వారం - 25 పిల్లలు ఏమి నేర్చుకుంటారు సహాయం కోసం అడగడం. తోటివారితో ఆడుకోవడాన్ని ఆస్వాదించటం. తన వంతు కోసం వేచి ఉండటం మరియు దృశ్య కళను రూపొందించడానికి విభిన్న పదార్థాలను ఉపయోగించడం. సంఖ్యా పదాలు మరియు ఆకార పేర్లను ఉపయోగించటం, సరళమైన సూచనలను వినటం మరియు అర్థం చేసుకోవటం, పదాలలో ప్రారంభ మరియు చివరి అక్షరాలను గుర్తించటం. సాధారణ వస్తువులను స్వతంత్రంగా గుర్తించడం మరియు వివరించడం వ్యర్ధాలను తగ్గించడం, వస్తువులను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం వంటి ఆలోచనలను అర్థం చేసుకోవడం. భావోద్వేగాలను పదాలు, ముఖ కవళికలతో అనుసంధానించి, వాటిని నిర్వహించడం నేర్చుకోవడం. వస్తువులను చిన్న సమూహాలుగా తయారు చేయడం, మొత్తం వస్తువులను లెక్కించడం మరియు ఐదు వస్తువుల వరకు రెండు సమూహాలను కలపడం. భారతీయ కరెన్సీని గుర్తించి నకిలీ డబ్బుతో ఆడుకోవడం. రోజువారీ కృత్యాలను ఆస్వాదించడం. చిన్న సాధారణ సూచనలను అనుసరించడం & చలన నియంత్రణను ప్రదర్శించడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు ఒక కాగితం కింద నాణేలను ఉంచండి మరియు పిల్లలను క్రియాన్లను ఉపయోగించి షేడ్స్ ఏర్పరచమని ప్రోత్సహించండి. తద్వారా నాణేల ముద్రలు బయటపడతాయి. పిల్లలతో సరళమైన ద్రవ్య లావాదేవీ ఆటలు ఆడండి. ఇల్లు, రహదారి, తరగతి, మతపరమైన ప్రదేశం, ఉద్యానవనం మొదలైన ప్రదేశాలకు సంబంధించిన నియమాలు మరియు క్రమశిక్షణ గురించి పిల్లలతో మాట్లాడండి. వీటిని అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి మరియు ఆచరించటానికి వారిని ప్రోత్సహించండి. రంగు కాగితం లేదా వార్తాపత్రిక నుండి కత్తిరించిన ఆకారాలతో ఒక పజిల్ని తయారు చేయండి. వాటిని గుర్తించడానికి క్రమబద్ధీకరించడానికి లెక్కించడానికి మరియు వాటిని కలిపి వివిధ వస్తువులను తయారు చేయటానికి పిల్లలను ప్రోత్సహించండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ