ఆర్.టి.ఐ యాక్ట్ 2005 సమాచార హక్కు చట్టం - 2005 సమగ్ర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి ఆర్.టి.ఐ యాక్ట్ 2005 మీరు తెలిసికొనవలసిన మీ సమాచార హక్కులు (ఆర్.టి.ఐ యాక్ట్) ఇది ఎప్పుడు అమలులోకి వచ్చింది? అక్టోబర్ 12వ తేది,2005 న ఇది అమలులోనికి (జూన్15, 2005న చట్టబద్ధమైన నాటి నుండి 120 వ రోజున) వచ్చింది. కొన్ని ఏర్పాట్లు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు ప్రభుత్వ అధికారుల బాధ్యతలు [ఎస్.4(1)], పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార ఆధికారులు [ఎస్.5(1) మరియు 5(2)], కేంద్ర సమాచార కమీషన్ ఏర్పాటు (ఎస్12 మరియు 13), రాష్ట్ర సమాచార కమీషన్ ఏర్పాటు (ఎస్.15 మరియు 16). రహస్య సమాచార, భద్రతా వ్యవస్థలకు (ఎస్.24) ఇది వర్తించదు. చట్టనియమాలను పొందుపరచే ఏర్పాటు జరిగింది (ఎస్.27మరియు 28). ఎవరికి వర్తిస్తుంది? జమ్మూ కాశ్మీరు రాష్ట్రమునకు తప్ప భారత దేశప్రజలందరికి ఈ చట్టం వర్తిస్తుంది [ఎస్.(12)]. సమాచారం అనగానేమి? సమాచారం అనగా రికార్డులు, దస్తావేజులు (డాక్యుమెంట్లు), మెమోలు, ఇ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, అందరికీ తెల్పే పత్రం (సర్క్యులర్లు), ఉత్తర్వులు, దినచర్య పుస్తకాలు (లాగ్ బుక్స్), ఒప్పందాలు(కాంట్రాక్టులు), నివేదికలు(రిపోర్టులు), పత్రాలు, నమునాలు, ఏదేనా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే దత్తాంశాల (డేటా మెటీరియల్)తో సహా ఏ రూపంలోనైనా ఉండే ఏదేని అంశాలు, ఆ సమయంలో అమలులోఉన్న ఏదైనా ఇతర శాసనం క్రింద ప్రభుత్వ అధికార వర్గం తెలుసుకొనదగినట్టి ఏదైనా ప్రవేటు సంస్థకు చెందిన సమాచారం, ఫైలు వివరణలు (ఫైల్ నోటింగ్ లు) ఇందులో చేరవు [ఎస్.2(ఎఫ్) ]. సమాచారహక్కు అనగానేమి? ఇందులో ఈ దిగువ హక్కులు చేరి ఉన్నాయి- పనులను, దస్తావేజు(డాక్యుమెంట్లు)లను, లిఖిత నమోదు(రికార్డు)లను తనిఖీచేసే హక్కు. డాక్యుమెంట్లు లేదా రికార్డుల నుండి కావలసిన అంశాలను నోట్ చేసుకోవడం, ఉదాహరణ భాగాలను రాబట్టుకోవడం, ధృవీకృత నకళ్ళను తీసుకొనే హక్కు. సామగ్రి యొక్క ధృవీకృత మాదిరిలను తీసుకొనేహక్కు. ముద్రిత ప్రతుల, డిస్కెట్స్, ఫ్లాపీలు, టేపులు, వీడియో కేసెట్ల రూపంలో లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ విధానంలో లేదా ముద్రిత ప్రతుల ద్వారా సమాచారం పొందవచ్చు. [ఎస్.2( j )] అధికారులు వారి విధులు ప్రభుత్వ(పౌర) అధికార వర్గం యొక్క విధులేమిటి? ఈచట్టం అమలులోకి వచ్చిన120 రోజులలోపల ఈక్రింది వాటిని ప్రచురించాలిః- అధికారవ్యవస్థ యొక్క కార్యక్రమాలు మరియు విధులు; అధికారులు, ఉద్యోగస్థుల అధికారాలు మరియు విధులు; పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతోబాటు నిర్ణయాత్మక ప్రక్రియతో అనుసరించే విధానాలు; వ్యవస్థ యొక్క కార్యక్రమ నిర్వహణలో నిర్వర్తించే సూత్రాలు; దీనిలో గల ఉద్యోగుల కార్యక్రమం అమలులో వినియోగించే నియమాలు, నిబంధనలు, సూచనలు, నియమ సంపుటులు ( మేన్యువళ్ళు), రికార్డులు; దాని దగ్గర లేదా అజమాయిషీలో ఉన్న దస్తావేజుల లేదా పత్రాల రకాలకు సంబంధించిన ప్రకటన; దాని విధానాల రూపకల్పన కోసం ,లేక వాటి అమలు కోసం పౌర సభ్యులతో సంప్రదింపులు జరిపేటందుకు లేక వారి ప్రాతినిధ్యం స్వీకరించేటందుకు ఏదైనా పద్ధతి ఉన్నట్లయితే దాని వివరాలు; దానిలో భాగంగా గాని, లేక సలహాలు ఇచ్చేటందుకు గాని, ఇద్దరులేక అంతకన్నా ఎక్కువ సభ్యుల తో మండళ్ళు(బోర్డులు), పరిషత్తులు(కౌన్సిళ్ళు), సమితులు(కమిటీలు),ఇతర సంస్థలు ఏర్పాటై ఉంటే వాటి వివరాల ప్రకటన. ఆయా సమావేశాలగురించి ప్రజలకు తెలుస్తున్నదీ లేనిది సమావేశపు వివరణలు అందుబాటులో ఉన్న విషయం; అధికారుల, ఉద్యోగ దర్శిని; అధికారులు, ఉద్యోగులలో ప్రతి ఒక్కరు తీసుకునే నెలవారి వేతనము, నిబంధనల ప్రకారం చెల్లించే పరిహార విధానం; అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యెయాలు, జరిపిన పంపిణీలకు సంబంధించిన నివేదికల వివరాలను సూచిస్తూ ఆ యంత్రాంగంయొక్క ప్రతినిధి సంస్థలు ప్రతీదానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు; ఆర్ధిక సహాయ (సబ్సిడీ )కార్యక్రమాల అమలుతీరు, ఆయా కార్యక్రమాలకు కేటాయించిన సొమ్ము మొత్తం, లబ్ధిదారుల వివరాలు; అది మంజూరు చేసిన రాయితీలు, అనుమతులు, అధికారికనిధులను పొందుతున్న గ్రహీతల వివరాలు; ఎలక్ట్రానిక్ రూపంలోకి కుదించిన అందుబాటులోను, ఆధీనంలోఉన్నసమాచారం; ప్రజా వినియోగం కోసం గనుక నిర్వహిస్తే గ్రంధాలయం, పఠనాలయం యొక్క పని గంటలతోబాటు పౌరులకు అందేసమాచారం కొరకు అందుబాటులోగల సౌకర్యాల వివరాలు; పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతరవివరాలు. [ ఎస్.4(1)(బి) ] ప్రభుత్వ అధికార వర్గం అనగానేమి? ఏ అధికార వర్గమైనా, స్వపరిపాలన మండలి లేదా సంస్థను ఏర్పరచడం లేదా నెలకొల్పడాన్నే ప్రభుత్వ అధికార వర్గం అంటారు. [ఎస్.2(హెచ్) ] రాజ్యాంగం ద్వారా లేదా దాని ఆధీనంలో; పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఇతర శాసనం; రాష్ట్ర శాసన సభ లో చేసిన ఏదైనా ఇతరశాసనం; ప్రభుత్వం జారీ చేసిన సముచితమైన ప్రకటన లేదా ఉత్తరువు మరియు ఇంకేదేని చేరి ఉంటాయి- ఎ. స్వంత, నియంత్రణ లేదా గణనీయమైన ఆర్ధికసహాయాన్ని పొందిన సంస్థ.బి.సంబంధిత ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయమైన ఆర్ధిక సహాయాన్ని పొందిన ప్రభుత్వేతర సంస్థ. ప్రభుత్వ సమాచార అధికారులెవరు(పిఐఒలు)? అన్నిపరిపాలనా విభాగాలు, లేదా చట్టం క్రింద కోరే సమాచారాన్ని ప్రజలకు అందించే కార్యాలయాలలో పనిచేసే అధికారులను ప్రభుత్వ (పౌర) సమాచార అధికారులుగా ప్రభుత్వ అధికార వర్గం ద్వారా పేర్కొనబడింది. ప్రభుత్వ (పౌర) సమాచార అధికారి తన అతను/ఆమె యొక్క కర్తవ్య నిర్వహణలో ఏ అధికారి సహాయమైన కావాలనుకున్నప్పుడు అన్ని విధాల సహాయాన్ని పొందే ఉద్దేశంతో చట్టాన్ని అనుసరించి శాసన నిబంధనకు లోబడి యేర్పరిస్తే అతను/ఆమెను సహాయ ప్రభుత్వ(పౌర) సమాచార అధికారిగా చెప్పవచ్చును. పౌరసమాచార అధికారియొక్క విధులేమిటి? సమాచారం కోసం వ్రాత పూర్వక విజ్ఞప్తినివ్వలేకపోతే ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని లిఖితరూపంలో గ్రహించడానికి తగు సహాయాన్ని తీసుకోవాలి. మరో ప్రభుత్వాధికార వర్గం వద్దఉన్న లేదా విషయాంశానికి సన్నిహిత సంబంధంకల్గి ఉన్న సమాచార విజ్ఞప్తిని (5) రోజుల లోపల సముచిత సమాచారాన్ని పొంద వలసిన వేరొక ప్రభుత్వాధికార వర్గమునకు తగిన అభ్యర్ధనతో బదిలీచేసి పౌర సమాచార అధికారి ఆ విషయాన్ని వెనువెంటనే దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి తనకు సహాయం కావాలనుకున్నప్పుడు ఏ ఇతర అధికారికైన అతడు/ఆమె కర్తవ్య నిర్వహణను అప్పగించవచ్చును. విజ్ఞప్తి అందిన వెంటనే వీలయినంత వేగంగా, మరియు విజ్ఞప్తి అందిన (30) రోజుల లోపల సమాచారాన్ని ఇవ్వడం, సూచించిన రుసుమును చెల్లించే సమాచారాన్నివ్వడం, ఎస్.8 లేదా ఎస్.9 లోతెల్పిన విధంగా తగిన కారణాన్ని చెబ్తూ నిరాకరించడం ప్రభుత్వ (పౌర) సమాచార అధికారి చేయాలి. ఒక వ్యక్తి యొక్క జీవితానికి లేదా స్వఛ్ఛకు సంబంధించిన అభ్యర్ధన అందిన (48)గంటల లోపల సమాచారాన్ని ఇవ్వాలి. సూచించిన కాలపరిమితిలోపల అభ్యర్ధనకు తగిన నిర్ణయాన్ని ఇవ్వలేనప్పుడు విజ్ఞప్తిని తిరస్కరించినట్లుగా భావించవచ్చును. విజ్ఞప్తిని గనుక తిరస్కరిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి, విజ్ఞప్తిదారునికి (1) నిరాకరించడానికి గల కారణాలు, (2) తిరస్కరించిన అభ్యర్ధనకు ఎప్పటిలోగా అపీలు చేసుకోవచ్చునో దానికి తగిన నిర్ణీత కాలవ్యవధిని చెప్పడం, (3)విచారణాధికారి వివరాలు తెలియజేయాలి. ప్రభుత్వ అధికార వనరులను సరిపోల్చలేని విధంగా మళ్ళించవలసి రావటం రికార్దుల పరిరక్షణ, భద్రతకు హానీకరమైనదయితే తప్ప కోరిన సమాచారాన్ని సాధారణంగా అందజేయడమౌతుంది. పాక్షికంగా సమాచారాన్ని అంద జేయాల్సినప్పుడు , ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి దరఖాస్తుదారునికి ప్రకటనద్వారా తెలియజేయడం ; ఎ. రికార్డులోని కొంత భాగాన్ని అభ్యర్దించినప్పుడు పంపకానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లైతే మినహాయించి వెల్లడిచేయవచ్చును; బి. వాస్తవాంశాల పరిశీలనలను కలుపుకొని, నిర్దేశితవిషయానికి సంబంధించిన ఆయా పరిశీలనల ఆధారంగా నిర్ణయానికి కారణాలను తెల్పాలి; సి. నిర్ణయమిచ్చిన వ్యక్తి యొక్క పేరు ,హోదా; డి. అతడు/ఆమెకు గణనచేసిన రుసుము,దరఖాస్తుదారుడు జమచేయవలసిన మొత్తం రుసుము వివరాలు;మరియు ఇ. అతను/ఆమె హక్కులను గౌరవిస్తూ వెల్లడి చేయలేని సమాచార భాగ నిర్ణయాన్ని సమీక్షించి, రుసుము మొత్తాన్ని విధించడం లేదా పొందవలసిన మేరకు సమాచారాన్ని అందించాలి. తృతీయ పక్షానికిచెందిన లేదా అందించిన సమాచారం , అతి రహస్యమైనదిగా తృతీయ పక్షం భావించినట్లయితే ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి సమాచారం అందిన (5)రోజులలోగా సదరు తృతీయ పక్షానికి వ్రాతపూర్వక ప్రకటనను ఇవ్వాలి. వారి విన్నపాన్ని పరిగణనలోకి తేసుకోవాలి. ప్రకటన అందిన (10) రోజులలోగా సమాచార వెల్లడి ప్రతిపాదనపై తృతీయ పక్షానికి అవకాశం ఇవ్వాలి. అందుబాటులో గల సమాచారం ఏముంది? బహిరంగ వెల్లడికి మినహాయింపులేమిటి? వెల్లడిచేయడంలో ఈ క్రింది మినహాయింపులు ఇవ్వబడినవి.(ఎస్.8) భారతీయ ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రతికూల పరిణామాలను కల్గించే సమాచారం, దేశ భద్రతకు, కీలకమైన, రాష్ట్రవైజ్ఞానిక లేదా ఆర్ధిక ప్రయోజనాల, విదేశీ రాజ్య సంబంధంలేదా నేరాలను ప్రేరేపించడంలో త్రోవకల్పించే సమాచారం, వెల్లడికి మినహాయింపులు. ఏదైనా న్యాయ స్థానం లేదా ట్రిబ్యునల్ (అధికరణస్థానం) ప్రచురించ కూడదని నిరోధించిన, లేదా చట్టంనిషేధించిన విషయం న్యాయస్థానాల ధిక్కారం లోకి వస్తుందనుకుంటే అ సమాచారం. కేంద్ర శాసనమండలి (పార్లమెంట్) లేదా రాష్ట్ర శాసనసభల ప్రత్యేక హక్కుల ఉల్లంఘనకు కారణమయ్యే సమాచారం; వాణిజ్య విశ్వసనీయత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన , వెల్లడిచేసే సమాచారం పోటీ రంగంలో తృతీయ పక్షానికి హానీ కల్గుతుందనుకుంటే ఆ సమాచారం. విస్తృత ప్రజాప్రయోజనాల అధిపత్రం (వారంట్) దృష్ట్యా సమర్ధమైన అధికార వర్గం వెల్లడి చేయాల్సిందేనని భావించినట్లైతే అటువంటి సమాచారాన్ని వెల్లడించవచ్చును; విశ్వాసబద్ధమైన సంబంధరీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం విస్తృత ప్రజా ప్రయోజనాల అధిపత్రం (వారంట్) దృష్ట్యా సమర్ధమైన అధికార వర్గం వెల్లడి చేయాల్సిందేనని భావించినట్లైతే అటువంటి సమాచారాన్ని వెల్లడించవచ్చును; విదేశీ ప్రభుత్వం నుంచి అందిన రహస్య సమాచారం; ఏదైన సమాచారం వెల్లడి వల్ల ఏ వ్యక్తి ప్రాణానికైనా లేక భౌతిక భద్రత కైనా హానీ కల్గుతుందనుకుంటే అలాంటి సమాచారం. చట్టాల అమలు, భద్రతా ప్రయోజనాల కొరకు రహస్య సమాచారం అందించిన లేక సహాయపడిన వారిగుర్తింపునకు దారితీసే సమాచారం; దర్యాప్తు ప్రక్రియను, నేరస్తులను పట్టుకునేందుకు అభియోగం నడపడానికి అవరోధాలు కల్పించే సమాచారం; మంత్రి మండలి , కార్యదర్శులు , ఇతర అధికారుల సమాలోచనలతో సహా మంత్రి మండలి(క్యాబినెట్) పత్రాలు; ప్రజా కార్యకలాపాలకు, ప్రయోజనాలతో నిమిత్తంలేని వ్యక్తిగత సమాచారం, లేదా వ్యక్తిగత జీవితాలలోకి నిష్కారణంగా తొంగిచూసే అవకాశం కల్పించే సమాచారం; పై మినహాయింపు జాబితాతో నిమిత్తము లేకుండ రక్షిత ప్రయోజనాలకు కల్గే హానికన్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేలు ఎక్కువనుకుంటే సమర్ధమైన అధికార వర్గం సమాచారాన్ని అందించవచ్చును; కొంతభాగాన్ని మాత్రమే వెల్లడిచేసే అనుమతి ఉందా? కోరిన రికార్డులో వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగము యొక్క సమాచారాన్ని అందించడం. (ఎస్.10) సమాచార చట్టంనుండి మినహాయింపు గల వారెవరు? కేం ద్ర రహస్య సమచార, భద్రాతా సంస్థలు రెండవ షెడ్యూల్ లో నిర్దిష్టంగా ఉన్నటు వంటి ఐబి.ఆర్ అండ్ఎడబ్ల్యు, ఆదాయ సంపత్తి కార్యకేంద్రం (రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్) ,కేంద్ర ఆర్ధిక ప్రజ్ఞా సంపత్తి కార్య కేంద్రం (సెంట్రల్ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ బ్యూరొ ) ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మాదకద్రవ్యాల నియంత్రణ కార్యకేంద్రం (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరొ), ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ , ప్రత్యేక సరిహద్దు దళం (స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్), సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్), కేంద్ర ప్రత్యేక భద్రతా దళం (సి.ఆర.పి.ఎఫ్), ఐ.టి.బి.పి, సి.ఐ.ఎస్.ఎఫ్, ఎన్.ఎస్.జి, అస్సామ్ రైఫిల్స్ , ప్రత్యేక సేవా కార్యకేంద్రం( స్పెషల్ సర్వీస్ బ్యూరొ), ప్రత్యేక విభాగం- కేంద్ర రహస్య సమాచార సంచాలక కార్యాలయం (సిఐడి), అండమాన్ అండ్ నికోబార్ , నేరవిభాగం- కేంద్ర రహస్య సమాచార సంచాలక కార్యాలయం - కేంద్రవిభాగం, దాద్ర అండ్ నాగర్ హవేలి మరియు ప్రత్యేకశాఖ, లక్షద్వీప్ పోలీస్. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రకటింపబడిన ప్రత్యేక సంస్థలను మినహాయించడమౌతుంది. అవినీతి ఆరోపణలు, మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి ఉంటే ఆయా సంస్థల సమాచారాన్ని అందించడంలో మినహయింపు ఉన్నప్పటికి అది వర్తించదు. ఇంకను కేంద్ర లేదా రాష్ట్ర సమాచార కమీషన్ ఆమోదమైన తర్వాతనే మానవ హక్కుల మూల్యాంకనానికి సంబంధించిన ఆరోపణల వ్యవహారం ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఇవ్వాలి. (ఎస్.24) సమాచారం కోసం అభ్యర్ధించే విధానం 1. సమాచారం కొరకు అభ్యర్ధిస్తూ చేసే దరఖాస్తు విధానమేమిటి?లిఖిత పూర్వకంగా గానీ , లేదా ఎలక్ట్రానిక్ రూపంలో గానీ ఇంగ్లీష్ , హిందీ లేదా స్థానిక అధికార భాషలో గానీ , ప్రభుత్వ సమాచార అధికారికి వివరాలను దరఖాస్తు చేస్తూ సమాచారాన్ని కోరడం,2. సమాచారం కోరడానికి గల కారణాలను తెలియజేయవలసిన అవసరంలేదు;3. నిర్ణీత రుసుమును చెల్లించవలెను (దారిద్ర్య రేఖకు దిగువగల వర్గం వారుతప్ప). 2. సమాచారాన్ని పొందడానికి గల కాల పరిమితి ఏమిటి?1. దరఖాస్తు చేరిన (30) రోజుల లోగా సమాచారమివ్వాలి.2. ఒక వ్యక్తి జీవితం లేదా స్వేచ్చకు సంబంధించిన విషయంలో (48)గంటలలోపల సమాచారమివ్వాలి.3. సహాయ సమాచార అధికారికి సమాచారం కోసం ఇచ్చిన దరఖాస్తు విషయంలో సమాధానంచెప్పడానికి (5)రోజుల వ్యవధిని కలుపుకోవాలి.4. తృతీయ పక్షం గనుక సమాచారాన్ని ఉన్నట్లయితే (40) రోజుల కాలవ్యవధిని (గరిష్ట కాలవ్యవధి,తృతీయ పక్షానికి ఇచ్చిన సమయం కలుపుకొని) ఇవ్వాలి5. కేటాయించిన వ్యవధిలో సమాచారాన్ని అందించకపోతే గనుక అభ్యర్ధనను తిరస్కరించినట్లుగా భావించవచ్చు. 3. చెల్లించవలసిన రుసుము ఎంత? సముచిత మైన నిర్దిష్ట రుసుమును దరఖాస్తు కొరకు ఉండాలి. ఇంకను ఎక్కువ రుసుము చెల్లించాలంటే వ్రాతపూర్వకంగా, లెక్కించిన వివరాలతో బాటు ఎంత మొత్తం చెల్లించాలో తెలియజేయాలి. అభ్యర్ధిదారుడు నిర్ణయంపై పునర్విచారణ కోరితే ప్రభుత్వ సమాచార అధికారి విధించిన రుసుముతో సరియగు విచారణాధికారికి దరఖాస్తు చేయాలి. దారిద్ర్య రేఖకు దిగువగల వర్గం వారు ఎలాంటి రుసుమును చెల్లించవలసినవసరంలేదు. కాల వ్యవధిలోగా ప్రభుత్వ సమాచార అధికారి , దరఖాస్తుదారునికి సమాచారాన్ని ఇవ్వలేని పక్షంలో ఉచితంగానే సమాచారాన్ని ఇవ్వాలి. 4.సమాచారాన్ని ఇవ్వడంలో తిరస్కరణకు గల కారణాలేమిటి? మినహాయింపులోగల సమాచారాన్ని వెల్లడించరాదు. (S.8) ఇతర రాష్ట్రం లోగల ఏ వ్యక్తి కాపీరైటుగల వాటి సమాచారం (S.9) మరంత సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. సమాచారం పొందడానికి చెల్లించవలసిన రుసుము మీరు తెలిసికొనవలసిన మీ సమాచార హక్కులు సమాచారము కొరకు ధరఖాస్తు చేసుకొనే విధానమేమిటి ? వ్రాతపూర్వకముగా ధరఖాస్తు లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా హిందీ లేదా ఇంగ్లీషు భాషలో గాని, లేదా ఆ ప్రాంతంలో గల అధికార భాషలోగాని సహాయ సమాచార శాఖాధికారికి కావల్సిన నిర్దిష్టమైన సమాచారము కొరకు ధరఖాస్తు చెయ్యాలి. సమాచారము పొందడానికి అవసరమైన కారణాలు ఇవ్వవలసిన అవసరము లేదు. నిర్దేశించిన రుసుమును చెల్లించాలి (దారిద్ర్యరేఖకు దిగువనున్న వర్గమునకు చెందినవారు కాకపోయినట్లయితే). సమాచారము పొందుటకు కాలపరిమితి ఎంత ? ధరఖాస్తు చేసిన తేదీ నుండి ముప్ఫై రోజులు. మనిషి జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన సమాచారము కొరకు నలభై ఎనిమిది గంటలు. సహాయ సమాచార శాఖాధికారి ద్వారా సమాచారం పొందడానికి పైన చెప్పిన దానికి ఐదు రోజులు అదనంగా కలుపుకోవాలి. మూడవ వ్యక్తి ప్రయోజనములు కూడి ఉన్నట్లయితే కాలవ్యవధి నలభై రోజులు (అత్యధిక కాలవ్యవధి+మూడవ వ్యక్తి ధరఖాస్తు చేసుకోడానికి ఇవ్వబడే కాలవ్యవధి). నిర్దేశించిన కాలవ్యవధిలో సమాచారము ఇవ్వకపోతే ఆ ధరఖాస్తును తిరస్కరించినట్లుగా భావించాలి. రుసుము ఎంత చెల్లించాలి ? నిర్దేశించబడిన ధరఖాస్తు రుసుము హేతుబద్ధంగా ఉండాలి. ఇంకను రుసుము అవసరమైతే, ఆ విషయము వ్రాతపూర్వకంగా ఆ రుసుమును ఎలా గణించారో గణాంక వివరములతో సహా ధరఖాస్తుదారునికి ఇవ్వాలి. ధరఖాస్తుదారుడు సహాయ సమాచార శాఖాధికారిచే నిర్ణంయించబడిన రుసుముపై పునః సమీక్షకు విచక్షణాధికారికి అప్పీలు చేసుకోవచ్చు. దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రజలు రుసుము కట్టనవసరం లేదు. ధరఖాస్తుదారుడు కావలసిన సమాచారాన్ని సమాచార శాఖాధికారి ద్వారా నిర్దేశించిన కాలపరిధిలో పొందలేక పోయినట్లయితే రుసుము కట్టనవసరం లేకుండా సమాచారం పొందవచ్చు. ఏ పరిస్థితులలో ధరఖాస్తు తిరస్కరించబడుతుంది ? ఇది బహిరంగపరచుటనుండి మినహాయింపు పొందిన పరిధిలో ఉన్నట్లయితే(ఎస్–8) ఇది ఇతర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ముద్రణాధికారము ఉల్లంఘించినట్లయితే (ఎస్-9). సమాచారముకొరకు ఎలా మనవి చేసుకోవాలి – తరచుగా అడగే ప్రశ్నలు ఎ) ఫిర్యాదు నమోదు చేయువిధానం మీద తరచుగా అడిగే ప్రశ్నలుఃప్ర ) ఫిర్యాదు ఎక్కడ, ఎలా నమోదు చేయాలి?జవాబుః కేంద్రప్రభుత్వ ప్రజా అధికారుల సమాచారము కొరకు ఆగస్ట్ క్రాంతిభవన్, భికాజికామా ప్లేస్, క్రొత్తఢిల్లీ – 110066 [www.cic.gov.in]లో ఉన్న కేంద్రసమాచార శాఖలను (CIC) సంప్రదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు ఎస్.ఐ.ఎస్ (SIS) సంబంధించిన ఫిర్యాదుల కొరకు రాష్ట్రసమాచార శాఖని సంప్రదించవచ్చు. రాష్ట్రప్రభుత్వాధికారుల మీద ఫిర్యాదులు ఆరాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రసమాచార శాఖకి మాత్రమే చేయాలి. సంస్థ ముఖ్యాధికారికి లేదా ప్రభుత్వవిభాగంలో అత్యున్నతస్ధాయిలో ఉన్న కార్యదర్శి/ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేస్తే బాగుంటుంది. ఇది సమాచారం పొందడానికి దోహదం చేస్తుంది. ఫిర్యాదు నమోదు చేసిన తరువాత దయచేసి సంబంధిత వెబ్ సైట్ లో ఆ ఫిర్యాదు నమోదైనదీ, లేనిదీ చూడండి. నమోదయిన ఫిర్యాదు నంబరు మరియు ప్రస్తుతస్థితి కూడా చూడండి. ఫిర్యాదు కాపీని ప్రభుత్వ సమాచార ఉద్యోగికి /ప్రథమ విచారణ అధికారికి కూడా పంపించండి. రెండవ /తుది అప్పీల్ లేకుండా ఫిర్యాదులు కూడా ధరఖాస్తుదారుని దగ్గర ఉంటాయి. ప్ర ) ఫిర్యాదుచేయడానికి ఏమైనా నమూనాలు రూపొందించారా? ఇంకా ఏమేమి ఫిర్యాదుల్లో అడగవచ్చు? జవాబు: కేంద్ర సమాచార శాఖ – సి.ఐ.సి (CIC) మరియు కొన్ని రాష్ట్ర సమాచార శాఖ-ఎస్.ఐ.సి (SIC) లు ఫిర్యాదులతో పాటు ఇవ్వవలసిన కాగితాలు లేదా ఇవ్వవలసిన కనీస సమాచారము రూపొందించాయి. కొన్ని రాష్ట్రసమాచారశాఖలు ఫిర్యాదుచేయుటకు కొన్నినిర్ణీత ధరఖాస్తు నమూనాలను రూపొందించాయి. ధరఖాస్తు వ్రాయడానికి ఒక తెల్లకాగితాన్ని ఉపయోగించండి. నోట్ షీట్ లేదా స్టాంప్ పేపరు ఉపయోగించవలసిన అవసరం లేదు. వ్రాయదలచుకున్న విషయం చేతివ్రాత లేదా టైపింగు ద్వారా చేయవచ్చు. విషయాన్ని టైపింగ్ ఉపయోగించి వ్రాయడం తప్పనిసరికాదు. దరఖాస్తు అర్థమయ్యేలా మరియు చదవడానికి సులువుగా ఉండేటట్లు చూడండి. సమాచారం అడిగినప్పుడు ఎన్ని పేజీలైనా ఉండవచ్చు. ఒక దరఖాస్తులో ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. అయినప్పటికీ పరిమితమైన మరియు సంబంధితమైన ప్రశ్నలు అడగడం మంచిది. చిన్న, చిన్న ప్రశ్నలు ఎన్నైనా అడగవచ్చు. కాని ఎక్కువ సమాచారం అడగవద్దు. దరఖాస్తులో ఎప్పుడూ మీపేరు మరియు సంతకం చేయండి. మీ పదవి లేదా ఉద్యోగం వ్రాయనవసరంలేదు. ఎందుకంటే ప్రతిపౌరుడికి సమాచారం అడిగే హక్కు ఉంది. ఎందుకు అనే పదంతో ఎప్పుడూ ప్రశ్నలు అడగవద్దు. ఎందుకంటే ఈరకమైన ప్రశ్నలు – ఆర్. టి. ఐ - (R.T.I) చట్టంలో లేవు. అందుకని ధరఖాస్తుని తిరస్కరించవచ్చు. ఉదాహరణకు ఎందువల్ల మీరు బిల్లు పాస్ చేయలేకపోయారు ? అనే ప్రశ్న తిరస్కరించబడవచ్చు. ఏదైనా పాలన లేదా నిర్దేశించిన చట్టపరమైన తీర్మానం వల్ల మీకు కష్టం కల్గితే మీరు దాని తీర్మానం వెనుకఉన్న కారణాలు అథ్యాయం 4(1)(d) ద్వారా అడగవచ్చు. అడగవలసిన సమాచారం మరీ ఎక్కువ ఉంటే సీ.డి (CD) రూపంలో అడగడం మంచిది. దీనివల్ల ఖర్చుని ఆదాచేయవచ్చు. మీరు సమాచారం అడిగినప్పుడు దాని వెనుక కారణాలు తెలుపనవసరం లేదని గుర్తుంచుకోండి. బేంక్ చలాన్ /दीदीడీడి/ పోస్టల్ ఆర్డర్ - నంబరు విడుదల చేసిన బ్యాంకు/పోస్టాఫీసు వివరాలు, తేది, నగదు రసీదు వివరాలు మొదలైనవి దరఖాస్తు చివరలో తెలియజేయండి. ప్రశ్నః దరఖాస్తు ఎవరికి మనవి చేసుకోవాలి ?జవాబుః ప్రభుత్వ సమాచార అధికారి పేరు, చిరునామా మొదలగు వివరాలు వ్రాయండి. మీ ప్రభుత్వ సమాచార అధికారి / సహ ప్రభుత్వ సమాచార అధికారిని గుర్తించడం కష్టంగా ఉంటే మీకు మీ ఆర్.టి.ఐ - (R.T.I) దరఖాస్తుని ప్రభుత్వ సమాచార అధికారి, C/o ప్రధానవిభాగ అధికారి. దీనిని సంబంధిత ప్రభుత్వ అధికారికి అవసరమైన ధరఖాస్తు రుసుముతో పంపించండి. ప్రధాన అధికారి మీ దరఖాస్తుని ప్రభుత్వ అధికారికి పంపించడం జరుగుతుంది. దరఖాస్తుమీద ప్రభుత్వ సమాచార అధికారి పేరు వ్రాయవద్దు. అలా చేస్తే ఆ అధికారిని బదిలీ చేయవచ్చు లేదా ఒక క్రొత్త అధికారిని ఆ పదవిలో నియమించవచ్చు. ప్రశ్నః వేర్వేరు నిబంధనలు మరియు చార్జీలు విభిన్న రాష్ట్రాలలో ఉన్నాయా ?జవాబుః కేంద్ర, రాష్ట్ర, శాసనసభ మరియు సుప్రీమ్/హైకోర్టులు క్రింద పనిచేసే ప్రభుత్వ అధికారులు వేర్వేరు నిబంధనలు ఆర్. టీ. ఐ ((R.T.I)) కోసం నిర్ణయించారు. ఫీజు మరియు చెల్లించే రీతి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. మీరు మీ రాష్ట్రానికి తగిన, సరియైన నిబంధనలను నిర్ణయించుకోవాలి. దరఖాస్తు రుసుము ఈ విధంగా జమచేయవచ్చు. సొమ్ము చెల్లించడం ద్వారా (రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు). పోస్టు ద్వారా డిమాండ్ డ్రాఫ్టు/బ్యాంకర్స్ చెక్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ (కొన్ని రాష్ట్రాలలో మాత్రమే) కోర్టు ఫీజు (కొన్ని రాష్ట్రాలలో మాత్రమే) కొన్ని రాష్ట్రప్రభుత్వాలు హెడ్ ఆఫ్ అక్కౌంట్ ప్రారంభించారు. దీనికి మీరు ఏదైనా ఎస్. బి. ఐ SBI బ్రాంచ్ కి వెళ్ళి ఫీజ్ ని ఆ అక్కౌంటులో జమ చేసి మరియు ఆ జమచేసిన రసీదుని మీ ఆర్. టి. ఐ -(R.T.I) దరఖాస్తుతోజతచేయాలి. మీరు ఆ అక్కౌంటు పేరుతో పోస్టల్ ఆర్డరు లేదా డిడి ని తీసి (R.T.I) దరఖాస్తుతో జతచేసి పంపించవచ్చు. కేంద్ర ఆర్. టి. ఐ (R.T.I) నిబంధనల క్రింద ప్రభుత్వ అధికార్లకు, అక్కౌంట్స్ ఆఫీసర్ పేరుతో బేంక్ చలాన్ /दीदीడీడి/ పోస్టల్ ఆర్డర్ లు చెల్లించవచ్చని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్స్ నల్ & ట్రైనింగ్ (DoPT) ఈ మధ్య విశదపరిచారు. ప్రశ్నః ఆర్. టి. ఐ- (R.T.I) చట్టం క్రింద మొదటి అప్పీలు ఎలా చేయాలి ?జవాబుః ఆర్. టి. ఐ - (R.T.I) చట్టం 2005 క్రింద మొదటి అప్పీలు చేయడానికి ఈ క్రింద వివరించిన సూచనలను అనుసరించాలి. చిఫ్. పబ్లిక్. ఇన్ఫర్మేషన్ ఆఫిసర్ / ప్రధాన ప్రజా సమాచార అధికారి - సిపిఐఓ (CPIO) తీర్మానం వచ్చిన 30 రోజులలోపు ధరఖాస్తుదారుడు తన మొదటి అప్పీల్‌ని ప్రథమ విచారణ అధికారికి (FAA) ఫైల్ చేయాలి. ప్రధాన ప్రజా సమాచార అధికారి-CPIO కి చేరిన తేదీనుంచి ముప్పై రోజులలోపు ప్రత్యుత్తరము రాకపోతే (ధరఖాస్తు –ఉపప్రధానాధికారి ACPIO కి పెడితే ముప్పైఐదు రోజులలోపు) అప్పుడు మొదటి అప్పీలు CPIO ప్రత్యుత్తరము ఇవ్వవలసిన తేదీనుంచి ముప్పై రోజులలో ఫైల్ చేయవలెను. ప్రధాన ప్రజా సమాచార అధికారి CPIO తీర్మాన ఉత్తరం నుంచి ప్రథమ విచారణ అధికారి పేరు, హోదా మరియు చిరునామా తెలుసుకోండి. ఏవిధమైన ప్రత్యుత్తరం రాకపోతే ప్రభుత్వ విభాగం / ఆఫీసు / సంస్థ వెబ్ సైట్ చూడండి. ఈ వివరముల కొరకు వెబ్ సైట్ లో ఆర్. టి. ఐ (R.T.I) ఐకాన్ ని చూడండి. ప్రథమ విచారణ అధికారి వివరములు పైన చెప్పిన విధానంలో దొరకకపోతే మీ అప్పీల్ ఈ క్రింది విధంగా ఇవ్వండి. The first appellate Authority under (R.T.I) Act 2005C/O Head of --------- ------------------------ Department/office(CPIO విభాగము / కార్యాలయం చిరునామా కూడా వ్రాయండి ) మీరు మొదట విచారణకు రావాలనుకుంటే మీ అప్పీలు చివర సూచించండి. కేంద్ర ప్రభత్వము క్రింద ప్రభుత్వ అధికారికి మొదట అప్పీలుకి ఏ విధమైన ఫీజు కట్టనవసరము లేదు. కొన్ని రాష్ట్రాలు మొదటి అప్పీల్ కి ఫీజు మరియు ధరఖాస్తు నమూనాలు నిర్దేశించారు. అప్పీల్ లో వివరించిన విధంగా ధరఖాస్తుదారుడు జతచేసిన అన్ని ఫోటో కాపీల మీద ‘అటెస్టెడ్’ (‘attested’) అని వ్రాసి దానిక్రింద సంతకం చేయాలి. అప్పీలు, పోస్టల్ రసీదు మరియు AD రసీదు దగ్గర ఉంచుకోవాలి. మీరు స్వతహాగా అప్పగించవచ్చు కాని రిజిస్టర్డ్ AD / స్పీడ్ పోస్టు ద్వారా పంపించడం మేలైనది. కొరియర్ ద్వారా పంపించడం మంచిది కాదు. ప్రథమ విచారణ అధికారికి -FAA మొదటి అప్పీలు వచ్చిన 30 రోజులలో తీర్మానం చేయాలి. సరియైన కారణాలతో వ్రాతపూర్వకంగా ఇస్తే అతను 15 రోజులు (మొత్తం 45 రోజులు) అదనంగా తీసుకోవచ్చు. ప్రథమ విచారణ అధికారి మాటపూర్వకంగా గాని వ్రాతపూర్వకంగా గాని ఆర్డరు ఇవ్వవచ్చు. ప్రశ్నః ఆర్. టి. ఐ (R.T.I) చట్టం క్రింద రెండవ అప్పీలు ఎలా చేయాలి ?జవాబుః క్రింద ఇచ్చిన అప్పీలు ఫారంను సూచిక మరియు తేదీల వారీగా జరిగిన అభివృద్ధిని పూర్తి చేయాలి. అప్పీలును మీరు ఫైలు చేస్తే కనుక ఫిర్యాదు / ఫిర్యాదు దారుడు అనే పదాల్ని తీసివేయండి. రెట్టింపు ఖాళీతో టైపు చేయండి. ఈ క్రింద ఇచ్చిన ఫోటో కాపీలను జతచేయండి. ఆర్. టి. ఐ (R.T.I) క్రింద చేసిన అసలు ధరఖాస్తుతో పాటు ఇతర కాగితనులు మొదటి అప్పీలు మరియు జత చేసిన కాగితములు దాఖలు ఫీజు పది రుపాయలు మరియు ఇతరత్రా చార్జీలు చెల్లించిన డిడి/ డిడి రసీదు/పోస్టల్ ఆర్డర్/నగదు రసీదులు. ప్రధాన ప్రజా సమాచార అధికారి CPIO మరియు ప్రథమ విచారణ అధికారి అందుకున్న పోస్టల్ డిడి రసీదు/అధికారి చెల్లు చీటి. ప్రధాన ప్రజా సమాచార అధికారి CPIO మరియు ప్రథమ విచారణ అధికారికి FAA ఇచ్చిన తీర్మానం (ఒకవేళ పంపితే) అన్ని కాగితాల మీదా కుడిప్రక్కన పైమూలలో వరుసగా నంబర్లు వ్రాసి సూచిక ప్రకారం కాగితాలు వరుసగా పెట్టాలి. ఇది రెండవ అప్పీలు/ఫిర్యాదుకు అసలు కాపీ. అదనంగా నాలుగు ఫోటో కాపీలు తయారుచేయండి. ప్రతి అప్పీలు, సూచిక మరియు రోజువారీ చార్ట్ మీద సంతకం చేయాలి (ఐదు కాపీల మీద). ప్రతి కాపీ మీద ఎటెస్టడ్ అనే పదం వ్రాసి దానిక్రింద సంతకం చేయాలి. ప్రధాన ప్రజా సమాచార అధికారి CPIO మరియు ప్రథమ విచారణ అధికారికి FAAకి ఒక కాపీని స్పీడ్/రిజిస్టర్/యుపిసి పోస్ట్ ద్వారా పంపించాలి. అసలు, రెండవ అప్పీలు/ఫిర్యాదు అదనపు కాపీ మరియు మీ కాపీని పోస్ట్ లో పంపిన రుజువు యొక్క కాపీని సూచిక/తేదీవారీ చార్ట్ నింపిన తరువాత జతచేయాలి. ఈ క్రింద ఇచ్చిన చిరునామాకు అసలు మరియు ఒక అదనపు కాపీని రిజిష్టరు ఎడి ద్వారా సమితికి పంపించండి. రిజిస్ట్రారుకేంద్ర సమాచార సమితిరెండవ అంతస్తు, ఆగష్టు క్రాంతి భవనము,భికాజి కామ ప్లేస్,క్రొత్తఢిల్లీ – 110066 కొరియర్ సేవలను ఉపయోగించవద్దు. ఒకకాపీని పోస్ట్ ద్వారా పంపిన రసీదు మరియు కేంద్ర సమాచార కమిషన్ / ప్రధాన సమాచార అధికారి/ ప్రథమ విచారణ అధికారికి -CIC/CPIO/FAA అందుకున్న చెల్లు చీటీని మీ రికార్డు కోసం మీ వద్ద ఉంచుకోండి. చెల్లు చీటి లేదా ఫిర్యాదు అందిందన్న ధృవపత్రము మీ ఫిర్యాదు పంపిన పదిహేను రోజులలోపు రాకపోతే మీరు పంపించిన అప్పీలుని వెతకమని విజ్ఞప్తి చేస్తూ ఒకకాపీని స్పీడ్ పోస్టు ద్వారా రెండవ అప్పీలు/ఫిర్యాదు కాపీని ఇతర కాగితముల జతచేసి పంపించండి. మొదటి లేదా రెండవ అప్పీలు చేయడానికి మీరు స్థానిక ప్రభుత్వేతర సేవా సంస్ధ NGO/ ఆర్.టి.ఐ (R.T.I) కార్యకర్తని సంప్రదించవచ్చు. ఈ సేవలు మామూలుగా ఉచితంగా అందిస్తారు. ప్రశ్నః ఆర్.టి.ఐ - (R.T.I) చట్టం క్రింద ఎవరు సమాచారాన్ని పొందవచ్చు?జవాబుః ఏ ఇతర పౌరుడైనా ఆర్.టి.ఐ -(R.T.I) చట్టం క్రింద సమాచారాన్ని పొందవచ్చు . ఈ చట్టం జమ్ము మరియు కాశ్మీరు రాష్ట్రం మినహాయించి మిగతా రాష్ట్రాలకు వర్తిస్తుంది. OCI’s (అంతర్జాతీయ భారతీయ పౌరులు) మరియు PIO’s (భారతదేశంలో పుట్టిన వారు) కార్డు కలిగిన వారు కూడా ఈ చట్టం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. విదేశాలలో ఉన్న భారతీయ పౌరులు, OCI’s మరియు PIO’s , (R.T.I) ధరఖాస్తుని స్థానిక భారతీయ రాయబారి/కన్సలేట్/హైకమిషన్ కి ఫైల్ చేసుకోవచ్చు. చెల్లించవలసిన ఫీజు వివరములు (స్థానిక ద్రవ్యములలో) మరియు చెల్లించవలసిన రీతి గురించి వారు ధరఖాస్తుదారునకు తెలియపరుస్తారు. ప్రశ్నః ఆర్.టి.ఐ (R.T.I) దరఖాస్తు ఎలా ఇవ్వాలి ?జవాబుఃమీ ఆర్.టి.ఐ (R.T.I) దరఖాస్తు ప్రజా సమాచార అధికారి - PIO కి చేరినది అని నిర్ధారించడానికి మరియు ధరఖాస్తు ఇచ్చినట్లుగా రుజువు మీ దగ్గర ఉండడానికి ఈ క్రింద వివరించిన పద్ధతులు మీకు దోహదపడతాయి. స్వయంగా ఇవ్వడం: ప్రజా సమాచార అధికారి -PIO గాని లేదా ఇన్ వార్డ్ విభాగం గాని మీ ఫిర్యాదు గాని మరియు రసీదు మీద స్టాంపు మరియు తేది వేసి సంతకం తీసుకోండి. రిజిస్టర్డ్ పోస్టు తిరుగు రసీదు (AD): పోస్టల్ విభాగము తీసుకువచ్చిన తిరుగు రసీదు, దరఖాస్తు పంపిన రుజువుగా పని చేస్తుంది. ఒకవేళ సరియైన స్టాంపు, సంతకం మరియు అందిన తేదీతో పాటు రాకపోతే పోస్టాఫీసులో తిరుగు రసీదు వచ్చేంతవరకు గుర్తు చేయవలెను. స్పీడ్ పోస్ట్ (పోస్టల్ విభాగ సేవ): స్పీడ్ పోస్ట్ లో దరఖాస్తు పంపిన తరువాత http://www.indiapost.gov.in/Speednew/track.aspx లో వెదకండి. మరియు ఒక అప్పగించిన స్ధితి యొక్క కాపీను జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోండి. సామాన్య పోస్టు, ప్రైవేటు కొరియర్ కంపెనీల సేవలు ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇవి అప్పగించిన ఆధారిత రుజువులను ఇవ్వవు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు