వారం - 4 పిల్లలు ఏమి నేర్చుకుంటారు వివిధ పరస్పర చర్చలలో పాత్రలను గుర్తించడం, వివరించడం, ఆప్యాయతను వ్యక్తం చేయడం మరియు సాధారణ వస్తువులు, వ్యక్తులు మరియు చిత్రాలను వివరించడం. వ్యక్తిగత సంరక్షణ వస్తువులను ఉపయోగించడం గించడం ప్రారంభించడం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం. ఆకారాలు, రంగులు మరియు వాటి షేడ్స్ మధ్య తేడాను గుర్తించటం. వస్తువుల సంఖ్య, సం పొడవు, ఆకారం, పరిమాణం మరియు బరువు ఆధారంగా పోల్చటం. వస్తువుల వాసన మరియు రుచిని గుర్తించడం మరియు వేరు చేయడం, వాటి విభిన్న లక్షణాల ఆధారంగా వాటిని వర్గీకరించడం మరియు పంచుకోవడం. సాధారణ స సూచనలను అనుసరించటం మరియు వస్తువులను క్రమంలో మూడు స్థాయిలలో అమర్చటం. భావనలను అర్థం చేసుకొని చెప్పడానికి పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవటం, సంభాషణలలో థీమ్ నిర్దిష్ట పదాలను ఉపయోగించటం మరియు ధ్వనుల అవగాహనను అభివృద్ధి చేసుకోవటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు ఇంటి చుట్టూ ఉండే వివిధ ఆకారాలుగల వస్తువులను కనుగొనేలా పిల్లలను ప్రోత్సహించండి. వేలితో ఆ వస్తువుల సరిహద్దులను గీయండి. ప్రతి ఆకృతికి పేరు పెట్టి, దాని లక్షణాలను వివరించండి. గాలిలో, నీటిలో, ఇసుకలో ఆకారాలను గీయమని వారిని ప్రోత్సహించండి. సూక్ష్మక్రిములను సూచించేటట్లుగా పిల్లల చేతులపై రంగు పొడిని పూయండి. ఇతరులతో కలుపుగోలుగా మాట్లాడమని, కరచాలనం చేయమనినీ మరియు మరియు చేతితి ఉపరితలాల ఉపరితలాలను తాకమని, చెప్పండి. "సూక్ష్మక్రిములు" ఎలా వ్యాపిస్తాయి మరియు చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించండి. చేతులు సరిగ్గా కడగడం ఎలాగో రోల్ ప్లే చేయించండి. పిల్లలతో కలిసి పనిముట్లు వస్తువులను ఊహించే ఆట ఆడండి. వస్తువుల ఉపయోగాలు, రూపం, లక్షణాల గురించి సూచనలు ఇవ్వండి . ఆటలో రిమోట్ ఫోన్, స్టెతస్కోప్, కంప్యూటర్, సుత్తి, స్కేల్, హెల్కెట్ మొదలైన వస్తువులను చేర్చండి. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ