పాస్ పోర్ట్ మరియు వీసా సేవలు లభిస్తున్న సేవలు: పాస్ పోర్ట్, వీసాలగురించిన సమగ్ర సమాచారం కోసం ఈ పోర్టల్ని చూడొచ్చు. దరఖాస్తు ఫారాలు, దాన్ని నింపే విధం, ఫీజు వివరాలు, ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నవాటికి వివరాలు తత్కాల్ పథకం, అఫిడవిట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు వీటి గురించిన సమాచారం ఈ వెబ్సైట్ లో లభ్యమౌతుంది. పాన్ కార్డ్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం ఇండియాలో ఆదాయపన్ను చెల్లింపుకు, డిమ్యాట్ అకౌంట్ నిర్వహణకు పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ వెబ్సైట్ లో పాన్ కార్డ్ కు సంబంధించిన వివరాలు లభ్యమౌతాయి పాన్ / టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ - రిటర్నుల రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం పాన్ కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం, పాన్ డేటాలో మార్పు, చేర్పులు(ఎన్ఎస్డిఎల్ ద్వారా) చేసుకోవడం కూడా సాధ్యమౌతుంది ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం ఇందులో కింది అంశాలపై ఆన్లైన్ సమాచారం లభిస్తుంది : ఆదాయపుపన్ను పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం నమోదు ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడం ఫారం 2 ఎఫ(F) ను డౌన్ లోడ్ చేసి, నింపడం, ఇ-రిటర్న్ లను అప్ లోడ్ చేయడం ఎక్స్ఎంఎల్ ఇ-రిటర్న్ ఫైల్ ను తయారు చేయడం, రసీదును ముద్రించుకోవడం వగైరా ఆన్లైన్ ప్రజోపయోగ దరఖాస్తులు లభిస్తున్న సేవలు రాష్ట్రాలవారీ, విభాగాల వారీగా ప్రజోపయోగ ద్విభాషా దరఖాస్తులు ముద్రణకు వీలుగా దరఖాస్తులు వోటర్ల జాబితా లో మీ పేరు వెదకటం లభిస్తున్న సేవలు వోటర్ల జాబితా లో ఆన్ లైన్ గా పేరు వెదికే సౌకర్యం వోటర్ల జాబితా లో మీ పేరు చేర్చటానికి దరఖాస్తు ఫారం ఎన్నికల ఫలితాలు మెదలైనవి. పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రం లభ్యమయ్యే సేవ: నగరాల, రాష్ట్రాల వారిగా పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రాలను వెదికే ఆన్ లైన్ సేవ. పాన్ దరఖాస్తు స్థితి గతులు లభ్యమయ్యే సేవ: ఎకనాలెడ్జమెంట్ నంబరు, పేరు మరియు పుట్టిన తేది వ్రాసి పాన్ కార్డు దరఖాస్తు స్థితి గతులు మీరు సరిగా ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చును. ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం లభ్యమయ్యే సేవ: మీ పాన్ కార్డును గురించిన పూర్తి సమాచారం మీరు పొందవచ్చు. ఉదాహరణకు దానిపై ముద్రించిన మీ పేరు పుట్టిన తేది మొదలైన సమాచారం. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు