ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక సేవలు ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక సేవలు రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం(ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం”అనే పధకాన్ని ఇటీవల ఆరంభించింది. దీనిద్వారాగ్రామీణ ప్రజలకు సత్వరంగా, సమర్ధవంతంగా, తక్కువఖర్చుతో, ఎలాటి బాదరబందీ లేకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మొత్తం మీద 8618 గ్రామాల్లో ఈ రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాలను ఆరంభించారు. గ్రామాల్లో ఈ రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాలను ఆరంభించడంవల్ల వచ్చే లాభాలివి: వ్యవసాయం, విద్య, ఆరోగ్యంవంటి అంశాలపై సులభంగా సమాచారాన్ని పొందడం. మార్కెట్ ధరలు, పంటల తీరు, వాతావరణ అంచనాలు, వ్యవసాయవిస్తరణ వంటి అంశాలపై సమాచారాన్ని పొందడం. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు వంటి మొదలైనముడిసరకులు పొందడం - వ్యవసాయమార్కెటింగ్ - ఉత్పత్తులకు మేలైన ధరలు తెచ్చుకోవడం. పరీక్షాఫలితాలు, ఇ-లెర్నింగ్ ఆరోగ్య విస్తరణ, వ్యాది నిరోధకాలు వేయించడం, టెలి మెడిసన్ వగైరా అన్నిరకాల ఫారంలు, భూరికార్డులు, అప్లికేషన్ ఫారంలు, సర్టిఫికేట్లు వగైరాలను పొందడం. విద్యుత్, టెలిఫోన్ వంటి బిల్లుల వసూలుచేయడం. బీమా, ఇ-కామర్స్ వంటి ప్రవేటు సేవలు పొందడం. “రాజీవ్ పల్లెబాట”అప్లికేషన్ల స్థితి సమాచారాన్నిపొందడం. ఒక కుటుంబంలో కనీసం ఒకవ్యక్తికి కంప్యూటర్ అక్షరాస్యతని కల్పించడం.. ప్రస్తుతం 1148 గ్రామీణ సేవలందించే డెలివరీపాయింట్లను(ఆర్.ఎస్ డిపి) 2003 సంవత్సరంలోనే ఒక కార్యక్రమంగా ఆరంభించారు. ఇవి మండలస్థాయిలో, గ్రామస్థాయిలో పనిచేస్తున్నాయి. ఏపిఆన్ లైన్ అన్న ప్రభుత్వ పోర్టల్ ద్వారా కింది సేవలను అందిస్తున్నాయి : విద్యుత్ బిల్లులను వసూలు చేయడం . వ్యవసాయసమాచారాన్ని ఐ-కిసాన్ పోర్టల్ ద్వారా పొందడం. కంప్యూటర్ విద్య. బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ బిల్లుల వసూలు. వివిధ ప్రభుత్వ ఫారాలు, సమాచారం, సర్టిపికేట్లు పొందే వీలు. వ్యవసాయ మార్కెట్ ధరలు మార్కెట్ శాఖలో, అగ్ మార్క్ నెట్ ద్వారా తెల్సుకోవడం. హెచ్ఎల్ఎల్ యొక్క ఐ-శక్తి సమాచార వ్యవస్థ భారత్ మాట్రిమోని - పెళ్లిసంబంధాల సేవలు పరీక్షా ఫలితాలు, మార్క్ షీట్లముద్రణ. రెవిన్యూ రికార్టుల వితరణ వ్యవస్థ. ఈ రాజీవ్ ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా కింది సేవలను గ్రామీణ ప్రజలకు అదనంగా అందించడం జరుగుతోంది : జి2సి సేవలు : ఆస్తి పన్ను చెల్లింపులు. జనన, మరణాల నమోదు, సర్టిఫికేట్ల జారీ. వ్యాపార లైసెన్సుల జారీ, పునరుద్దరణ, అప్లికేషన్ల అమ్మకం. ఆర్టిసి టికెట్ల అమ్మకం, రిజర్వేషన్ . పన్ను చెల్లింపుల రిటర్న్‌లను ఫైల్చేయడం, పన్ను చెల్లింపులు. నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్ల అమ్మకం. రవాణా శాఖ సంబంధిత సేవలు. పాస్ పోర్ట్ అప్లికేషన్ల అమ్మకం. రైల్వే రిజర్వేషన్. వివిధ యాత్రాస్థలాలలో కాటేజీల రిజర్వేషన్, దర్శనం టికెట్లు. బి2సి సేవలు : రిలయన్స్, ఐడియా సెల్యులార్, ఏర్ టెల్ ఫోన్ బిల్లుల చెల్లింపులు, కొత్త కనెక్షన్ల అప్లికేషన్లు. వెస్టర్న్ యూనియన్ ద్వారా డబ్బు బదిలీ సౌకర్యం. ఇంటర్నెట్ సేవా ఉత్పత్తుల అమ్మకం. కొరియర్ సేవలు. టూరిజం ఆపరేటర్ల కోసం టికెట్ల అమ్మకాలు. ఆన్ లైన్ పెళ్లి సంబంధాల రిజిస్ట్రేషన్స్. రాజీవ్ ఇంటర్నెట్ విలేజి గురించి మరింత సమాచారానికి http://www.aponline.gov.in/Quick%20Links/events/RIV%20Launch/RaJiv.htm పై క్లిక్ చేయండి. ఆన్ లైన్ లో మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వే/ బహు ప్రయోజక గృహ సర్వే అందుబాటులో ఉన్న సేవలు కుల ధృవీకరణ పత్రాలు జనన ధృవీకరణ పత్రాలు నివాస ధృవీకరణ పత్రాలు పత్రాలను పొందడానికి ఈ వెబ్ లింకును http://www.apit.ap.gov.in క్లిక్ చేయండి ఆన్ లైన్ లో రవాణా శాఖ వారి పౌర సేవలు డ్రైవింగు/ వాహన నడపడం నేర్చుకునే వారికి లెర్నర్ లైసెన్సు జారీ చేయడం –అదే రోజు పొందవచ్చు డ్రైవింగు లైసెన్సు జారీ చేయడం –అదే రోజు పొందవచ్చు డ్రైవింగు లైసెన్సు రెన్యూవల్ చేసుకోవడం – రెండు గంటలు – అదే రోజు పొందవచ్చు డూప్లికేట్ డ్రైవింగు లైసెన్సు జారీ చేయడం – రెండు గంటలు – అదే రోజు పొందవచ్చు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ – రెండు గంటలు –అదే రోజు పొందవచ్చు వాహన రిజిస్ట్రేషన్ – అదే రోజు పొందవచ్చు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ పత్రం జారీ చేయడం – రెండు గంటలు- అదే రోజు పొందవచ్చు వాహన సొంతదారుడి / ఓనరు షిప్ మార్పు – అదే రోజు వాహనం అద్దెకు తీసుకునేందుకు – కొనుక్కునేందుకు ఒప్పందం లేదా రద్దు – అదే రోజు నివాస , వ్యాపార స్థల మార్పు – అదే రోజు పన్ను టోకెన్లు – రెండు గంటలు – అదే రోజు పర్మిట్ జారీ చేయడం – అదే రోజు ఫిట్ నెస్ పత్రం జారీ చేయడం – అదే రోజు పైన సేవలు పొందడానికి ఈ వెబ్ లింకును www.aptransport.org క్లిక్ చేయండి. ఈ-సేవా కేంద్రాలు -అందుబాటులో ఉన్న సేవలు ప్రజా వినియోగ పత్రాలు ప్రభుత్వ ఉత్తర్వులు ఈ సేవా కేంద్రాల వివరాలు ప్రజల వినిమయ బిల్లుల చెల్లింపులు మరిన్ని వివరాల కొరకు ఈ వెబ్ లింకును http://www.esevaonline.com క్లిక్ చేయండి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు