భూమి భూమి అనే భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ కర్ణాటకలో సామాన్య పౌరుల కోసం విజయవంతంగా అమలుచేసిన తొలి ఇ గవర్నెన్స్ చొరవగా చెప్పుకోవచ్చు. గత 4 ఏళ్లుగాదాదాపు 70 లక్షల పైగా రైతులకు ఇది సేవలను అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద భూరికార్డుల కియోస్కులను రాష్ట్రంలోని ప్రతి తాలూకాలోనూ ఏర్పాటు చేసి కింది సేవలందించడం జరుగుతోంది : ప్రజల కోరికెపై భూ రికార్డుల డాక్యుమెంట్ల నకలు జారీ వేలిముద్రల స్వీకరణ ద్వారా(బయోమెట్రిక్) సురక్షితమైన వ్యవస్థ ఏర్పాటు భూ రికార్డుల డాక్యుమెంట్లను సులభంగా, వేగంగా జారీ చేయడం, మ్యుటేషన్ స్థితిగతులు తెలపడానికోసం టచ్‌స్క్రీన్ కియోస్క్‌లను ఏర్పాటుచేయడం ఎవరు ముందొస్తే వారికి మ్యుటేషన్ విన్నపాలను పూర్తిచేయడం భూ రికార్డుల మ్యుటేషన్ చేయడానికి పని ధారా విధానంలో ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ డేటాను ఎన్క్రిప్షన్ ద్వారా భూమితో ఏకీకృతం చేయడం మరిన్ని వివరాలకు : http://www.bhoomi.kar.nic.in/ సామాన్య మహితి సామాన్య మహతి అనేది గ్రామీణ అభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ ఏర్పాటుచేసిన వెబ్ ఆధారిత చొరవ. ఇది కర్ణాటక రాష్ట్రంలోని అన్ని పల్లెవాడలలోని మౌలిక సౌకర్యాల గురించిన వివరాలను అందిస్తుంది. దాదాపు 21 శాఖలకు చెందిన 387 అంశాలపై వివరాలను అందిస్తుంది. ఇందులో వివరాలను పల్లెలవారీగా, గ్రామాలవారీగా, గ్రామ పంచాయితీలవారీగా, తాలూకా, పంచాయితీ నియోజక లర్గాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా, పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా, జిల్లా వారీగా, మొత్తం రాష్ట్రం వారీగా సమాచారాన్ని పొందవచ్చు. ఆయా జిల్లాలలోని జిల్లా పంచాయితీ ఈ సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ అభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ పర్యవేక్షిస్తుంది. మరిన్ని వివరాలకు : http://rdpr.kar.nic.in ఇ గ్రంథాలయ ఇ గ్రంథాలయ అనేది గ్రంథాలయాల కంప్యూటరీకరణకు విండోస్ ఆధారిత సాఫ్ట్వేర్. దీనిని ఎన్ఐసి ప్రమాణీకరించి దేశాం మొత్తంలో అమలుచేయనుంది. ఇందులోని సౌకర్యాలివీ : బార్కోడ్ ఇంటర్ఫేస్తో పుస్తకాలను సేకరించడం, సీరియల్స్, ఒపాక్, సర్క్యులేషన్, నిర్వహణ పూర్తి స్థాయి హెల్ప్, సెర్చి సౌకర్యాలు సభ్యులు కాని వారికి గెస్ట్ సౌకర్యం, వెబ్ సౌకర్యాలు మరిన్ని వివరాలకు : http://egranthalaya.kar.nic.in సహకార దర్పణ డైరెక్టరేట్ ఆఫ్ కో-ఆపరేటివ్ ఆడిట్ సహకార దర్పణ అనేది సహకార సంస్థల్లో వ్యవహార నిర్వహణలో పారదర్శకతను తేవడానికి ఆరంభించిన ద్విభాషా పోర్టల్. దీనిని ఎన్ఐసి, కర్ణాటక, డైరెక్టరేట్ ఆఫ్ కో-ఆపరేటివ్ ఆడిట్ లు సంయుక్తంగా రూపొందించాయి.ఇందులో 30వేలకు పైగా సహకార సంస్థల ఆర్థిక స్థితిగతులను చూపుతూ తద్వారా ఆయా సంస్థల ఆర్థిక బలాబలాలను ప్రదర్శిస్తారు. ఇందులోని సౌకర్యాలివీ : బ్యాలన్స్ షీట్ క్లుప్తీకరణ లాభ నష్టాల బేరీజు తయారీ రంగ అకౌంట్లు వ్యాపార అకౌంట్లు నిష్పత్తి విశ్లేషణ అవకతవకల గుర్తింపు (వ్యవహార నిర్వహణ, ఆర్థిక, రికార్డుల నిర్వహణ) కోఆపరేటివ్ సొసైటీల గ్రేడింగ్ మరిన్ని వివరాలకు : http://sahakaradarpana.kar.nic.in/ సారధి - వాహన్ ( రవాణా శాఖ) సారధి &వాహన్ అనేది ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని(ఆర్టివో) కంప్యూటరీకరించడానికి ఉద్దేశించింది. ఫీజు, పన్నుల వసూలు, రిజిస్ట్రేషన్, లైసెన్సు, పర్మిట్లు, ఎన్ఫోర్స్మెంట్, ఫిట్నెస్ - అన్నిటినీ పని జరిగే వివిధ స్థాయుల ఆధార వ్యవస్థ ద్వారా జరపడం దీని ప్రత్యేకత. ఇందులో అందించే సేవలివీ : మానవ ప్రమేయం లేని పూర్తి ఆన్లైన్ వ్యవస్థ ఆన్‌లైన్‌గా పని జరిగే వివిధ స్థాయుల ఆధార వ్యవస్థ ద్వారా వివిధ పత్రాల జారీ పోలీసు శాఖలోని ట్రాఫిక్ విభాగంతో ఏకీకృతం చేయడం డ్రైవింగ్ లైసెన్సు జారీచేసే సమయంలో అభ్యర్థి ఫోటో, వివరాలను సేకరించడం మరిన్ని వివరాలకు : http://rto.kar.nic.in/ రిటర్న్స్ ఫైలింగ్ సిస్టం(ఆర్టిఎస్) రిటర్న్స్ ఫైలింగ్ సిస్టం అనేదానిని బెంగళూరులో 130కి పైగా కార్యాలయాలలో అమలు చేశారు. దీని ద్వారా పన్ను కట్టే వివరాలు వగైరా తెలుసుకోవచ్చు. పన్నుల నిర్వహణలో పారదర్శకత చేవడానికి దీన్ని ప్రవేశ పెట్టారు. ఈ వెబ్సైట్లో పన్ను కట్టాల్సిన సమయాలు, పన్ను రేట్ల వివరాలు, తత్సంబంధ ప్రకటనలు ఉంటాయి. ఇందులో ముఖ్య సౌకర్యాలివీ : క్షత్ర స్థాయిలో రాష్ట్రంలోని కార్యాలయాలన్నిటినీ ప్రమాణీకరించడం డీలర్లకు అందించే సేవలని మెరుగుపరచడం ఎల్లవేళలా పొల్లుపోకుండా వివరాలివ్వడం అన్ని స్థాయుల్లో డేటా సురక్షణ డీలర్ల వివరాలను అన్నివేళలా అందుబాటులోకి తేవడం మరిన్ని వివరాలకు : http://ctax.kar.nic.in/index.asp ఇ-మాన్ ఇ - మాన్' అనెది టెక్నికల్ స్టోర్స్‌లో ఉండే వస్తువుల(కన్స్యూమబుల్స్, నాన్ కన్స్యూమబుల్స్) నిర్వహణకు ఉపకరించే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్. దీనిని ఎన్ఐసికి చెందిన వివిధ రాష్ట్ర కేంద్రాల్లో అణలుచేసి వాడుతున్నారు. వివిధ వస్తువులను జారీచేయడం, అవసరాల మేరకు దరఖాస్తు పెట్టుకోవడం, అనుమతించడం, పాత వస్తువులను రిటర్న్ తీసుకోవడం, కొత్త వస్తువులను స్టాక్‌లో చేర్చడం వగైరా పనులకు ఈ సాఫ్ట్వేర్ పనికొస్తుంది. ఇందులో ముఖ్య సౌకర్యాలివీ : స్టోర్స్ నిర్వహణ స్వీకారాలు/ జారీ చేయడం / వెనక్కి తీసుకోవడం ప్రతి వాడకందారుకీ ఒక లావాదేవీ కాగానే తగురీతిలో ఆటోమేటిగ్గా ఇ - మెయిల్ పంపడం వివిధ అంశాల ఆధారంగా స్టాక్ రిపోర్ట్ తయారీ ఏఎంసిలో ఉన్న హార్డ్‌వేర్ లోపాలు ఏర్పడితే రిపోర్ట్ చేసే సౌకర్యం హార్డ్‌వేర్ లోపాలు ఏర్పడితే చేసిన రిపోర్ట్‌లను ఏఎంసిలో ఉన్న వెండర్లు చూసుకొనే సౌకర్యం మరిన్ని వివరాలకు : http://eman.kar.nic.in/ ఆస్తి తెరిగె(ఆస్తి పన్ను) ఆస్తితెరిగె అనెది ఆస్తిపన్ను లెక్క గట్టడానికీ, వసూలు చేయడానికీ వీలునిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారి సాలు అద్దె విలవ, ఆస్తిపన్ను నిర్ణయించగానే ఈ సాఫ్ట్వేర్ చెల్లించాల్సిన మొత్తాలను లెక్కగడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను కర్ణాటక ప్రభుత్వం వివిధ గ్రామ పంచాయితీల్లో అమలు చేసింది. ఇందులో ముఖ్య సౌకర్యాలివీ : డిమాండ్ నోట్స్‌ను, నోటీసులను ముద్రించడాన్ని కంప్యూటరీకరించడం కంప్యూటరీకరించిన కౌంటర్ల ద్వారా పన్ను వసూలు చేసే వీలు స్థానిక భాషలలో పనిచేసే వీలు పారదర్శక వ్యవస్థ మరిన్ని వివరాలకు : http://rdpr.kar.nic.in బాల కార్మిక నిర్మూలనా కార్యకలాపాల సమాచార వ్యవస్థ(సిఎల్ఇఏఐఎస్) కర్ణాటక రాష్ట్రం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథక సొసైటీ, 'బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథక సమాచార వ్యవస్థ' అనే కంప్యూటరీకృత వ్యవస్థను కింది అంశాలకు డేటా ఎంట్రీ, క్వెరీ, గ్రాఫ్‌లు గీయడానికి చేదోడు వాదోడుగా ఉండేలా రూపొందించి అమలుచేసింది : అమలయ్యేలా చూసే పనులు విచారణ కేసులు కనీస వేతన కేసులు రికవరీ కేసులు డిసి రికవరీ డిసీ బకాయీల కేసులు బాల కార్మికులను గుర్తించడం బ్రిడ్జి స్కూలు వర్గవారీ పిల్లలను వేరుచేయడం వెట్టి బాల కార్మిక వ్యవస్థ గ్రామీణాభివృద్ధి, పౌర సంబంధాల శాఖలలో కార్మిక వ్యవస్థ నిర్మూలనా కార్యకలాపాలు నగరాభివృద్ధి శాఖలో కార్మిక వ్యవస్థ నిర్మూలనా కార్యకలాపాలు సాంఘిక సంక్షేమ శాఖలో కార్మిక వ్యవస్థ నిర్మూలనా కార్యకలాపాలు సామర్ధ్య నిర్మాణ, శిక్షణ కార్యకలాపాలు తగిన వాతావరణ నిర్మాణ కార్యకలాపాలు సమాజ నిధి వివరాలు మరిన్ని వివరాలకు : http://balashrama.kar.nic.in/ కృషి మరత వాహిని కృషిమరతవాహినిఅనేది ఒక వెబ్ ఆధారిత వ్యవసాయ సంబంధిత వస్తువుల ధరల సమాచార వ్యవస్థ. ఇది మార్కెట్లవారీగా ఇంగ్లీష్, కన్నడ భాషల్లో రోజూ సాయంత్రం 4గంటలకు ధరల సమాచారాన్నందిస్తుంది. ఈ వెబ్ పోర్టల్‌లో లభించే ధరల వివరాలను వివిధ వ్యాపారస్తులు, రైతులు వాడుకొంటారు. తద్వారా వారి వ్యవసాయ ఉత్పత్తులకు తగు రీతిలో ధరలను నిర్ణయించుకోగలుగుతారు. మరిన్ని వివరాలకు : http://maratavahini.kar.nic.in/ ఆహార ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆరంభించిన ఈ 'ఆహార' అనే వెబ్ ఆధారిత ప్రాజెక్ట్ ప్రభుత్వానికి చెందిన దారిద్ర్య రేఖ కన్నా దిగువనుండే లబ్దిదారులైన ప్రజలకు ఏర్పరచిన ఆహార తంత్రాన్ని గురించి ప్రచారం చేయడానికి ఉద్దేశించింది.ఇది 50 లక్షల లబ్దిదారులకు కింది అంశాలపై ఆన్‌లైన్‌గా సమాచారాన్ని అంస్తుంది : 20,000 చౌకధరల దుకాణాల గురించిన వివరాలు అన్ని జిల్లాలోనూ నిత్యావసర వస్తువుల రోజువారీ చిల్లర ధరవరలు రోజువారీ చిల్లర ధరవరలలో వ్యత్యాసాలు వారాలవారీ చిల్లర ధరవరలలో వ్యత్యాసాలు నెలవారీ చిల్లర ధరవరలు, మాసాంత చిల్లర ధరలు మాసాంత టోకు ధరలు టోకు, చిల్లర ధరల పోలిక, వ్యత్యాసాల పట్టిక సిటిజన్ ఛార్టర్, పథకాల వివరాలు, టిపిడిఎస్, ఇతర వివరాలు జిల్లావారీ ఆహార ధాన్యాల కేటాయింపులు మరిన్ని వివరాలకు : ఆహార ఆడిట్ మానిటరింగ్ సిస్టం(ఎఎంఎస్) ఆర్థిక శాఖకు చెందిన కంట్రోలర్(అకౌంట్స్ మేనేజ్మెంట్) & ఎక్స్ అఫిషియో ప్రభుత్వ కార్యదర్శి 'ఆడిట్ మానిటరింగ్ సిస్టం' (ఏఎంఎస్) అనే దానిని ఆరంభించారు. ప్రజాధన నిర్వహణ, లెక్కలరంగంలో రాష్ట్ర కార్యకలాపాలను ఏకీకృతం చేయడం దీని ఉద్దేశం.ప్రభుత్వంలోని వివిధ శాఖల అభిప్రాయాలను సేకరించి, తదనుగుణంగా పర్యవేక్షించడానికి కింది అంశాల వారీగా వారు ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు : తనిఖీ నివేదికల్లో ఆడిట్ అభ్యంతరాలు, గమనికలు కాగ్ ఆడిట్ రిపోర్టులలో(పౌర, వాణిజ్య, రాబడి, జిల్లా పంచాయత్) ప్రస్తావించడానికి ఉద్దేశించిన ఆడిట్ పేరాలు / సమీక్షల కోసం డ్రాఫ్ట్‌ల తయారీ కాగ్ ఆడిట్ రిపోర్టులలో(పౌర, వాణిజ్య, రాబడి, జిల్లా పంచాయత్) ప్రస్తావించడానికి ఉద్దేశించిన పేరాలకు, సమీక్షలకు విభాగీయ నోట్స్ వివిధ గ్రాంట్లకు తదితర క్రమబద్దీకరించాల్సిన అంశాలకు విభాగీయ నోట్స్ పిఏసి / సిఓపియు నివేదికలకు సంబంధించిన తీసుకొన్న చర్యల సంబంధమైన నోట్స్ మరిన్ని వివరాలకు : ఆడిట్ మానిటరింగ్ సిస్టం పదవ తరగతికి ఆన్లైన్ టెక్ట్స్‌బుక్స్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర విద్యా పరిశోధన& శిక్షణా శాఖ(డిఎస్ఇఆర్టి) పదవ తరగతి పాఠ్య పుస్తకాలని ఆన్‌లైన్‌గా లభించే ఏర్పాటు చేస్తోంది. పదవ తరగతి సైన్సు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, లెక్కలు, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, సంస్కృతం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దు పాఠ్య పుస్తకాలను అన్ని భాషల్లో అంటే, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు, ఉర్దూ, తమిళ భాషల్లో అందరికీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిని పిడిఎఫ్ ఫార్మేటులో లభింపజేస్తున్నారు. మరిన్ని వివరాలకు : పాఠ్య పుస్తకాలు రైతు మిత్ర Agriculture Department కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 'రైత మిత్ర' వెబ్ పోర్టల్‌లో రైతుల మెరుగైన వ్యసాయానికి దోహదం చేసే విధంగా సలహాలూ, సూచనలూ, ఇతర రోజువారీ సమాచారాలూ అందిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 745 రైత మిత్ర కేంద్రాల్లో సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు. మరిన్ని వివరాలకు :http://raitamitra.kar.nic.in సిఏఎస్సెట్ -2003 సిఏఎస్సెట్-2003, రాష్ట్రంలో ఉన్న వివిధ వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ల నిర్వహణ కోసం రూపొందించారు. ఈ ప్రాజెక్టు గత పదేళ్లుగా రాష్ట్రంలో విజయవంతంగా అమలౌతోంది. ఈ సెట్ సాఫ్ట్వేర్ విజయాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఇతర కాలేజీలలో నిర్వహించే ఇంజనీరింగ్ డిప్లొమా, నర్సింగ్, ఆయుర్వేద, యునాని, హోమియో కోర్సులకు అడ్మిషన్లకు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ఈ ఆటోమేషన్‌వల్ల ర్యాంకులను ఇవ్వడంలో, సీట్ల కేటాయింపులలో పారదర్శకత ఏర్పడింది. సౌకర్యాలు సమాధాన పత్రాలను దిద్దడాన్ని కంప్యూటరీకరించడం మెరిట్ జాబితా తయారీ, సీట్ల కేటాయింపు వగైరాలను డిస్ప్లే బోర్డుపై చూపడం కేటాయింపులు జరిగేటపుడు ఉత్పన్నమయ్యే ట్రాన్సాక్షన్లను ఆటోమేటిగ్గా ఆడిట్చేయడం బయోమెట్రిక్ విధానంలో యాక్సెసింగ్ ప్రవేశ పరీక్షలకు వెబ్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకొనే వీలు రాసిన సమాధానాలను అసలైన వాటితో పోల్చి చూపే నివేదిక ఉత్తీర్ణ పరీక్షకూ, సిఏఎస్సిఇటి పరీక్షకూ అభ్యర్థి ప్రదర్శించిన తీరులో వ్యత్యాస నివేదిక మరిన్ని వివరాలకు : http://cet.kar.nic.in ఇ - ఆర్కీవ్ ఆర్కీవ్ శాఖ కోసం ఇ-ఆర్కీవ్అనేది వెబ్ ఆధారిత కేటలాగు సాఫ్ట్వేర్. 5 లక్షలకు పైగా ఉండే డాక్యుమెంట్లనుఇందులో శబ్దాశ్రయంగా వెదుక్కోవచ్చు. తన వద్ద ఉన్న 17వ శతాబ్ద కాలపు పత్రాలనుంచీ నేటి దాకా ఉండే వివిధ అమూల్యమైన పత్రాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి వీలుగా ఆర్కీవ్ శాఖ దీనిని రూపొందించింది.ఈ వెబ్సైట్లో కన్నడ భాష, సంస్కృతి, రాష్ట్ర ప్రాచీన పత్రాలు, గెజిటీర్లు, పురావస్తు, సంగ్రహాలయ, సమాచారాన్ని పొందే హక్కు చట్టం వంటి అనేక అంశాలకు చెందిన సమాచారాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో పొందవచ్చు. మరిన్ని వివరాలకు : http://kannadasiri.kar.nic.in ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు