ఆన్ లైన్ లోప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు అందుబాటులో ఉన్న సేవలు : వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు ఈ సైటులో ఉన్నాయి. అన్ని ధరఖాస్తులు పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైట్ నుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు. ధరఖాస్తులను డౌన్ లోడు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ లింక్ ను క్లిక్ చేయండి. http://sikkim.nic.in/sikkimroot/html/forms.htm ఆన్ లైన్ లో ఇండియా బయో మెడికల్ పత్రిక వివరాలు అందుబాటులో ఉన్న సేవలు : ఇండియా బయో మెడికల్ సమాచార పత్రిక కు సంబంధించిన 38 సంచికలను ఈ వెబ్ లో పొందుపరిచారు. భారత దేశంలో ప్రధాన మెడికల్ లైబ్రరీలు కలిగి ఉన్న పత్రికల పూర్తి డేటాబేస్ ఈ వెబ్ సైటులో లభిస్తుంది. ఇండియా మెడ్లర్స్ సెంటర్ వారు నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాల వివరాలు తెలుసుకోవచ్చు ప్రొపెషనల్స్, వినియోగదారులకు, నర్సింగు ప్రొపెషనల్స్ కు, మెడికల్ లైబ్రరేరియన్స్ కు అవసరమైన ఇంటర్నెట్ వనరుల సమాచారాన్ని ఈ వెబ్ సైటులో పొందుపరిచారు వ్యాధులు / మందులు- ఇంటర్నెట్ వనరుల తాజా సమాచారంతో అప్ డేటే చేసిన వివరాలు లభిస్తాయి. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్ ను క్లిక్ చేయండి http://indmed.nic.in/ ఆన్ లైన్ లో ఓటరు వివరాలు లభిస్తున్న సేవలు: నియోజక వర్గాల వారీగా ఓటరు వివరాలు ఈ వెబ్ సైటులో లభిస్తాయి. అందులో పేరు, వయస్సు, ఓటు ఐడీ నెంబరు ఉంటాయి సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన 32 నియోజక వర్గాల ఓటరు వివరాలు లభిస్తాయి. ఈ వివరాలు పిడియఫ్ ఫార్మెట్ లో పొందుపరచి, వాటిని సులభంగా డౌన్ లోడు చేసుకునే సదుపాయం కల్పించారు. ఓటరు వివరాలు పొందడానికి ఈ క్రింది పేర్కొన్న వెబ్ లింక్ ను క్లిక్ చేయండి. (http://sikkim.gov.in/asp/ELECTION-DATA/e-roll2008/index.htm) ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు