ఆన్ లైనులో ప్రభుత్వ ప్రకటనలు లభిస్తున్న సేవలు : ఇంగ్లీషు భాషలో అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు లభిస్తాయి అన్ని ఉత్తర్వులు పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు. ఉత్తర్వులను డౌన్ లోడు చేసుకొని చదువుకోవడానికి ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.Manipur pensions) ఆన్ లైనులో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ లభిస్తున్న సేవలు: ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కంపెనీలు లేదా సంస్థలు మరియు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆన్ లైనులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు కరీర్ గైడెన్సు ఇచ్చే విధంగా వివరాలు ఇందులో లభిస్తాయి. మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి Manipur - career guidance ప్రభుత్వ యంత్రాంగ ఇ-మెయిల్ వివరాలు లభిస్తున్న సేవలు : రాష్ట్ర మంత్రుల, యం.యల్.ఏ., ఐఏయస్, యం.సి.యస్ అధికారుల మరియు ఇతర అధికారుల ఇ- మెయిల్ వివరాలు వెబ్ సైటులో ఉంచారు. మీ వివాదాలను సరియైన, ఖచ్చితమైన అధికారికి ఇ-మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇ-మెయిల్ వివరాల కొరకు ఈ వెబ్ సైటును క్లిక్ చేయండి. Manipur Email Directory విద్యకు సంబంధించిన ధరఖాస్తులు లభిస్తున్న సేవలు : మణిపూర్ ఉన్నత విద్యాశాఖ, మణిపూర్ విశ్వవిద్యాలయాలు, ప్రణాళిక శాఖ కు సంబంధించిన ధరఖాస్తులు ఈ వెబ్ సైటులో లభిస్తాయి. అన్ని ధరఖాస్తులు పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు. ధరఖాస్తుల కొరకు ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి Manipur Educational forms.htm ఆన్ లైనులో పరీక్షా ఫలితాలు లభిస్తున్న సేవలు : వివిధ పరీక్షా ఫలితాలు ఈ వెబ్ సైటునుండి పొందవచ్చు. ఫలితాల కోసం ఈ క్రింది వెబ్ సైటును సందర్శించండి. Manipur results ఆన్ లైనులో హైకోర్టు తీర్పులు లభిస్తున్న సేవలు : గౌహాతీ హైకోర్టు – మణిపూర్ బెంచ్ మరియు మణిపూర్ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల తీర్పులను ఈ వెబ్ సైటులో పొందవచ్చు. హై కోర్టు తీర్పుల కోసం Judgements వివిధ జిల్లా కోర్టుల తీర్పుల కోసం Manipur courts వెబ్ సైటులను క్లిక్ చేయండి. ప్రజా ప్రతినిధులు లభిస్తున్న సేవలు: పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వెబ్ సైటునుండి పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్లను క్లిక్ చేయండి. లోక్ సభ సభ్యుల వివరాల కోసం Manipur - LokSabha రాజ్యసభ సభ్యుల వివరాల కోసం Manipur-RajyaSabha రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల వివరాల కోసం Manipur-StateAssembly రవాణా సేవలు లభిస్తున్న సేవలు : లెర్నర్ లైసెన్స్, శాశ్వత లైసెన్సుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు, నియమావళి, ఫీజు వివరాలు ఈ సైటులో లభిస్తాయి. వాహన నమోదుకు సమాచారం లభిస్తుంది. లెర్నర్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ కు సంబంధించిన ధరఖాస్తులు లభిస్తాయి. రోడ్డు పన్ను, పర్మిట్ , డ్రైవింగు కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు మరియు పూర్తి సమాచారం ఇందులో లభిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి Manipur Transport department సాంఘిక సంక్షేమ శాఖ లభిస్తున్న సేవలు : మహిళ, బాలల, వైకల్యం గల వారికి, వృద్ధులకు, వైద్య సదుపాయం పొందలేని వారికి సంబంధించిన సంక్షేమ వివరాలన్ని ఈ సైటులో లభిస్తాయి. సంక్షేమ పధకాలను పొందడానికి ఏ అధికారికి ధరఖాస్తులు సమర్పించాలో ఆ అధికారి పేరు, మరిన్ని చిరునామా వివరాలు ఈ వెబ్ సైటులో లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ స్పాన్సర్ పధకాలు – నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, ఇంటిగ్రెటేడ్ చైల్డ్ స్పాన్సర్ సర్వీసెస్ ప్రోగ్రాం మరియు బాలికా సమృద్ధి యోజన వివరాలు ఈ వెబ్ సైటులో లభిస్తాయి. మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి. Manipur - social welfare మైనారిటీ మరియు బిసి సంక్షేమ శాఖ లభిస్తున్న సేవలు : ప్రీ మెట్రీక్, పోస్ట్ మెట్రీక్ కు సంబంధించిన స్కాలర్ షిప్పులు ఒబిసి విద్యార్థులు పొందడానికి అవసరమైన పూర్తి సమాచారం ఈ వెబ్ సైటులో లభిస్తుంది. స్కాలర్ షిప్పులు మరియు ఇతర స్కీం లు పొందడానికి అవసరమైన ధరఖాస్తులను వెబ్ సైటులో పొందుపరిచారు. స్కాలర్ షిప్పుల వివరాలు, ధరఖాస్తుల కొరకు ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి Manipur - scheme వైద్య ఆరోగ్య సేవలు లభిస్తున్న సేవలు: జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాల కు సంబంధించిన ధరఖాస్తులు వ్యాధి నిరోధక టీకాల పట్టిక మణిపూర్ రాష్ట్రంలో ఆరోగ్య సమాచారం, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులలో లభిస్తున్న సదుపాయాల వివరాలు ఈ వెబ్ లో లభిస్తాయి. పూర్తి సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి. Manipur - Health ఓటరు వివరాలు లభిస్తున్న సేవలు: నియోజక వర్గాల వారీగా ఓటరు వివరాలను పిడియఫ్ ఫార్మెట్లో రూపోందించి వెబ్ సైటులో ఉంచారు. ఈ ఓటరు వివరాలను సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఏ నియోజక వర్గంలో ఉందో తెలుసుకోవడానికి ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి. Electoral Rolls ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు