భారత సముద్ర రంగం భారత్ సామర్థ్యం, స్థిరత్వం, పురోగమనానికి సముద్ర రంగం ప్రతీక. దేశంలోని 13 తీర రాష్ట్రాలు, 11.098 కిలోమీటర్ల తీరరేఖ, సుమారు 1,300 దీవులు, 2.37 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలం దేశాన్ని సహజ సముద్ర శక్తిగా నిలుపుతున్నాయి. భారత సముద్ర చరిత్ర లోథాల్ (ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రేవు)తో ముడిపడి ఉంది. ఇది సింధు లోయ నాగరికతలో అంతర్భాగమై మెసపొటేమియాతో వాణిజ్యం నిర్వహించింది. లోథాల్లో బయల్పడిన డ్రై డాక్ క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల నాటిది. ప్రపంచంలో నౌకలు నిలపడానికి, మరమ్మతు చేయడానికి ఉపయోగించిన తొలి కేంద్రంగా ఇది పరిగణనలో ఉండేది. సముద్రం రంగమంటే ఏమిటి? 'సముద్ర రంగం' అంటే- ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సముద్రాధారిత పరిశ్రమలు, నౌకాయానం, వాణిజ్యం, నౌకా నిర్మాణం, సముద్ర భద్రత. సముద్ర ఆర్థిక వ్యవస్థ సముద్ర మార్గాల్లో భారత ఆర్థిక శక్తి స్రవంతి భారత ఆర్థిక శక్తి నేడు సముద్ర మార్గాల్లో ప్రవహిస్తోంది. దేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం, విలువలో 70 శాతం ఈ మార్గాల ద్వారానే సమకూరుతోంది. 60% జీడీపీ వాటా తీర ప్రాంత రాష్ట్రాల నుంచే వస్తోంది. అంతేగాక దాదాపు 8 కోట్ల మంది ప్రజలు జీవనోపాధి కోసం సముద్రంపైనే ఆధారపడి ఉన్నారు. 10% సముద్ర వాణిజ్యాని భారత్ నియంత్రిస్తోంది 2047 కల్లా దీనిని త్రిగుణం చేయడమే లక్ష్యం. భారత్ ఇప్పుడు ప్రపంచ మత్స్య ఉత్పాదనలో 8 శాతం వాటాతో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఉంది. మత్స్య రంగం సుమారు 3 కోట్ల మందికి జీవనోపాధి కన్పిస్తూ ఎగుమతులకు గణనీయంగా తోడ్పడుతోంది. భారతదేశ మత్స్య రంగం సుమారు 3 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి అండగా నిలుస్తూ ఎగుమతులకు గణనీయంగా తోడ్పాటును. అందిస్తోంది. సముద్ర ప్రణాళికలో భారత్ భవితవ్యం ప్రపంచ సముద్ర శక్తిగా తన స్థానం సుస్థిరం చేసుకోవడం లక్ష్యంగా భారత్ నిరంతరం సాహపోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సముద్ర రంగంలో 2030 నాటికి దేశం ఎంత శక్తిమంతంగా నిలదొక్కుకోగలదనే అంశం ఆధారంగా ఒక ప్రణాళిక ఆవిష్కృతమైంది. అలాగే, 2047 నాటికి వికసిత భారత్ ఒక సముద్ర శక్తిగా ఎంత పటిష్టంగా ఉండగలదో నిర్వచించడానికి బృహత్ ప్రణాళిక సిద్ధం కావడంతో ఆ దిశగా కృషి మొదలైంది. భారత సముద్ర ప్రణాళిక-2030 (ఎంఐవి) మన సముద్ర రంగ సర్వతోముఖాభివృద్ధికీ 'భారత సముద్ర ప్రణాళిక-2030' ఓ సమగ్ర చట్రాన్ని నిర్దేశించింది. ఇందులో రేవులు, నౌకా వాణిజ్యం, జలమార్గాలు భాగంగా ఉంటాయి. భారత్‌ను ప్రపంచ సముద్ర రంగంలో అగ్రస్థానాన నిలపడం లక్ష్యంగా 150 కార్యక్రమాలను 'ఎంఐవి-2030' నిర్దేశిస్తోంది. సముద్ర రంగ అమృతకాలం 2047 భారత్ తన వాణిజ్య అవసరాల కోసమే కాకుండా సముద్ర రంగ అగ్రశక్తిగా ఎదగడానికీ సిద్ధమవుతోంది. ఈ లక్ష్యం కింద భారత సముద్ర సామర్థ్య పునరుజ్జీవనానికి దీర్ఘకాలిక కార్యక్రమంగా 'సముద్ర రంగ అమృతకాల ప్రణాళిక - 2047ను రూపొందించుకుంది. దీనికింద రేవులు, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాలు, నౌకా నిర్మాణం, కాలుష్య రహిత షిప్పింగ్ కార్యక్రమాల కోసం సుమారు 280 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేసింది. సముద్ర రంగ మౌలిక సదుపాయాలు బలోపేతం అవుతున్న భారత సముద్ర సామర్థ్యం భారత్ భవిష్యత్తుకు సముద్రాలతో విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే, దేశ సుసంపన్న సముద్ర వారసత్వాన్ని, సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారు. ఈ రంగంలో మౌలిక సదుపాయాల బలోపేతంపై నిశితంగా దృష్టి సారించారు. తదనుగుణంగా చేపట్టిన సంస్కరణలు నౌకా నిర్మాణం, కాలుష్య రహిత షిప్పింగ్‌లో విస్తృత ఫలితాలిస్తున్నాయి. ₹69,725 కోట్ల విలువైన సమగ్ర ప్యాకేజీకి ఆమోదం ద్వారా నౌకా నిర్మాణ, సముద్ర రంగ వ్యవస్థ పునరుజ్జీవనానికి చర్యలు ఈ ప్యాకేజీ కింద 'నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ పథకం' (ఎస్జేఎఫ్ఎస్) 2036 మార్చి 31 వరకూ పొడిగింపు. భారత నౌకా వాణిజ్య సామర్థ్యం పెరుగుదల 35 శాతం నౌకా వాణిజ్యం భారత పతాకంతో ప్రయాణించే నౌకలు/ఓడల సంఖ్య పెరుగుదల 29 శాతం ఓడల నావికా సిబ్బంది సంఖ్యలో 174 శాతం పెరుగుదల నమోదు సముద్ర రంగంలో మహిళా నావికుల సంఖ్య పెరుగుదల 640 శాతం సాగరమాల కార్యక్రమం సాగరమాల కార్యక్రమం కింద దేశంలో ₹5.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 839 ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. వీటిలో 119 ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అమలవుతున్నాయి. 280 ప్రాజెక్ట్ లు పూర్తయ్యాయి. ₹1.42 లక్షల కోట్ల దాక పెట్టుబడులు పెట్టారు 209 ప్రాజెక్టులు ₹1.62 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అమలులో ఉండగా, ₹2.75 లక్షల కోట్ల విలువైన 353 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 106 రేవుల ఆధునికీకరణ ప్రాజెక్టులు ₹35,423 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. 96 రేవుల (రహదారి-రైలు) అనుసంధాన ప్రాజెక్టులను ₹58.628 కోట్లతో పూర్తిచేశారు. 9 రేవు ఆధారిత పారిశ్రామికీకరణ ప్రాజెక్టులు ₹45,865 కోట్లతో పూర్తికాగా, దీనికింద 8,000 ఎకరాలకు పైగా భూమి వినియోగంలోకి వచ్చింది. 81 తీర ప్రాంత సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను ₹11.573 కోట్ల వ్యయంతో ప్రారంభించగా ₹2000 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 12 ఫిషింగ్ హార్టర్ ప్రాజెక్టులను ₹1,078 కోట్లతో పూర్తి చేయగా, వీటి ద్వారా 35,000 మందికి పైగా మత్స్యకారులకు లబ్ధి చేకూరింది. + 18 పట్టణ జల రవాణా సంబంధిత ప్రాజెక్టులను ₹640 కోట్లతో పూర్తి చేయడం వల్ల రహదారి, రైలు మార్గాల్లో సరక రవాణాపై ఒత్తిడి తగ్గింది. 8 ప్రత్యేక తీరప్రాంత బెర్తులను ₹430 కోట్లతో నిర్మించారు. ఇనుమడిస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యం ఐఎన్ఎస్ విక్రాంత్ తొలి దేశీయ విమాన వాహక యుద్ధనౌక 'ఐఎస్ఎస్ విక్రాంత్' 2022 సెప్టెంబరు 2న నావికాదళంలో ప్రవేశించింది. దేశంలో ప్రస్తుతం 290,000 కోట్ల వ్యయంతో 51 భారీ నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దేశీయ 100వ, 101వ యుద్ధ నౌకలు 'ఐఎన్ఎస్ ఉదయగిరి', 'ఐఎన్ ఎస్ హిమగిరి' నానికాదళంలో చేరాయి. దేశీయ నౌకా నిర్మాణ సంస్థలు 2014 నుంచి ఇప్పటిదాకా మొత్తం 40 యుద్ధనౌకలు, జలాంతర్గాములను వాబితా దళానికి అందజేశాయి. ముఖ్యంగా గడచిన ఏడాదిలో ప్రతి 40 రోజులకు ఒకటి వంతున కొత్త నౌక సముద్ర ప్రవేశం చేస్తూ వచ్చింది. రక్షణ రంగ బడ్జెట్లో నావికాదళం వాటా 15 నుంచి 21 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఐఎన్ఎస్ అంజదీప్' యుద్ధనౌక నావికాదళంలో చేరింది. భారత నావికాదళంలోకి 2025లో ఫ్రిగేట్లు హిమగిరి (ఎఫ్ 34), ఉదయగిరి (ఎఫ్35) నేరాయి. రెండు అత్యాధునిక సముద్ర ఉపరితల యుద్ధనౌకలు ఏకకాలంలో జల ప్రవేశం చేయడం ఇదే తొలిసారి. సముద్ర శక్తిని బలోపేతం చేసే కార్యక్రమాలు లోథాల్ మ్యూజియం సముద్ర వారసత్వంపై లోతైన అవలోకనం : గుజరాత్ రాష్ట్రంలోని లోథాల్లో దేశ సముద్ర వారసత్వ ప్రతిష్ఠ పునరుద్ధరణ దిశగా మ్యూజియం నిర్మాణంపై నెదర్లాండో భారత్ ఒప్పందం. కుదుర్చుకుంది. ఇది 4,500 ఏళ్ల ప్రాచీన భారత సముద్ర వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పి చారిత్రక ఒప్పందం. ఈ ప్రదర్శన శాల నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర మ్యూజియంగా పరిగణనలోకి వస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత ప్రాచీన సముద్ర సంప్రదాయాలను ఇది ప్రపంచానికి ప్రస్పుటం చేస్తుంది. అంతేకాకుండా పర్యాటక, పరిశోధన, విద్యా. నైపుణ్యాభివృద్ధి రంగాల కూడలిగా రూపొందుతుంది. సముద్ర విశ్వవిద్యాలయం చెన్నె ప్రధాన కేంద్రంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదాలో భారత సముద్ర విశ్వవిద్యాలయం (ఐఎంయూ) ఏర్పాటైంది. దీనికింద చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి, నవీ ముంబయిలలో సంస్థలు పనిచేస్తుండగా, 17 అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. 'ఐఎంయూ' పరిధిలోని ఈ 8 సంస్థలలో 2025 ఏప్రిల్ 8న కేంద్ర రేవులు-నౌకా వాణిజ్యం అల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 767.77 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులను ప్రారంభించారు. సాగర్ సమ్మాన్ పురస్కారం సముద్ర రంగంలో విశిష్ట కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం 'సాగర్ సమ్మాన్' పురస్కారాన్ని ప్రధానం చేస్తోంది. జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా ఏటా ఏప్రిల్ 5న ప్రదానం చేసే ఈ అవార్డుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సముద్ర రంగ విధానంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం "సాగర్ మే సమ్మాన్" పేరిట ఓ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. భవిష్యత్తులో లింగ సమాన సముద్ర కార్మిక శక్తిని సృష్టించడమే దీని లక్ష్యం. చట్ట సంస్కరణలు - సముద్ర రంగ వృద్ధికి వేగం భారత సముద్ర, అంతర్గత జలమార్గ రవాణా రంగాల ఆధునికీకరణ దిశగా ప్రభుత్వ అనేక సమగ్ర, చట్ట సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు 2025లో పార్లమెంటు ఆమోదించిన వివిధ చట్టాలు, కొత్త బిల్లుల దన్నుతో ఈ రంగం పటిష్టంగా నిలదొక్కుకుంది. చట్టాలు జాతీయ జలమార్గాల చట్టం-2016 అడ్మిరావిటీ (అధికార పరిధి - సముద్ర క్లెయిన్లు పరిష్కార) 0-2017 నౌకల రీసైక్లింగ్ చట్టం- 2019 ప్రధాన రేవుల ప్రాధికార సంస్థ చట్టం-2021 అంతర్గత నౌకల చట్టం-2021 సముద్ర యాన ఉపకరణాల చట్టం-2021 పర్యావరణహిత మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు ప్రతి టన్ను సరకు రవాణా ప్రాతిపదికన కార్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యం పునరుత్పాదక విద్యుత్ వాటా 100 శతానికి పైగా పెంచే లక్ష్యం. న్యూ మంగళూరు రేవు 2025 నాటికి 100 శాతం సౌరశక్తి వినియోగ సామర్థ్యం సాదించి, పునరుత్పాదక విద్యుత్ వాడకంలో కొత్త ప్రమాణం సృష్టించింది. పర్యావరణ నాణ్యత మెరుగు దిశగా ఈ రేవు పరిధిలో వర్గీకరణ లక్ష్యం 2030 నాటికి 20 శాతం కాగా, 2047కల్లా దీన్ని 33 శాతానికి పెంచాలని నిర్ణయం. వ్యర్థజలాల 100 శాతం పునరుపయోగం ద్వారా అన్ని రేవులలో 2030 నాటికి మంచినీటి వాడకం 20 శాతానికి పైగా తగ్గింపు. రేవులు రవాణా రంగాల్లో మెరుగుపడిన భారత్ ర్యాంకు దేశవ్యాప్తంగా కొన్నేళ్ల నుంచీ రేవుల మౌలిక సదుపాయాలు, డిజిటల్ సౌకర్యాలు సహా నిర్వహణ సామర్థ్యం మెరుగుదల ఫలితంగా అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతమైంది. ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన కంటైనర్ పోర్టుల, లాజిస్టిక్స్ రంగ పనితీరు సూచీలలో భారత్ రేవుల ర్యాంకు మెరుగుపడటం ఈ పరిణామాన్ని ధ్రువీకరిస్తోంది. ప్రపంచ బ్యాంకు కంటైనర్ పోర్ట్ పనితీరు సూచీ (సీపీపీఐ) ప్రకారం 2023-24లో తొలిసారి రెండు భారత రేవులు ప్రపంచంలోని 30 అగ్రశ్రేణి రేవుల జాబితాలో చోటు సంపాదించాయి. ప్రపంచ బ్యాంకు రవాణా పనితీరు సూచీ అంతర్జాతీయ షిప్మెంట్ విభాగంలో భారత్ ర్యాంకు 2013-14 నాటి 44వ స్థానం నుంచి 2024-25లో ఏకంగా 22వ స్థానానికి దూసుకెళ్లింది. ఆధారం: న్యూ ఇండియా సమాచార్