ప్రజాసమాచార కేంద్రం – సి.ఐ. సి (CIC) భారత ప్రభుత్వము, కంప్యూటర్ సమాచార ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ లో భాగంగా ప్రజాసమాచార కేంద్రాల్ని జమ్ము మరియు కాశ్మీరు రాష్ట్రంలో ప్రారంభించింది. సి.ఐ.సి, కంప్యూటర్ ఆధారితమైన పౌరుల కియోస్కు. ఈ కియోస్కు పౌర కేంద్రిత సేవలు, ఈ-గవర్నెన్స్, ఈ-లెర్నింగ్ మరియు ఈ- కామర్స్ సేవల్ని ప్రజలకి అందుబాటులో ఉంచుతుంది. ఈ రాష్ట్రం, ప్రతి 134 బ్లాకులకు ఒక సి.ఐ.సి ని కలిగి ఉంది. ఈ CIC ద్వారా క్రింద నిచ్చిన సమాచారము మరియు సేవల్ని వినియోగించవచ్చు: వ్యవసాయ మార్కెటింగ్ ఉద్యోగావకాశాలు ప్రజారోగ్యం సామాజిక మరియు రాజ్య డేటాబేస్ కంప్యూటర్ శిక్షణా ప్రణాళికలు పౌర కేంద్రిత సేవలు టెండర్ల ప్రకటనలు ఈ-ఉద్యోగ ప్రకటనలు ఎలక్ట్రానిక్ మాధ్యము ద్వారా దూర ప్రాంతాలకు వార్తాపత్రికలు సమస్యల పరిష్కారం మొదలగునవి ఆన్ లైన్ ఉపాధికల్పన సమాచారం లభ్యమగుసేవలుః ఉద్యోగము కావలసిన ధరఖాస్తు దారుని రిజిస్ట్రేషన్ ఉద్యోగ మార్కెట్ సమాచార డేటా ఒకేషనల్ మార్గదర్శకత్వము మరియు ఉద్యోగ సలహాలు వివిధ ప్రైవేట్ రంగాలకు అభ్యర్థులను జవాబుదారిగా పంపడం రక్షక దళాలలో ప్రత్యేక ఉద్యోగ భర్తీ స్వయం ఉపాధి పథకాల సమాచారము పోటీ పరీక్షలకు సలహాలు ఉపాధికల్పన కేంద్రంలో రిజిస్ట్రేషన్ పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి http://jakemp.nic.in ఆన్ లైన్ మోటారు వాహన సమాచారం లభ్యమగుసేవలుః ధరఖాస్తు ఫారం పన్నుల మధింపు వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ ధరఖాస్తు యధాస్థితి దూరములను తెలిపే చార్ట్ డ్రైవింగ్ స్కూల్ జాబితా పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి http://jaktrans.nic.in ధరఖాస్తులు మరియు విధానములకు సంబంధించిన సమాచారం లభ్యమగుసేవలు ఈ క్రింద ఇచ్చిన జె&కె (J&K) డిపార్ట్ మెంట్లు, అందుబాటులో ఉంచిన ప్రజా స్కీమ్ / సేవలకి సంబంధించిన సమాచారం చూడవచ్చు. వినియోగదారుల వ్యవహారములు మరియు ప్రజా పంపిణీ, ఉపాధికల్పన, సాంఘిక సంక్షేమ, రవాణా. ఏ డిపార్ట్ మెంటు పద్ధతులనైనా చూచి, వారి సేవల్ని వినియోగించుకోవచ్చు మరియు కావలసిన ఫారం మరియు సరిచూసుకొనే జాబితా లను డౌన్ లోడు చేసుకోవచ్చు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు