పునశ్చరణ & పునర్బలన వారం - 4 ప్రతిరోజూ విభిన్నమైన థీమ్ లను ఎంచుకుని, పిల్లలను అనేక, వైవిధ్యమైన, ఆహ్లాదకరమైన, ఆట ఆధారిత కృత్యాలలో నిమగ్నం చేయండి. పిల్లలు ఏమి నేర్చుకుంటారు వివిధ రకాల డిజిటల్/నాన్-డిజిటల్ సాధనాల వినియోగాన్ని అన్వేషించడం మరియు అర్థం చేసుకోవడం. పరిరక్షణ, పునర్వినియోగం మరియు వ్యర్ధాల తగ్గింపుపై ఆలోచనలను అర్థం చేసుకోవడం మరియు సాధన చేయడం. వివిధ రవాణా మార్గాలను, సంబంధిత లక్షణాలను గుర్తించడం. ఋతువులు, ఆయా ఋతువులలో వేసుకునే దుస్తులు, తినే ఆహారం, సంవత్సరంలో వాటి సమయం, వాతావరణం, ఉష్ణోగ్రతలు మొదలైన లక్షణాల గురించి అర్ధం చేసుకోవటం. సంఘటనల క్రమాన్ని మరియు రోజు, వారం, నెల, సంవత్సరం భావనలను అర్థం చేసుకోవడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు రిమోట్, ఫోన్, స్టెతస్కోప్, కంప్యూటర్, సుత్తి, స్కేల్, హెల్కెట్ మొదలైన వస్తువుల ఉపయోగాలు, రూపం, ఫీచర్లపై సూచనలు ఇస్తూ సాధనాలు వస్తువులపై పిల్లలతో గెస్సింగ్ గేమ్ ఆడండి. పాత మ్యాగజైన్లు లేదా వార్తాపత్రికలను అందించండి. వివిధ రకాల రవాణా విధానాలను కత్తిరించి లేదా చింపి కొలాజ్ రూపొందించటానికి పిల్లలను ప్రోత్సహించండి ప్రతి దాని గురించి మాట్లాడటం మరియు వేరే వాటితో పోల్చడం. పిల్లలను జాగ్రత్తగా పర్యవేక్షణలో సిగ్నల్ లైట్ క్రాసింగ్ వద్దకు తీసుకెళ్లండి మరియు ట్రాఫిక్ కదలికలపై వారికి మార్గనిర్దేశం చేయండి. హెల్మెట్ / సీట్ బెల్ట్/ పుట్‌పాత్/జీబ్రా క్రాసింగ్ వంటి వాటిని సురక్షితంగా ఉపయోగించడం, భద్రతా నియమాలను అనుసరించటం. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ