పునశ్చరణ & పునర్చలన ప్రణాళిక ఈ 4 వారాల ప్రణాళికను గత వారాలలో నేర్చుకున్న విషయాలను పునశ్చరణ చేసుకోవడానికి, పునర్బలనం చేయడానికి మరియు అభ్యసనను బలోపేతం చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ వారాలలో, కొనసాగుతున్న పరిశీలనల ఆధారంగా, అంగన్ వాడీ కార్యకర్త పిల్లలను మరింత బలోపేతం చేయటానికి అవసరమయ్యే నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి నిర్దిష్ట కృత్యాలను నిర్వహించవచ్చు. ఈ ప్రణాళికలను పోషణ్ మాప్/పోషణ్ పక్వాడా వంటి నిర్దిష్ట కార్యక్రమాల సమయంలో కేంద్రంలో అభ్యసన కృత్యాల వ్యవధిని తగ్గించడానికి మరియు ప్రత్యామ్నాయ కృత్యాలు మరియు వేడుకలలో పాల్గొనడానికి ఉపయోగించవచ్చు. పునశ్చరణ కి పునర్చలన వారం 1 పిల్లలు ఏమి నేర్చుకుంటారు శరీర భాగాల గురించి అర్థం చేసుకోవడం. పరిసరాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియాలను, ఉపయోగించడం. కుటుంబ సంబంధాలను మెచ్చుకోవడం మరియు గుర్తించడం. విభిన్న వ్యక్తులతో వివిధ పరిస్థితులలో తనను తాను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోవడం. అంగన్వాడి కార్యకర్త పిల్లల సమక్షంలో కేంద్రంలో సుఖంగా మరియు నమ్మకంగా ఉండటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు "సురక్షిత ప్రదేశం (ఇల్లు) "విశ్వసనీయ పెద్దల (కుటుంబం, ఉపాధ్యాయులు) చిత్రాలు లేదా డ్రాయింగ్ రూపొందించడంలో పిల్లలను నిమగ్నం చేయండి. సురక్షితమైన ప్రదేశం (ఇల్లు) యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. కుటుంబ చిత్రాలు పాతవి చూడటం లేదా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం కుటుంబానికి, పిల్లలతో గల సంబంధం, వారితో గల ఇష్టమైన జ్ఞాపకాలు. మ్యాగజైన్లు, వార్తాపత్రికలలోని చిత్రాలను చూడటం మరియు వివిధ రకాల కుటుంబాల గురించి మాట్లాడటం. పిల్లల కళ్లకు గంతలు కట్టి, వివిధ వస్తువుల రుచి మరియు వాసన చూడడానికి వారిని ప్రోత్సహించటం. వాసన యొక్క మూలాన్ని గుర్తించడంలో మరియు ఆహ్లాదకరమైన అయిష్టమైన, బాగున్న బాగోని, ప్రమాదకరమైన వాసనలు మొదలైన వాటిని వర్గీకరించడంలో వారికి సహాయపడటం. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ