వారం - 26 పిల్లలు ఏమి నేర్చుకుంటారు వస్తువుల చిన్న సమూహాలను చేయడం, మొత్తం వస్తువులను, సమూహాల సంఖ్యను లెక్కించడం మరియు వస్తువులను సమానంగా పంపిణీ చేయడం. రోజువారీ కృత్యాలను ఆస్వాదించడం మరియు చిన్న సాధారణ సూచనలను అనుసరించడం, మూడు స్థాయిల వరకు వస్తువులను అమర్చడం మరియు చిత్రంలో తప్పిపోయిన భాగాలను గుర్తించడం. పదాలలో ప్రారంభ మరియు ముగింపు అక్షరాలను గుర్తించడం. వివిధ ఆహార సమూహాల నుండి వివిధ రకాల ఆహారాన్ని తినడం మరియు ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన ఆహారాన్న గుర్తించడం. మరియు తరగతి గది నిబంధనలను అనుసరించడం భావోద్వేగాలను పదాలు/ముఖ కవళికలతో / శరీర ప్రతిచర్యలతో అనుసంధానించడం, భావాలను నిర్వహించడానికి వ్యూహాలను గుర్తించడం. మొక్కలు, పక్షులు మరియు జంతువుల అవసరాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం మరియు ఇతరుల పట్ల ఆప్యాయతను ప్రదర్శించడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు వారంలోని రోజులను మరియు నెలలోని రోజులను పరిచయం చేయడానికి ఆకర్షణీయమైన పాటల ట్యూన్లను ఉపయోగించండి, వాటిని గుర్తుంచుకోవడంలో సహాయపడండి. ప్రతిరోజూ ఏ తేదీ / రోజు/ నెల అని గుర్తు తెచ్చుకోవడానికి మరియు చర్చించడానికి ప్రతిరోజూ కలిసి పాడండి. పిల్లలను ఆ రోజు గురించి, రోజులో తమ అనుభవాల గురించి ప్రతిరోజూ అడగడం ద్వారా సంఘటనలను ఒక క్రమంలో చెప్పటం మరియు పంచుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడండి. వారు మొదట ఏమి చేశారు? ఆ తర్వాత చివరికి? మొదలైనవి. అదేవిధంగా కథలను మీతో పంచుకోమని చెప్పండి. వివిధ పనుల యొక్క దశలగురించి మాట్లాడండి. 'కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి బహుమతి సంజ్ఞలుగా 'ధన్యవాదాలు' కార్డులు & మట్టితో చేసిన చిన్న వస్తువులను లేదా ఇతర వస్తువులను తయారు చేయడం వంటి కళ & చేతిపనుల కృత్యాలలో పిల్లలను నిమగ్నం చేయండి. పిల్లలు ఎవరికి, ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు అనే దాని గురించి మాట్లాడండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ