మహితిశక్తి లభ్యమగు సేవలుః ప్రజోపయోగార్థ దరఖాస్తులు వాటితో పాటు సరిచూసుకొనే జాబితా, దరఖాస్తుకు కావలసిన ఫీజు, దరఖాస్తును పరిష్కరించుటకు పట్టే కాలము వివరాలు. జరుగుచున్న/ అమలులోనున్న పథకముల సమాచారం. సమస్యలను పరిష్కరించే చర్చావేదిక. ఆన్ లైన్ ద్వారా జాతీయ వృద్దాప్య పింఛను పథకము నోఆప్స్ - (NOAPS) , త్రాగునీటి సమస్యలు మరియు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు. మంత్రులు మరియు జిల్లా అత్యున్నత అధికారులతో ఆన్ లైన్ ద్వారా సంభాషణ. వెయ్యికి పైగా రక్తదాతల జాబితా వారి బ్లడ్ గ్రూపులు, చిరునామా, టెలిఫోన్ వివరములు విత్తనములు, ఎరువులు, పురుగు మందులు మరియు సేంద్రియ ఎరువుల సమాచారము. ఎవరికైన ఉపయోగార్థం ఓటర్ల జాబితా సమాచారం. దారిద్ర్యరేఖకు దిగువనున్న జనాభా జాబితా. పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. http://gujaratindia.com/ ఆన్ లైన్ దరఖాస్తు ఫారాలు లభ్యమగు సేవలుః గుజరాత్ ప్రభుత్వమునకు సంబంధించిన దరఖాస్తుఫారాలను వెదకడం, గుర్తించడం మరియు చూడడం. ద్విభాషలలో (ఇంగ్లీషు మరియు గుజరాతీ) దరఖాస్తుఫారంను ఏదైనా ఒక భాషలో చూడడం. పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. http://formbook.gswan.gov.in/ ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ తీర్మానముల – జీ. ఆర్ (G.R) పుస్తకము లభ్యమగు సేవలుః గుజరాత్ ప్రభుత్వ తీర్మానములను వెదకడం, గుర్తించడం మరియు చూడడం. ద్విభాషలలో (ఇంగ్లీషు మరియు గుజరాతీ) దరఖాస్తు ఫారంను ఏదైనా ఒక భాషలో ప్రభుత్వ తీర్మానములను చూడడం. ప్రభుత్వ తీర్మానములలో ఎక్కువగా వాడబడే వాటిని మనకు ఎక్కువ నచ్చిన వాటిలో జమ చేసే సౌకర్యం. పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. http://gswan.gov.in గుజరాత్ బ్యాంక్ ఆఫ్ విజ్డమ్ లభ్యమగు సేవలుః గుజరాత్ ప్రభుత్వమునకు మీ సలహాలు, సూచనలు పంపించండి. ప్రతినెలలో నిర్దేశించబడిన విషయంపై ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ నిపుణులతో చర్చావేదికలో పాల్గొనండి. మీరు చేసిన సూచన ఆనెలలో ఎంపికైతే మీరు కూడా చర్చావేదికలో పాల్గొనడానికి ఆహ్వానింపబడతారు. పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి www.gujaratbankofwisdom.com ఉపాధికల్పనా కేంద్రములో ఉపాధికై ఆన్ లైన్ నమోదు లభ్యమగు సేవలుః ఆన్ లైన్ నమోదు చేసే అవకాశం ప్రకటన సమాచారం శిక్షణాకార్యక్రమాలపై సమాచారం ఆన్ లైన్ ద్వారా ఉపాధి యదాస్ధితిని చెక్ చేసుకొనవచ్చు. ఉద్యోగ సమాచారం మరియు సూచనలు పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి http://talimrojgar.org/Scripts/AddCandidateRegB.asp ఈ-సిటీ (AMC) నగరపౌరకేంద్రం-ఏకైక పౌరకేంద్రం లభ్యమగు సేవలుః ఈ క్రింది పౌరసేవల సమాచారములు ఆరు నగరపౌరకేంద్రాలలో ఏ కేంద్రం నుండి అయినా సమాచారం పొందవచ్చు. జనన మరణాల రిజిస్ట్రేషన్ బిల్డింగ్ ప్లాన్ లు ప్రాథమిక ఆరోగ్యం మరియు విద్య నగర పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల, రోడ్లు వీధి దీపాలు పార్కులు మరియు ఉద్యానవనాలు వివిధ రకాల పన్నుల చెల్లింపు హెల్ప్ డెస్క్: దస్తావేజులు, దరఖాస్తులు మరియు ఇతర సహాయము పౌరులకు కార్యాలయ పనివేళలు దాటిన తర్వాత కూడా సత్వర పంపిణీ సేవలు అందజేయుట. పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి www.egovamc.com జనసేవా కేంద్రం లభ్యమగు సేవలుః తొంభై వివిధ రకాల పౌరసేవలు, నలభై నాలుగు రకాల అఫిడవిట్ లు మరియు అనేక విలువ ఆధారిత సేవలు. అదనపు సేవలైన భూసంబంధిత విషయాలు, పంపిణీ సంబంధిత విషయాలు, శిస్తువసూలు, లైసెన్స్ ల మంజూరు, ధృవీకరణ పత్రాలు, సమాచార హక్కుకు సంబంధించిన కేసులు మరియు అఫిడవిట్ లు. ధృవీకరించబడిన పత్రాలను ఇంటి వద్దకు పంపిణీ చేయుట. వికలాంగులు,నిరక్షరాస్యులు వయోవృద్ధులకు ప్రత్యేకమైన సేవలు. పౌరులకు SMS- ఎస్. ఎమ్. ఎస్ సేవ ద్వారా యధాతధ స్థితి సరిచూచుకొనుట. ఎల్లవేళలా ఫోనుద్వారా ప్రత్యుత్తరము, రోజులో ఇరవై నాలుగు గంటలు, వారంలో ఏడు రోజులు. పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి www.gujarat.gov.in ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు