ఆపరేటివ్ గ్రాంట్ లను మంజూరు చేస్తుంది . దీనికై ఒక పారదర్సకమైన విధానము రూపొందింపబడి , ప్రకటింప బడుతుంది. మొదటి మూడు సంవత్సరముల ఆపరేషన్ లో అయినఇంటర్ నెట్ చార్జీలు 25% ప్రతి సంవత్సరము తిరిగి ఇవ్వబడుతుంది కానీ దీని గరిస్ట పరిమితి INR2,50,000 ప్రతి సంవత్సరము. ప్రభుత్వభవనాలను టెక్నాలజీ ఇంక్క్యుబేటర్స్ కు అద్దెకు ఇచ్చి ఉన్నట్టయితే 5 సంవత్సరముల వరకు లేదా ఇంక్యుబేటర్లు స్వయంసమ్రుద్ధమయే వరకు ఈరెండింటిలో ఏది ముందు అయితే దాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రభుత్వభవనాలలో స్తాపింపబడిన ఇంక్యుబేటర్లకు లీజ్/అద్దె లేదాO&M చార్జీలు విధింపబడవు. అదే ప్రైవేటు భవనాలలోఅద్దెకు ఉన్న ఇంక్యుబేటర్లకు చదరపు అడుగుకు INR 5లు లేదా 25% ఏక్ట్యువల్ చెల్లించిన అద్దె ఏది తక్కువ అయితే అది 3 సంవత్సరములవరకు తిరిగి ఇవ్వబడుతుంది. ఇది ఇంక్యుబేషన్ కు సంబంధించిన స్తలమునకు మాత్రమే వర్తిస్తుంది ఈ పాలసీ జారీ చేయబడిన రెండు సంవత్సరములలోపు ప్రభుత్వముతో MOU లో ప్రవేసించిన ఇంక్యుబేటర్ పరిశ్రమలకు భూమి, భవనాలకు తప్ప,మిగిలిన స్థిరపెట్టుబడులపై 20% రాయితీ ఇవ్వబడుతుంది.ఈ రాయితీ గరిష్ట పరిమితి INR5 కోట్లు. స్తార్ట్సప్ కి ప్రోత్సహకాలు(Incentives for startups) స్టార్ట్స్ అప్ చెల్లించిన సర్వీస్ టాక్స్: ప్రభుత్వ సహాయము / గుర్తింపు పొందిన సంవత్సరపు టర్నోవర్ మొదటి 3 సంవత్సరములలో INR50 లక్షలకు మించకుంటే అవి చెల్లించిన సర్వీస్ టాక్స్ తిరిగి ఇవ్వబడుతుంది. VAT/ CST లు తిరిగిచెల్లించటము: ఇంక్యుబేట్ అయిన మొదటి 3 సంవత్సరములలో స్టార్ట్స్ అప్ ఇంక్యుబేట ర్స్ కి సంవత్సరానికి INR 50 లక్షల టర్నోవర్ వరకు తెలం గాణాలో చెల్లించిన VAT/CST లు తిరిగి ఇవ్వబడతాయి. ప్రొమోషన్లు: అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలలో మార్కెటింగ్ కొరకు ప్రయాణ ఖర్చులతొ సహా అయిన ఖర్చులలో 30% ప్రభుత్వము తిరిగిచెల్లిస్తుంది. దీని గరిష్ట పరిమితి సంవత్సరానికి కంపనీకి INR 5 లక్షల వరకు. పేటెంట్ ఫైలింగ్ ఖర్చు:పేటెంట్ అప్లికేషన్ ఫైలింగ్ మరియు ప్రాసిక్యుషన్ ఖర్చులు ఇంక్యుబేటెడ్ స్టార్ట్ అప్ కంపెనీలకు తిరిగి ఇవ్వబడతాయి. భారతీయ పేటెంట్ కు గరిస్ట పరిమితి INR2లక్షల వరకు,విదేసీయపేటెంట్ కు ఒక విషయానికై INR10 లక్షల వరకు ఖర్చు తిరిగి ఇవ్వబడుతుంది..ఐతే ఈ మొత్తం రెండు దశలుగా 50% పేటెంట్ ఫైలింగ్ దశలోను, మిగిలిన50% పేటెంట్ వచ్చినతరువాత ఇవ్వబడుతుంది. ఆలోచనాస్తాయి కంపెనీలను ప్రొమొటె చేసేన్దుకు ప్రభుత్వము మొదటిసంవత్సరములో INR10,000 చొప్పునఒక్కొక్క ఎంప్లాయీకి రిక్రూట్మెంట్ సహాయత అందచేస్తుంది ఆడిట్ జరిపిన ఎకౌంట్స్ ప్రకారముసాలీనా15% వ్రుధ్ధిరేటునమోదుచేసుకున్న స్టార్ట్ అప్ లకు ఇంక్యుబేషన్ అయిన మూడుసంవత్సరములలోపు టర్నోవర్ లో 5% గ్రాంటు రూపములో పొందటానికి అర్హత కలిగి ఉంటాయి. ఆధారము: http://www.it.telangana.gov.in/